Design change
-
రసూల్‌పురా ఫ్లై ఓవర్ డిజైన్.. మారున్..
సాక్షి, సిటీబ్యూరో: హై సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) పథకం కింద ఫ్లై ఓవర్లు, రహదారులు తదితర పనులకు ప్రభుత్వం రూ.7 వేల కోట్లకు పైగా పరిపాలన అనుమతులు మంజూరు చేయడంతో పనులు చేపట్టేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లోని క్షేత్రస్థాయి పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే రూపొందించిన డిజైన్లను మార్చాలని భావిస్తున్నారు. అలా.. ఆల్విన్ జంక్షన్, జేఎన్టీయూ జంక్షన్ల వద్ద డిజైన్ల మార్పునకు ఇప్పటికే కన్సల్టెంట్లను ఆహా్వనించిన అధికారులు తాజాగా రసూల్‌పురా ఫ్లై ఓవర్/అండర్‌పాస్ డిజైన్లను కూడా మార్చేందుకు సిద్ధమయ్యారు. ప్రత్యామ్నాయ డిజైన్ అవసరం.. మెట్రో రెండోదశ దృష్టిలో ఉంచుకొని ఆల్విన్, జేఎన్టీయూ జంక్షన్ల వద్ద డిజైన్ల మార్పుకు సిద్ధమైన అధికారులు బేగంపేట సమీపంలోని రసూల్‌పురా ఫ్లై ఓవర్ /అండర్‌పాస్ నిర్మాణానికి డిఫెన్స్ భూములు సేకరించాల్సి ఉందన్నారు. ఎక్కువ భూ ములు ఇచ్చేందుకు సంబంధిత అధికారులు సుముఖంగా లేకపోవడంతో భూసేకరణ వీలైనంత తగ్గించేందుకు కొత్త డిజైన్ల కోసం కన్సల్టెంట్లను ఆహా్వనించినట్లు పేర్కొన్నారు. ఈ టెండరు పొందే కన్సల్టెంట్స్ ఇప్పటికే ఉన్న డిజైన్‌ను పరిశీలించి, ప్రత్యా మ్నాయ డిజైన్‌ను రూపొందించాల్సి ఉంటుంది. రూ.105 కోట్లు మంజూరు.. ⇒ ఈ ఫ్లై ఓవర్/అండర్‌పాస్ పనులకు ప్రభుత్వం రూ. 105 కోట్లు మంజూరు చేయడంతో పని ప్రారంభించేందుకు పరిస్థితుల్ని అధ్యయనం చేసిన అధికారులు ప్రత్నామ్నాయ డిజైన్‌తో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ రిపోర్ట్ కోసం (పీపీఆర్) కన్సల్టెంట్లను ఆహా్వనించారు. తక్కువ భూసేకరణతో పాటు ప్రజల భద్రత, సేవల పెంపుదల కొత్త డిజైన్ ప్రధాన లక్ష్యం. సేకరించాల్సిన ఆస్తుల సరిహద్దులతోపాటు యుటిలిటీస్ షిఫ్టింగ్ వంటి అంశాలను కూడా బేరీజు వేసి, ఉన్న డిజైన్ కంటే మెరుగైన డిజైన్ రూపొందించాల్సి ఉంటుంది. ⇒ సమీప ప్రాంతాల్లో ప్రస్తుతం పురోగతిలో ఉన్న ప్రాజెక్టులు, మెట్రో రైలు, బీఆర్టీఎస్, సీటీఎస్ మాస్టర్ప్లాన్లను కూడా దృష్టిలో ఉంచుకోవడంతో పాటు ప్రాజెక్టు వ్యయం తగ్గేందుకు కూడా తగిన మార్గాలుంటే సూచించాలి. ఇంకా, మేజర్ జంక్షన్లు, బాటిల్‌నెక్స్, ప్రార్థనా మందిరాలు, శ్మశాన వాటికల వంటి వాటిని దృష్టిలో ఉంచుకోవాలి. రాబోయే ఇరవయ్యేళ్ల వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ఫ్రీగా ప్రయాణం సజావుగా సాగేందుకు శాశ్వత పరిష్కారంగా కొత్త డిజైన్ ప్లాన్ ఉండాలి. -
రింగ్‌రోడ్ ఇంటర్చేంజ్
దశాబ్దాలుగా కొనసాగుతున్న ఓ భారీ ప్రైవేటు పరిశ్రమ కోసం రీజనల్ రింగురోడ్డు ఇంటర్చేంజ్ డిజైన్ మారింది. ముందుగా ఎంచుకున్న డిజైన్‌లో రింగురోడ్ కూడలి నిర్మిస్తే.. ఆ పరిశ్రమను తొలగించాల్సిన పరిస్థితి. అది స్థానికంగా నిరసనకు కారణమవుతుందన్న ఉద్దేశంతో ఇంటర్చేంజ్ డిజైన్‌ను మార్చారు. నాలుగు లూప్‌లతో నిర్మించడానికి బదులు.. ఆ పరిశ్రమ వైపు లూప్ లేకుండా మూడింటితోనే ఇంటర్చేంజ్ డిజైన్‌ను ఖరారు చేశారు. - సాక్షి, హైదరాబాద్‌రోడ్డు లేఔట్ మార్చే వీలు లేక.. తూప్రాన్ నుంచి గజ్వేల్ పక్కగా వచ్చే రీజనల్ రింగురోడ్డు హైదరాబాద్–కరీంనగర్ రాజీవ్ రహదారిని ప్రజ్ఞాపూర్‌కు కాస్త ముందుగా క్రాస్ చేస్తుంది. రాజీవ్ రహదారి మీద వాహనాల రద్దీ ఎక్కువ. ఇలా అధిక రద్దీ ఉన్న రోడ్లను రీజనల్ రింగ్‌రోడ్డు క్రాస్ చేసేచోట.. నాలుగు లూప్‌లతో ఉండే క్లోవర్ లీఫ్ డిజైన్‌తో ఇంటర్చేంజ్ జంక్షన్లను నిర్మించాలని గతంలోనే నిర్ణయించారు. ఈ మేరకు ప్రజ్ఞాపూర్ సమీపంలో క్లోవర్ లీఫ్ డిజైన్‌తో ఇంటర్చేంజ్ నిర్మించాల్సి ఉంది. కానీ ఇంటర్ చేంజ్‌కు ఉండే నాలుగు లూప్‌లలో ఒక లూప్ కట్టాల్సిన చోట ఓ బ్రేక్ లైనర్స్ తయారీ పరిశ్రమ ఉంది. అదే డిజైన్‌తో నిర్మిస్తే.. ఆ పరిశ్రమను తొలగించాల్సిన పరిస్థితి. ఇలా జరగకుండా రింగ్‌రోడ్డును కాస్త అటువైపో, ఇటువైపో జరపడానికీ వీలు లేకుండా పోయింది. ఆర్ఆర్ఆర్ను హైదరాబాద్ వైపు జరపాలనుకుంటే.. ఓవైపు కొండపోచమ్మ సాగర్ జలాశయం, మరోవైపు వందల ఎకరాల్లో విస్తరించిన సామాజిక అటవీ ప్రాంతం అడ్డు వస్తున్నాయి. అదే గజ్వేల్ వైపు జరపాలనుకుంటే.. వేల ఇళ్లతో నిర్మించిన పునరావాస కాలనీ, గజ్వేల్ రింగురోడ్డు కూడలి అడ్డు వస్తున్నాయి. ఒకవేళ పరిశ్రమను తొలగించాలనుకుంటే.. దశాబ్దాలుగా స్థానికులకు ఉపాధినిస్తున్న పరిశ్రమను తొలగిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత రావొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో.. ఇంటర్చేంజ్ డిజైన్‌ను మూడు లూప్లకు మార్చారు. మరో లూప్‌కు బదులు.. పరిశ్రమ ప్రహరీని ఆనుకుని రెండు కారిడార్లను నిర్మించి, ఇటు రాజీవ్ రహదారికి, అటు ‘రీజనల్’ప్ర«దాన వేకు అనుసంధానం చేసేలా డిజైన్‌ను సిద్ధం చేశారు. అయితే మార్పుల వల్ల అదనంగా కొంత రోడ్డు, రెండు వంతెనలు నిర్మించాల్సి వస్తుందని.. దాదాపు రూ.30 కోట్ల వరకు ఖర్చు పెరుగుతుందని అంచనా వేశారు. -
కాళేశ్వరంతో కష్టాలెన్నో...
► డిజైన్ మార్పుతో శాశ్వత పెనుభారం... ► జేఏసీ అధ్యయనంలో వెల్లడి... నేడు నివేదిక విడుదల సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత చేవెళ్ల ప్రాజె క్టును తమ్మిడిహెట్టి నుంచి కాళేశ్వరం వద్ద మేడిగడ్డకు మార్చడంవల్ల తెలంగాణ ప్రజల పై శాశ్వతంగా పెనుభారం పడుతుందని తెలంగాణ జేఏసీ అధ్యయనంలో తేలింది. ప్రాజెక్టు ద్వారా ఎకరానికి అయ్యే వ్యయాన్ని సాగు నీటిపారుదల శాఖ నిపుణులు అధ్యయ నం చేశారు. తమ్మిడిహెట్టి నుంచి కాళేశ్వరం దగ్గరకు ప్రాజెక్టును మారుస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వల్ల జరిగే లాభనష్టాలపై నిపుణులు అధ్యయనం చేశారు.తమ్మిడిహెట్టి నుంచి కాళేశ్వరం దగ్గరకు ప్రాజెక్టును మారిస్తే నిర్మాణ వ్యయం పెరుగుతుందని, నిర్వహణ వ్యయం శాశ్వతంగా భారం అవుతుందని తేలింది. కాళేశ్వరం నుంచి ఎత్తిపోతలు, ప్రతి పాదిత రిజర్వాయర్ల సామర్థ్యం, పంపుల సామర్థ్యం, నీటిలభ్యత, ఎత్తిపోతలకు అవకా శం ఉన్న రోజులు, సామర్థ్యం వంటివాటిపై సంపూర్ణంగా జరిపిన అధ్యయనంలో పలు అంశాలు రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ చేస్తున్న వాదనలను అంకెలతో సహా కొట్టిపారేశారు. సాగునీటిపారుదల రంగ నిపుణులు గుజ్జా బిక్షం, శివకుమార్, విద్యుత్‌రంగ నిపుణులు కంచర్ల రఘు సంయుక్తంగా అధ్యయనం చేసి, నివేదికను రూపొందించారు. నీటి నిల్వకు అవకాశమే లేదు... కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎకరానికి నీరందిం చడానికి ఏటా రూ.లక్ష నుంచి రూ.1.80 లక్షల దాకా ఖర్చు అవుతుందని తేలింది. 50 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ప్రతిపాదించిన మల్లన్నసాగర్లో నీటిని నిల్వచేసే అవకాశమే లేదని ఈ అధ్యయనంలో తేలింది. తప్పని విద్యుత్ భారం తమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చడం వల్ల కొండపోచమ్మ రిజర్వాయర్ దాకా 525 మీటర్లు ఎత్తిపోసినా ఇంతకన్నా మెరుగైన ఫలితాలు ఉండవని తేల్చారు. దీనివల్ల ఏటా 1,250 కోట్ల విద్యుత్ భారం తప్పదని తేలింది. దీనివల్ల ప్రతీ ఎకరానికి 40 నుంచి 70 వేల ద్వారా కరెంటు చార్జీలే అదనంగా పడనున్నారుు. ఈ నివేదికను తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం, ఆస్కి మాజీ డీన్ గౌతమ్ పింగ్లే విడుదల చేయనున్నారు. -
‘ప్రాణహిత’ కోసం టీడీపీ పాదయాత్ర
- 18న శంకర్పల్లి మండలం మహాలింగపురం నుంచి ప్రారంభం - పాల్గొననున్న ఎర్రబెల్లి, రమణ, పెద్దిరెడ్డి తదితరులు చేవెళ్ల: ప్రాణహిత -చేవెళ్ల ఎత్తిపోతల పథకం డిజైన్ మార్పును వ్యతిరేకిస్తూ టీడీపీ పాదయాత్రకు సిద్ధమవుతోంది. 18, 19 తేదీల్లో చేపట్టనున్న ఈ కార్యక్రమానికి టీడీఎల్పీ నాయకులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రమణ, ఈ.పెద్దిరెడ్డి తదితర ప్రముఖులు హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆ పార్టీ జిల్లా నాయకులు శేరి పెంటారెడ్డి, చేవెళ్ల మండల పార్టీ అధ్యక్షుడు శేరి నర్సింహారెడ్డి చేవెళ్లలో ఆదివారం విలేకరులకు వివరించారు. 18న శంకర్పల్లి మండలం మహాలింగపురం నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుందని, 19న కూడా కొనసాగిస్తామని చెప్పారు. జిల్లాకు తాగు, సాగునీరు అందించడంలో జరుగుతున్న అన్యాయాన్ని పాదయాత్ర ద్వారా ప్రజలకు వివరిస్తామని చెప్పారు. తెలంగాణలోని ఏడు జిల్లాలను సస్యశ్యామలం చేయడం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి 2008లో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని, ప్రస్తుత ప్రభుత్వం జిల్లా రైతులకు, ప్రజలకు అన్యాయం చేయడానికి ప్రాజెక్టు డిజైన్ మారుస్తోందని మండిపడ్డారు. మెదక్ జిల్లాకు నీరివ్వడం కోసం రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేయడం పద్ధతి కాదన్నారు. 19న ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టు పైలాన్‌వద్ద భారీ బహిరంగసభ నిర్వహిస్తామన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు శ్రీశైలం, సుభాన్‌గౌడ్, శర్వలింగం, రాజశేఖర్, లింగం, మొహినుద్దీన్, వడ్డె రాంచంద్రయ్య, మల్లారెడ్డి, అబీబ్, రాములు, శ్రీకాంత్‌రెడ్డి, నరేందర్‌గౌడ్, వీరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
గులాబీకి ‘ప్రాణ’ సంకటం!
- కాంగ్రెస్ దూకుడుకు కళ్లెం వేసేదేలా? - ప్రాణహిత -చేవెళ్లపై విపక్షపార్టీల విమర్శనాస్త్రాలు - డిజైన్ మార్పుపై అధికార పార్టీలో అస్పష్టత సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పు అంశం తెలంగాణ రాష్ట్ర సమితిని ఆత్మరక్షణలో పడేసింది. ఈ ప్రాజెక్టు కుదింపును రాజకీయాస్త్రంగా మలుచుకొని కాంగ్రెస్ దూకుడు కొనసాగిస్తుండడంతో గులాబీ దళంలో గుబులు మొదలైంది. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుపై విపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొలేక దాటవేత ధోరణిని అవలంబిస్తోంది. దివంగత సీఎం రాజశేఖరరెడ్డి జిల్లాను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ చే సిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రాజెక్టు పనులు కూడా చకచకా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన ప్రకటనను కాంగ్రెస్ అందిపుచ్చుకుంటోంది. పాలకపక్షాన్ని ఇరుకున పెట్టేలా వ్యూహాలకు పదునుపెట్టింది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తో డీలా పడ్డ ఆ పార్టీ నాయకత్వం.. తొలిసారి చేవెళ్ల- ప్రాణహిత ప్రాజెక్టుపై సమష్టిగా పోరుబాట పట్టింది. ఓటమి తర్వాత దాదాపు ఇంటికే పరిమితమైన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ప్రాజె క్టు కుదింపును ప్రతిష్టాత్మకంగా తీసుకొని టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. ప్రాజెక్టు నమూనా మారిస్తే సహించేదిలేదని హెచ్చరించడం ద్వారా రాష్ట్రస్థాయిలో చర్చకు తెరలేచింది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలోనూ ఆ పార్టీ మునుపెన్నడులేని విధంగా ప్రభుత్వాన్ని ఇరుకున పడేసింది. డిజైన్ మార్చారా? లేదా? అనే అంశంపై స్పష్టతనివ్వాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. ఒకవైపు సమావేశంలో తీర్మానానికి పట్టుబట్టడం.. మరోవైపు బయట పార్టీ శ్రేణులు జెడ్పీని ముట్టడించడంతో కాంగ్రెస్ వ్యూహం ఫలించిం ది. ప్రాజెక్టుపై తీర్మానానికి ససేమిరా అన్న మంత్రి మహేందర్‌రెడ్డి.. విపక్ష సభ్యులను అరెస్ట్ చేయించారు. ఈ అంశం కూడా తమకు లాభిస్తుందని కాంగ్రెస్ ఆశిస్తోంది. అధికారపక్షంలో అస్పష్టత ప్రాణ హిత ప్రాజెక్టుపై అధికారపక్షం పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. ప్రాజెక్టు నమూనా మార్పుపై ఇప్పటికే పలుమార్లు సీఎం సంకేతాలిచ్చినప్పటికీ, ఈ అంశంపై నోరుమెదిపేందుకు అధికారపార్టీగణం జంకుతోంది. డిజైన్ మార్చారని ఒప్పుకుంటే జనంలోకి వెళ్లలేమని బయపడుతున్న ఆ పార్టీ.. డిజైన్ మార్చలేదని చెప్పేందుకూ సాహసించడంలేదు. గోదావరి జలాలు చేవెళ్ల వరకు రావని కేసీఆర్ ఇదివరకే స్పష్టం చేసినందున.. ఏ ప్రకటన చేసినా గులాబీ బాస్‌తో చీవాట్లు తప్పవని భావిస్తోంది. ఈ ఇబ్బందే కాంగ్రెస్‌కు కలిసివచ్చింది. ‘తమ సభ్యులను బయటకు పంపాలా? సమావేశం వాయిదా వేయాలా? అనే అంశంపై మంత్రి కేటీఆర్‌తో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకున్న మహేందర్‌రెడ్డి.. ఒకవేళ ప్రాజెక్టు డిజైన్ మార్చకపోతే ఎందుకు అరెస్ట్ చేయిస్తారు’ అని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు ప్రశ్నించారు. డిజైన్ మార్చుతున్నారు గనుకే కేటీఆర్ కూడా కాంగ్రెస్ సభ్యులను బయటకు పంపించాలని సలహా ఇచ్చిఉంటారన్నారు. కాంగ్రెస్ ముప్పేట దాడిని కొనసాగించడంతో డైలమాలో పడిన గులాబీ దళం.. విమర్శలకు దీటుగా సమాధానం చెప్పడానికి ప్రయత్నాలు ప్రార ంభించింది. అయితే, ప్రాజెక్టు నమూనాపై స్పష్టత లేకుండా ముందుకెలా సాగాలనే అంశంపై తర్జనభర్జన పడుతోంది. -
‘ప్రాణహిత- చేవెళ్ల’పై కాంగ్రెస్ పట్టు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్ మార్పుపై రంగారెడ్డి జెడ్పీ సర్వసభ్య సమావేశం అట్టుడికిపోయింది. గోదావరి జలాలు రంగారెడ్డి జిల్లాకు రాకుండా మెదక్ వరకే పరిమితం చేయడాన్ని ప్రశ్నిస్తూ విపక్ష కాంగ్రెస్ సభ్యులు పోడియం ముందు బైఠాయించడంతో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. పాత నమూనాను యథాతథంగా కొనసాగించేలా తీర్మానం చేయాలని పట్టుబట్టడం.. ఒకానొక దశలో కాంగ్రెస్, టీఆర్ఎస్ సభ్యులు పోటాపోటీగా నిలదీసుకుంటూ తోపులాటకు దిగడంతో సభ అదుపుతప్పింది. శనివారం చైర్పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తొలుత ఈ అం శాన్ని లేవనెత్తిన ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి.. ప్రాణహిత ప్రాజెక్టు మళ్లింపు ప్రకటనపై అధికారపక్షాన్ని గట్టిగా నిలదీశారు. దాదాపు రూ. వెయ్యి కోట్ల పనులు కూడా పూర్తిచేసుకున్న ప్రాజెక్టును కుదించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నందున.. ప్రస్తుత డిజైన్‌నే కొనసాగించేలా తీర్మానం చేయాలని పట్టుబట్టారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దూరదృష్టితో బీడువారిన రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశార న్నా రు. ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్టును మెదక్ వరకు పరిమితం చేయడంతో తీరని అన్యా యం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగ ప్రయోజనాలను కాపాడేలా ప్రాజెక్టు మళ్లింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా తీర్మానం చేయాలని పట్టుబట్టారు. రామ్మోహన్‌రెడ్డికి బాసటగా కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ముందుకు దూసుకొచ్చారు. ఆఖరికి పోలీసులు రంగప్రవేశం చేసి సభ్యులను అరెస్టు చేశారు. ప్రాణహిత ప్రాజెక్టు నుంచి జిల్లాను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్, కాంగ్రెస్ నేత కార్తీక్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు జిల్లా పరిషత్‌ను ముట్టడించడం ఉద్రిక్తతకు దారి తీసింది. వీరిని కూడా అరెస్టు చేసిన పోలీసులు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అడ్డుకున్న అధికారపక్షం ప్రాణహిత డి జైన్ మార్పుపై విపక్ష సభ్యుల ఆం దోళనను విరమింపజేసేందుకు రవాణా మం త్రి మహేందర్‌రెడ్డి, చైర్పర్సన్ సునీత, కలెక్టర్ రఘునందన్‌రావు పలుమార్లు సంప్రదింపులు జరిపినప్పటికీ పట్టు వీడలేదు. తీర్మానం చేయాల్సిందేనని గట్టిగా నినాదాలివ్వడమేకాకుండా.. మంత్రితో వాగ్వావాదానికి దిగారు. ఈ క్రమంలోనే సమావేశాన్ని వాయిదా వేసి బయటకు వెళ్లిన మంత్రిని కాంగ్రెస్ శ్రేణులు ఘెరావ్ చేశాయి. కాంగ్రెస్ సభ్యుల ఆందోళనకు టీడీపీ, బీజేపీలు కూడా సంఘీభావం ప్రకటించడం గమనార్హం. మేంవినం: మంత్రి మహేందర్‌రెడ్డి ‘కాంగ్రెస్ చెబితే.. మేం వినే ప్రసక్తేలేదు. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన లేకుండా గందరగోళం సృష్టించడం మంచి పద్ధతికాదు. రాజకీయం చేయాలని చూస్తే బాగుండదు. మేం కూడా జనంలోకి వెళ్లగలం. ప్రాజెక్టు నమూనా మార్పుపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.’ అని అన్నా రు. అంతకుముందు ఈ అంశంపై మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ 60 శాతం పనులు పూర్తిచేసుకున్న ప్రాజెక్టును ఆపడం సరికాదన్నారు. ప్రాణహితపై స్పష్టమైన వైఖరిని ప్రకటించకపోవడం అపోహలకు తావిస్తోందని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు. కొత్త నినాదం ‘జై దక్షిణ తెలంగాణ’ కాగా, దక్షిణ తెలంగాణ జిల్లాల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం వివక్ష పాటిస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ సభ్యులు శనివారం రంగారెడ్డి జెడ్పీ సమావేశంలో ‘జై దక్షిణ తెలంగాణ’ అని నినదించారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ కోసం రంగారెడ్డి జిల్లా ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని నినాదాలు చేశారు. -
పట్టిసీమలో మరో వింత డిజైన్
-
పట్టిసీమలో మరో వింత డిజైన్
ఏడాదిలో పూర్తిచేసుకునేందుకు పనులు కుదింపు అందుకోసమే డిజైన్ మార్పు.. అదనంగా రూ.250 కోట్లు ఖర్చు ‘మార్చిన డిజైన్’కు ప్రభుత్వ అనుమతులు లేకుండానే పనులు పూర్తి అనుమానాలున్నాయన్న మంజూరు కమిటీ డిజైన్ మార్చడం వల్ల రూ.260 కోట్లు ఖర్చు తగ్గాల్సి ఉండగా, అదనంగా రూ.250 కోట్లు కొట్టేసే వ్యూహం హైదరాబాద్: ఆధునిక పరిజ్ఞానం పేరిట అదనంగా రూ.250 కోట్లు కొట్టేయడానికి పట్టిసీమ ప్రాజెక్టు కాంట్రాక్టర్, ప్రభుత్వ పెద్దలు కలిసి వ్యూహం రూపొందించారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం అంచనా వ్యయాన్ని వాస్తవ ఖర్చు కంటే భారీగా నిర్ణయించడం, అంచనా వ్యయంపై 21.9శాతం అధికంగా చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరించిన అంశంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం విదితమే. దాని మీద అదనంగా రూ.250కోట్లు కొట్టేయడానికి తాజాగా ‘అత్యాధునిక పరిజ్ఞానం’ అనే అంశాన్ని తెర మీదకు తెచ్చారు. గోదావరి నుంచి 8,500 క్యూసెక్కుల నీటిని తోడి పోలవరం కుడికాల్వలో పోయడానికి వీలుగా 30 మోటార్లు, 15 వరుసల పైపులైన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం, కాంట్రాక్టు సంస్థ మెగా మధ్య ఒప్పందం కుదిరింది. ఈపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్)విధానంలో ప్రాథమిక అంశాల్లో మార్పు చేయకుండా డిజైన్ మార్చుకొనే స్వేచ్ఛ కాంట్రాక్టు సంస్థకు ఉంటుంది. అంచనా వ్యయానికి మించి చేసే అదనపు ఖర్చును ప్రభుత్వం చెల్లించదు. ఈ విషయం ఒప్పందంలోనూ ఉంది.పనులు ప్రారంభానికి ముందే డిజైన్‌ను సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ నుంచి ఆమోదం పొందాలనే నియమం ఉంది. ఇందుకు భిన్నంగా పనులన్నీ పూర్తి చేసి డిజైన్‌ను ప్రభుత్వానికి పంపించింది. ఈపీసీ నిబంధనలను నెట్టి అంచనా వ్యయాన్ని మించి అదనంగా రూ.250 కోట్లు చెల్లించాలని ప్రతిపాదించింది. డిజైన్ మార్చాల్సిన అవసరం ఏమిటో? పనులు చేసే సమయంలో క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి డిజైన్‌లో మార్పులు చేయడం సహజం. కానీ ఒప్పందం మీద సంతకాలు చేసిన వెంటనే.. కొత్త డిజైన్ మేరకు పనులు ప్రారంభం కావడం గమనార్హం. ఇలా రూ.కోట్లు కొల్లగొట్టే వ్యూహం ఇరు పక్షాలకు తెలుసు. అందుకే.. మార్చిన డిజైన్‌కు ఆమోదం లేకుండానే పనులు చేసేశారు. చివరి దశలో డిజైన్ ఆమోదానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చారు. ఎందుకు మార్చాల్సి వచ్చిందనేది చెప్పకపోవడం గమనార్హం. ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించడం వల్ల మోటార్లు-పంపుల సంఖ్య 30 నుంచి 24కు తగ్గాయని చెప్పారు. కాంట్రాక్టర్ చెబుతున్న ఆధునిక పరిజ్ఞానానికి, ఒప్పందంలో పేర్కొన్న పరిజ్ఞానానికి వ్యత్యాసమేమిటో అధికారులు తెలుసుకొనే ప్రయత్నం చేయలేదు. పంపుల సంఖ్య తగ్గితే వ్యయం తగ్గాల్సి ఉండగా, పెరుగుతుందంటూ కాంట్రాక్టు చేసిన ప్రతిపాదనకు తలాడించడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధమన్న ఎస్ఎల్ఎస్సీ సర్కారు పెద్దల అండదండలతో ముందే రూపొందించుకున్న వ్యూహం మేరకు మారిన డిజైన్, ఫలితంగా అదనంగా రూ.250 కోట్లు చెల్లించాలన్న ప్రతిపాదన మీద నేరుగా సంతకాలు చేయడానికి అధికారులకు ధైర్యం సరిపోయినట్టులేదు. రాష్ట్రస్థాయి మంజూరు కమిటీఆమోదముద్రకు ప్రయత్నిం చారు. గురువారం రాత్రి వరకు చర్చించిన కమిటీ... కాంట్రాక్టర్ చెబుతున్న ఆధునిక పరిజ్ఞానం నమ్మశక్యంగా లేదనే అభిప్రాయం వ్యక్తం చేసింది. అదనంగా చెల్లించాలని కోరుతున్న రూ.250 కోట్లలో రూ.190 కోట్ల విలువైన ‘కాంపోనెంట్స్’ గురించి నీటిపారుదల శాఖ ఇంజనీర్లకు కనీస అవగాహన లేదని, వాటి ధరలపైనా అనుమానాలున్నాయంది. మారిన డిజైన్‌కు సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ ఆమోదం తెలిపినట్లుగా నీటిపారుదల శాఖ అధికారులు సమావేశంలో వివరించారు. డిజైన్ మారడం వల్ల వ్యయం పెరుగుతుందంటూ పోలవరం సీఈ రాసిన లేఖలో ఎక్కడా.. మారిన డిజైన్‌కు ఆమోదం తెలిపారనే అంశం లేదు. ఆమోదం తెలిపిన లేఖా లేదు. డిజైన్‌కు ఆమోదం లేకుండానే పనులు ఎలా చేశారనే ప్రశ్న రావడంతో.. పాత తేదీలతో సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ సీఈతో ఆమోదముద్ర వేయించడానికి ఉన్నతాధికారులు హడావుడి పడుతున్నారు. బోర్డు ఆమోదముద్ర వేయిస్తే సరి.. ఎస్ఎల్ఎస్సీలో ఊహించని అభిప్రాయం వ్యక్తంకావడంతో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, సర్కారు పెద్దలు ప్రత్యామ్నాయ మా ర్గాలను అన్వేషించారు. ఆధునిక పరిజ్ఞానం, ఎస్ఎస్ఆర్(స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్) జాబితా లో లేని అంశాల ధరల నిర్ధారణకు ‘బోర్డ్ ఆఫ్ సీఈస్’(చీఫ్ ఇంజనీర్ల బోర్డు) భేటీ ఏర్పాటు చేస్తారు. ఇప్పుడూ ఈ భేటీ ఏర్పాటు చేసి ‘మమ’ అనిపించాలని శుక్రవారం నిర్ణయించా రు. సోమవారం భేటీ ఏర్పాటు చేసి, అక్కడే వారికి పత్రాలు ఇచ్చి ఆమోదముద్ర వేయిస్తామని.. పట్టిసీమ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఇంజనీర్ ‘సాక్షి’కి చెప్పారు. ఆమోదముద్ర పడిన మరుక్షణం అదనపు చెల్లింపులు చేయడానికి అధికారులు సమాయత్తమవుతున్నారు. రూ.500 కోట్లకు పైగా కొట్టేసే వ్యూహం మోటార్లు-పంపుల సంఖ్య 30 నుంచి 24కు, పైపుల లైన్ల సంఖ్య 15 నుంచి 12కు తగ్గించడం వల్ల రూ.260 కోట్ల వ్యయం తగ్గుతుందని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. ఈ రూ.260 కోట్లు, ఆధునిక పరిజ్ఞానం పేరిట అదనంగా అడుగుతున్న రూ.250 కోట్లు కలిపి.. మొత్తం రూ.500 కోట్లు కొల్లగొట్టేసే వ్యూహాన్ని సర్కారు పెద్దల అండదండలతో అమలవుతోందని స్పష్టంగా తెలిసిపోతోంది. దోపిడీ కొనసాగింపునకే కొత్త నాటకం పట్టిసీమ పథకంలో అన్నీ అడ్డగోలు వ్యవహారాలే. ఈపీసీ నిబంధనల ప్రకారం 5 శాతానికి మించి బిడ్లు దాఖలైతే రద్దు చేయాలి. 21.9% అధికానికి టెండర్లు ఖరారు చేయడంపై శాసనసభ లోపల, వెలుపల విమర్శలు రావడంతో.. ఏడాదిలో పూర్తి చేస్తేనే 21.9% అధికంగా చెల్లిస్తామని, లేదంటే 5 శాతమేనని కొత్త పల్లవి అందుకొన్న విషయం విదితమే. ఏడాదిలో పూర్తి చేయాలని టెండర్లు పిలిచి, ఇచ్చిన గడువులో పూర్తి చేస్తే 5 శాతంతోపాటు మరో 16.9% అదనంగా చెల్లిస్తామంటూ నిబంధనలను తుంగలో తొక్కినప్పుడే గూడుపుఠాని వెల్లడయింది. ఒప్పందం ప్రకారం చేస్తే ఏడాదిలో పూర్తవుతుందో, లేదో అనే అనుమానం రావడంతో కాంట్రాక్టర్-ప్రభుత్వం కలిసి కొత్త నాటకం మొదలుపెట్టాయి. మోటార్లు-పంపులు, పైపులైన్ల సంఖ్య తగ్గించి గడువులోగా పూర్తి చేసి సొమ్ము చేసుకోవాలని వ్యూహం పన్నాయి. మోటార్లు-పంపులు, పైపులైన్ల సంఖ్య తగ్గినప్పుడు ప్రాజెక్టు పూర్తి చేయడానికి పట్టే సమయం, వ్యయం రెండూ తగ్గాలి. కానీ అందుకు భిన్నంగా.. వ్యయాన్ని పెంచడం గమనార్హం. -
కాళేశ్వరం బ్యారేజీని మొదలుపెడదాం
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పులో భాగంగా కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద నిర్మించే బ్యారేజీ నిర్మాణ విషయమై స్పష్టత వచ్చినందున ఈ పనులకు త్వరలోనే శంకుస్థాపన చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాంటి ముంపు లేకుండా చేపట్టే బ్యారేజీ నిర్మాణాన్ని ఏ ఎత్తులో చేపట్టాలన్న దానిపై ప్రాజెక్టు సర్వే బాధ్యతలు చూస్తున్న వ్యాప్కోస్ సమర్పించిన నివేదిక పూర్తి సంతృప్తికరంగా ఉన్న దృష్ట్యా, దీనిపై శనివారం జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి దీనికి ఆమోదం తెలిపే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. తుమ్మిడిహెట్టితో పోలిస్తే కాళేశ్వరం దిగువన నీటి ప్రవాహం ఎక్కువ రోజులుంటుందని, లభ్యత సైతం గణనీయంగా ఉందని ఇప్పటికే వ్యాప్కోస్ ప్రాధమికంగా నిర్ధారించింది. ఎలాంటి అంతరాష్ట్ర వివాదాలకు ఆస్కారం లేకుండా ఇక్కడి నుంచి నీర్ణిత నీటిని రాష్ట్రానికి మళ్లించుకోగలిగితే, ఆ తర్వాత రాష్ట్రంలో ఇప్పటికే ప్రాజెక్టు కింద నిర్ణయించిన సాగు, తాగు నీటి లక్ష్యాలను చేరుకోవచ్చని నివేదించింది. మేటిగడ్డ వద్ద నిర్మించే బ్యారేజీ ఎత్తును 102మీటర్ల ఎత్తుతో నిర్మించి 100మీటర్ల వరకే నీటిని నిల్వ చేసి ముంపు లేకుండా చూడాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లు ప్రాధమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ ఎత్తులో 10 టీఎంసీల నీటిని నిల్వ చేసే ఆస్కారం ఉండటంతో పాటు సుమారు 120 రోజుల పాటు నీటి లభ్యత ఉంటుందని వ్యాప్కోస్ తన నివేదికలో స్పష్టం చేసింది. అయితే బ్యారేజీ నుంచి ఎల్లంపల్లి వరకు కాల్వల అలైన్‌మెంట్‌పై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. కాల్వల అలైన్మెంట్లలో 22 క్లిష్టమైన పాయింట్లను గుర్తించిన సంస్థ వాటికి ప్రత్యామ్నాయాలపై సర్వే చేస్తోంది. దీంతో పాటే త్వరలోనే ఈ ప్రాంతంలో లైడార్ సర్వే సైతం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియంతా జరిగి తుది నివేదిక వచ్చేందుకు మరో రెండు, మూడు నెలల సమయం పట్టే అవకాశాల దృష్ట్యా అప్పటిరవకు బ్యారేజీ నిర్మాణాన్ని ఆరంభించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు చెబుతున్నారు. పనులు ఆరంభించడం ద్వారా ప్రాజెక్టును జాప్యం చేస్తున్నారన్న ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కోవాలనే ఉద్ధేశ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై శనివారం నాటి కేబినెట్ భేటీలో చర్చిస్తారని ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి.