మదనపల్లె సభపై మిథున్‌రెడ్డి సమీక్ష
మదనపల్లె, న్యూస్‌లైన్: మదనపల్లెలో మంగళవారం సాయంత్రం నిర్వహించనున్న షర్మిల బహిరంగ సభ ఏర్పాట్లపై ఆదివారం సాయంత్రం స్థానిక దేశాయ్ ఫంక్షన్‌హాలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో తొలిసారిగా అడుగిడి సమైక్య ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడానికి షర్మిల బస్సుయాత్ర, బహిరంగసభలను నిర్వహించి సమైక్యవాదాన్ని వినిపించనున్నట్లు తెలిపారు.
రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, జేఏసీ నాయకులు, సమైక్యవాదులు అందరూ పాల్గొని బహిరంగసభను విజయవంతం చేయాలని కోరారు. జిల్లా కన్వీనర్ నారాయణస్వామి మాట్లాడుతూ సమైక్యవాదం కోసం మొదటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి మాట్లాడుతూ ఈనెల 3వతేదీ (మంగళవారం) మదనపల్లె పుంగనూరు రోడ్డులోని మున్సిపల్ బోర్డు నుంచి బస్సు యాత్ర ప్రారంభించి చిత్తూరు బస్టాండు, టౌన్ బ్యాంకు సర్కిల్ మీదుగా బెంగళూరు బస్టాండుకు సాయంత్రం 4 గంటంలకు చేరుకుని బహిరంగసభలో షర్మిల ప్రసంగిస్తారని తెలిపారు.
తంబళ్లపల్లె నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే ఎ.వి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రజలను మరోసారి మోసగించడానికి చేపట్టిన ఆత్మగౌరవయాత్రను సమైక్యవాదులు అడ్డుకుని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీలేరు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త షమీమ్‌అస్లాం, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు డి.ఉదయకుమార్, నాయకులు అక్తర్ అహ్మద్, జింకా వెంకటాచలపతి, బాబ్జాన్,హచ్ కుమార్, సింగిల్‌విండో అధ్యక్షులు ఆనందరెడ్డి, సురేంద్ర, తంబళ్లపల్లె నియోజకవర్గ నాయకులు టి.ఎన్.ప్రమీలమ్మ, ఎం.రంగారెడ్డి, రెడ్డిశేఖర్‌రెడ్డి, పుంగనూరు నియోజకవర్గ నాయకులు లిడ్‌క్యాప్ రెడ్డెప్ప, వెంకటరెడ్డియాదవ్, నాగరాజురెడ్డి, గోల్డన్‌వ్యాలీ ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ రమణారెడ్డితో పాటు అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.