మూడో వన్డేలో దక్షిణాఫ్రికా విజయం
డికాక్, ఆమ్లా సెంచరీలు
సెంచూరియన్: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా స్ఫూర్తిదాయక విజయం సాధించింది. తొలి రెండు వన్డేల్లో ఓడిపోయిన సఫారీలు మూడో వన్డేలో 319 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి ఏడు వికెట్లతో ఘన విజయం సాధించారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 318 పరుగులు చేసింది. రూట్ (113 బంతుల్లో 125; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీ చేయగా... హేల్స్ (65), స్టోక్స్ (53) అర్ధసెంచరీలు సాధించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో అబాట్, రబడ రెండేసి వికెట్లు తీసుకున్నారు. దక్షిణాఫ్రికా జట్టు 46.2 ఓవర్లలోనే మూడు వికెట్లకు 319 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు డికాక్ (117 బంతుల్లో 135; 16 ఫోర్లు, 4 సిక్సర్లు), ఆమ్లా (130 బంతుల్లో 127; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో చెలరేగారు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు ఏకంగా 239 పరుగులు జోడించడం విశేషం. డు ప్లెసిస్ (29 బంతుల్లో 33 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్సర్) రాణించాడు. డికాక్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఐదు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. నాలుగో వన్డే శుక్రవారం జరుగుతుంది.
వన్డేల్లో వేగంగా పది సెంచరీలు (55 ఇన్నింగ్స్ లో) చేసిన ఆటగాడిగా డికాక్ రికార్డు సృష్టించాడు. ఆమ్లా (57 ఇన్నింగ్స్) రికార్డును అతను అధిగమిం చాడు. దక్షిణాఫ్రికా జట్టు 319 అంతకంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించడం ఇది మూడోసారి మాత్రమే.: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా స్ఫూర్తిదాయక విజయం సాధించింది. తొలి రెండు వన్డేల్లో ఓడిపోయిన సఫారీలు మూడో వన్డేలో 319 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి ఏడు వికెట్లతో ఘన విజయం సాధించారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 318 పరుగులు చేసింది. రూట్ (113 బంతుల్లో 125; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీ చేయగా... హేల్స్ (65), స్టోక్స్ (53) అర్ధసెంచరీలు సాధించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో అబాట్, రబడ రెండేసి వికెట్లు తీసుకున్నారు. దక్షిణాఫ్రికా జట్టు 46.2 ఓవర్లలోనే మూడు వికెట్లకు 319 పరుగులు చేసి గెలిచింది.
ఓపెనర్లు డికాక్ (117 బంతుల్లో 135; 16 ఫోర్లు, 4 సిక్సర్లు), ఆమ్లా (130 బంతుల్లో 127; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో చెలరేగారు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు ఏకంగా 239 పరుగులు జోడించడం విశేషం. డు ప్లెసిస్ (29 బంతుల్లో 33 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్సర్) రాణించాడు. డికాక్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఐదు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. నాలుగో వన్డే శుక్రవారం జరుగుతుంది.వన్డేల్లో వేగంగా పది సెంచరీలు (55 ఇన్నింగ్స్ లో) చేసిన ఆటగాడిగా డికాక్ రికార్డు సృష్టించాడు. ఆమ్లా (57 ఇన్నింగ్స్) రికార్డును అతను అధిగమిం చాడు. దక్షిణాఫ్రికా జట్టు 319 అంతకంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించడం ఇది మూడోసారి మాత్రమే.