రేపటి నుంచి ఏపీ మెడికల్ కౌన్సెలింగ్
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): ఆంధ్రప్రదేశ్‌లోని మెడికల్/డెంటల్ కళాశాలల్లోని ఎంబీబీఎస్/బీడీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లకు బుధవారం నుంచి తొలి విడత మెడికల్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఈ నెల 5 నుంచి 7 వరకూ ఓపెన్ కేటగిరీ సీట్లకు కౌన్సెలింగ్ జరుగుతుంది. 8 నుంచి 11వ తేదీ వరకూ రిజర్వేషన్(బీసీ/ఎస్సీ/ఎస్టీ) కేటగిరీ సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించనుండగా, ఇందుకోసం మొదటి నుంచి 35వేల ర్యాంకుల వరకూ సాధించిన బీసీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులను పిలిచారు.
ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో 1,375, ఎస్వీయూ పరిధిలో 1,050, స్టేట్‌వైడ్ సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలో 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో 450, ఎస్వీయూ పరిధిలో 225, ఇతర దంతవైద్య కళాశాలల్లో 40 బీడీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంబీబీఎస్‌లో 341, బీడీఎస్‌లో 102 అన్రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి. ఇవి కాక తిరుపతి పద్మావతి మెడికల్ క ళాశాల(స్విమ్స్)లో 127 సీట్లకు యూనివర్సిటీ కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. ఏపీలో మొత్తం 11 ప్రభుత్వ, 11 ప్రైవేటు మెడికల్ కళాశాలలు, 2 ప్రభుత్వ, 12 ప్రైవేటు దంత వైద్య కళాశాలల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.
కౌన్సెలింగ్ కేంద్రాలు: విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్‌లోని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ స్కూల్ బిల్డింగ్‌కు ఎదురుగా, తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలోని ఓల్డ్ ఎంబీఏ బిల్డింగ్, కూకట్పల్లి హైదరాబాద్ జేఎన్టీయూ ఆన్లైన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. సీట్లు, కళాశాలల వివరాలతో కూడిన సీట్ మ్యాట్రిక్స్ ఇప్పటికే యూనివర్సిటీ వెబ్సైట్లో పెట్టారు. మరిన్ని వివరాలను హెచ్‌టీటీపీ://ఎన్టీఆర్యూహెచ్ఎస్.ఏపీ.ఎన్ఐసీ.ఇన్ వెబ్సైట్లో పొందవచ్చు.