తమ్మిలేరుకు తగ్గిన వరద
చాట్రాయి: ఖమ్మం జిల్లాలో వర్షాలు తగ్గడంతో మండలంలోని తమ్మిలేరు వాగుకి వరదనీరు తగ్గింది. రెండు రోజలు క్రితం రెండు వేల క్యూసెక్కుల వరదనీరు రాగా సోమవారం ఉదయం 1400 క్యూసెక్కులకు తగ్గింది. చిన్నంపేట, శివాపురం గ్రామాల మధ్య ఉన్న తమ్మిలేరు వంతెన వద్ద తక్కువ వరద ప్రవహిస్తోంది. సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో చెరువులు నిండిపోవడంతో ఏ మాత్రం వరద వచ్చినా నేరుగా తమ్మిలేరు రిజర్వాయర్కి వరద వస్తుందని టీఆర్పీ ఇంజినీర్లు చెబుతున్నారు.