dharmasala
-
ఇజ్రాయెల్‌కు ధర్మశాలతో సంబంధం ఏమిటి?
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ సైనికులు గాజా స్ట్రిప్‌నంతటినీ చుట్టుముట్టారు. ఈ యుద్ధ నేపధ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదు సోదరులను ఇజ్రాయెల్ వెనక్కి రావాలంటూ పిలుపునిచ్చింది. దీంతో ఇప్పుడు భారతదేశ సందర్శనలో ఉన్న యూదులు తమ స్వదేశానికి తిరిగివెళుతున్నారు. ఫలితంగా మనదేశంలోని ఒక నగరం ఖాళీగా మారిపోతోంది. ఈ నగరం హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది. ఆ నగరం గురించి, ఇజ్రాయెల్‌తో ఆ నగరానికున్న అనుబంధం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న నగరం.. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల. ఇజ్రాయెలీలు ఈ నగరంలోని ధర్మ్‌కోట్‌కు వస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఇజ్రాయెలీలు సమావేశమవుతారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ యువత ప్రతి సంవత్సరం ఇక్కడకు వచ్చి, చాలా కాలం ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఖబద్ హౌస్ కూడా ఉంది. దానిలో ఇజ్రాయెలీలు ప్రార్థనలు చేస్తారు. ఇజ్రాయెల్‌లోని ప్రతి ఒక్కరూ అంటే యువకులైనా, యువతులైనా సైన్యంలో తప్పనిసరిగా శిక్షణ పొందుతారు. ఈ శిక్షణ పూర్తయిన తర్వాత చాలా మంది యువకులు హిమాచల్ ప్రదేశ్‌లోని ఈ ప్రాంతానికి వచ్చి కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారు. అయితే ఈసారి హమాస్ దాడి వారి విశ్రాంతికి అంతరాయం కలిగించింది. అనుకోని పరిస్థితుల్లో వారు తమ స్వదేశానికి తిరిగి వెళ్లవలసి వస్తోంది. భారతదేశానికి వచ్చే ఇజ్రాయెలీలు ధర్మ్‌కోట్‌తో పాటు, ఢిల్లీలోని పహర్‌గంజ్, రాజస్థాన్‌లోని అజ్మీర్‌లను కూడా సందర్శిస్తారు. ఇజ్రాయెలీల మతపరమైన స్థలాలు అంటే ఖబద్ హౌస్‌లు ఢిల్లీ, రాజస్థాన్‌లో ఉన్నాయి. ఇజ్రాయెలీలు అక్కడ ప్రార్థనలు చేస్తారు. యూదుల మత ప్రార్థనా స్థలాలు దాదాపు ప్రతి దేశంలో ఉన్నాయి. ఇక్కడ యూదులు బస చేస్తుంటారు. ఇది కూడా చదవండి: ఈవీఎంలోని బటన్లను రెండుసార్లు నొక్కితే ఏమవుతుంది? -
CWC 2023 AFG VS BAN: ఇదేం గ్రౌండ్ రా సామీ.. ఇసుక దిబ్బలే నయం..!
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ధర్మశాల వేదికగా నిన్న (అక్టోబర్ 7) ఆఫ్ఘనిస్తాన్-బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 37.2 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ 34.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మెహది హసన్ మీరజ్ ఆల్‌రౌండర్ షోతో (9-3-25-3, 57) అదరగొట్టి బంగ్లాదేశ్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. కాగా, మ్యాచ్ అనంతరం ధర్మశాల మైదానంపై సోషల్‌మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బౌండరీ లైన్ వద్ద గ్రౌండ్ పరిస్థితిని చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రౌండ్ కంటే ఇసుక, బుడద దిబ్బలు నయమని అంటున్నారు. గ్రౌండ్ పరిస్థితికి అద్దం పట్టేలా ఉన్న ఓ వీడియోను (బౌండరీ లైన్ వద్ద ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఫీల్డింగ్ చేస్తూ కిందపడ్డ వీడియోను) వైరల్ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తే గ్రౌండ్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్దమవుతుంది. This happened in Dharamsala today! How did the ICC deem this ground fit enough to host a World Cup match 🤦🏼♂️🤦🏼♂️I hope Mujeeb Ur Rahman isn't badly hurt. Crazy 🙏🏼 #CWC23 #WorldCup2023 pic.twitter.com/P5XpwLHmte— Farid Khan (@_FaridKhan) October 7, 2023 వరల్డ్‌కప్ లాంటి మెగా ఈవెంట్లో మ్యాచ్ నిర్వహించేందుకు ఈ గ్రౌండ్‌కు ఐసీసీ ఎలా అనుమతి ఇచ్చిందని క్రికెట్ ఫాలోవర్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనీస ప్రమాణాలు లేని బుడద మైదానంలో మ్యాచ్‌ను నిర్వహించడాన్ని వారు తప్పుబడుతున్నారు. ఈ విషయంలో జనాలు బీసీసీఐని నిందిస్తున్నారు. కాగా, ధర్మశాల మైదానం హిమాచల్‌ప్రదేశ్‌లోని ఎత్తైన కొండ ప్రాంతంలో ఉందన్న విషయం తెలిసిందే. ఇక్కడ వాతావరణం ఎప్పుడూ శీతలంగా ఉంటుంది. ఇక్కడ ఎండ రావడం చాలా అరుదుగా జరుగుతుంది. అందుకే ఈ మైదానం కాస్త స్టికీగా ఉంటుంది. ఇదిలా ఉంటే, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో భారత్.. ఇవాళ (అక్టోబర్ 8) తమ తొలి మ్యాచ్‌ను ఆడనున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఇవాళ భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభంకానుంది. మరోవైపు ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు పూర్తైన విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌తో జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ అద్భుత విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌లో నెదార్లండ్స్‌పై పాక్ సూపర్ విక్టరీ సాధించింది. నిన్న జరిగిన 2 మ్యాచ్‌ల్లో తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్పై బంగ్లాదేశ్.. శ్రీలంకపై సౌతాఫ్రికా ఘన విజయాలు నమోదు చేశాయి. -
అయ్యర్, జడేజా మెరుపులు.. సిరీస్ మనదే
ఎంతటి భారీ స్కోరైనా భారత్ ముందు తక్కువేనని మరోసారి రుజువైంది. ఓపెనర్లు విఫలమైనా శ్రేయస్ అయ్యర్, సంజు సామ్సన్, రవీంద్ర జడేజా మెరుపు బ్యాటింగ్‌కు జట్టుకు మరో విజయాన్ని, సిరీస్‌ను అందించింది. 60 బంతుల్లో 104 పరుగులు చేయాల్సిన స్థితిలో లక్ష్యం కష్టంగా అనిపించినా... మన బ్యాటర్లు అలవోకగా పరుగులు బాదేశారు. ముందుగా భారీ స్కోరు చేయడంతో పాటు ఆరంభంలో భారత్‌ను నిలువరించగలిగిన లంక ఆ తర్వాత పూర్తిగా చేతులెత్తేసింది. సిరీస్ ఫలితం తేలిపోగా, మిగిలిన మూడో మ్యాచ్ లాంఛనం నేడు పూర్తి కానుంది. ధర్మశాల: శ్రీలంకతో జరిగిన రెండో టి20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. పతుమ్ నిసాంకా (53 బంతుల్లో 75; 11 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా, గుణతిలక (29 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. చివర్లో షనక (19 బంతుల్లో 47 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగిపోవడంతో లంకకు భారీ స్కోరు సాధ్యమైంది. అనంతరం భారత్ 17.1 ఓవర్లలో 3 వికెట్లకు 186 పరుగులు చేసి అంతర్జాతీయ టి20ల్లో వరుసగా 11వ విజయం నమోదు చేసుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శ్రేయస్ అయ్యర్ (44 బం తుల్లో 74 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), జడేజా (18 బంతుల్లో 45 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), సామ్సన్ (25 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌లు జట్టును గెలిపించాయి. చివరి టి20 నేడు ఇదే మైదానంలో జరుగుతుంది. 4 ఓవర్లలో 72 పరుగులు... ఓపెనర్లు నిసాంకా, గుణతిలక జాగ్రత్తగా ఇన్నింగ్స్ ను ప్రారంభించడంతో పవర్‌ప్లేలో శ్రీలంక 32 పరుగులే చేయగలిగింది. జడేజా వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్లో తొలి మూడు బంతుల్లో వరుసగా 6, 4, 6 బాది దూకుడు ప్రదర్శించిన గుణతిలక నాలుగో బంతికి అవుట్ కావడంతో 67 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం (52 బంతుల్లో) ముగిసింది. ఆ తర్వాత వరుస ఓవర్లలో అసలంక (2), మిషారా (1) వెనుదిరగ్గా, చండిమాల్ (9) కూడా విఫలమయ్యాడు. ఈ దశలో నిసాంకా, షనక భాగస్వామ్యం జట్టు ఇన్నింగ్స్‌ను నడిపించింది. వీరిద్దరు 26 బంతుల్లోనే 58 పరుగులు జోడించారు. ముఖ్యంగా చివరి నాలుగు ఓవర్లలో భారత బౌలర్లపై లంక విరుచుకుపడింది. హర్షల్ వేసిన 17 ఓవర్లో షనక 2 సిక్స్‌లు బాదగా నిసాంకా ఫోర్ కొట్టాడు. బుమ్రా వేసిన తర్వాతి ఓవర్లో నిసాంకా మూడు ఫోర్లతో చెలరేగగా, భువీ ఓవర్లో షనక వరుసగా 6, 4తో చెలరేగాడు. నిసాంకా వెనుదిరిగిన తర్వాత హర్షల్ వేసిన 20వ ఓవర్లోనూ షనక సత్తా చాటాడు. ఈ నాలుగు ఓవర్లలో లంక వరుసగా 19, 14, 16, 23 పరుగులు సాధించడం విశేషం. భారీ లక్ష్య ఛేదనలో భారత్‌కు సరైన ఆరంభం లభించలేదు. రోహిత్ (1) తొలి ఓవర్లోనే వెనుదిరగ్గా, ఇషాన్ (15) కూడా పవర్‌ప్లేలోనే అవుటయ్యాడు. అయితే శ్రేయస్, సామ్సన్ భాగస్వామ్యం జట్టును విజయం దిశగా నడిపించింది. ముందుగా బినూరా ఓవర్లో మూడు ఫోర్లతో జోరు మొదలు పెట్టిన శ్రేయస్ దానిని కొనసాగించాడు. జయవిక్రమ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన అతను కరుణరత్నే బౌలింగ్‌లో మరో సిక్సర్‌తో 30 బంతుల్లోనే సిరీస్‌లో వరుసగా రెండో అర్ధ సెంచరీ సాధించాడు. ఆరంభంలో తడబడిన సామ్సన్... కుమార ఓవర్లో చెలరేగిపోయాడు. ఒక ఫోర్, 3 భారీ సిక్సర్లు బాదిన అనంతరం అదే ఓవర్లో బినూరా అద్భుత క్యాచ్‌కు నిష్క్రమించాడు. 42 బంతుల్లో 56 పరుగులు చేయాల్సిన ఈ దశలో జడేజా దాదాపు ఒంటి చేత్తో మ్యాచ్‌ను ముగించాడు. చమీరా ఓవర్లో వరుసగా కొట్టిన 6, 4, 4, 4 అతని ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచాయి. జడేజా, శ్రేయస్ నాలుగో వికెట్‌కు 26 బంతుల్లోనే అభేద్యంగా 58 పరుగులు జత చేశారు. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంకా (ఎల్బీ) (బి) భువనేశ్వర్ 75; గుణతిలక (సి) వెంకటేశ్ (బి) జడేజా 38; అసలంక (ఎల్బీ) (బి) చహల్ 2; మిషారా (సి) శ్రేయస్ (బి) హర్షల్ 1; చండీమాల్ (సి) రోహిత్ (బి) బుమ్రా 9; షనక (నాటౌట్) 47; కరుణరత్నే (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 183. వికెట్ల పతనం: 1–67, 2–71, 3–76, 4–102, 5–160. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–36–1, బుమ్రా 4–0–24–1, హర్షల్ పటేల్ 4–0–52–1, చహల్ 4–0–27–1, రవీంద్ర జడేజా 4–0–37–1. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) చమీరా 1; ఇషాన్ కిషన్ (సి) షనక (బి) కుమార 16; శ్రేయస్ (నాటౌట్) 74; సామ్సన్ (సి) బినూరా (బి) కుమార 39; జడేజా (నాటౌట్) 45; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (17.1 ఓవర్లలో 3 వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1–9, 2–44, 3–128. బౌలింగ్: చమీరా 3.1–0–39–1, బినూరా 4–0–47–0, కుమార 3–0–31–2, జయవిక్రమ 2–0–19–0, కరుణరత్నే 3–0–24–0, షనక 2–0–24–0. -
భారత్-దక్షిణాఫ్రికాల తొలి వన్డే వర్షార్పణం
ధర్మశాల : భారత్- దక్షిణాఫ్రికా జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దయ్యింది. ఈ మ్యాచ్‌కు పదే పదే వరుణుడు అడ్డంకిగా మారండంతో చివరకు రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఉదయం నుంచి పలు దఫాలుగా వర్షం పడుతూ ఉండటంతో టాస్ కూడా పడకుండానే మ్యాచ్‌ను రద్దు చేశారు. సాయంత్ర సమయంలో వరుణుడు కాస్త తెరిపిచ్చినప్పటికీ మైదానం మొత్తం చిత్తడిగా మారడంతో మ్యాచ్‌ను నిర్వహించడానికి వీలు లేకుండా మారిపోయింది. ఫలితంగా మ్యాచ్ రద్దు కాకతప్పలేదు. కాగా ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం లక్నోలో జరగనుంది. (రికార్డు స్థాయి క్రికెట్ మ్యాచ్‌కు కరోనా బాధితుడు) మ్యాచ్‌కు కరోనా భయం : కాగా భారత్-దక్షిణాఫ్రికాల వన్డే సిరీస్‌ను కరోనా భయం వెంటాడుతున్నట్లే కనిపిస్తోంది. తొలి వన్డేకు హాజరైన ప్రేక్షకుల సంఖ్య గణనీయకంగా తగ్గిపోయింది. కాగా హెచ్పీసీఏ స్టేడియం సామర్థ్యం 23వేలు కాగా సరాసరి ఎంతమంది హాజరయ్యారనేది తెలియదు కానీ స్టేడియంలో ప్రేక్షకుల హడావుడి చాలా తక్కువ సంఖ్యలోనే ఉంది. ఇది మిగతా వన్డేలపై కూడా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. పరిస్థితి ఇలానే ఉంటే ఒకవేళ ఐపీఎల్ జరిగితే మాత్రం.. ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు జరిగే అవకాశాలున్నాయి. ఐపీఎల్ 13వ సీజన్ నిర్వహించాలా? వద్దా? అనే దానిపై మార్చి 14న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కానుంది. కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు లక్షకు పైగా చేరడంతో పాటు మృతుల సంఖ్య 4800 పైగా చేరుకుంది. భారత్‌లోనూ ఇప్పటివరకు 73 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని కేంద్రం స్పష్టం చేసింది. -
ధర్మశాలలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ
-
వాన ముంచెత్తింది
ధర్మశాల: భారత్–దక్షిణాఫ్రికా మధ్య టి20 సిరీస్ ఎప్పుడు, ఎక్కడ జరిగినా... వరుణుడి చుట్టపు చూపు పలకరింపు తప్పదేమో! ఔను మరి... రికార్డులు ఇదే విషయం చెబుతున్నాయి. గత మూడు సిరీస్ (2011–12, 2015–16, 2017–18)లలో ఏదో ఒక మ్యాచ్‌నైనా అడ్డుకున్న వర్షం వరుసగా నాలుగో సిరీస్‌లోనూ నేనున్నానంటూ వచ్చేసింది. దీంతో ఆదివారం ధర్మశాల వేదికగా ఇరు జట్ల మధ్య జరగాల్సిన తొలి టి 20 రద్దయింది. మధ్యాహ్నం నుంచే వాతావరణం మేఘావృతమై ఉండగా... సాయంత్రానికి వాన మొదలైంది. అంపైర్లు పిచ్‌ను తనిఖీ చేయాల్సిన పని లేకుండా, ఔట్ ఫీల్డ్‌ను పదేపదే పరిశీలించాల్సిన అవసరం రానంతగా తెరపి లేకుండా కురిసింది. దీంతో కనీసం టాస్ కూడా పడలేదు. తుది జట్ల ప్రకటన సైతం చేయలేదు. మైదానంలో మంచి డ్రైనేజీ వ్యవస్థ ఉన్నా, ఆటకు ఏమాత్రం వీలుకానంతగా వర్షం పటడంతో చివరకు మ్యాచ్‌ను రద్దు చేయక తప్పలేదు. మ్యాచ్ ప్రారంభ సమయం (రాత్రి గం.7) నుంచి 50 నిమిషాలు వేచి చూసిన అనంతరం ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పరిస్థితి తెలిసిపోయిన ప్రేక్షకులు అంతకు అరగంట ముందు నుంచే స్టేడియం నుంచి వెళ్లిపోవడం ప్రారంభించారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో టి20 ఈ నెల 18న బుధవారం మొహాలీలో జరుగనుంది. కుర్రాళ్లకు నాలుగైదు అవకాశాలే: కోహ్లి వచ్చే ఏడాది టి20 ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని... లభించిన నాలుగైదు అవకాశాల్లోనే తమను తాము నిరూపించుకోవాలని జట్టులోని కుర్రాళ్లకు టీమిండియా కెపె్టన్ విరాట్ కోహ్లి సూచించాడు. కెరీర్ ఆరంభంలో తనకూ ఇలాంటి పరిస్థితే ఎదురైందని అతడు చెప్పుకొచ్చాడు. ‘ప్రపంచ కప్ ముందు మాకు గరిష్టంగా 30 మ్యాచ్‌లున్నాయి. ప్రస్తుతం తీవ్ర పోటీ వాతావరణంలో ఉన్నాం. అందుకని కాసిన్ని అవకాశాలనే ఒడిసిపట్టాలి. వాస్తవానికి వీటిని తక్కువనే భావించాలి. అరంగేట్రం సమయంలో నేను కూడా పదిహేను చాన్సులు వస్తాయని భావించలేదు. ఇప్పుడు జట్టులోనూ ఇదే మనస్తత్వం ఉంది. దీనిని తెలుసుకుని రాణించినవారే నిలవగలుగుతారు’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. ఓవైపు టి20 ప్రపంచ కప్‌నకు సన్నద్ధమవుతూనే టెస్టు చాంపియన్íÙప్ పైనా దృష్టిపెట్టినట్లు పేర్కొన్నాడు. ఈ క్రమంలో జట్టును పటిష్ట పరిచే దిశగా, విజయాలు సాధించే విధంగా యువకులను సమయానుకూలంగా పరీక్షిస్తామని చెప్పుకొచ్చాడు. -
రెండో రాజధాని.. సీఎం అనూహ్య నిర్ణయం
ఈ సంవత్సరం చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ధర్మశాలను తమ రాష్ట్రానికి రెండో రాజధానిగా ఆయన ప్రకటించారు. 70 లక్షల జనాభా ఉన్న అతి చిన్న రాష్ట్రానికి రెండో రాజధానిని ప్రకటించడం ద్వారా అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ధౌలాధర్ పర్వతశ్రేణిలో ఉన్న ధర్మశాల చాలా అద్భుతమైన ప్రాంతమని, దీనికి చారిత్రక ప్రాధాన్యం కూడా ఉన్నందున రాష్ట్రానికి రెండో రాజధాని అయ్యే అర్హతలన్నీ ఉన్నాయని ఆయన చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లోని దిగువ ప్రాంతాలైన కాంగ్రా, చంబా, హమీర్పూర్, ఉనా జిల్లాలకు ధర్మశాల చాలా ముఖ్యమైన ప్రాంతం. పైగా, రాష్ట్రంలోని మొత్తం 68 అసెంబ్లీ సీట్లలో 25 ఈ జిల్లాల్లోనే ఉన్నాయి. దాంతో ఇక్కడకు ఒక రాజధాని నగరాన్ని ఇవ్వడం ద్వారా ఈ ప్రాంతవాసులను ఆకట్టుకోవాలన్నది సీఎం వ్యూహంలా కనిపిస్తోంది. రాజధాని నగరంలో పనులు చేసుకోవాలంటే షిమ్లా వరకు దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉండదని, తమకు దగ్గర్లోనే ఉన్న ధర్మశాలలో ఆ పనులు చేసుకోవచ్చని ఆయన చెప్పారు. దలైలామా ఆశ్రమం ఉండటం, ప్రకృతి అనుకూలత, అడ్వంచర్ టూరిజానికి కేంద్రం కావడం.. ఇలా పలు రకాలుగా ధర్మశాల ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయంగా పేరు పొందింది. ఇప్పుడు రాష్ట్రానికి రెండో రాజధాని హోదా రావడంతో మరింత ముందుకెళ్తుంది. -
మోదీకి బుద్ధి చెబుతా: రాహుల్
ధర్మశాల: అధిక విలువ నోట్ల రద్దు వల్ల పేదలు, రైతులు, మధ్య తరగతి వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. మధ్యప్రదేశ్, జార్ఖాండ్, చత్తీస్ ఘడ్ లలో బీజేపీ ప్రభుత్వం కేవలం ఆదివాసి భూములను మాత్రమే లాక్కుందని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశాన్ని రెండు ముక్కలు చేశారని అన్నారు. ఓ భాగంలో కేవలం ఒక శాతం ఉన్న ధనవంతులకు ఇచ్చేసి మరో భాగంలో మధ్యతరగతి, పేదలు ఉండేలా చేశారని వ్యాఖ్యానించారు. నోట్లకు రంగులేదన్న రాహుల్.. అవినీతిపరుల చేతిలోకి వెళ్లిన తర్వాతే అది నల్లడబ్బుగా మారుతోందని చెప్పారు. భారత్ లో కేవలం ఆరు శాతం మాత్రమే నల్ల డబ్బు ఉందని మిగిలినదంతా రియల్ ఎస్టేట్, బంగారం రూపంలో ఉందని పేర్కొన్నారు. నల్లడబ్బు కేవలం బ్యాంకు అకౌంట్లలో కాకుండా బంగారం, రియల్ ఎస్టేట్ రూపంలోకి మారుతోందని అన్నారు. స్విస్ బ్యాంకులో నల్లడబ్బును దాచుకున్న అవినీతి పరుల జాబితా మోదీ పార్లమెంటులో ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు. ఢిల్లీలో లైన్లలో నిల్చున్న పేదలకు బీజేపీ మూడు రూపాయల లడ్డు ఇచ్చిందని, అదే విజయ్ మాల్యాకు రూ.1,200 కోట్లు ఎగ్గొట్టి విదేశాలు చెక్కేస్తే చూస్తూ ఊరుకుందని విమర్శించారు. అధిక విలువ కలిగిన నోట్ల రద్దు భారత నగదు వ్యవస్ధకు కార్చిచ్చు పెట్టిందని అన్నారు. మోదీ సిమ్లా, ధర్మశాల ప్రజల నడ్డి విరిచారని ఉద్రేకంగా మాట్లాడారు. మోదీ తనతో పరాచకాలు ఆడుతున్నారని ఆయనకు త్వరలోనే బుద్ధి చెబుతానని అన్నారు. -
టీమిండియా 'లెక్క' సమం అవుతుందా?
ధర్మశాల:ఇప్పటికే న్యూజిలాండ్ తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి మంచి ఊపు మీద ఉన్న టీమిండియాకు మరో సవాల్ కు సిద్ధమవుతోంది. మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ఐదు వన్డేల సుదీర్ఘ సిరీస్ ను ఆడనున్న నేపథ్యంలో ధర్మశాలలో జరిగే తొలి మ్యాచ్ లో కొంతవరకూ కఠిన పరీక్ష ఎదురయ్యే అవకాశం ఉంది. ధర్మశాలలో భారత జట్టుకు విజయాల రికార్డు అంతంతమాత్రంగా ఉండంటంతో దాన్ని అధిగమించేందుకు ధోని సేన కసరత్తు చేస్తుంది. ఇక్కడ భారత్ ఆడిన మూడు మ్యాచ్ ల్లో రెండు పరాజయాలను చవిచూడగా, ఒక విజయం మాత్రమే దక్కించుకుంది. ఇప్పటివరకూ ధర్మశాలలో ఓవరాల్ గా 10 మ్యాచ్‌లు జరిగాయి. ఇక్కడ కేవలం రెండు వన్డేలు, ఎనిమిది టీ 20లను నిర్వహించారు. అయితే ఈ స్టేడియానికి 2013లో అంతర్జాతీయ హోదా వచ్చిన తరువాత ఇంగ్లండ్ తో జరిగిన వన్డేలో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఆ తరువాత 2014లో వెస్టిండీస్ తో జరిగిన వన్డేలో భారత్ విజయం సాధించింది. 2015లో ఇక్కడ చివరిసారి దక్షిణాఫ్రికాతో ఆడిన టీ 20లో భారత్ ఏడు వికెట్లతో ఓటమి చెందింది. ఈ నేపథ్యంలో ధర్మశాల స్టేడియంలో న్యూజిలాండ్ జరిగే తొలి వన్డేలో గెలిచి ఇక్కడ రెండో గెలుపును సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తుంది. ఒక వేళ తొలి వన్డేలో భారత్ గెలిస్తే తమకు ఇక్కడ ఎదురైన ఓటమి లెక్కను సమం చేసే అవకాశం దక్కుతుంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ తో ఆదివారం జరిగే తొలి వన్డేలో భారత్ ఎంతవరకూ రాణిస్తుందో వేచి చూడాల్సిందే. -
ఆ మూడు మ్యాచ్‌లు ధర్మశాలలో..
ధర్మశాల: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా కింగ్స్ పంజాబ్ హోం మ్యాచ్ లను ధర్మశాలలో నిర్వహించనున్నారు. దీనికి హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అంగీకరించడంతో కింగ్స్ పంజాబ్ హోం గ్రౌండ్ గా ధర్మశాల ఖరారైంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం వచ్చే నెలలో కింగ్స్ పంజాబ్ హైం పిచ్ అయిన నాగ్ పూర్లో మూడు మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. అయితే కరవు కారణంగా మహారాష్ట్రలో మ్యాచ్‌లను తరలించాలని ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పుతో అక్కడ జరగాల్సిన 13 మ్యాచ్‌లను తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏప్రిల్ 30 తర్వాత మహారాష్ట్రలో జరగాల్సిన మ్యాచ్‌లన్నీ తరలించాలని కోర్టు పేర్కొనడంతో ముంబై ఇండియన్స్, పుణె సూపర్ జెయింట్స్, కింగ్స్ పంజాబ్ జట్ల హోం గ్రౌండ్ లను మార్చాల్సి వచ్చింది. ఇప్పటికే పుణె సూపర్ జెయింట్స్ తన హోం గ్రౌండ్ గా విశాఖను ఎంచుకోగా, ముంబై ఇండియన్స్ తన హోం పిచ్ గా జైపూర్ ను ఎంచుకుంది. ఇదిలా ఉండగా ఐపీఎల్లో మే 1న పుణేలో జరగాల్సిన మ్యాచ్‌ను అక్కడే నిర్వహించుకోవడానికి బాంబే హైకోర్టు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ముంబైలో జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగే అవకాశం ఉంది. -
విదేశీ వనితపై లైంగిక దాడి
ధర్మశాల: హిమాచల్ ప్రదేశ్‌లో ఓ విదేశీ వనితపై గ్యాంగ్ రేప్ చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు ఆమెను మోసగించి లైంగిక దాడి జరిపినట్లు బాధితురాలి వాపోయింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలకు ఓ విదేశీ వనిత పర్యటన నిమిత్తం వచ్చింది. అయితే, మాయమాటలు చెప్పిన ఇద్దరు వ్యక్తులు గతవారం ఆమెపై లైంగికదాడి చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఇద్దరు అనుమానితుల్ని అరెస్టు చేశారు. వీరిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు.