పండ్ల తోటలపై ఏనుగుల దాడి
కుప్పం రూరల్, న్యూస్‌లైన్: పండ్ల తోటలపై ఏనుగుల గుంపు దాడి చేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఏనుగుల బారి నుంచి పంటలను కాపాడేందుకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపడం లేదని వాపోతున్నా రు. వుండల పరిధిలోని అటవీ ప్రాంత శివారు గ్రావూలైన గుడ్లనాయునపల్లె, జరుగు, యునవునాసనపల్లె, పరుకుంట్లపల్లె గ్రావూల్లో శుక్రవారం తెల్లవారుజామున ఏనుగుల గుంపు అరటి, పుచ్చకాయు తోటల ను ధ్వంసం చేసింది. పరుకుంట్లపల్లెలోని చిన్నక్క, రత్నవ్ము, జరుగు గ్రామంలోని వీటి.రావుప్పకు చెందిన 6.7 ఎకరాల పుచ్చకాయుతోట పూర్తిగా దెబ్బతింది.
అలాగే పరకుంట్లపల్లెలోని కెంపన్నకు చెందిన రెండు ఎకరాల అరటి తోట, జరుగు గ్రామంలోని క్రిష్ణప్ప చెందిన మూడు ఎకరాల రాగి పంటను ఏనుగులు నాశనం చేశారుు. అప్పులు చేసి సాగు చేశామని, పంట చేతికోచ్చే సవుయూనికి ఏనుగులు దాడి చేయడంతో పూర్తిగా నష్టపోయూవుని రైతులు కన్నీటి పర్యంతమయ్యూ రు. ఏనుగుల దాడిలో పంటనష్టం జరిగిన ప్రతిసారీ పరిహారం ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఎప్పుడు వస్తుందో తెలియడం లేదన్నా రు. అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, నాలుగేళ్లుగా ఏనుగులు దాడులు చేస్తున్నా శాశ్వత పరిష్కారం చూపడం లేదని రైతులు వాపోతున్నారు.