నా కారు నంబర్‌ ఎవరో వాడుతున్నారు.. | Same Number Using in Cars Case Files Hyderabad | Sakshi
Sakshi News home page

ఆ కారు నాది కాదు

Published Tue, Feb 18 2020 8:51 AM | Last Updated on Tue, Feb 18 2020 8:51 AM

Same Number Using in Cars Case Files Hyderabad - Sakshi

బంజారాహిల్స్‌: తన కారు నంబర్‌ను గుర్తు తెలియని వ్యక్తి తన కారుకు వాడుతున్నాడని అతనిపై చర్యలు తీసుకోవాలంటూ సోమవారం బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాలు.. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌– 12లోని ఫార్చున్‌ ఎన్‌క్లేవ్‌లో నివసించే డాక్టర్‌ కె.వనజా రఘునందన్‌ సన్‌సెట్‌ ఆరెంజ్‌ కలర్‌ హోండా జాజ్‌ టీఎస్‌ 09 ఈఎల్‌ 5679 కారు రిజిస్ట్రేషన్‌ అయి ఉంది. గత నెల 20న వనజా రఘునందన్‌కు మహబూబ్‌నగర్‌ జిల్లాలో పోతులమడుగు వద్ద ఓవర్‌స్పీడ్‌గా వెళ్లినట్లు చలానా వచ్చింది.

ఆ రోజు తాను ఎక్కడికి వెళ్లలేదని, చలానాలో ఉన్న కారు కూడా తనది కాకపోవడంతో ఆరా తీశారు. తన కారు నంబర్‌తోనే చాక్లెట్‌ కలర్‌ ఓల్వో కారు కూడా తిరుగుతోందని  మహబూబ్‌నగర్‌ జిల్లా పోతులమడుగు వద్ద ఓవర్‌స్పీడ్‌లో నిబంధనలు ఉల్లంఘించిన కారు అదేనని కావాలనే ఎవరో తన కారు నంబర్‌ను వాడుతూ తనకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన నంబర్‌తో ఓల్వో కారు నడుపుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని భవిష్యత్‌లో తనకు ఇది ప్రమాదం కూడా తలెత్తే అవకాశాలున్నాయని బాధితురాలు ఆందోళన వ్యక్తం చేశారు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి ఓల్వో కారు కోసం గాలింపుచేపట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement