car number
-
9999 @ రూ.8,66,116
రాజేంద్రనగర్: ఉప్పర్‌పల్లి ఆర్టీఓ కార్యాలయంలో బుధవారం 9999 నంబర్‌కు అత్యధిక ధర పలికింది. టీఎస్ 07 హెచ్ఈ 9999 నంబర్‌కు ఆన్లైన్లో వేలం వేయగా శేరిలింగంపల్లి కొత్తగూడ అపర్ణ టవర్స్‌కు చెందిన జి.శివరామకృష్ణ రూ. 8,66,116కు కోట్ చేసి దక్కించుకున్నారు. ఈ నంబర్ కోసం ముగ్గురు పోటీపడగా అత్యధికంగా కోడ్ చేసి న శివరామకృష్ణకు కేటాయించారు. ఆయన కొత్తగా కొనుగోలు చేసిన రేంజ్‌రోవర్ కారు కోసం డబ్బు వెచ్చించి దక్కించుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఆల్‌లైన్‌లో నంబర్‌కు అత్యధిక ధర పలకడం ఇదే మొదటిసారి. -
నా కారు నంబర్ ఎవరో వాడుతున్నారు..
బంజారాహిల్స్: తన కారు నంబర్‌ను గుర్తు తెలియని వ్యక్తి తన కారుకు వాడుతున్నాడని అతనిపై చర్యలు తీసుకోవాలంటూ సోమవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాలు.. బంజారాహిల్స్ రోడ్ నంబర్– 12లోని ఫార్చున్ ఎన్‌క్లేవ్‌లో నివసించే డాక్టర్ కె.వనజా రఘునందన్ సన్‌సెట్ ఆరెంజ్ కలర్ హోండా జాజ్ టీఎస్ 09 ఈఎల్ 5679 కారు రిజిస్ట్రేషన్ అయి ఉంది. గత నెల 20న వనజా రఘునందన్‌కు మహబూబ్‌నగర్ జిల్లాలో పోతులమడుగు వద్ద ఓవర్‌స్పీడ్‌గా వెళ్లినట్లు చలానా వచ్చింది. ఆ రోజు తాను ఎక్కడికి వెళ్లలేదని, చలానాలో ఉన్న కారు కూడా తనది కాకపోవడంతో ఆరా తీశారు. తన కారు నంబర్‌తోనే చాక్లెట్ కలర్ ఓల్వో కారు కూడా తిరుగుతోందని మహబూబ్‌నగర్ జిల్లా పోతులమడుగు వద్ద ఓవర్‌స్పీడ్‌లో నిబంధనలు ఉల్లంఘించిన కారు అదేనని కావాలనే ఎవరో తన కారు నంబర్‌ను వాడుతూ తనకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన నంబర్‌తో ఓల్వో కారు నడుపుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని భవిష్యత్‌లో తనకు ఇది ప్రమాదం కూడా తలెత్తే అవకాశాలున్నాయని బాధితురాలు ఆందోళన వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి ఓల్వో కారు కోసం గాలింపుచేపట్టారు. -
ఆ కారు నంబర్ కోసం ఎంత పెట్టారో!
తుర్కయంజాల్: కర్మన్‌ఘాట్‌కు చెందిన ఓ వ్యక్తి ఇబ్రహీంపట్నం రవాణా శాఖ కార్యాలయంలో 9999 నెంబర్‌ను అధిక ధరకు వేలంలో దక్కించుకున్నాడు. మునదల రామచంద్రరావు తన కిర్లోస్కర్ కారుకు 9999 నెంబర్‌ను 4,58,020 రూపాయలకు వేలంలో దక్కించుకున్నాడు. ఇంత ధర పలకడం ఇబ్రహింపట్నం రవాణా శాఖ కార్యాలయంలో ఇదే మొదటిసారి అని ఆర్టీఓ గౌరిశంకర్ తెలిపారు.