ఆరు నెలల పసికందుపై అత్యాచారం
అహ్మదాబాద్: శిశువుపై పశువులాగా రెచ్చిపోయాడు ఓ కామాంధుడు. పసికందుపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుజరాత్‌లోని పఠాన్ జిల్లా ఛనాస్మా తాలూకాలోని ఇటోడా గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. ఇటోడా గ్రామానికి చెందిన ఆరు నెలల శిశువుపై భవాన్జీ ఠాకూర్(32) అత్యాచారం చేశాడు. ధర్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శిశువు పరిస్థితి విషమంగా ఉంది. తమకు పరిచయస్తుడైన ఠాకూర్ వద్ద చిన్నారిని వదిలి తల్లిదండ్రులు గ్రామ శివారులో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్లారు. వారు ఇంటికి తిరిగి వచ్చేసరికి బాలిక విపరీతంగా ఏడుస్తోంది. చిన్నారిని పరిశీలించగా తీవ్ర రక్తస్రావమవుతోంది. వెంటనే ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.
నర్సరీ విద్యార్థినిపై అటెండర్ అత్యాచారం
సాక్షి, బెంగళూరు: బెంగళూరులోని ఓ ప్రైవేటు స్కూల్లో నర్సరీ చదువుతున్న మూడేళ్ల బాలిక కు అక్కడ అటెండర్‌గా పనిచేసే నాగరాజ్ (27) చాక్లెట్ ఆశ చూపించి అత్యాచారానికి పాల్పడ్డాడు. గత నెల 26న స్కూల్లో ఈ దారుణం జరిగింది. కాగా, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో సోమవారం రాత్రి ఓ ఉపాధ్యాయినిని ఐదుగురు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.