correction
-
ఈక్విటీ కరెక్షన్తో తిరిగి బ్యాంకుల్లోకి డిపాజిట్లు
ముంబై: ఈక్విటీ మార్కెట్లో దిద్దుబాటుతో బ్యాంక్‌లు తిరిగి డిపాజిట్లను ఆకర్షించగలవని ఎస్బీఐ ఎండీ అశ్విని తివారీ అభిప్రాయపడ్డారు. ఎస్బీఐ డిపాజిట్ల వృద్ధికి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) ఖాతాలను కీలకంగా చూస్తున్నట్టు చెప్పారు. క్యాపిటల్ మార్కెట్లలో ర్యాలీతో బ్యాంకుల్లోని డిపాజిట్లు అధిక రాబడులను ఇచ్చే ఇతర సాధనాల్లోకి మళ్లేలా చేసినట్టు పేర్కొన్నారు.కాలక్రమేణా మార్కెట్ కరెక్షన్కు లోనైతే గతంలో తమ వద్ద డిపాజిట్లుగా ఉండే కొంత మొత్తం తిరిగి వెనక్కి వస్తుందన్నారు. తక్కువ విలువైన, చిన్న ఖాతాల ద్వారా డిపాజిట్లు పెంచుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నట్టు తివారీ తెలిపారు. జన్‌ధన్ యోజన ఖాతాలపై గతంలో ప్రత్యేక దృష్టి ఉండేది కాదంటూ, ఇక మీదట ఆ ఖాతాలను కూడా కీలకంగా చూస్తామన్నారు. గడిచిన 18 నెలలుగా బ్యాంకుల్లో డిపాజిట్ల కంటే రుణాల వృద్ధే అధికంగా నమోదవుతుండడం గమనార్హం. దీంతో డిపాజిటర్లను ఆకర్షించేందుకు బ్యాంకులు రేట్లను పెంచడం లేదంటే రుణ వృద్ధిలో రాజీ పడాల్సిన పరిస్థితి నెలకొంది.దేశ ఈక్విటీ మార్కెట్ గడిచిన ఏడాదిన్నర పాటు గణనీయమైన వృద్ధిని చూడడం గమనార్హం. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు అధిక రాబడుల కోసం ఈక్విటీ మ్యూచవుల్ ఫండ్స్, నేరుగా స్టాక్స్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్న ధోరణి నెలకొంది. ఈ క్రమంలో అశ్విని తివారీ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. అన్సెక్యూర్డ్ రుణాలకు రిస్క్ వెయిటేజీ పెంచడం, ప్రాజెక్టు రుణాలకు అధిక కేటాయింపులు చేయాల్సి రావడం వంటివి డిపాజిట్లలో వృద్ధి నిదానించడానికి సంకేతంగా తివారీ పేర్కొన్నారు. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా అవసరమైతే డిపాజిట్ల రేట్లను సైతం పెంచుతామని ప్రకటించారు. ప్రత్యామ్నాయాలు.. సాధారణంగా బ్యాంకింగ్ రంగంలో 90 శాతం మేర రుణ అవసరాలకు సరిపడా నిధులు డిపాజిట్ల రూపంలోనే వస్తుంటాయని.. ఇన్ఫ్రా బాండ్లు వంటి ఇతర సాధనాలవైపు చూడక తప్పని ప్రస్తుత పరిస్థితుల్లో డిపాజిట్ల వాటా తగ్గొచ్చని తివారీ చెప్పారు. సూక్ష్మ రుణాల పోర్ట్‌ఫోలియో చెల్లింపుల్లో ఎలాంటి వైరుధ్యాలు లేవన్నారు. -
దిద్దుబాటు కొనసాగొచ్చు.. మార్కెట్ గమనంపై నిపుణుల అంచనాలు
ముంబై: స్టాక్ మార్కెట్లో ఈ వారమూ దిద్దుబాటు (కరెక్షన్) కొనసాగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. కరెక్షన్ పరిమితంగా ఉంటూ.., తీవ్ర ఒడిదుడుకుల ట్రేడింగ్‌కు అవకాశం ఉందంటున్నారు. బక్రిద్ సందర్భంగా బుధవారం సెలవు కావడంతో నాలుగురోజులే ట్రేడింగ్ జరుగుతుంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్ డెరివేటివ్‌ల గడువు ముగింపు గురువారం ఉంది. గతవారం(జూన్ 22న) మొదలైన విప్రో రూ.12,000 బైబ్యాక్ ఇష్యూ గురువారమే ముగియనుంది. ఇదే వారంలో చిన్న, మధ్య తరహా కంపెనీలతో మొత్తం ఏడు కంపెనీలు ఐపీఓకి రానున్నాయి. అంతర్జాతీయంగా రష్యాలో అంతర్యుద్ధ పరిణామాలు, ఈసీబీ ఫోరమ్ నిర్వహించే సమావేశంలో ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించవచ్చు. వీటితో పాటు రుతుపవనాల వార్తలు, ఎఫ్ఐఐల పెట్టుబడులు, రూపాయి విలువ కీలకం కానున్నాయి. ‘‘మార్కెట్ స్థిరీకరణలో భాగంగా అమ్మకాల ఒత్తిడి కొనసాగొచ్చు. దేశీయంగా బలమైన స్థూల ఆర్థిక డేటా నమోదు, కమోడిటీ ధరలు దిగిరావడం తదితర సానుకూలాంశాల ప్రభావంతో దిద్దుబాటు పెద్దగా ఉండకపోవచ్చు. దిద్దుబాటు కొనసాగితే నిఫ్టీకి దిగువున 18,600–18,650 శ్రేణిలో తక్షణ మద్దతు స్థాయి కలిగి ఉంది. కొనుగోళ్లు నెలకొంటే ఎగువున 18,750 స్థాయిని చేధించాల్సి ఉంటుంది’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. క్రితం వారం సెన్సెక్స్ 405 పాయింట్లు, నిఫ్టీ 160 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. ప్రపంచ పరిణామాలు... రష్యాలో తిరుగుబాటు పరిణామాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ పోర్చుగల్‌లోని సింట్రాలో కేంద్ర బ్యాంకింగ్ వ్యవస్థ(2023)పై ఈసీబీ ఫోరం నిర్వహించే పాలసీ చర్చలో పాల్గొనున్నారు. అమెరికా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు క్యూ1 జీడీపీ గణాంకాలు గురువారం విడుదల కానున్నాయి. అదే రోజున మే జపాన్ రిటైల్, వినిమయ విశ్వాస డేటా వెల్లడికానున్నాయి. ఈ వారంలో 7 ఐపీఓలు.. ఈ వారంలో ఏడు కంపెనీలు ఐపీఓకి రానున్నాయి. ఇడియాఫోర్జ్, సియెంట్ డీఎల్ఎమ్, పీకేహెచ్ వెంచర్స్‌తో మరో నాలుగు చిన్న, మధ్య తరహా కంపెనీలు మొత్తం రూ.1600 కోట్లు సమీకరించనున్నాయి. ఐడియాఫోర్జ్ టెక్నాలజీ ఐపీఓ సోమవారం(నేడు) ప్రారంభమై జూన్ 29(గురువారం) ముగుయనుంది. ధరల శ్రేణిని రూ.632–672గా ఉంది. మొత్తం రూ.576 కోట్లు సమీకరించనుంది. సైయంట్ డీఎల్ఎం ఐపీఓ మంగవారం(రేపు) ప్రారంభం కానుంది. శుక్రవారం(జూన్ 30న) ముగుస్తుంది. చిన్న, మధ్య తరహా కంపెనీలైన కన్వేయర్ బెల్ట్ తయారీ సంస్థ పెంటగాన్ రబ్బర్(జూన్ 26 – 30), సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సర్వీసెస్ సంస్థ(జూన్ 30 – జూలై 5), త్రివిద్య టెక్, సినోఫిట్స్ టెక్నాలజీ ఐపీఓలు రెండూ జూన్ 30న మొదలై.., జూలై అయిదున ముగియనున్నాయి. మూడు వారాల్లో రూ.30,600 కోట్లు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐటు) భారత ఈక్విటీల్లో పెట్టుబడులను కొనసాగిస్తున్నారు. ఈ జూన్‌లో ఇప్పటివరకు వారు రూ. 36,600 కోట్ల పెట్టుబడులు పెట్టారు. భారత ఆర్థికవ్యవస్థ ఆర్థిక గణాంకాలు సానుకూలంగా ఉండటం, కార్పొరేట్ రంగం ఆదాయం పటిష్టంగా ఉండటమే దీనికి కారణమని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ‘‘ఎఫ్ఐఐల పెట్టుడబడులు రానున్న రోజుల్లో నెమ్మదించవచ్చు. అమెరికా ద్రవ్యోల్బణాన్ని లక్ష్యం కంటే దిగువకు చేర్చేందుకు మరింత వడ్డీ పెంపు అవసరమని భావిస్తుంది. ఇటీవలే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ నేపథ్యంలో ఎఫ్‌పీఐలు అప్రమత్తంగా వహించవచ్చు’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్(రిటైల్) హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అన్నారు. -
మార్కెట్లో స్థిరీకరణకు అవకాశం
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారం పరిమిత శ్రేణిలో ట్రేడవుతూ.., స్థిరీకరణ దిశగా సాగొచ్చని నిపుణులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రపంచ పరిణామాలతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి సూచీల గమనాన్ని నిర్దేశిస్తాయని చెబుతున్నారు. అలాగే స్థూల ఆర్థిక గణాంకాలు, కార్పొరేట్ల క్యూ2 ఫలితాలు మార్కెట్‌కు కీలకం కానున్నాయని వారంటున్నారు. ప్రపంచ పరిణామాలు, ఎఫ్ఐఐల వైఖరి కీలకం ‘‘ప్రపంచ మార్కెట్ల మిశ్రమ వైఖరితో దేశీయ స్టాక్ సూచీల గరిష్ట స్థాయిల వద్ద అమ్మకాల ఒత్తిడికి ఎదుర్కోవచ్చు. కార్పొరేట్ల రెండో క్వార్టర్ ఆర్థిక ఫలితాల విడుదల నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌పై దృష్టి సారించడం శ్రేయస్కరం. సాంకేతికంగా నిఫ్టీ తన 50 రోజుల సగటు తక్షణ మద్దతు 17,674 స్థాయిని నిలుపుకోగలిగింది. అప్‌సైడ్‌లో 18,000–18,200 శ్రేణి మధ్య బలమైన నిరోధాన్ని ఎదుర్కోనుంది’’ రిలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. గత వారంలో సెన్సెక్స్ 761 పాయింట్లు, నిఫ్టీ 245 పాయింట్లు లాభపడ్డాయి. కార్పొరేట్ల క్వార్టర్ ఫలితాలపై దృష్టి... కార్పొరేట్ల రెండో క్వార్టర్ ఆర్థిక ఫలితాల ప్రకటన తుది అంకానికి చేరుకుంది. ఈ వారంలో 2,100 పైగా కంపెనీలు తమ క్యూ2 ఆర్థిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. బ్రిటానియా, అరబిందో, భాష్, ఎంఅండ్ఎం, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బ్యాంక్ ఆఫ్ బరోడా, జొమాటో, టాటా స్టీల్, కోల్ ఇండియా, గ్రాసీం, హీరో మోటోకార్ప్, హిందాల్కో, ఓఎన్జీసీ లు సెప్టెంబర్ త్రైమాసిక గణాంకాలను వెల్లడించే కంపెనీల జాబితాలో ఉన్నాయి. బేరీష్‌గా విదేశీ ఇన్వెస్టర్లు... వరుసగా మూడోవారంలోనూ విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) దేశీయ ఈక్విటీలను అమ్మేందుకే మొగ్గు చూపారు. గత నెల ఆక్టోబర్‌లో రూ.13550 కోట్ల షేర్లను షేర్లను విక్రయించిన ఎఫ్ఐఐలు తాజాగా ఈ నవంబర్ ఇప్పటి వరకు రూ.4,583 కోట్లు పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. రానున్న రోజుల్లో ఇదే వైఖరి కొనసాగితే మార్కెట్లో కరెక్షన్ తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు కీలకం.... అమెరికా, చైనాలు బుధవారం(10న) ద్రవ్యోల్బణ గణాంకాలను విడుదల చేయనున్నాయి. ఆర్థికంగా అగ్ర రాజ్యాలైన ఈ దేశాల ద్రవ్యోల్బణ గణాంకాల ఆధారంగానే ఈక్విటీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మక, కొనుగోళ్లు ఆధారపడి ఉంటాయి. అలాగే పలు దేశాల కేంద్ర బ్యాంకుల వడ్డీరేట్ల తగ్గింపు, పెంపు అంశాలను సైతం ఈ గణాంకాలు ప్రభావితం చేయగలవు. ఇక దేశీయంగా శుక్రవారం(నవంబర్ 12న) దేశీయ సెప్టెంబర్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలతో పాటు రిటైల్ ద్రవ్యోల్బణ డేటా విడుదల అవుతుంది. -
వైద్యశాఖలో అవినీతి బాగోతం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి..
సాక్షి, నిర్మల్ (ఆదిలాబాద్): నిర్మల్ జిల్లాలో స్వల్ప వ్యవధిలోనే ఏసీబీ వలకు మరో అవినీతి జలగ చిక్కింది. వైద్యశాఖలో లంచాలకు అలవాటుపడ్డ ఉద్యోగి కథ బట్టబయలైంది. జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్యవిధాన పరిషత్ కార్యాలయంలో ఏసీబీ అధి కారులు గురువారం అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. లంచం తీసుకున్న సీనియర్ అసిస్టెంట్ కోరకంట శ్రీనివాస్‌ను పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య వివరాలు వెల్లడించారు. రిటైర్డ్ ఉద్యోగినీ వదలకుండా.. అటవీశాఖలో ఫారెస్ట్ సెక్షన్ అధికారి(ఎఫ్ఎస్ఓ)గా పనిచేసిన జి.రాజేశ్వర్ 2018లో ఉద్యోగ విరమణ పొందారు. రిటైర్డ్ తర్వాత రావాల్సిన బెనిఫిట్స్ రావాలంటే సమర్పించాల్సిన కమిటెడ్ వాల్యుయేషన్ రిపోర్ట్ కోసం జూలై 14న మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించారు. సదరు సర్టిఫికెట్‌ను ఖాళీ చేతులతో ఇవ్వడానికి సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ ముందుకు రాలేదు. రిటైర్డ్ అయిన తర్వాత నుంచి కనీసం పింఛన్ తీసుకోని రాజేశ్వర్ వద్ద రూ. పదివేలు లంచం అడిగాడు. చివరకు రూ.8వేల వరకు ఇస్తే ఓకే అన్నాడు. దీంతో జూలై 26న రాజేశ్వర్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గురువారం రూ.8వేలు లంచం తీసుకుంటున్న శ్రీనివాస్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు డీఎస్పీ వివరించారు. కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పరుస్తున్నట్లు చెప్పారు. అకస్మాత్తుగా ఏసీబీ అధికారులు రావడంతో వైద్యవిధాన పరిషత్‌తో పాటు అదే భవనంలో ఉండే వైద్యారోగ్య శాఖ కార్యాలయంలోనూ కలకలం కొనసాగింది. -
మరోసారి మార్చి కనిష్ఠాలకు మార్కెట్???
దేశీయ మార్కెట్లు ఈ ఏడాది నష్టాల నుంచి కోలుకోవని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తొమ్మిదేళ్లలో 2020 అత్యంత అధ్వాన్న ప్రదర్శన చూపుతుందని అంచనా వేస్తున్నారు. ఎకానమీలో భారీ డౌన్‌ట్రెండ్, వ్యాపారకార్యకలాపాలు పడకేయడం.. మార్కెట్‌ను కోలుకోలేకుండా చేస్తాయని రాయిటర్స్ పోల్‌లో విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మార్చి 24న నమోదు చేసిన 25639 పాయింట్ల కనిష్ఠాన్ని సెన్సెక్స్ ఈ ఏడాది మరోమారు తాకవచ్చని పోల్‌లో పాల్గొన్న అనలిస్టుల్లో 55 శాతం మంది అంచనా వేశారు. ఇది వచ్చే సెప్టెంబర్‌లోనే జరగవచ్చన్నారు. మార్చి కనిష్ఠాల నుంచి మార్కెట్ దాదాపు 20 శాతం రికవరీ చూపింది. కానీ ఈ ఏడాది తాకిన ఆల్‌టైమ్‌హై నుంచి దాదాపు 26 శాతం దిగువన ఉంది. ఆర్బీఐ పలు చర్యలు చేపట్టినా, ప్రభుత్వం భారీ ప్యాకేజీ ఇచ్చినా సూచీలు పెద్దగా ర్యాలీ జరపలేకపోవడం బలహీనతకు నిదర్శనమని అనలిస్టులు భావిస్తున్నారు. సెన్సెక్స్ ఈ ఏడాది చివరకు కాస్త రికవరీ చూపవచ్చని, డిసెంబర్ నాటికి సెన్సెక్స్ 31960 పాయింట్లను చేరవచ్చని సర్వేలో పాల్గొన్న నిపుణులు సరాసరిన అంచనా వేశారు. అప్పటికీ ఈ ఏడాది మొత్తం మీద సెన్సెక్స్ దాదాపు 22.5 శాతం నష్టాన్ని నమోదు చేసినట్లవుతుంది. 2011 తర్వాత ఈ స్థాయిలో సూచీలు అధ్వాన్న ప్రదర్శన జరపడం ఇదే తొలిసారి కానుంది. మూడునెలల క్రితం ఇదే రాయిటర్స్ సర్వేలో నిపుణులు సెన్సెక్స్ సంవత్సరాంతపు టార్గెట్ 43560 పాయింట్లుగా అంచనా వేశారు. తాజా అంచనాల ప్రకారం వచ్చే ఏడాది మధ్యనాటికి సెన్సెక్స్ 35500 పాయింట్లు, 2021 చివరకు 38000పాయింట్లకు చేరవచ్చు. ఈ ఏడాది జనవరిలో సెన్సెక్స్ 42274 పాయింట్ల ఆల్‌టైమ్‌హైని తాకింది. ప్రస్తుతం దేశీయ సూచీలు వాల్యూషన్లపరంగా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయని, కానీ ఎకానమీలో ఇబ్బందులు, రికవరీలో జాప్యం కారణంగా సూచీల్లో లాభాలు చాలా పరిమితంగా ఉంటాయని క్యాపిటల్ ఎకనామిక్స్ అనలిస్టు శిలాన్‌షా చెప్పారు. దేశీయ ఎకానమీకి రాబోయే మూడునెలల్లో అధిక నిరుద్యోగిత అధిక ముప్పని సర్వేలో ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. వచ్చే ఒకటి రెండు త్రైమాసికాలు కార్పొరేట్ ఫలితాలు బాగా దెబ్బతింటాయని కూడా సర్వేలో అత్యధికులు భావించారు. ఆగస్టు- సెప్టెంబర్ నాటికి సూచీలు మరోమారు మార్చి కనిష్ఠాలను చూస్తాయని, అనంతరమే కాస్త రికవరీ ఉంటుదంని ఏంజల్ బ్రోకింగ్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ముందు లోతైన అధ్యయనం జరపాలని నిపుణులు సూచిస్తున్నారు. -
ఆధార్ నిబంధనల సవరణకు క్యాబినెట్ ఓకే..
న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాలు, మొబైల్ నంబర్లకు ఆధార్‌ను అనుసంధానించడాన్ని చట్టబద్ధం చేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి టెలిగ్రాఫ్ చట్టం, మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టాలకు సవరణలు చేసే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ సోమవారం ఆమోదముద్ర వేసింది. ఆధార్ ఆధారంగా కొత్త మొబైల్ కనెక్షన్స్ ఇవ్వడానికి, బ్యాంక్ ఖాతాలు తెరవడానికి దీనితో చట్టబద్ధత లభిస్తుంది. వీటికోసం కస్టమర్లు ఆయా సంస్థలకు తమ ఆధార్‌ను ఇష్టపూర్వకంగా ఇవ్వొచ్చు. మొబైల్ సిమ్ కార్డుల జారీకి, బ్యాంక్ ఖాతాలు తెరవడానికి ఆధార్ తప్పనిసరన్న సెక్షన్ 57ని సుప్రీం కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ప్రైవేట్ కంపెనీలు ఆధార్‌ను వినియోగించడంపై ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో క్యాబినెట్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. -
పేపర్లు దిద్దడం..మార్కులు వేయడం..అంతా విద్యార్థులే!
ఉలవపాడు : ఓ వైపు విద్యాశాఖ తాము వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని గొప్పలు చెబుతుంది...తీరా పరిస్థితి చూస్తే వాస్తవానికి విరుద్ధం. వివరాలలోకి వెళితే పకడ్బందీ అంటూ పేపర్లు ఇచ్చేటప్పుడు పోలీస్‌స్టేషన్‌కు పంపి అక్కడ నుంచి పాఠశాలకు చేర్చి అనంతరం పరీక్షలు నిర్వహించారు. కానీ పరీక్షలు జరిపారు. ఆ తరువాత విద్యార్థులు రాసిన పేపర్లను బహిర్గతం కాకుండా దిద్ది నిజమైన మార్కులు అందచేయాలి. కానీ ఉలవపాడు ఉన్నత పాఠశాలలో పరిస్థితి చాలా దారుణం. సోమవారం ఉలవపాడు ఉన్నత పాఠశాలలో పాత రూంలలో ఏడో తరగతి విద్యార్థులే తాము రాసిన పేపర్లను రుద్దుకుంటున్నారు. తమకు నచ్చిన విధంగా మార్కులు వేసుకునే పరిస్థితి. ఉపాధ్యాయులు పరీక్ష రాసిన తరువాత రహస్యంగా జరగాల్సిన కార్యక్రమం కాస్తా బహిర్గతం చేయడం అదీ పరీక్షలు రాసిన విద్యార్థుల చేతే వారి పేపర్లు రుద్దిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వారి పేపర్లు కాకుండా పక్క క్లాసు పేపర్లు కూడా దిద్దుతున్న పరిస్థితి నెలకొంది. ప్రధానోపాధ్యాయురాలి అండతోనే ఈ కార్యక్రమం జరుగుతుందని ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. ప్రధానోపాధ్యాయురాలు కొండపి ఎమ్మెల్యే స్వామి అక్క కావడంతో విద్యాశాఖ నుంచి తమను ఎవరూ పట్టించుకోరు అని ఉపాధ్యాయులు బాహాటంగా చెబుతున్నారు. కానీ ఏడాది కాలంగా వివాదాల మధ్య నడుస్తున్న ఈ పాఠశాలలో ఇలా పేపర్లు విద్యార్థులు దిద్దడం చూసిన తరువాత ఉపాధ్యాయులు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలంటే వెనుక్కు తగ్గే పరిస్థితిని ఉలవపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు కల్పించారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
పట్టించుకుంటే ‘ఒట్టు’!
కర్నూలు(అగ్రికల్చర్): గతంలో ఎన్నడూ లేని విధంగా 2017 ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం అస్తవ్యస్తంగా మారింది. మొదట మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఇంటింటి సర్వే చేపట్టడం వల్ల ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం దారి తప్పిపోయింది. రాష్ట్ర శాసనసభకు, పార్లమెంటుకు ఒకేసారి వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, ఈ సారి నాలుగైదు నెలలు ముందుగా నిర్వహించేందుకు యత్నాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలను ఎదుర్కొనే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఎన్నికల యంత్రాంగం మాత్రం స్తబ్దుగా మిన్నకుండడం గమానార్హం. ముందస్తుగా ఎన్నికలు జరిగితే 2017 ఓటర్ల జాబితా సవరణ ద్వారా ప్రకటించే తుది జాబితానే ప్రామాణికం అవుతుంది. నిబంధనల ప్రకారం జాబితా సవరణ కార్యక్రమం మొదలయ్యే రోజున ముసాయిదా జాబితాను ప్రకటిస్తారు. ఈ సారి మాత్రం జాబితా సవరణలో భాగంగా ఓటరు నమోదు, అభ్యంతరాలు, మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమం ముగిసినప్పటికీ ముసాయిదా జాబితాను ప్రకటించలేదు. దీన్ని ప్రకటిస్తే ఓటర్లు అందులో తమ పేరు ఉందో లేదో చూసుకొని దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ముసాయిదా జాబితాను ఇంత వరకూ ప్రకటించ లేదు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా డిసెంబరు 17, 24వ తేదీలను ప్రత్యేక ఓటరు నమోదు దినాలుగా ప్రకటించడంతో 6,677, 7,664 దరఖాస్తులు వచ్చాయి. ఇంత వరకు వీటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. వీటిపై బీఎల్ఓలు ఇంటింటికీ తిరిగి విచారణ జరపాలి. ఆన్లైన్లో సీఈఓ వెబ్సైట్లో నమోదు చేయాల్సి ఉంది. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం షెడ్యూలు ప్రకారం ఈ నెల 20న తుది జాబితాను ప్రకటించాల్సి ఉన్నా ఇప్పటి దాకా పట్టించుకోకపోవడం గమనార్హం. ఓటర్ల జాబితా సవరణ పూర్తై తుది జాబితా ప్రకటించిన తర్వాత జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే, ఎన్నడూ లేని విధంగా అస్తవ్యస్త పరిస్థితులు నెల కొన్నాయి. రాజకీయ పార్టీలు సాధారణ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నా ఓటర్ల జాబితా తయారీలో ఎన్నికల యంత్రాంగం స్తబ్దుగా ఉండి పోయింది. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించేందుకు చర్యలు ప్రారంభించినా జాబితా ప్రకటనపై గందరగోళం నెలకొంది. ఈ సారి ముసాయిదా ఓటర్ల జాబితా లేకుండానే ఒకటి రెండు రోజుల్లో తుది ఓటర్ల జాబితా వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఓటర్ల దినోత్సవానికి పకడ్బందీ ప్రణాళిక : కలెక్టర్ ఈ నెల 25న అన్ని నియోజకవర్గాల్లో 8వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని కలెక్టర్ సత్యనారాయణ ఆర్డీఓలు, ఈఆర్ఓలు, తహసీల్దార్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్పరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తామని, మండల కేంద్రాలు, మున్సిపాలిటీలు, నియోజక వర్గ కేంద్రాల్లో అనువైన ప్రదేశాల్లో నిర్వహించాలని సూచించారు. పంచాయతీల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసి టామ్‌టామ్ వేయించాలని, 25న 2కే రన్ నిర్వహించి ప్రధాన కూడళ్లలో మానవాహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేయించాలని సూచించారు. మహిళలతో ముగ్గుల పోటీలు నిర్వహించాలని, ఫోక్ డ్యాన్స్, మిమిక్రీ, కూచిపూడి తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. మొదటి సారిగా ఓటర్లుగా నమోదైన యువతను, ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న వెటరన్ ఓటర్లను గుర్తించి సత్కరించాలని సూచించారు. వీడియో కాన్పరెన్స్‌లో డీఆర్ఓ శశీదేవి, జడ్పీ సీఇఓ ఈశ్వర్,స్పెషల్ కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి, డిప్యూటీ కలెక్టర్ అనురాధ, డీఎస్డీఓ జగన్నాథరెడ్డి, ఐసీడీఎస్ పీడీ జుబేద బేగం ఎన్నికల సెల్ సూపరింటెండెంటు యూనస్‌బాషా తదితరులు పాల్గొన్నారు. -
వారంలో టీఆర్టీ సవరణ నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో పాత పది జిల్లాల ప్రకారమే నియామకాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టీఆర్టీ నోటిఫికేషన్ సవరణ చేయాలని.. పాత జిల్లాల ప్రకారం పోస్టులు, రోస్టర్, రిజర్వేషన్ల వివరాలను సిద్ధం చేయాలని విద్యా శాఖను ఆదేశించింది. ఇక ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు జిల్లాల ఆప్షన్‌ను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించ నున్నారు. కొత్తగా దరఖాస్తు చేసేవారికి పాత పది జిల్లాల ఆప్షన్లే వచ్చేలా మార్పులు చేయనున్నారు. వారం రోజుల్లో సవరణ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముంది. దరఖాస్తుల గడువును కూడా వచ్చే నెల 15వ తేదీ వరకు పొడిగించనున్నట్లు సమాచారం. 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం గత నెల 21న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అదే నెల 30వ తేదీ నుంచి ఈనెల 30 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది. అయితే ఈ నోటిఫికేషన్‌ను 31 కొత్త జిల్లాల ప్రాతిపదికన జారీ చేశారని, రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు 10 జిల్లాల వారీగా భర్తీ చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న కోర్టు పాత జిల్లాల ప్రకారమే నియామకాలు చేపట్టాలని శుక్రవారం తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. పాత పది జిల్లాల ప్రకారం పోస్టులు, రోస్టర్, రిజర్వేషన్ల వివరాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లా ఆప్షన్లో ‘ఎడిట్’కు అవకాశం టీచర్ పోస్టుల దరఖాస్తుల్లో అభ్యర్థుల స్థానికతకు సంబంధించి 31 జిల్లాలను పొందుపరిచారు. అభ్యర్థులు తాము పుట్టిన ప్రదేశం ప్రకారం కొత్త జిల్లాను ఎంచుకున్నారు. తాజాగా పాత జిల్లాలే ప్రాతిపదిక అని హైకోర్టు స్పష్టం చేయడంతో దరఖాస్తుల్లో మార్పులు చేయాల్సి ఉంది. దీంతో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ‘ఎడిట్’ఆప్షన్ ఇచ్చి.. పాత జిల్లాల లెక్కన తమ జిల్లాను ఎంచుకునే అవకాశం కల్పించాల్సి ఉంటుందని టీఎస్పీఎస్సీ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తంగా నోటిఫికేషన్లో మార్పు ఉండకపోవచ్చని.. సవరణ ద్వారా పాత పది జిల్లాల ప్రకారం పోస్టులు, రోస్టర్, రిజర్వేషన్ వివరాలను తెలియజేస్తే సరిపోతుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఇక కొత్తగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కోసం 31 జిల్లాల ఫార్మాట్ స్థానంలో పాత 10 జిల్లాలను అందుబాటులోకి తేవాల్సి ఉంది. ఇందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉండడంతో.. దరఖాస్తుల స్వీకరణ గడువును వచ్చే నెల 15 వరకు పొడగించే అవకాశముంది. మరోవైపు 31 జిల్లాలతో భర్తీ చేయాలన్న ఉద్దేశంతో కొత్త రోస్టర్‌ను ఒకటో పాయింట్ నుంచి ప్రారంభించారు. కానీ పాత జిల్లాల లెక్కన భర్తీతో పాత రోస్టర్, రిజర్వేషన్లనే కొనసాగించనున్నారు. పలు జిల్లాల వారికి ప్రయోజనం కొత్త జిల్లాల లెక్కన చూస్తే.. ఏడు జిల్లాల్లో ఎస్జీటీ వంటి కొన్ని కేటగిరీల పోస్టులే లేవు. మరో 8 జిల్లాల్లో ఏజెన్సీ పోస్టులను మినహాయిస్తే ఎస్జీటీ పోస్టులు 11లోపే ఉన్నాయి. అంటే సాధారణ అభ్యర్థుల విషయంలో 15 జిల్లాల్లో పోస్టులు దాదాపుగా లేనట్లే. మరో మూడు జిల్లాల్లోనూ 50లోపే పోస్టులు ఉండటంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా పాత జిల్లాల లెక్కన భర్తీ చేపట్టనుండడంతో.. ఆయా జిల్లాల ఉపాధ్యాయ అభ్యర్థులకు ప్రయోజనం కలుగనుంది. ముఖ్యంగా పోస్టులు లేని పట్టణ జిల్లాలకు చెందినవారికి ఎక్కువ ప్రయోజనం చేకూరనుంది. పాత జిల్లాల ప్రకారం వివిధ కేటగిరీల్లోనూ పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉండనుంది. -
ఓటరు జాబితా సవరణ
► ఏప్రిల్ 20న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ ► మే 10 వరకు అభ్యంతరాల స్వీకరణ ► స్పెషల్ క్యాంపులు, గ్రామసభల అనంతరం ► మే 31న ఓటరు తుది జాబితా ప్రకటన ► ప్రయోగాత్మకంగా నల్లగొండ నియోజకవర్గంలో ఇంటింటి సర్వే నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కొత్త ఓటరు నమోదు కార్యక్రమానికి ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది. జిల్లాల పునర్విభజన, పొరుగు జిల్లాల్లో శాసన మండలి ఎన్నికల కారణంగా ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటరు నమోదు ప్రక్రియ ఆలస్యమైంది. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమైంది. షెడ్యూల్ ప్రకారం ప్రస్తుతం ఉన్న మూడు జిల్లాల్లో ముసాయిదా ఓటరు జాబితాను ఏప్రిల్ 20న ప్రకటిస్తారు. కొత్త ఓటరు నమోదు ప్రక్రియ కూడా అదే రోజు నుంచి ప్రారంభమవుతుంది. దీంతో పాటు ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలు మే 10 తేదీ వరకు స్వీకరిస్తారు. ఏప్రిల్ 26, మే 3న రెండు విడతల్లో గ్రామ సభలు నిర్వహించి ఓటరు జాబితాను చదివి వినిపిస్తారు. ఆ తర్వాత మలి విడత ప్రత్యేక క్యాంపు ఏప్రిల్ 30, మే7న నిర్వహిస్తారు. ఈ రెండు రోజుల్లో పోలింగ్ కేంద్రాల వద్ద బూత్ లెవల్ ఏజెంట్లు ముసాయిదా జాబితాపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఈ మొత్తం షెడ్యూల్లో వలస వెళ్లిన ఓటర్లను జాబితా నుంచి తొలగించడంతో పాటు, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించనున్నారు. మార్పులు, చేర్పుల అనంతరం నియోజకవర్గాల వారీగా ఓటరు తుదిజాబితాను మే 31న అధికారికంగా ప్రకటిస్తారు. నల్లగొండలో ఇంటింటి సర్వే.. ఓటరు జాబితాను సమగ్రంగా ప్రక్షాళన చేసి ఆ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య, పోలింగ్ కేంద్రాలను నిక్కచ్చిగా తేల్చేందుకు ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ప్రయోగాత్మకంగా కొన్ని నియోజకవర్గాలను ఎంపిక చేసింది. దీనిలో భాగంగా నల్లగొండ నియోజకవర్గంలో ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. ఈ సర్వేలో ప్రధానంగా లేని వారికి కొత్తగా ఇంటి నంబర్లు వేయడం, పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు చేస్తారు. ఉదాహరణకు ఒక కుటుంబంలో నలుగురు ఓటర్లు ఉంటే వారికి ఒకే పోలింగ్ కేంద్రంలో కాకుండా వేర్వేరు కేంద్రాల్లో ఓటర్లుగా ఉంటున్నారు. దీంతో సమీపంలో ఉన్న పోలింగ్ కేంద్రం కాకుండా దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి వాటిన్నింటినీ ఇంటింటి సర్వే ద్వారా సరిచేస్తారు. నల్లగొండ నియోజకవర్గంలో 1,81,528 మంది ఓటర్లు ఉన్నారు. దీంట్లో పురుషులు 91,196, మహిళలు 90,332 మంది ఉన్నారు. పోలింగ్ కేంద్రాలు 258 ఉన్నాయి. ప్రత్యేక షెడ్యూల్.. ఇంటింటి సర్వే చేపట్టేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక షెడ్యూల్ ఖరారు చేసింది. నాలుగు నెలల పాటు ఈ సర్వే చేస్తారు. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు బూత్ లెవల్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తారు. రెండో విడత మే 1 నుంచి జూన్ 15 వరకు నిర్వహిస్తారు. ఈ సర్వేలో బూత్లె వల్ సిబ్బంది, కంప్యూటర్ ఆపరేటర్ ట్యాబెలెట్ పీసీ సహాయంతో ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు తనిఖీ చేస్తారు. అదే నెల 25 తేదీ వరకు మొత్తం వివరాలను అప్డేట్ చేస్తారు. పోలింగ్ కేంద్రాలు, ఓటరు జాబితాలో ఏమైన తప్పుఒప్పులు ఉన్నట్లయితే వాటిని సరిచేసి జూన్ 30న జాబితాలన్నింటిని ప్రింట్ తీస్తారు. జూలై 5న నియోజకవర్గ వ్యాప్తంగా ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురిస్తారు. ఈ జాబితాపై అభ్యంతరాలను జూలై 5 నుంచి 20 వరకు స్వీకరిస్తారు. వచ్చిన అభ్యంతరాలను జూలై 31 వరకు పరిష్కరిస్తారు. ఆగస్టు 15 నాటికి మొత్తం ఓటరు జాబితాను అప్డేట్ చేస్తారు. ఓటరు తుదిజాబితాను ఆగస్టు 31న అధికారింగా ప్రకటిస్తారు. వేర్వేరుగానే కసరత్తు... జిల్లాల పునిర్వభజన జరిగినందున ఓటరు జాబితాలు, కొత్త ఓటరు నమోదు కార్యక్రమం అంతా కూడా వేర్వేరుగానే కొనసాగుతోంది. మూడు జిల్లాల కలెక్టర్లను ఎన్నికల అధికారులుగా నియమిస్తూ ఎన్నికల సంఘం జనవరిలో ఆదేశాలు జారీ చేసింది. నల్లగొండ జిల్లాలో ఆరు, సూర్యాపేట జిల్లాలో నాలుగు, యాదాద్రి జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో ఓటరు జాబితా సవరణ అంతా ఆ జిల్లాలకే పరిమితం చేశారు. ఈ ఏడాది జనవరి వరకు మూడు జిల్లాల్లోని 12 నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్లు... ఓటర్లు మొత్తం : 22, 49, 305 పురుషులు : 11,30,114 మహిళలు :11,19, 191 పోలింగ్ స్టేషన్లు : 3,052 -
‘జవాబు’దారీతనం ఏదీ?
→ మూల్యాంకన నిబంధనలకు తిలోదకాలు → ఆలస్యం కానున్న దూరవిద్య పీజీ కోర్సుల ఫలితం ఎస్కేయూ : శ్రీకష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య పీజీ కోర్సులకు సంబంధించి జవాబుపత్రాల మూల్యాంకనంలో ఆ విభాగం అధికారులు నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారు. పరీక్ష నిర్వహణ, మూల్యాంకన ప్రక్రియ, ఫలితాలు ప్రకటనలో కచ్చితంగా విధానాలు అనుసరించాల్సి ఉంది. కానీ వీటినన్నింటినీ పక్కనబెట్టి నిబంధనలకు విరుద్ధంగా మూల్యాంకనం చేపట్టారు. దూరవిద్య పీజీ మొదటి సంవత్సరం 13 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఒక్కో విద్యార్థి కోర్సుకు సంబంధించి ఐదు టైటిల్స్ రాశారు. అంటే 65 వేలు జవాబు పత్రాలు మూల్యాంకనం చేయించారు. ప్రైవేటు అధ్యాపకులతో.. వాస్తవానికి పీజీ జవాబు పత్రాలు రెండు దఫాలుగా మూల్యాంకనం చేయించాలి. ఇంటర్నల్ (వర్సిటీ ఆచార్యులు, అధ్యాపకులు) ఎక్స్టర్నల్ (బీఓఎస్ గుర్తించిన) అధ్యాపకులతో మూల్యాంకనం నిర్వహించాల్సి ఉంది. పీజీ కోర్సులకు సంబంధించి మొదటి సంవత్సరం జవాబు పత్రాల ఎక్స్టర్నల్ మూల్యాంకనం బోర్డ్ ఆఫ్ స్టడీస్ సూచించిన శాశ్వత అధ్యాపకులతో మూల్యాంకనం చేయించాలని నిబంధనలు ఉన్నాయి. వీటిని పక్కనపెట్టి ప్రైవేటు డిగ్రీ కళాశాల అధ్యాపకులతో పీజీ జవాబు పత్రాల మూల్యాంకనం జరిగిందనే విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఎక్స్టర్నల్ మూల్యాంకనం అయిన తరువాత ఇంటర్నల్ మూల్యాంకనం కోసం జవాబు పత్రాలు వర్సిటీ ప్రొఫెసర్ల వద్దకు పంపారు. అనర్హులైన వారితో మూల్యాంకనం చేయించారని ప్రొఫెసర్లు నిర్ధారించి ఇంటర్నల్ మూల్యాంకనం చేయమని కరాఖండిగా స్పష్టం చేస్తున్నారు. దీంతో నిబంధనల అతిక్రమణ బహిర్గతమైంది. ఫలితాలు ప్రకటన ఎలా ? పీజీకి సంబంధించి ఇంటర్నల్, ఎక్స్టర్నల్ మూల్యాంకనాలు నిర్వహిస్తేనే ఫలితాలు ప్రకటించడానికి సాధ్యమవుతుంది. ఎక్స్టర్నల్ మూల్యాంకనంలో తప్పిదాలు చోటు చేసుకోవడంతో ఇంటర్నల్ మూల్యాంకనానికి చిక్కులు ఏర్పడ్డాయి. దీంతో ఫలితాలు ప్రకటన ఆలస్యం కానున్నట్లు తెలిసింది. -
నో.. జంబ్లింగ్ !
– వెనక్కు తగ్గిన ప్రభుత్వం ! – పాఠశాలస్థాయిలోనే మూల్యాంకనం అనంతపురం ఎడ్యుకేషన్ : విద్యారంగంలో నూతన విధానం అంటూ సంగ్రహాణాత్మక మూల్యాంకనం అమలుకు పూనుకున్న రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది. నూతన విధానాన్ని అమలు చేసేందుకు క్షేత్రస్థాయిలో సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఫలితాలను ఒకటికి రెండుసార్లు విశ్లేషించాల్సి ఉంది. అయితే ఇవేం పట్టకుండా తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అన్న చందంగా తన నిర్ణయాలను అమలు చేయాలంటూ ప్రభుత్వం బలవంతంగా టీచర్లపై రుద్దింది. అయితే ఈ విధానం అమలులో చోటు చేసుకున్న ఇబ్బందులు, కలిగే నష్టాలపై ప్రభుత్వంపై ముప్పేట ఒత్తిడి వచ్చింది. పోలుపోలేని స్థితిలో చివరకు పరీక్షలకు రెండు రోజుల ముందు తన నిర్ణయాన్ని మార్చుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కామన్ పరీక్ష అమలు చేస్తున్నా.. బాహ్య మూల్యాంకనంలో పలు సవరణలు చేస్తూ మంగళవారం జీఓ విడుదల చేసింది. 8,9,10 తరగతులకు సంబంధించి ఎస్ఏ–1, ఎస్ఏ–2 మూల్యాంకనాన్ని జంబ్లింగ్ విధానంలో కాకుండా పాఠశాల స్థాయిలోనే నిర్వహించాలని ఆదేశించింది. సమ్మేటివ్–3 పరీక్షలను మాత్రమే బాహ్యమూల్యాంకనంలో (పదో తరగతికి పబ్లిక్ పరీక్షలు ఉంటాయి) నిర్వహించనున్నారు. అలాగే 6,7 తరగతులకు సంబంధించి ఎస్ఏ–1, ఎస్ఏ–2, ఎస్ఏ–3 మూల్యాంకనాలను మండల కేంద్రాల్లో కాకుండా పాఠశాల స్థాయిల్లోనే నిర్వహించాలని నిర్ణయించారు. – 6–10 తరగతులకు 1,2,3 సంగ్రహణాత్మక మూల్యంకనాల్లో అన్ని సబ్జెక్టుల్లోనూ 5 శాతం జవాబు పత్రాలను ప్రత్యేక బందం ద్వారా మూల్యాంకనం జరుగుతుంది. – 8,9 తరగతులు వార్షిక పరీక్షల్లో సాధించిన మార్కులను మాత్రమే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు కలుపుతారు. అంటే ప్రస్తుతం 8వ తరగతి ఉన్న విద్యార్థి వార్షిక పరీక్షలో వచ్చిన మార్కులు 5 శాతం, అదే విద్యార్థి తొమ్మిదో తరగతిలో వెళ్లిన తర్వాత వార్షిక పరీక్షలో వచ్చిన మార్కులు ఆధారంగా 5 శాతం, ఈ విద్యార్థి 2019 మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా 10 శాతం కలిపి మొత్తం 20 శాతం అంతర్గతమార్కులు కేటాయిస్తారు. పరీక్షల సక్రమ నిర్వహణకు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రత్యేక స్క్వాడ్ బందాలను నియమిస్తారు. ప్రభుత్వం పునరాలోచించాలి బాహ్య మూల్యాంకనం అమలు చేసే విషయంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులను దష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పునరాలోచించాలి. సౌకర్యాల లేమి, ల్యాబ్‌లు, ఇంటర్నెట్ లేని కారణంగా అర్బన్ విద్యార్థులతో పోటీ పడాలంటే ఇబ్బంది. ముందుగా గ్రామీణ ప్రాంతాల పాఠశాలలకు అన్ని సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆ తర్వాత ఈ విధానాలు అమలు చేస్తే బాగుంటుంది. – రజనీకుమార్రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి ‘ఆప్టా’ అధ్యక్ష,ప్రధాన lకార్యదర్శులు ఏకపక్ష నిర్ణయం తీసుకుంది నూతన విధానం అమలులో ప్రభుత్వం ఎవర్నీ సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘంతో పాటు వివిధ వర్గాలు వ్యతిరేకించడంతో వెనక్కు తగ్గి ఈ విధానాన్ని విరమించుకుంది. – గోపాల్‌రెడ్డి, ప్రైవేట్ పాఠశాలల సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి -
స్విస్ చాలెంజ్‌పై బాబు సర్కార్ దొంగాట
-
ఏపీ సర్కారు దొంగాట!
-
ఏపీ సర్కారు దొంగాట!
హైదరాబాద్: రాజధాని అమరావతి నిర్మాణంలో జరుగుతున్న అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దొంగాట ఆడుతోంది. స్విస్ చాలెంజ్ వ్యవహారం హైకోర్టు విచారణలో ఉండగానే సీఆర్డీఏ నోటిఫికేషన్ లో ఏపీ సర్కారు సవరణలు చేసింది. ఎలిజిబిలిటీ బిడ్డింగ్ దరఖాస్తు గడువును సెప్టెంబర్ 13 వరకు, కమర్షియల్ బిడ్డింగ్ ను సెప్టెంబర్ 23 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. స్విస్ చాలెంజ్ వ్యవహారంపై హైకోర్టు ఆదేశాలు రాకముందే హడావుడిగా చర్యలు తీసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. దీనిపై ఒకవైపు విచారణ జరుగుతుండగానే సీఆర్డీఏ నోటిఫికేషన్ లో మార్పులు చేర్పులు చేసింది. వివరాల సేకరణకు సమయం పడుతుందని స్విస్ చాలెంజ్ వ్యవహారంపై విచారణ సందర్భంగా ఏపీ ఏజీ కోర్టుకు విన్నవించారు. రేపు మళ్లీ విచారణ జరగనుంది. దీనిపై హైకోర్టు రేపు ఆదేశాలు ఇచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం హడావుడిగా ఆంగ్ల దినపత్రికలో సవరణ నోటిఫికేషన్ జారీ చేయడం వివాదాలకు తావిస్తోంది. అదే సమయంలో అర్హతా నియమాల మార్పుపై చంద్రబాబు సర్కారు నోరు విప్పడం లేదు. -
ఓటర్ల జాబితాలో తప్పుల సవరణకు సత్వరం చర్యలు
– బోగస్ ఓటర్లను గుర్తించి తొలగించండి – కలెక్టర్ ఆదేశాలు కర్నూలు(అగ్రికల్చర్): ఓటర్ల జాబితాలోని తప్పులను తక్షణమే సవరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అధికారులకు ఆదేశించారు. శనివారం సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. డూప్లికేట్ ఓటర్ల తొలగింపు, తప్పుల సవరణ, అర్బన్ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల విభజన తదితర వాటిపై కలెక్టర్ విధి విధానాలు వివరించారు. జిల్లాలో అనేక మంది ఒకే ఫొటోతో రెండు, మూడు చోట్ల ఓటర్లుగా ఉన్నారని ప్రత్యేక సాఫ్వేర్ ద్వారా వీటిని మ్యాచ్ చేయాలని సూచించారు. మ్యాచ్ అయితే ఒక చోట మాత్రమే ఓటరుగా ఉంచి మిగిలిన చోట్ల తొలగించాలని తెలిపారు. మ్యాచ్ కాకపోతే అవి వేరువేరు ఓటర్లుగా భావించాలని వివరించారు. ఓటర్ల జాబితాలో అచ్చు తప్పులు భారీగా ఉన్నాయని. వీటిని ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకుందని వెంటనే సరిచేసేందుకు చర్యలు తీసుకోవాలని వివరించారు. అన్లైన్ ఎంట్రీలో అనుమానాలు ఉంటే సంబంధిత ట్రై నర్ 95733 11084కు పోన్ చేయాలని సూచించారు. సమావేశంలో జేసీ–2 రామస్వామి, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, కర్నూలు, ఆదోని, నంద్యాల ఆర్డీఓలు రఘుబాబు, ఓబులేసు, సుధాకర్‌రెడ్డి, ఈఆర్ఓలు, నియోజక వర్గ తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. -
సవరణ
గురువారం నాటి (16-06-2016) సాక్షి సంచికలో ‘సత్యానికి సమాధి కట్టొద్దు' అనే శీర్షికతో వచ్చిన వ్యాసంలో లక్ష్మీపార్వతి బీసీ వర్గానికి చెందిన మహిళగా పేర్కొన్నాను. అది వాస్తవం కాదని తెలిసింది. క్షంతవ్యుడిని. - డాక్టర్ ఏపీ విఠల్ -
దిద్దుబాటుకు సిద్ధపడతారా?
జాతిహితం మోదీ పదవీ కాలంలోని ద్వితీయార్థ భాగం మొదలుకు కొంత ముందుగా జరిగిన ఈ ఎన్నికలు బీజేపీకి చెప్పుకోదగ్గ విరామాన్ని కల్పిస్తాయి. తదుపరి శాసనసభ ఎన్నికలు ఇంకా ఏడాది దూరంలో ఉన్నాయి. మోదీ ప్రభుత్వం ఈ విరామాన్ని తమ పరిపాలనపై దృష్టిని కేంద్రీకరించడానికి, సరిదిద్దుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఈ ఎన్నికల వల్ల తిరిగి నెలకొన్న ఆత్మవిశ్వాసాన్ని అది తన దిశను సరిచేసుకోడానికి వినియోగించుకోవాలి. నిరంతర పోరాటం నుంచి వైదొలగి పార్లమెంటు, పరిపాలనలపైకి దృష్టిని మరల్చాలి. ఇటీవలి ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ఉన్న కీలకమైన తేడాను నొక్కిచెప్పాయి. ఒక పార్టీ చేసిన తప్పుల నుంచి నేర్చుకోడానికి సిద్ధపడే దైతే, మరొక పార్టీ తన విజయాల నుంచి సైతం నేర్చుకోడానికి ఇష్టపడని బాపతు. బిహార్‌లో బీజేపీ, ఆ రాష్ట్రానికి నాయకత్వశక్తిగా ఓటర్లకు కనిపిం చడానికి ప్రయత్నించలేదు. పైగా దాని ప్రచారం మరీ చీల్చిచెండాడేట్టుగా, విభజనాత్మకంగా సాగింది. అసోంలో అది ఆ రెండు ధోరణులనూ వదిలే సింది. ఆ రాష్ట్రంలో ఆ పార్టీకి సొంత స్థానిక నేతలు ఉండటమే కాదు, ఓటర్లలో దాదాపు 34 శాతం ముస్లింలు. కాబట్టి దూకుడుగా మతపరమైన కేంద్రీకరణ కోసం తహతహలాడకుండా అది నిగ్రహం చూపింది. బీజేపీ, బిహార్‌లోని తన ప్రత్యర్థుల నుంచి కలిసికట్టుగా పెద్ద కూటమిని ఏర్పరచా లనే విషయాన్ని నేర్చుకుంది. ఒకే ఓటు బ్యాంకు కోసం తమతో పోటీపడే వారితో సైతం కలవడానికి సిద్ధపడింది (ఏజీపీతో వలే). మరోవంక కాంగ్రెస్... బద్రుద్దీన్ అజ్మల్‌తో కూటమిని నిర్మించడానికి నితీష్ కుమార్ చేసిన ప్రయత్నాలను తిరస్కరించింది. కూటములు పర స్పర అనుబంధంపై ఆధారపడి పనిచేసేవనీ, అలా అని గణాంకాలను తోసిపుచ్చలేమని మనకు తెలుసు. ఈ వారం వెలువడ్డ ఫలితాల్లో సైతం కాంగ్రెస్‌కు, అజ్మల్ ఏఐయూడీఎఫ్‌కు వచ్చిన మొత్తం ఓట్లు, బీజేపీ కూటమికి వచ్చినవాటికంటే ఎక్కువ! ఫలితం దిగ్భ్రాంతికరమైన బీజేపీ విజయం. దీంతో బిహార్‌లో కోల్పోయిన రాజకీయ ప్రతష్టను అది గణనీ యంగా పునరుద్ధరించుకోగలిగింది. మారగలమని నిరూపించుకున్నారు కేరళలో బీజేపీ, మమతా బెనర్జీ మార్గాన్ని అనుసరించినట్టనిపిస్తోంది. అక్కడ అది వామపక్షాలకు ప్రధాన భావజాల ప్రత్యర్థి కావాలని ప్రయ త్నించింది. ఒక దశాబ్దికి పైగా బెంగాల్లో కాంగ్రెస్ మృదువైన వామపక్ష భావజాలానికి అంటిపెట్టుకుని ఉండగా... మమత వామపక్షాలతో పోరా డారు. తరచుగా అవి హింసాత్మక వీధి పోరాటాలుగా సైతం సాగాయి. పెరుగుతున్న వామపక్ష వ్యతిరేక జనాభా కాంగ్రెస్‌ను గాక ఆమెనే ప్రత్యామ్నాయంగా చూసింది. కేరళలో కాంగ్రెస్ నాయకత్వం వామపక్ష సానుభూతిదారుగా (పింకో-లెఫ్ట్) కొనసాగుతుంటే... బీజేపీ/ఆర్ఎస్ఎస్ వామపక్షాలకు నిజ మైన ప్రత్యర్థిగా ఎదుగుతోంది. ఈ ఎన్నికల్లో ఆ రాష్ట్రాల్లో బీజేపీ ప్రచారం అంతా సరైన దిశకు మళ్లు తున్నదిగా స్పష్టంగానే కనిపించింది. అధికారంలో ఉన్న ప్రభుత్వాల పట్ల ప్రధాని కటువైన విమర్శలు చేశారు. కానీ అంతకంటే ముఖ్యమైన విభజ నాత్మక స్వరాన్ని దూరంగా ఉంచారు. ఇక అసోంలో పాకిస్తాన్, గో సంరక్షణలను ప్రస్తావించక పోవడమే కాదు, ముస్లిం వ్యతిరేకతను సైతం ప్రదర్శించలేదు. ‘‘చట్టవిరుద్ధ బంగ్లాదేశీయులు’’ ఉండటాన్ని రాజకీయ సమస్యగా చేసినా, ఎవరినీ బయటకు గెంటేస్తామనే బెదిరింపులు లేవు. ఇప్పటికే వచ్చి స్థిరపడ్డవారిని తిరిగి వెనక్కు పంపేయడమనే యోచన ఆచరణ సాధ్యంకానిదని ఆ పార్టీ రాష్ట్ర నేతలు ప్రత్యేకించి హేమంత బిశ్వశర్మ దృఢంగా చెప్పారు. పశ్చిమబెంగాల్ నుంచి అసోం, కేరళల వరకు పార్టీ స్థానిక, జాతీయ నేతలంతా ఏం తింటారనేదే వ్యక్తిగత ఎంపికకు సంబంధించిన వ్యవహా రమని చెబుతూ ‘గోమాంస’ పరీక్షలో నెగ్గారు. ఆసక్తికరకంగా, ఒక చట్టం ప్రకారం గోవధ సాంకేతికంగా చట్టవిరుద్ధమైనదిగా ఉన్న అసోంలో సైతం ఆ పార్టీ ఇదే పంథాను అనుసరించింది. క్రోడీకరించి చెప్పాలంటే ఈ ఎన్నికలు బీజేపీకి మారగలిగే శక్తీ, తిరిగి తనను తాను మలుచుకోగలిగే సామర్థ్యం ఉన్నాయని తెలిపాయి. భావజాలపరమైన మూర్ఖత్వానికి (ఈ వ్యక్తీకరణను ప్రయోగిస్తున్నందుకు మన్నించాలి) బదులుగా రాజకీయ ఫలిత ప్రయోజన వాదాన్ని తాను అనుసరించగలనని బీజేపీ నిరూపించుకుంది. ఇదే వాస్తవిక వాద దృష్టి పరిపాలన పట్ల బీజేపీ వైఖరిలో కూడా ప్రతిఫలిస్తుందా? అనేదే ఇప్పడు ముందున్న ప్రశ్న. కాంగ్రెస్ ఇంకా ముప్పుగా కనిపిస్తున్నంత వరకు బీజేపీ పార్లమెంటు లోనూ, పరిపాలనలోనూ సంఘర్షణాత్మక వైఖరిని అవలంబించడం అర్థం చేసుకోగలిగినదే. ‘‘కాంగ్రెస్ ముక్త్ భారత్’’ అనే దాని లక్ష్యం ఇప్పుడు చాలా వరకు నెరవేరింది. కాంగ్రెస్‌తోనూ, దాన్ని శాసించే కుటుంబంతోనూ ఇంత వరకు అనుసరించిన సంఘర్షణను ఇంకా అదే స్థాయిలో కొనసాగించడం కోసం బీజేపీ మూల్యాన్ని చెల్లించనుందా? లేక వాళ్లను కొంతకాలం పాటూ విస్మరించడమే మంచిదని అది అనుకుంటుందా? ప్రశాంత్ కిశోర్ (రాహుల్‌కు సలహాలిస్తున్నారంటున్న నితీశ్ సన్నిహితుడు) ఉన్నా, లేకున్నా ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ దానికి పెద్ద సవాలును ఇచ్చేదేమీ కాదు. కాకపోతే పంజాబ్‌లో బీజేపీ ఆప్‌కు తలొగ్గాల్సి రావచ్చు. విజయంతో లభించిన విరామం కాంగ్రెస్ తన ఓట్ల వాటాను వేగంగా కోల్పోతుండగా, దాదాపుగా వాటిలో ఏవీ బీజేపీ/ఎన్డీఏకు చేరకపోవడం 2014 పూర్వ జాతీయ రాజకీయాల్లోని కీలక వాస్తవం. కాంగ్రెస్ కోల్పోతున్న ఓట్లలో చాలా వరకు కాంగ్రెస్‌లాగా పేదరికవాద భాషలో మాట్లాడే శక్తివంతమైన స్థానిక పార్టీలు (ఆప్ సహా) చేజిక్కించుకోవడం జరుగుతుండేది. మరోవిధంగా చెప్పాలంటే, కాంగ్రెస్ అవసానదశ క్షీణతలో ఉన్నా... దాని ఓటు బ్యాంకు మాత్రం చెక్కుచెదర కుండా ఉన్నదని అర్థం. ఇతర పార్టీలు దాన్ని తీసుకుంటున్నాయంతే. అదే పనిగా కాంగ్రె స్పైనే దృష్టిని కేంద్రీకరించడంవల్ల అధికార పార్టీ... ఇందిరా గాంధీ కుటుంబాన్ని గుడ్డిగా వ్యతిరేకిస్తూ రాజకీయ వాస్తవాలను విస్మరి స్తుండవచ్చు. మోదీ పదవీ కాలంలోని రెండో సగభాగం మొదలు కావడానికి కొద్దిగా ముందు జరిగిన ఈ ఎన్నికలు బీజేపీకి చెప్పుకోదగిన విరామాన్ని కల్పిస్తాయి. తదుపరి జరగాల్సిన శాసనసభ ఎన్నికలు ఇంకా ఒక ఏడాది దూరంలో ఉన్నాయి. మోదీ ప్రభుత్వం ఈ విరామాన్ని తన పరిపాలనను చక్కదిద్దుకోడానికి, పరిపాలనకు సంబంధించి వెనుకబడిపోయిన పలు అంశాలపై దృష్టిని కేంద్రీకరించడానికి ఉపయోగించుకోవాలి. మంత్రివర్గాన్ని పునర్వ్య వస్థీకరించడం, తమ ప్రభుత్వంలోని కొన్ని శాఖలు పూర్తిగా సక్రమంగా పనిచేయడంలేదని అంగీకరించడంతో ముడిపడినది కావడం వల్లనేమో... ఆ అవసరాన్ని గుర్తు చేయడాన్ని మోదీ ఇష్టపడరు. పైగా ఆయన ఒత్తిడికిలోనై అలాంటి పనులను చేయడానికి అసలే ఇష్టపడరు. అందువలన ఆయన బలంగా ఉన్న ఈ సమయం వదులుకో కూడనిది. రెండు ప్రధాన కారణాల వల్ల మోదీ 2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఒకటి, క్రియాశీలకంగాలేని ప్రధానితో కూడిన కాంగ్రెస్ ప్రభుత్వంపట్ల ప్రజలు విసిగిపోయి ఉండటం. రెండవది, ముఖ్యమైనది మోదీ వాగ్దానం చేసిన పరిపాలనాపరమైన సమర్థత, కల్పించిన ఆశ. 2019లో కూడా ఇదే కారణాలవల్ల తిరిగి గెలవగలమని ఆయన ఆశించలేరు. కాంగ్రెస్ అంతుచూసేశారు కాబట్టి వాటిలో ఒకటి లేకుండా పోయింది. రేపు ఆయన ఓటర్ల ముందుంచాల్సిన తన సంక్షిప్త పరిచయంలో వాగ్దానాల కంటే సాధించినవాటి గురించి ఎక్కువగా చెప్పుకోవడం అవసరం అవుతుంది. సంస్కరణల పూర్వ భారతంలో భావజా లేతరమైన ‘‘నేను ఎవరికీ ఏ బాధ్యత వహించా ల్సింది లేదు’’ అనే ధోరణి ఓటర్లలో పెరిగింది. ఇది రాజకీయ వేత్తలకు ఓటర్లతో ఉండే అనుబంధాన్ని మునుపెన్నడూ ఎరుగని రీతిలో పరివర్త నాత్మకమైనదిగా మార్చింది. దాన్ని గుర్తించక పోవడం లేదా దాన్ని ఖండించక పోవడం ఫ్యాషన్‌గా మారింది. ఏదేమైనా ఓటర్ల గుడ్డి విధేయత అనే రోజులు చెల్లిపోయాయి. నువ్వు నాకేమైనా చేశావా? దీని వల్ల నాకు ఒరిగేదేమిటి? వంటి ప్రశ్నలే ఓటర్లు అడిగేది. ఒక వంక ‘‘కేవలం నేను, నేను మాత్రమే, మరెవరితో సంబంధంలేని నేను’’ అనే యువతరం పెరుగుతుంది. మరోవంక రాజ్యాంగమే నిజమైన అధికా రమని, వామపక్ష లేదా మితవాద భావజాల వ్యాప్తిపై అది బలమైన పరిమితులను విధించగలదనే గుర్తింపు మెల్లగా పెరుగుతోంది. అంతఃశోధన అవసరం కాంగ్రెస్ తన వైఫల్యాలపై అంతఃశోధన జరుపుకుంటుందా లేదా అనేది ఇకనెంత మాత్రమూ మోదీ పట్టించుకోవాల్సినది కాదు. అందుకు బదులుగా తన ప్రభుత్వం ఇంతవరకు ఎంత బాగా పని చేసింది?అనే విషయమై ఆయన అంతఃశోధన చేసుకోవాలి. పార్ల మెంటులోని నిరంతర సంఘర్షణ ఉపయోగకరమైనదేనా? ఇప్పుడు తానూ, తన పార్టీ సురక్షితంగా ఉన్నా, మరింత బలీయంగా మారు తున్నా... ఇంత ప్రతికూలాత్మకత తమను ఆవరించి ఉండటం ఇంకా అవసరమేనా? సంఘర్షణాత్మక రాజకీయాలు వ్యసనంలాంటి మత్తును కలిగించేవి. కానీ అందుకోసం ఇకనెంత మాత్రమూ చెల్లించలేని మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది. బడ్జెట్ సమావేశాల ఆఖరు రోజున ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శాసన, పారిపాలనా వ్యవస్థలను న్యాయవ్యవస్థ ‘‘దెబ్బతీస్తోంది’’ అంటూ శక్తివంత మైన ఉపన్యాసం చేశారు. వాస్తవాలకు సంబంధించి ఆయన సరిగ్గానే మాట్లా డారని అత్యంత అణకువతోనూ, భీతితోనూ విన్నవించుకుంటున్నాను. ఐపీఎల్ మ్యాచ్‌లను మార్చడం, బీసీసీఐ పరిధిని పునర్నిర్వచించడం, కరువు సహాయ చర్యలు చేపట్టమని ప్రభుత్వాన్ని ‘‘ఆదేశించడం’’ లేదా దీనిమీదో లేక దానిమీదో చట్టం చేయమని చెప్పడం ప్రారంభించడం ద్వారా న్యాయ వ్యవస్థ... సున్నితమైన అధికారాల పంపిణీ కోసం రాజ్యాంగం చేసిన ఏర్పా టును అస్థిర పరుస్తోంది. కానీ వాస్తవాలకు సంబంధించి జైట్లీ చెప్పింది సరైనదేగానీ, కోర్టులు ఎందుకు ఇలా శాసన, పరిపాలనా వ్యవస్థలలోకి చొరబడక తప్పడం లేదు? అవి ఎందుకు అలా ఉబలాటపడాల్సి వస్తోంది? ఇంకా అవి ఆ పని ఎలా చేయగలుగుతున్నాయి? అని ఆయనా, ఆయన ప్రభుత్వమూ ఆలోచించాలి. బలహీనమైన, రాజకీయ ప్రతిష్టలేని, విశ్వసనీ యతలేని యూపీఏ-2 హయాంలో న్యాయవ్యవస్థ, కార్యకర్తలు ఆ శూన్యం లోకి ప్రవేశించారు. ఇంకా ఆ ఖాళీ అలాగే మిగిలి ఉందంటే అందుకు కారణం... యూపీఏకున్న బలహీనతలు లేకున్నా ఈ ప్రభుత్వం సంఘ ర్షణల్లో తన రాజకీయ ప్రతిష్టను ఖర్చు పెట్టేయడమే. ఉత్తరప్రదేశ్, అరుణా చల్ప్రదేశ్లు అందుకు మంచి ఉదాహరణలు. ఈ ఎన్నికల వల్ల లభించిన విరామాన్ని, తిరిగి నెలకొన్న ఆత్మవిశ్వాసాన్ని అది తన దిశను సరిదిద్దు కోడానికి ఉపయోగించుకుని నిరంతర పోరాటం నుంచి దూరంగా జరిగి పార్లమెంటుపైనా, పరిపాలనపైనా దృష్టిని కేంద్రీకరించాలి. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
ఈజిప్టులో కూలిన రష్యా విమానం
-
నైట్ క్లబ్లో పేలుడు
-
దిద్దుబాటు మరికొన్నాళ్లు..!
అమ్మకాలు కొనసాగుతాయ్ ⇒పారిశ్రామికోత్పత్తి క్షీణత ఎఫెక్ట్ ⇒టోకు ధరల గణాంకాలు నేడు వెల్లడి ⇒పార్లమెంట్ సమావేశాలపైనా దృష్టి ⇒ఈ వారం మార్కెట్‌పై నిపుణుల విశ్లేషణ న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో గడిచిన వారం మొదలైన దిద్దుబాటు(కరెక్షన్) ఈ వారం కూడా కొనసాగుతుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గత వారం చివర్లో వెలువడ్డ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు(ఐఐపీ) ఇందుకు కొంతమేర కారణంగా నిలవనున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ నెలకు ఐఐపీ మైనస్ 4.2%కు పడిపోవడం ప్రభావం చూపనున్నట్లు తెలిపారు. ఈ బాటలో నవంబర్ నెలకు గత శుక్రవారమే(12న) వెల్లడైన రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) 4.4%కు దిగివచ్చినప్పటికీ, ఈ సోమవారం విడుదలకానున్న టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ)పై ఇన్వెస్టర్లు దృష్టిపెడతారని వివరించారు. వీటితోపాటు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలూ కీలకంగా నిలవ నున్నట్లు తెలిపారు. విదేశీ సంకేతాలూ అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ స్టాక్ మార్కెట్ల తీరు సైతం ట్రేడింగ్‌ను ప్రభావితం చేయనున్నట్లు స్టాక్ నిపుణులు అంచనా వేశారు. మరోవైపు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడులు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి అంశాలు సెంటిమెంట్‌కు కీలకంగా నిలవనున్నట్లు తెలిపారు. ఇక విదేశీ మార్కెట్లలో తాజాగా ముడిచమురు ధరలు ఐదేళ్ల కనిష్టానికి దిగిరావడం తెలిసిందే. ఇలాంటి పలు అంశాలు సమీప కాలానికి దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ముందస్తు పన్ను చెల్లింపులు... గత వారం మార్కెట్లు ముగిశాక వెలువడ్డ ఐఐపీ, సీపీఐ గణాంకాలకు అనుగుణంగా మార్కెట్లు స్పందించే అవకాశమున్నట్లు రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ చెప్పారు. ఇక ఈ సోమవారం విడుదలకానున్న డబ్ల్యూపీఐ కూడా సెంటిమెంట్‌కు కీలకంగా నిలవనుందని తెలిపారు. ఇవికాకుండా కార్పొరేట్ సంస్థల ముందస్తు పన్ను చెల్లింపు వివరాలకూ ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. వీటి ఆధారంగానే కంపెనీల క్యూ3(అక్టోబర్-డిసెంబర్) ఫలితాలపై అంచనాలకు వచ్చే వీలుంటుందని తెలియజేశారు. ఈ నెల 23తో ముగియనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలపైనే ఇన్వెస్టర్లు దృష్టినిలుపుతారని చెప్పారు. మరింత దిగువకు..: ప్రస్తుత పరిస్థితుల ప్రకారం కూడా ఈ వారం మార్కెట్లు దిద్దుబాటుకు లోనవుతాయని అంచనా వేస్తున్నట్లు జయంత్ చెప్పారు. పలు అంశాల నేపథ్యంలో మార్కెట్లు హెచ్చుతగ్గులను చవిచూస్తాయని, ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందని వివరించారు. కాగా, అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్ష ఈ నెల 16-17న జరగనుంది. ఈ వివరాలతోపాటు, పార్లమెంట్ సమవేశాల్లో చర్చకురానున్న బీమా బిల్లు, సంస్కరణలు, తదితర ప్రభుత్వ చర్యలకూ ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇస్తారని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ సీఎంటీ డెరైక్టర్ వివేక్ గుప్తా చెప్పారు. రూ. 10 లక్షల కోట్లకు విదేశీ పెట్టుబడులు ఇప్పటివరకూ దేశీ క్యాపిటల్ మార్కెట్లోకి ప్రవహించిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) మొత్తం పెట్టుబడులు రూ. 10 లక్షల కోట్లను అధిగమించాయి. ఇందుకు ఈ ఏడాది(2014) జనవరి నుంచి ఇన్వెస్ట్‌చేసిన రూ. 2.6 లక్షల కోట్లు(43.4 బిలియన్ డాలర్లు) కూడా జత కలిశాయి. వీటిలో ఈక్విటీలలో రూ. 1.05 లక్షల కోట్లను ఇన్వెస్ట్ చేయగా, రూ. 1.6 లక్షలను బాండ్ల కొనుగోలుకి వెచ్చించారు. ఈక్విటీలకు సంబంధించి ఎఫ్‌పీఐలు ఒక ఏడాదిలో రూ. లక్ష కోట్ల స్థాయిలో ఇన్వెస్ట్చేయడం ఇది నాలుగోసారి మాత్రమే. ఇంతక్రితం 2013, 2012, 2010లలోనూ రూ. లక్ష కోట్లకుపైగా ఇన్వెస్ట్ చే శారు. 1992లో తొలిసారి విదేశీ ఇన్వెస్టర్లను దేశీ క్యాపిటల్ మార్కెట్లోకి అనుమతించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచీ చూస్తే నికరంగా దేశీ ఈక్విటీలలో రూ. 8 లక్షల కోట్లను ఇన్వెస్ట్ చేశారు. మరోవైపు రూ. 2.6 లక్షల కోట్లను రుణ సెక్యూరిటీల కొనుగోలుకి వినియోగించారు. వెరసి మొత్తం ఎఫ్‌పీఐల నికర పెట్టుబడులు 10.54 లక్షల కోట్లను(214 బిలియన్ డాలర్లకుపైనే) తాకాయి. వివిధ రకాల విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లను సెబీ ఇటీవలే ఎఫ్‌పీఐలుగా వర్గీకరించింది. స్వల్పకాలిక పెట్టుబడులుగా భావించే ఈ నిధులను హాట్మనీగా మార్కెట్ వ్యవహరిస్తుంది. దీర్ఘకాలిక నేపథ్యంగల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐలు) కోవలోకి ఇవిరాకపోగా, ఎప్పుడైనా మార్కెట్ల నుంచి వెనక్కి(విదేశాలకు) మళ్లిపోతుంటాయి. కాగా, 2014 సంవత్సరం ముగియడానికి ఇంకా 2 వారాల గడువున్న నేపథ్యంలో ఈ పెట్టుబడులు మరింత పెరిగే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.