'నిర్లక్ష్యం చేసి మా పిల్లల్ని చంపకండి'
న్యూఢిల్లీ: నిర్లక్ష్యం చేసి తమ పిల్లల చావులకు కారణం కావొద్దని ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి శ్రద్ధ తమ పిల్లలకు వైద్య సేవలు అందించి వారి ప్రాణాలు రక్షించాలని ఢిల్లీ వైద్యులకు విజ్ఞప్తి చేశారు. ప్రమోద్ కుమార్ చౌదరీ అనే వ్యక్తికి ఓ కూతురు ఉండగా ఆమె నాలుగేళ్ల కిందట డెంగ్యూ వ్యాధితో చనిపోయింది. అయితే, వ్యాధికి తగిన మందులు ఇవ్వడంలో వారు నిర్లక్ష్యం చేసి చేజేతులా తన కూతురు చనిపోవడానికి కారణమయ్యారని తెలిసింది.
సమాచార హక్కు చట్టం ద్వారా తన కూతురుకు ఎలా వైద్యం చేశారు, ఏమందులు ఇచ్చారు అనే వివరాలను తెలుసుకున్న ఆ తండ్రికి కొన్ని నిజాలు తెలిసి ఆవేదన చెందారు. జబ్బుకు తగిన మందులు ఇవ్వకుండా వేరే మందులు ఇవ్వడం వల్లే తన కూతురు చనిపోయిందని ఆర్టీఐ దరఖాస్తు ద్వారా ప్రమోద్‌కు తెలిసింది. ప్రస్తుతం ఢిల్లీలో డెంగ్యూ మరణాలు అధికమవుతున్న నేపథ్యంలో వైద్యులు నిర్లక్ష్యం చేయరాదని విజ్ఞప్తి చేశారు. డెంగ్యూ రోగుల విషయంలో వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది జాగ్రతతో, అప్రమత్తతో ఉండి వారి ప్రాణాలు రక్షించాలని వేడుకున్నారు.