DEOs
-
విద్యార్థుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బడి బయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించడంతోపాటు అన్ని యాజమాన్యాల్లోని విద్యార్థుల వివరాలను స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ పోర్టల్‌లో నమోదు చేసేలా కలెక్టర్లు, డీఈవోలు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు అందించిన విద్యార్థుల వివరాలను అధికారులు తనిఖీ చేసి ధ్రువీకరించాలన్నారు. ఇప్పటికే వలంటీర్లు చేసిన సర్వే ప్రకారం18 లక్షల మంది విద్యార్థుల పేర్లు ఇంకా స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ పోర్టల్‌లో అప్డేట్ కాలేదన్నారు. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ప్రారంభించి బుధవారానికి వంద రోజులు అవుతున్నందున అన్ని స్కూళ్ల హెచ్ఎంలు అప్లోడ్ చేసేలా కలెక్టర్లు తీసుకోవాలన్నారు. విద్యార్థుల వివరాలు అప్లోడ్ చేయకుంటే కఠిన చర్యలు తప్పవని మంగళవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. -
పర్యవేక్షణ అధికారుల్లేక పరేషాన్
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యశాఖలో ఏళ్ల తరబడి పర్యవేక్షక అధికారుల కొరత పీడిస్తోంది. 30 లక్షలమంది విద్యార్థులు, లక్ష మందికిపైగా సిబ్బంది ఉన్న పాఠశాల విద్యా వ్యవస్థలో పలు మండలాలకు ఎంఈవో, కొన్ని జిల్లాలకు డీఈవోలు లేరు. ప్రధానోపాధ్యాయులకే ఎంఈ వో పోస్టులు తాత్కాలికంగా అప్పగిస్తున్నారు. పలువురు ఎంఈవోలను అదనపు మండలాలకు సర్దుబాటు చేస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం స్కూళ్లు మొదలైన నాటి నుంచి ప్రతీ అంశాన్ని పర్యవేక్షించడం, అవసరమైన నివేదికలు తయారు చేసి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో మండల, జిల్లాస్థాయి అధికారుల పాత్ర కీలకం. ఇంగ్లిష్ మీడియం బోధన మొదలైనా పర్యవేక్షక అధికారుల కొరత వల్ల ఇప్పటివరకూ క్షేత్రస్థాయి నివేదికలు ఉన్నతాధికారులకు అందలేదని తెలుస్తోంది. 317 జీవోకు ముందు జిల్లా, జోన్లుగా రెండంచెల వ్యవస్థ ఉండేది. జీవో అమలులోకి వచ్చిన తర్వాత జిల్లా, జోన్, మల్టీజోన్లుగా మూడంచెల వ్యవస్థను తీసుకొచ్చారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యా శాఖాధికారులు, డైట్ లెక్చరర్ల పోస్టులన్నీ మల్టీజోన్ క్యాడర్ పోస్టులుగా ఉన్నాయి. వీటన్నింటి నిర్వహణకు మల్టీ జోన్‌స్థాయి అధికారి పోస్టులు ఉండాలని టీచర్ల సంఘాలు కోరుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న ఏడు జోన్లకు పాలన వ్యవహారాలు నిర్వహించడానికి ఏడుగురు జాయింట్ డైరెక్టర్(జేడీ) స్థాయి అధికారులు అవసరం కాగా, ప్రస్తుతం ఇద్దరు మాత్రమే ఉన్నారు. అత్యంత కీలకమైన పరీక్షల విభాగం, ఎస్సీఈఆర్టీ, ఓపెన్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, సైట్, కేజీబీవీలు, రెసిడెన్షియల్ స్కూల్స్, గ్రంథాలయాలు, పాఠ్యపుస్తకాలు, పబ్లిక్ స్కూల్స్, జవహర్ బాలభవన్ వంటి విభాగాల నిర్వహణకు అధికారులుంటేనే వ్యవస్థలో లోపాలను సరిచేయవచ్చని సూచిస్తున్నారు. కేజీబీవీల్లో ఇద్దరు, మోడల్ స్కూల్స్ విభాగం, ఓపెన్ స్కూల్స్‌లో ఒకరు చొప్పున జాయింట్ డైరెక్టర్లున్నారు. మిగిలిన విభాగాల్లో ఏడీ పోస్టు కానీ, పూర్తిస్థాయిలో డీడీ పోస్టులు లేవు. ఎంఈవోలు... డీఈవోలు ఎక్కడ? ఇప్పటికీ 12 జిల్లాలకే డీఈవోలున్నారు. 21 జిల్లాల్లో డీఈవో పోస్టులు మంజూరు చేసినా భర్తీ చేయలేదు. 602 మండలాలను ఎడ్యుకేషన్ బ్లాకులుగా చేశారు. ప్రతీ బ్లాక్‌కు ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా ఇప్పుడున్న టీచర్లకు పదోన్నతులు కల్పిస్తే భర్తీ అవుతాయి. స్థానిక సంస్థల పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులు ఎక్కువ వున్నారని, కాబట్టి తమకే ఎంఈవోలు కావాలని పంచాయతీరాజ్ విభాగం టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం గతంలో నేరుగా నియమించిన ఉపాధ్యాయులు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఈ పోస్టులు దక్కించుకునే అర్హత తమకే ఉందని చెబుతున్నారు. ఈ కారణంగానే హెచ్ఎంల పదోన్నతి ప్రతి ఏటా వాయిదా పడుతూ వస్తోంది. పదోన్నతులు, బదిలీలు లేకపోవడంతో కొంతమంది ఎంఈవోలకు 6 నుంచి 8 మండలాలు ఎంఈవో బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో తమ పాఠశాలల్లో బోధన ప్రమాణాలు దెబ్బతినే వీలుందని ఉపాధ్యాయులు అంటున్నారు. -
కొత్త జిల్లాలకు డీఈవోల నియామకం
సాక్షి, అమరావతి: కొత్తగా ఏర్పాటైన జిల్లాలన్నిటికీ విద్యాశాఖ అధికారులను నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల్లో క్యాడర్ సంఖ్యకు సంబంధించి కూడా జీవో విడుదల చేసింది. ప్రస్తుతం డీఈవోలుగా ఉన్న వారికి స్థానచలనంతో పాటు కొత్తగా అసిస్టెంట్ డైరెక్టర్లు, డిప్యూటీ ఈవో, సీటీఈ ప్రిన్సిపాల్, డిప్యూటీ డైరెక్టర్లకు డీఈవోలుగా బాధ్యతలు అప్పగించారు. -
'అమరావతి'కి తలా రూ.10 ఇవ్వండి..
- రాజధాని నిర్మాణం కోసం విద్యార్థుల నుంచి విరాళాలు కోరిన ప్రభుత్వం - సేకరణ బాధ్యతలు డీఈవోలకు అప్పగిస్తూ జీవో జారీ హైదరాబాద్: రాజధాని భూములను విదేశీ ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయాలని భావిస్తోన్న చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు అమరావతి నిర్మాణం కోసమని విద్యార్థుల నుంచి విరాళాలు సేకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం అన్ని జిల్లాల డీఈవోలకు ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు విధిగా రూ. 10 విరాళాన్ని ఇవ్వాలి. విద్యార్థులే కాదు ఉపాధ్యాయులు కూడా తప్పనిసరిగా విరాళం ఇవ్వాల్సిందే. విరాళాలు సేకరించే బాధ్యత డీఈవోలది. ఒక్క పాఠశాలలే కాక ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల నుంచి కూడా విరాళం సేకరించాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. అన్ని స్థాయిల్లో కలిపి ఏపీలో దాదాపు 50 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరిలో చాలా మంది నిరుపేద విధ్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే ఉపకారవేతనమే ఆధారం. ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణం కోసమంటూ విద్యార్థుల నుంచి విరాళాలు కోరడంపై పలువురు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. -
సీమాంధ్రలో టెట్ పెట్టలేం
ప్రభుత్వానికి డీఈవోల నివేదన సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టవద్దని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులు గురువారం నుంచి సమ్మెకు దిగనున్న నేపథ్యంలో.. ఈ నెల 9న టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష)ను సీమాంధ్ర జిల్లాల్లో నిర్వహించలేమని 13 జిల్లాల విద్యాశాఖాధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ మేరకు కలెక్టర్లతో మాట్లాడి డీఈవోలు విద్యాశాఖ కమిషనర్‌కు మంగళవారం నివేదికలు పంపించారు. దీంతో బుధవారం చర్చించి నిర్ణయం తీసుకోవాలని విద్యాశాఖ కార్యదర్శి నిర్ణయించారు.