ప్రశాంతంగా ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు
ధర్పల్లి/నిజాంసాగర్, న్యూస్‌లైన్ : ధర్పల్లి మండలం మైలారం, పిట్లం మండలంలోని బండపల్లి ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎంపీటీసీ స్థానాలకు ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. ఆయా మండల పరి షత్ కార్యాలయాల్లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించి గంటన్నర లోపే ఫలి తాలు వెల్లడించారు. మైలారం ఎంపీటీసీగా నాయిక లలితామోహన్(కాంగ్రెస్) ఎన్నికయ్యా రు. ఆమె స్వతంత్ర అభ్యర్థి సీహెచ్ ప్రసాద్‌పై 739 ఓట్ల మెజార్టీతో ఆమె విజయం సాధిం చారు. మండలంలో ఎక్కువ మెజార్టీ సాధించి న వారిలో లలిత ముందు వరుసలో నిలిచారు. మండల రిటర్నింగ్ అధికారి లక్ష్మణ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మదన్మోహన్ పర్యవేక్షణలో ఓట్ల లెక్కిం పు చే పట్టారు.లెక్కింపునకు అబ్జర్వర్‌గా బోధన్ డీఎల్పీఓ అనుక్ వ్యవహరించారు. మొత్తం 903 ఓట్లు పోల్ కాగా, నాయిక లలితకు 811, సీహెచ్ ప్రసాద్‌కు 68 ఓట్లు వచ్చాయి. 24 ఓట్లు చెల్ల లేదు.
బండపల్లిలో...
పిట్లం మండలం బండపల్లి ఎంపీటీసీకి టీఆర్ఎ స్ అభ్యర్థి రజనీకాంత్‌రెడ్డి 1,012 ఓట్ల మెజార్టీ తో కాంగ్రెస్ అభ్యర్థి గంగారాంపై గెలుపొందా రు. ఈ ఎంపీటీసీ స్థానం పరిధిలో 2,239 మం ది ఓటర్లకు గాను 1,720 మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. వీటిలో గం గారాంకు 338 ఓట్లు పోలవగా, మిగతావి 1350 టీఆర్ఎస్ అభ్యర్థి రజనీకాంత్‌రెడ్డికి వచ్చాయి. 32 ఓట్లు చెల్లలేవు. అత్యధిక మోజార్టీతో రజనీకాంత్‌రెడ్డి విజయం సాధించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి సుజాత ధ్రువపత్రాన్ని అందజేశారు.
నాటకీయ పరిణామాల మధ్య...
అనేక నాటకీయ పరిణామాల మధ్య బండపల్లి ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ జెం డా ఎగిరింది. ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీ స్థానానికి రాష్ట్ర ఎన్ని కల కమిషన్ అభ్యంతరంతో రద్దు చేశారు. మళ్లీ నిర్వహించిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి రజనీకాంత్‌రెడ్డిని విజయం వరిం చింది. సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించగా రెండున్నర గం టల్లో లె క్కింపు పూర్తయ్యింది. మూడు బూత్‌ల్లో ఓట్ల లెక్కింపు పూర్తవగానే టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగా రు. మండలంలో 14 ఎంపీటీ సీ స్థానాలకు గాను టీఆర్ఎస్ 12 ఎంపీటీసీ స్థానాలను దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలకే పరిమితమైంది. టీఆర్ఎస పార్టీ అత్యధిక స్థానాలతో ఎంపీపీ పీఠాన్ని చే జిక్కించుకునే బలాన్ని సాధించింది.