ఆ ఇద్దరినీ పక్కన పెట్టేసిన దర్శకుడు
టాలీవుడ్ ఇండస్ట్రీలో రెగ్యులర్ కమర్షియల్ జానర్‌కు భిన్నంగా సినిమాలు చేసే దర్శకులు చాలా అరుదు. అలాంటి అరుదైన దర్శకుల లిస్ట్ చేసిన ఈ తరం దర్శకుడు సుకుమార్. డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో సినిమాలు తెరకెక్కించే ఈ లెక్కల మాస్టర్, తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన దగ్గరనుంచి ఒకే టీంను కంటిన్యూ చేస్తున్నాడు. తన ప్రతీ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌తో సంగీతం, రత్నవేలుతో సినిమాటోగ్రఫీ చేయిస్తున్నాడు సుక్కు.
దేవీ, రత్నవేలులు ఎంత ఎదిగినా, ఎంత బిజీ అయినా సుకుమార్ సినిమా అంటే మాత్రం ఆలోచించకుండా డేట్స్ ఇచ్చేస్తారు. ఆఖరికి సుకుమార్ నిర్మాతగా మారి తెరకెక్కించిన చిన్న సినిమా, కుమారి 21ఎఫ్ కోసం తమ స్థాయిని కాదని మరి పనిచేశారు. ఈ సినిమాకు ఎలాంటి పారితోషికం తీసుకోకుండా సినిమా సక్సెస్ అయ్యాక లాభాల్లో వాటా తీసుకున్నారు. అంతటి స్నేహం ఈ ముగ్గురిది.
అయితే తన నెక్ట్స్ సినిమాకు మాత్రం దేవీ శ్రీ, రత్నవేలులను కాదని వేరే వాళ్లను తీసుకుంటున్నాడు సుకుమార్. సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న రెండో సినిమా దర్శకుడుకు సంగీత దర్శకుడు, సినిమాటోగ్రాఫర్లను మారుస్తున్నాడు. చిన్న సినిమాలకు ఇంత బిజీ టెక్నిషియన్లు తీసుకోవటం సరికాదని భావించిన సుక్కు, ఆ సినిమా స్థాయి తగ్గ టెక్నిషియన్స్ ఎంపిక చేసే పనిలో ఉన్నాడు. ఇక తన దర్శకత్వంలో చరణ్ హీరోగా తెరకెక్కబోయే సినిమాకు మాత్రం ఈ ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు.