భారత్ సిరీస్‌తో సంగక్కర గుడ్‌బై
కొలంబో : స్వదేశంలో భారత్‌తో జరగనున్న టెస్టు సిరీస్ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెబుతానని శ్రీలంక మాజీ కెప్టెన్ సంగక్కర స్పష్టం చేశాడు. ఆగస్టులో జరిగే మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో రెండో టెస్టే తనకు ఆఖరిదని చెప్పా డు. ‘ప్రపంచ కప్ తర్వాతే వీడ్కోలు చెబుదామని సిద్ధమయ్యా. కానీ సెలక్టర్ల విజ్ఞప్తి మేరకు కొనసాగా. నాలుగు టెస్టులు ఆడేందుకు ఒప్పుకున్నా. కాబట్టి భారత్‌తో రెండు టెస్టులు మాత్రమే ఆడతా’ అని సంగ పేర్కొన్నాడు.