‘కాళేశ్వరం’ కోసం లైడార్ సర్వే
గణపురం : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సియానో కాంట్రాక్ట్ కంపెనీ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కోసం లైడార్ సర్వే చేపట్టింది. బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ హెలికాప్టర్ ద్వారా కాళేశ్వరం, దుమ్ముగూడెం, మేడిగడ్డ ప్రాంతాల్లో సర్వే చేయనుంది.
ఈ మేరకు గురువారం సాయంత్రం హెలికాప్టర్ గురువారం సాయంత్రం చెల్పూరు శివారులోని కెటీపీపీలోని హెలిప్యాడ్‌లో దిగింది.హైదరాబాద్ నుంచి అధికారులు రావాల్సి ఉందని, శుక్రవారం సర్వే ఉంటుందని సమాచారం. ఆరు నెలల క్రితం కూడా ఇదే మాదిరిగా సర్వే చేశారు.