వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా గురునాథ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: అనంతపురం(అర్బన్) అసెంబ్లీ నియోజక వర్గానికి నూతన సమన్వయ కర్త, కో-ఆర్డినేటర్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియమించింది. నియోజక వర్గ సమన్వయ కర్తగా నదీమ్ అహ్మద్ నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. వారి నియామకాన్ని తెలియచేస్తూ వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం పత్రికా ప్రకటన విడుదల చేసింది. అయితే ఇప్పటివరకూ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డిని పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు.