చీటీల వ్యాపారి అదృశ్యం!
పెళ్లకూరు : నలభై ఏళ్లుగా చిటీల వ్యాపారం చేస్తూ చుట్టూ పక్కల ప్రాంతాల వారితో నమ్మకంగా ఉన్న పెళ్లకూరుకు చెందిన ఓ వ్యక్తి కుటుంబం అదృశ్యంపై లబ్ధిదారుల ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో సొంత ఇల్లు, కొద్దిపాటి వ్యవసాయ భూములు ఉండడం, అందరితో సత్సంబంధాలు ఉండటంతో పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు, వివిధ వ్యాపారులు, ఉద్యోగులు సైతం ఆయన వద్ద చీటీలు వేస్తూ లావాదేవీలు కొనసాగిస్తుండేవారు. ఈ క్రమంలో సుమారు రూ.2 కోట్లు వరకు చీటీల మొత్తాన్ని చేజిక్కించుకుని కుటుం బమంతా కలిసి ఉడాయించినట్లు తెలుస్తుంది. కుటుంబ సభ్యు లు ఎవరూ ఫోన్లో అందుబాటులో లేకపోవడంతో పలు ప్రాంతాలకు చెందిన ఖాతాదారులు రెండు రోజులుగా వ్యా పారి ఇంటి వద్దకు వచ్చి చుట్టు పక్కల వారిని విచారించి ఆం దోళన వ్యక్తం చేస్తున్నారు. పక్కా ప్లాన్‌తోనే అతను కుటుంబ సభ్యులతో పరారైనట్లు పలువురు విమర్శిస్తున్నారు. ఈ విషయమై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.