ఆకట్టుకున్న రంగవల్లులు
ఎల్లారెడ్డిపేట: వెంకటాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం విద్యార్థులు వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి. రంగవల్లి ముగ్గుల పోటీలను హైద్రాబాద్ భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ముగ్గుల పోటీల్లో ప్రథమ స్థానంలో రవళి, ద్వితీయ స్థానంలో నమ్రత, తృతీయ స్థానంలో రమ్య, యామని, శ్వేత, లావణ్య, నిఖితలు రాణించారు. ముగ్గుల పోటీల్లో రాణించిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఆడెపు సుదర్శన్, ఫౌండేషన్ ప్రతినిధి సతీశ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
డిగ్రీ కాలేజీలో ముగ్గుల పోటీలు
సిరిసిల్ల ఎడ్యుకేషన్: శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని అనురాగ్ డిగ్రీ కళాశాలలో సోమవారం సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. నిగమ ఇంజినీరింగ్ కళాశాల అధినేత బీవీఆర్ గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మనసంస్కృతి సంప్రదాయాలను కాపాడాలని కోరారు. కళాశాల ప్రిన్సిపాల్ పరమేశ్వర్ మాట్లాడుతూ ప్రతీ యేటా విద్యార్థినులకు, మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించి, బహుమతులు అందిస్తున్నట్లు తెలిపారు. ముగ్గుల పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను ప్రధానం చేశారు.