టీఆర్ఎస్ నేతల అలక..
పరిగి: జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి వైఖరిపై పరిగి నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు అలకబూనారు. సోమవారం గండేడ్ మండల సర్వసభ్యసమేవేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టీ.రామ్మోహన్‌రెడ్డి(టీఆర్ఆర్)తో కలిసి ఆయన నివాసంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేయటం నియోజకవర్గ టీఆర్ఎస్ శ్రేణుల్లో కలకలం రేపింది. టీఆర్ఎస్కు సంబంధించి నియోజకవర్గం నుంచి ఐదుగురు జెడ్పీటీసీలు, సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు హరీశ్వర్‌రెడ్డి ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు ప్రాధాన్యతనివ్వటంపై వారు ఆవేదనకు గురవుతున్నారు.
మంత్రి ఎదుట గోడు..
ఈ విషయంపైనే మంగళవారం నియోజకవర్గం నుంచి 50 మందికి పైగా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. ఓ దశలో కేసీఆర్‌కు ఫిర్యాదు చేసేందుకు ఆయన అపాయింట్మెంటు కోసం కూడా యత్నించినట్లు సమాచారం. అయితే ముందుగా ఓ మాట జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డికి చెబితే బాగుంటుందని పరిగికి చెందిన సీనియర్ నాయకుడి సలహాతో అందరు వెళ్లి ఆయనను కలిసినట్లు తెలిసింది.
గంటపాటు ఆయనతో చర్చించగా మరో సారి అలా జరగదని మంత్రి మహేందర్‌రెడ్డి హామీ ఇవ్వటం తో పరిగి శ్రేణులు వెనుదిరిగి వచ్చినట్లు సమాచా రం. ఇదే సమయంలో గతంలో ప్రసాద్‌కుమార్ మంత్రిగా ఉన్న సమయంలో ఆయనతో అప్పటి పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి కలిసి కార్యక్రమాల్లో, ప్రెస్మీట్లలో పాల్గొన్నారనే విషయంపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది.