dharpalli
-
మరో ఆన్లైన్ మోసం
ధర్పల్లి(నిజామాబాద్ రూరల్): జిల్లాకు చెందిన మరో వ్యక్తిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. బ్యాంకర్ల పేరు ఖాతా, ఏటీఎం వివరాలు తెలుసుకుని, బాధితుడి ఖాతా నుంచి రూ.38 వేలు కొల్లగొట్టారు. ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణకు సోమవారం సాయంత్రం దుండగులు ఫోన్ చేశారు. ‘హలో లక్ష్మీనారాయణ.. మేము ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. మీ ఏటీఎం కార్డు ఎక్స్పైరీ అయింది. ఆ కార్డు వివరాలు ఇవ్వండి.. మళ్లీ ఓపెన్ చేస్తామని’ హిందీలో చెప్పాడు. దీంతో తాను పొలం వద్ద ఉన్నానని, తన కుమారుడు ప్రణీత్‌తో మాట్లాడాలన్న లక్ష్మీనారాయణ అతడికి ఫోన్ కాన్ఫరెన్స్ కలిపాడు. ఇదేమి తెలియని ప్రణీత్ దుండగులు అడిగిన వివరాలన్ని చెప్పేశాడు. ఏటీఎం కార్డుపై 16 నెంబర్లతో పాటు సీవీవీ, పిన్ నెంబర్ తీసుకున్న దుండగులు.. క్షణాల్లో ఆ ఖాతా నుంచి రూ.38 వేలను ఆన్లైన్లో షాపింగ్ చేశారు. అయితే, ఖాతా నుంచి డబ్బులు డ్రా అయినట్లు ఫోన్‌కు మెస్సేజ్ రావడంతో బాధితుడు మంగళవారం దుబ్బాకలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు వెళ్లి విషయం చెప్పాడు. ఆన్లైన్ షాపింగ్‌తో నీ డబ్బులు డ్రా అయినట్లు బ్యాంక్ అధికారులు చెప్పడంతో తాను మోసపోయినట్లు గుర్తించి బాధితుడు లబోదిబోన్నాడు. ఈ ఘటనపై బ్యాంక్ అధికారులతో పాటు ధర్పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కోలకతా నుంచి ఫోన్.. లక్ష్మీనారాయణకు వచ్చిన ఫోన్ నంబర్ ద్వారా కోల్‌కతా నుంచి చేసినట్లు గుర్తించారు. బాధితుడు తిరిగి మంగళవారం అదే నెంబర్‌కు ఫోన్ చేయగా, తాను రాహుల్‌గాంధీని అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. మళ్లీ అరగంట తరువాత ఫోన్ చేయగా.. ‘అవును నీ ఏటీఎం నుంచి రూ.38 వేలు డ్రా చేశాను. ఇలా ఇప్పటివరకు రూ.25 లక్షలు డ్రా చేశా. ఏమి చేస్తావో చేసుకో’ అని దుండగుడు బదులిచ్చాడు. సైబర్ పోలీస్‌లకు ఫిర్యాదు చేస్తామని బాధితుడు చెబితే, చెప్పుకో నాక్కూడా పోలీసులు ఉన్నారని ఫోన్ పెట్టేశాడు. -
భద్రత ఎక్కడ!
ధర్పల్లి: అటవీ అధికారుల భద్రతను ఉన్నతాధికారు లు గాలికి వదిలేశారు. వారి ప్రాణాలకు ముప్పుం దన్న సోయి కూడా సర్కారుకు లేకుండా పోయింది. ధర్పల్లి మండలం నల్లవెల్లి శివారులోని అటవీ ప్రాం తంలో ఇందల్వాయి ఎఫ్ఆర్ఓ గంగయ్యను అటవీ భూకబ్జాదారులు కిరాతకంగా గొడ్డళ్లతో నరికి హత్యచేసి ఏడాది. గత సెప్టెంబర్ 14న అర్ధరాత్రి దాటిన తర్వాత గంగయ్యను దారుణంగా హత్యచేశారు. ఆయనతోపాటు ఉన్న ఎనిమిది మంది బీట్ ఆఫీస ర్లు దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు అర చేతి లో పెట్టుకుని బయటపడ్డారు. ఈ ఘటన జరిగినప్ప టి నుంచి అటవీ అధికారులు భయంతోనే విధులు నిర్విహ స్తున్నారు. హత్య జరిగిన స్థలాన్ని అప్పటి అటవీశాఖ అడిషనల్ పీసీసీఎఫ్ స్వర్గం శ్రీనివాస్, సీసీఎఫ్ గోపీనాథ్‌తోపాటు అటవీ శాఖ ఉన్నతాధికారులు, అప్పటి జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, ఎస్పీ విక్రంజిత్ దుగ్గల్ సందర్శించారు. ఉద్యోగులకు న్యా యం జరిగేలా చూస్తామని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత వారి గురించి పట్టించుకున్నవారు లేరు. జాయింట్ సర్వేలను మరిచారు అటవీ సిబ్బంది ప్రాణాలు పోయినప్పుడే ఉన్నతాధికారులకు వారి భద్రత గురించి ఆలోచన వస్తుంది. జిల్లావ్యాప్తంగా సుమారు 50 వేల హెక్టార్ల అటవీ భూములు వివాదాస్పదంగా ఉన్నాయి. ఈ భూములలో రెవెన్యూ, అటవీశాఖ అధికారులతో సంయుక్త సర్వేలను చేపడతామని, వివాదాలను పరిష్కరిస్తామని ఉన్నతాధికారులు ఇచ్చిన మాటలు నీటి మూటగానే మిగులుతున్నాయి. రిజర్వ్ ఫారె స్ట్ భూములలో సంయుక్త సర్వేలతో హద్దులు గుర్తిస్తే సమస్య పరిష్కారమవుతుంది. కానీ ఇప్పటికి అలాంటి చర్యలు చేపట్టేందుకు అటవీ ఉన్నతాధికారులు ముందుకు రావటం లేదు. ఫారెస్ట్ భూముల్లో వివాదాలు తలెత్తినప్పు డే జాయింట్ సర్వేలు చేస్తామని దాటవేస్తున్నారు. తాము రెవెన్యూ భూ ములనే సాగుచేస్తున్నామని, అయినా అటవీ అధికారులు వేధిస్తున్నారని బాధితులు కలెక్టర్‌ను ఆశ్రయిస్తున్నారు. వివాదాస్పద భూములలోకి వెళ్లేందుకు అటవీ సిబ్బంది జంకుతున్నారు. అడ్డుకుంటే కబ్జాదారులు దాడులకు పాల్పడుతున్నారు. దీంతో వారికి భద్రత లేకుండా పోయింది. అటవీ సిబ్బం దికి ఆయుధాలు ఇస్తామని గతేడాది ప్రభుత్వం ప్రకటించింది. కాని ఇంతవరకు అమలుకాలేదు. దీంతో అటవీ సిబ్బంది భద్రత గాలిలో దీపంగా మిగిలింది. -
ప్రశాంతంగా ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు
ధర్పల్లి/నిజాంసాగర్, న్యూస్‌లైన్ : ధర్పల్లి మండలం మైలారం, పిట్లం మండలంలోని బండపల్లి ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎంపీటీసీ స్థానాలకు ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. ఆయా మండల పరి షత్ కార్యాలయాల్లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించి గంటన్నర లోపే ఫలి తాలు వెల్లడించారు. మైలారం ఎంపీటీసీగా నాయిక లలితామోహన్(కాంగ్రెస్) ఎన్నికయ్యా రు. ఆమె స్వతంత్ర అభ్యర్థి సీహెచ్ ప్రసాద్‌పై 739 ఓట్ల మెజార్టీతో ఆమె విజయం సాధిం చారు. మండలంలో ఎక్కువ మెజార్టీ సాధించి న వారిలో లలిత ముందు వరుసలో నిలిచారు. మండల రిటర్నింగ్ అధికారి లక్ష్మణ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మదన్మోహన్ పర్యవేక్షణలో ఓట్ల లెక్కిం పు చే పట్టారు.లెక్కింపునకు అబ్జర్వర్‌గా బోధన్ డీఎల్పీఓ అనుక్ వ్యవహరించారు. మొత్తం 903 ఓట్లు పోల్ కాగా, నాయిక లలితకు 811, సీహెచ్ ప్రసాద్‌కు 68 ఓట్లు వచ్చాయి. 24 ఓట్లు చెల్ల లేదు. బండపల్లిలో... పిట్లం మండలం బండపల్లి ఎంపీటీసీకి టీఆర్ఎ స్ అభ్యర్థి రజనీకాంత్‌రెడ్డి 1,012 ఓట్ల మెజార్టీ తో కాంగ్రెస్ అభ్యర్థి గంగారాంపై గెలుపొందా రు. ఈ ఎంపీటీసీ స్థానం పరిధిలో 2,239 మం ది ఓటర్లకు గాను 1,720 మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. వీటిలో గం గారాంకు 338 ఓట్లు పోలవగా, మిగతావి 1350 టీఆర్ఎస్ అభ్యర్థి రజనీకాంత్‌రెడ్డికి వచ్చాయి. 32 ఓట్లు చెల్లలేవు. అత్యధిక మోజార్టీతో రజనీకాంత్‌రెడ్డి విజయం సాధించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి సుజాత ధ్రువపత్రాన్ని అందజేశారు. నాటకీయ పరిణామాల మధ్య... అనేక నాటకీయ పరిణామాల మధ్య బండపల్లి ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ జెం డా ఎగిరింది. ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీ స్థానానికి రాష్ట్ర ఎన్ని కల కమిషన్ అభ్యంతరంతో రద్దు చేశారు. మళ్లీ నిర్వహించిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి రజనీకాంత్‌రెడ్డిని విజయం వరిం చింది. సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించగా రెండున్నర గం టల్లో లె క్కింపు పూర్తయ్యింది. మూడు బూత్‌ల్లో ఓట్ల లెక్కింపు పూర్తవగానే టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగా రు. మండలంలో 14 ఎంపీటీ సీ స్థానాలకు గాను టీఆర్ఎస్ 12 ఎంపీటీసీ స్థానాలను దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలకే పరిమితమైంది. టీఆర్ఎస పార్టీ అత్యధిక స్థానాలతో ఎంపీపీ పీఠాన్ని చే జిక్కించుకునే బలాన్ని సాధించింది.