‘బంగారు’ ఉష
జాతీయ సీ॥వెయిట్‌లిఫ్టింగ్‌లో స్వర్ణాలు
జైపూర్: జాతీయ సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విజయనగరం జిల్లా లిఫ్టర్లు బంగారు ఉష, గౌరిబాబు రాణించారు. ఉష రెండు స్వర్ణ పతకాల్ని సొంతం చేసుకోగా, గౌరి బాబు కాంస్యం దక్కించుకున్నాడు.
బుధవారం జరిగిన 48 కేజీల విభాగంలో ఉష స్నాచ్‌లో 73 కేజీలు ఎత్తి రజతం సంపాదించగా... క్లీన్ అండ్ జెర్క్‌లో (96 కేజీలు), ఓవరాల్ (169 కేజీలు) విభాగాల్లో ఉషకు పసిడి పతకాలు లభించాయి. పురుషుల 62 కేజీల విభాగంలో కె.గౌరిబాబు ఓవరాల్‌గా 253 కేజీల బరువెత్తి కాంస్య పతకం సాధించాడు.