fraud loans
-
మామూలు మోసం కాదిది
-
సన్నీ లియోన్ పేరుపై గుర్తు తెలియని వ్యక్తికి రుణం.. ఐవీఎల్ సెక్యూరిటీపై నటి ఫైర్..
Sunny Leone Says PAN Card Used for Loan Fraud: తన పాన్ కార్డును ఎవరో దుర్వినియోగం చేశారని బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ఆరోపించింది. తన పాన్ కార్డు మీదు గుర్తు తెలియని వ్యక్తి రుణం తీసుకున్నారంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా మండిపడింది. ఈ మేరకు సన్నీ లియోన్ ట్వీట్ చేస్తూ.. ‘ఎవరో ఇడియట్ నా పాన్ కార్డు సాయంతో 2 వేల రూపాయల రుణం తీసుకుని నా సీబీల్ స్కోరును దెబ్బతీశాడు. ఈ విషయంలో ఐవీఎల్ సెక్యూరిటీస్ (ధనిస్టాక్స్, గతంలో ఇండియా బుల్స్ సెక్యూరిటీస్) నాకు సాయం చేయలేదు. ఇండియాబుల్స్ దీన్ని ఎలా అనుమతిస్తుంది’’ అంటూ సన్నీ లియోన్ ట్వీట్ చేసింది. చదవండి: నష్టాల్లో రామ్ చరణ్ బిజినెస్, నిలిచిపోయిన సేవలు అనంతరం కొద్ది సేపటి తర్వాత సన్నీ లియోన్ ఈ ట్వీట్‌ను డిలిట్ చేసి మరో ట్వీట్ ఐవీఎల్‌కు కృతజ్ఞతలు తెలిపింది. ‘ఐవీఎల్ సెక్యూరిటీస్, ఐబీ హోమ్ లోన్స్, సీబీల్‌కు ధన్యవాదాలు. వేగంగా నా సమస్యను పరిష్కరించారు. ఇకపై ఇలాంటివి పునరావృతం కావని ఆశిస్తున్నాను. ఎందుకంటే చెత్త సీబీల్ స్కోర్‌ను ఎవరూ కోరుకోరు’ అంటూ రాసుకొచ్చింది. అయితే ఇలాంటి మోసాలకు నిత్యం వందల మంది బాధ్యులు అవుతుంటారు. ఆ తర్వాత అవి పరిష్కారమవుతుంటాయి. కానీ సన్నీ లియోన్ తొందరపడి ఐవీఎల్ సెక్యూరిటీని విమర్శించడం, ఆ తర్వాత ట్వీట్ డిలిట్ చేయడంతో పలువురు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. Thank you @IVLSecurities @ibhomeloans @CIBIL_Official for swiftly fixing this & making sure it will NEVER happen again. I know you will take care of all the others who have issues to avoid this in the future. NO ONE WANTS TO DEAL WITH A BAD CIBIL !!! Im ref. to my previous post. — sunnyleone (@SunnyLeone) February 17, 2022 -
నకిలీ పత్రాలతో రుణం..బెంగుళూరుకు నటుడు దర్శన్
యశవంతపుర: తన ఆస్తుల నకిలీ పత్రాలతో రూ.కోట్లకు రుణ బాగోతం, హోటల్ సప్లయర్‌పై దాడి, పలువురు సినీ ప్రముఖులతో వాగ్వాదాలతో సతమతమవుతున్న నటుడు దర్శన్ మైసూరు వద్ద తన ఫాంహౌస్ నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. మరోవైపు దర్శక నిర్మాత ఇంద్రజిత్ లంకేష్‌తో మాటల యుద్ధం సాగుతోంది. హోటల్లో దాడి ఘటనలో సత్తా ఉంటే ఆడియోను ఇంద్రజిత్ విడుదల చేయాలని దర్శన్ సవాల్ చేయగా, సత్తా నిరూపించుకునే అవసరం తనకు లేదని ఇంద్రజిత్ చెప్పారు. హోటల్లో దాడి చేయలేదని ధర్మస్థల మంజునాథస్వామిపై దర్శన్ ప్రమాణం చేయాలని ఇంద్రజిత్ సవాల్ చేశారు. దర్శన్‌పై ప్రేమ్ అసహనం దర్శన్ విషయంలో సినిమా పెద్దలు పెద్ద మనస్సుతో రాజీ చేసి వివాదాలకు చరమగీతం పాడాలని నటుడు జగ్గేశ్ పేర్కొన్నారు. ఇక అనవసరంగా దర్శన్ తన పేరును ప్రస్తావించడం సరికాదని దర్శకుడు ప్రేమ్ అసహనం వ్యక్తం చేశారు. దర్శన్ మా కుటుంబానికీ స్నేహితుడన్నారు. తమ గురించి ఎందుకు అలా మాట్లాడారో తెలియదన్నారు. -
కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు..గొడవలకు కారణం ఆయనే: దర్శన్
మైసూరు: నా ఆస్తులకు నకిలీ పత్రాలను సృష్టించి మోసం చేయాలని చూసిన కేసు నుంచి దృష్టి మళ్లించడం కోసం ఇతరత్రా అంశాలను తీసుకొచ్చారని, ఈ గొడవలకు– దొడ్మనెకు ఎలాంటి సంబంధం లేదని ప్రముఖ నటుడు దర్శన్ అన్నారు. శనివారం మైసూరులోని తన ఫాంహౌస్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ధైర్యం ఉన్న ఎవరైనా నాపై ఆరోపణలు చేస్తే వాటికి సమాధానం ఇస్తానన్నారు. డా.రాజ్ కుమార్ బ్యానర్ వల్లనే తాము అన్నం తిన్నామని, దొడ్మనెలో ఉన్న గడ్డిపోచకు కూడా సరిపోమన్నారు. మొత్తం ఈ గొడవకు కారణం నిర్మాత ఉమాపతినే అని, రూ.25 కోట్ల కేసును తప్పుదోవ పట్టించడానికి దొడ్మనెను కూడా లాగుతున్నారని మండిపడ్డారు. హోటల్లో తాను సప్లయర్‌ను బెదరించిన మాట వాస్తవమే కానీ అతన్ని కొట్టలేదని చెప్పారు. కాగా, మొన్నటివరకు ఉమాపతి దర్శన్‌కు ఆప్తమిత్రునిగా వెంట ఉండడం తెలిసిందే. హోటల్లో పోలీసుల విచారణ.. మైసూరులోని సందేష్ ది ప్రిన్స్ హోటల్లో సప్లయర్‌పై నటుడు దర్శన్ దాడిచేశాడనే కేసులో శనివారం ఏసీపీ శశిధర్ నేతృత్వంలో పోలీసులు విచారణ జరిపారు. హోటల్లోని సిసి కెమెరా చిత్రాలను తీసుకోవడంతో పాటు సిబ్బందిని ప్రశ్నించారు. గొడవ జరిగిన రోజున హోటల్లో ఉన్న సిబ్బంది అందరూ విచారణకు రావాలని ఆదేశించారు. -
ప్రధానమంత్రి ప్రీలోన్ ఇప్పిస్తానని..
కణేకల్లు: రూ.10 వేలు ఇస్తే ప్రధానమంత్రి ప్రీలోన్ మంజూరవుతుందని నమ్మించి డబ్బుతో ఓ వ్యక్తి ఉడాయించిన ఘటన కణేకల్లు మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. బాధితుల వివరాల మేరకు..కణేకల్లులోని బస్టాండ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న సావిత్రమ్మ, మధుసూదన్ దంపతులు బజ్జీలు, వడలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. అపరిచిత వ్యక్తి వారింటికి వెళ్లి తాను పోస్టాఫీస్ ఉద్యోగినని పరిచయం చేసుకున్నాడు. వారితో మాటలు కలిపాడు. తనకు పింఛన్ వస్తోందని మధుసూదన్ చెప్పగా..అయితే రూ.5 వేలు చెల్లిస్తే రూ.30 వేలు రుణం, రూ.10 వేలు చెల్లిస్తే రూ.60 వేల రుణం వస్తుందని నమ్మించాడు. అతని మాటలు నమ్మిన దంపతులు రూ.10 వేలు నగదు ఇచ్చారు. అనంతరం వారి నుంచి ఆధార్‌కార్డును మొబైల్లో ఫొటో తీసుకున్నాడు. పోస్టాఫీస్‌కు వచ్చి కలవండి అని చెప్పి వెళ్లిపోయాడు. డబ్బు కోసం దంపతులు పోస్టాఫీసుకు వచ్చి, ఆరాతీశారు. తమ సిబ్బంది ఎవరూ డబ్బు తీసుకోరని ఎస్పీఎం శ్రీనివాసాచారి చెప్పారు. దీంతో మోసపోయామని బాధితులు తెలుసుకున్నారు. దుర్గమ్మ గుడి వద్ద టోకరాకు యత్నం ఉదయం 10.30 గంటలకు అదే వ్యక్తి కణేకల్లు శివారులో దుర్గమ్మ గుడి వద్ద నివాసముంటున్న వెంకటేశ్వర్రావు ఇంటికెళ్లి పోస్టాఫీసు ఉద్యోగినని పరిచయం చేసుకుని, వివరాలు ఆరా తీశాడు. తన కొడుకు బుద్ధిమాంద్యుడు.. పింఛన్ కూడా వస్తోందని ఆయన చెప్పాడు. అయితే రూ.5వేలు ఇస్తే పోస్టాఫీస్‌కు వెళ్లి మీ పేరున అక్కౌంట్ ఓపెన్ చేస్తామని, రూ.30వేలు రుణం వస్తుందని నమ్మించాడు. తన వద్ద డబ్బులేదు, తన భార్య ఆస్పత్రికి వెళ్లింది..సాయంత్రం మీ ఆఫీస్‌కు వచ్చి అకౌంట్ ఓపెన్ చేస్తామని చెప్పే ప్రయత్నం చేశాడు. అయినా వినకుండా కనీసం రూ.3వేలు అయినా ఇవ్వండి..తన వద్ద రూ.2వేలు ఉంది.. ఈ మొత్తంతో అకౌంట్ ఓపెన్ చేస్తానని బలవంతం చేయగా, ఇంటి యజమాని డబ్బు ఇవ్వకుండా పంపించేశాడు. మధ్యాహ్నం వెంకటేశ్వర్రావు భార్య తన కుమారుడిని పిలుచుకుని పోస్టాఫీస్ వద్దకు వెళ్లి, వివరాలు ఆరాతీసింది. ఉదయం రాజు అనే ఉద్యోగి మా ఇంటికి వచ్చి, రూ.5వేలు ఇస్తే రుణం మంజూరు చేస్తామని చెప్పాడని, మాకు ఫ్రీలోన్ ఇవ్వాలని ఆమె అడిగింది. సబ్‌పోస్టుమాస్టర్ కె. శ్రీనివాసాచారి కలగజేసుకుని లోన్లు ఇస్తామని చెప్పి, ఎవరూ ఇళ్ల వద్దకు రారని, అలా ఎవరైనా ఇళ్ల వద్దకు వస్తే ఎవరూ నమ్మవద్దని చెప్పి పంపారు. అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మకండి ప్రభుత్వ పథకాలు ఫ్రీగా మంజూరు చేస్తామని బెనిఫిటరీ వాటా లేదా అకౌంట్ కోసం డబ్బులివ్వాలని కొత్త వ్యక్తులు ఎవరైనా ఇళ్లవద్దకు వచ్చి అడిగితే నమ్మొద్దు. కణేకల్లులో ఓ అపరిచిత వ్యక్తి అమాయకులను మోసం చేశాడు. మరో కుటుంబాన్ని మోసం చేసే ప్రయత్నం చేశాడు. ఇలా కొత్త వ్యక్తులు ఎవరొచ్చి మాయ మాటలు చెప్పినా నమ్మవద్దు. అనుమానిత వ్యక్తులు సంచరిస్తుంటే తమకు సెల్: 9440901870కు సమాచారం ఇవ్వండి. – కె.సురేష్,ఎస్ఐ -
అయ్యయో చేతిలో డబ్బులు పోయెనే..
జానపద రసరాజు కొసరాజు పేరు చెప్పగానే గొప్ప జానపద గీతాలు స్ఫురిస్తాయి. కాని ఆయన నిశిత పరిశీలనతో పేకాట వ్యసనంపై గొప్ప పాట రాశారు. గుంటూరు జిల్లాలో ఆయనకు తెలిసిన ఎందరో ధనవంతులు పేకాట వ్యసనం వల్ల ఆస్తులూ, పొలాలూ పోగొట్టుకుని బికారులయ్యారు. ఆస్తులు పోగొట్టుకొని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్లున్నారు. పేకాటరాయుళ్ల బలీయమైన బలహీనతను రెచ్చగొట్టి ఉసికొల్పి అవహేళనతో ఆనందించేవాళ్లున్నారు. కులగోత్రాలు చిత్రంలో ఆయన రాసిన అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే... అనే పాట ఇలా పుట్టినదే. పేకాట చాలా పెద్ద వ్యసనం. డబ్బు పోయే కొద్దీ, పోగొట్టుకున్నవారిలో పౌరుషం పెరుగుతుంది. మళ్లీ ఎలాగైనా అంతా సంపాదించాలనుకుంటారు. కాని అదృష్టం కలిసి రావకపోవటమో, దురదృష్టం వెంటాడటమో కానీ, ఒకసారి డబ్బులు పోవటం మొదలైతే చివరిదాకా పోతూనే ఉంటాయి. ఇటువంటి వారిని నిశితంగా పరిశీలించి కొసరాజుగారు ఈ పాట రాశారు. ఇది గొప్పగా హిట్టయింది. పాట చివరలో కొసమెరుపుగా వాళ్లను రెచ్చగొట్టి ఉసికొల్పే వాళ్ల ప్రలోభాలను ‘గెలుపు ఓటమి దైవాధీనం/ చెయ్యి తిరగవచ్చు/ మళ్లీ ఆడి గెల్వవచ్చు/ఇంకా పెట్టుబడెవడిచ్చు/ ఇల్లు కుదువ పెట్టవచ్చు/ఛాన్సు తగిలితే ఈ దెబ్బతో మన కరువు తీరవచ్చు/పోతే అనుభవమ్ము వచ్చు/ చివరకు జోల కట్టవచ్చు’’ అనే ప్రలోభాత్మక వ్యంగ్య బాణాలు పేకాట వ్యసనపరుల గుండెల్లో గుచ్చుకుంటాయి. వాళ్లను ఉసికొల్పి రెచ్చగొట్టినవాళ్లు చివరకు తమ తప్పేమీ లేదని తప్పుకుంటారు. వాళ్ల దుస్థితి చూసి అవహేళన చేస్తారు. పేకాటపై పాట కొసరాజు మాత్రమే రాయగలరన్న ప్రచారం వచ్చింది. పేకాట సమాజంలో ఉన్నంతవరకు ఈ పాట నిలిచి ఉంటుంది. పేకాట ప్రియులు ఇందులో సందేశాన్ని గ్రహిస్తే సమాజం బాగుపడుతుంది. – సంభాషణ: వైజయంతి పురాణపండ అయ్యయో చేతిలో డబ్బులు పోయెనే అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే ఉన్నది కాస్తా ఊడింది సర్వమంగళం పాడింది పెళ్లాం మెళ్లో నగలతో సహా తిరుక్షవరమైపోయింది ఆ మహామహా నలమహారాజుకే తప్పలేదు భాయీ మరి నువ్వు చెప్పలేదు భాయీ/అది నా తప్పు కాదు భాయీ తెలివితక్కువగ చీట్ల పేకలో దెబ్బ తింటివోయి బాబూ నిబ్బరించవోయీ నిలువు దోపిడీ దేవుడికిచ్చిన ఫలితం దక్కేది ఎంతో పుణ్యం దక్కేది/చక్కెరపొంగలి చిక్కేది ఎలక్షన్లలో ఖర్చు పెడితే ఎంఎల్ఏ దక్కేది/మనకు అంతటి లక్కేది డా. పి. వి. సుబ్బారావు సినీసాహిత్య విమర్శకులు చిత్రం: కులగోత్రాలు రచన: కొసరాజు గానం: మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు -
యాప్స్ కేసులో నాగరాజే కీలకం!
సాక్షి, హైదరాబాద్: అక్రమ మైక్రోఫైనాన్సింగ్‌కు సంబంధించిన లోన్ యాప్స్ కేసుల్లో నాగరాజే కీలక నిందితుడని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ఢిల్లీలో అరెస్టు చేసి తీసుకువచ్చిన చైనీయుడు ల్యాంబో మాత్రం నోరు విప్పట్లేదు. ఆ యాప్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వీరిద్దరినీ కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించిన దర్యాప్తు అధికారులు ఆ మేరకు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఏపీలోని కర్నూలుకు చెందిన నాగరాజు హైదరాబాద్ కంపెనీల హెడ్ మధుబాబు ద్వారా చైనీయులకు పరిచయమయ్యాడు. దీంతో చైనీయులు బెంగళూరు, ఢిల్లీ కార్యాలయాలకు నాగరాజును ఇన్చార్జిగా నియమించారు. లోన్ యాప్స్‌తో పాటు కాల్ సెంటర్లు నిర్వహించడానికి నాలుగు కంపెనీలు ఏర్పాటు చేసిన చైనా మహిళ జెన్నిఫర్ వాటిలోని ఉద్యోగులనే డైరెక్టర్లుగా నియమించింది. ఇలా నియుక్తులైన నలుగురు డైరెక్టర్లు కలిసి నాగరాజుకు కీలక బాధ్యతలు అప్పగించారు. దీంతో నాగరాజు ఢిల్లీలో పది కరెంట్ బ్యాంకు ఖాతాలు తెరిచాడు. వీటి ఆధారంగా రెండు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలతో (ఎన్బీఎఫ్సీ) ఒప్పందాలు చేసుకున్నాడు. (లోన్‌యాప్స్ కేసులో ఆసక్తికర విషయాలు) ఇలా లోన్ యాప్స్ కార్యకలాపాలను జోరుగా సాగించాడు. మరోపక్క మధుబాబు పర్యవేక్షిస్తున్న హైదరాబాద్ కాల్ సెంటర్లకు మొత్తం డేటాను జెన్నీఫర్ చైనా నుంచే పంపేది. ఈ డేటా ఆధారంగా మధుబాబు డిఫాల్టర్ల వివరాలు తెలుసుకునే వాడు. వీటినే టెలీకాలర్లకు షేర్ చేసి ఫోన్లు చేయిస్తుండేవాడు. కాగా, హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరుల్లో ఉన్న కాల్ సెంటర్లలో ఉద్యోగులకు చైనీయులు నేరుగా జీతాలు చెల్లించకుండా.. హైదరాబాద్‌కు సంబంధించి ఫోకస్, ఢిల్లీలో మెరీడియన్ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. వీటి ద్వారానే సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు సంస్థలను సంప్రదించి ఉద్యోగులు, కాల్ సెంటర్ల పూర్తి జాబితాలను సేకరించాలని అధికారులు నిర్ణయించారు. బుధవారం చైనా పారిపోయే ప్రయత్నాల్లో ఢిల్లీ విమానాశ్రయంలో అధికారులకు చిక్కిన ల్యాంబో తనకేమీ తెలియదని బుకాయిస్తున్నాడు. తనకు ఆ యాప్స్‌తో ఎలాంటి సంబంధాలు లేవని, స్వదేశానికి వెళ్లిపోతుంటే అన్యాయంగా అరెస్టు చేశారని అంటున్నాడు. ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీలో ఉన్న ఢిల్లీ కాల్ సెంటర్ ఉద్యోగులు మాత్రం ల్యాంబోను గుర్తించారు. అతడే తమకు డేటా ఇచ్చేవాడని తెలిపారు. (లోన్ యాప్స్ కేసు: చైనా ల్యాంబో చిక్కాడు! ) -
లోన్ యాప్స్: చైనా ల్యాంబో చిక్కాడు!
సాక్షి, హైదరాబాద్: అక్రమ మైక్రోఫైనాన్సింగ్‌కు సంబంధించిన లోన్ యాప్స్ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించిన చైనీయుడు ల్యాంబో ఎట్టకేలకు ఢిల్లీలో పోలీసులకు చిక్కాడు. బెంగళూరులో రెండు కాల్ సెంటర్లకు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న నాగరాజును సైతం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ యాప్‌లకు సంబంధించి మొత్తం ఆరు కంపెనీలపై పోలీసుల దర్యాప్తు సాగుతోంది. ఇప్పటి వరకు నాలుగు కంపెనీల లావాదేవీల వివరాలు సేకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు.. వాటి టర్నోవర్ రూ.21 వేల కోట్లుగా ఉన్నట్లు తేల్చారు. ఈ యాప్స్ నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన చైనాకు చెందిన క్యూ యోన్ అనే మహిళ, యాప్‌లతో పాటు కాల్‌సెంటర్ల ఏర్పాటు వ్యవహారాలను కూడా పర్యవేక్షించినట్లు వెల్లడైంది. కాగా ఈమె ఈ ఏడాది ఫిబ్రవరిలో తిరిగి చైనా వెళ్ళిపోతూ తమ దేశీయుడే అయిన ల్యాంబోను ఇన్చార్జిగా నియమించింది. ఇతను హైదరాబాద్, గుర్గావ్, బెంగళూరుల్లో ఏర్పాటైన లియోఫాగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, హాట్‌ఫుల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, పిన్‌ప్రింట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, నబ్లూల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎన్యూ ప్రైవేట్ లిమిటెడ్, ట్రూత్ ఐ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు ఇన్చార్జిగా ఉన్నాడు. వీటి అదీనంలోని దాదాపు 34 యాప్స్‌తో పాటు కాల్ సెంటర్ల వ్యవహారాలు పర్యవేక్షించాడు. చైనా నుంచి అందే ఆదేశాల ప్రకారం ఇతను నడుచుకున్నట్లు తెలిసింది. కేవలం నిబంధనల కారణంగానే చైనీయులు తమ సంస్థల్లో భారతీయులను డైరెక్టర్లుగా నియమించుకుంటున్నారు. అయితే నిర్ణయాధికారం, సంతకం చేసే అధికారం, చెక్ పవర్ ఉన్న పోస్టుల్లో మాత్రం తమ జాతీయులను నియమించుకుంటున్నారు. అలాంటి వారిలో ల్యాంబో అత్యంత కీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాస్‌పోర్ట్ కాపీ ఆధారంగా గుర్తింపు ఇటీవల లోన్ బాధితులు ఆత్మహత్యలు చేసుకోవడం, కేసులు నమోదవుతుండటం.. తదితర పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో ఉండే ఇతను కొద్ది రోజుల కిందట అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అయితే గుర్గావ్లోని కాల్ సెంటర్లలో సోదాలు చేసిన సందర్భంలో పోలీసులకు ల్యాంబో పాస్‌పోర్ట్ కాపీ దొరికింది. ల్యాంబో అదను చూసుకుని దేశం దాటే అవకాశం ఉందని భావించిన సైబర్ క్రైమ్ పోలీసులు.. పాస్‌పోర్ట్ కాపీ ఆధారంగా అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడరేవులకు లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేశారు. కాగా, బుధవారం తెల్లవారుజామున ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి చైనాలోని షాంఘై పారిపోవడానికి ల్యాంబో ప్రయత్నించాడు. అయితే ఎల్ఓసీ ఆధారంగా ఇతడిని గుర్తించిన ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్లిన ప్రత్యేక బృందం ల్యాంబోను అరెస్టు చేసి తీసుకువస్తోంది. ఇదిలా ఉండగా హైదరాబాద్ కాల్ సెంటర్లకు సంబంధించి కీలకంగా ఉన్న మధుబాబు తన స్నేహితుడు నాగరాజును బెంగళూరులోని రెండు కాల్ సెంటర్లకు ఇన్చార్జిగా నియమించాడు. బుధవారం ఇతడిని కూడా బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న ఆరు కంపెనీల్లో .. నాలుగింటి లావాదేవీలు బుధవారం దర్యాప్తు అధికారులకు అందాయి. వీటి పేమెంట్ గేట్ వేస్ నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించిన అధికారులు, ఈ ఏడాది జూన్ నుంచి నవంబర్ వరకు 1.4 కోట్ల లావాదేవీలకు సంబంధించి రూ.21 వేల కోట్ల టర్నోవర్ జరిగినట్లు తేల్చారు. ఈ మొత్తం ఎక్కడ నుంచి వచ్చింది? ఎక్కడకు వెళ్ళింది? తదితర విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బిట్‌కాయిన్స్ రూపంలో ఏమైనా దేశం దాటించారా అన్న అంశాన్నికూడా పరిశీలిస్తున్నారు. ల్యాంబో, నాగరాజులను హైదరాబాద్‌కు తీసుకువచ్చి ప్రశ్నించనున్నారు. -
ఇన్స్టంట్ లోన్స్‌తో ఈ అనర్థాలు తప్పవు
‘హలో... చెప్పండి?’ బదులిచ్చాడు అవతలి ‘హలో’కి ఈశ్వర్. ‘ఏంది చెప్పేది? పుణ్యానికి పైసల్ దీసుకున్నప్పుడు టైమ్‌కి కట్టాల్నని తెల్వదా?’ కటువుగా అవతలి స్వరం. ‘కొంచెం టైమ్ కావాలి..’ నెమ్మదిగా ఈశ్వర్. ‘నక్రాలు చేయొద్దు.. రేపటి లోపు అకౌంట్లో డబ్బులు పడాలి’ హెచ్చరించింది అవతలి స్వరం. ‘ఏందీ పడేది? నాకింకా టైమ్ కావాలి? అయినా నేను తీసుకున్నదానికంటే ఎక్కువే కట్టేసినా ఇప్పటిదాకా!’ ఉక్రోషంగా ఈశ్వర్. ‘అట్లనా? సరే..’ అంటూ ఫోన్ కట్ చేసింది అవతలి స్వరం. రెండు గంటల్లో ఈశ్వర్ వాళ్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిచయస్తులు.. ఇలా అతని ఫోన్లో ఉన్న చాలా కాంటాక్ట్ నంబర్లకు ఫోన్లు వెళ్లాయి.. బూతులు తిడుతూ. హాహాకారాలతో వాళ్లంతా ఈశ్వర్‌కు ఫోన్ చేసి తిట్టారు.. ‘నువ్వు అప్పు తీసుకొని కట్టకపోతే మాకు ఈ గోలేంటి? ఆ తిట్లేంటి? ఆ బూతులేంటి?’ అని. కొంతమందైతే తమకు అలాంటి మనోవేదన కలిగించినందుకు ఈశ్వర్ మీద పోలీస్ కంప్లయింట్ ఇస్తామనీ బెదిరించారు. భయపడిపోయాడు ఈశ్వర్. ఓ అరగంట తర్వాత మళ్లీ ఫోన్ వచ్చింది ‘ఇంకా టైమ్ కావాలా?’ అంటూ. ‘కడ్తానని చెప్పిన కదా.. ఎందుకు ఇట్ల సతాయిస్తున్నరు?’ అన్నాడు దాదాపు ఏడుస్తున్నట్టుగా ఈశ్వర్. ‘పైసలు రాలేదనుకో.. నీ ఫోటోలు, వీడియోలు అన్నీ వైరల్ అయితయ్..’ అంటూ ఫోన్ పెట్టేశారు. తలకు చేతులు పట్టుకొని ఉన్న చోటే కూర్చుండిపోయాడు ఈశ్వర్ ‘ఎరక్కపోయి తీసుకున్నాన్రా బాబూ ఈ లోన్ ’ అనుకుంటూ. ఏమి ఆ లోన్? ఏంటి ఆ కథ? ఈశ్వర్ .. కూరగాయలను పండించే రైతు. వాటిని తనే మార్కెట్ చేసుకోవాలనే ఉద్దేశంతో వ్యాపారిగానూ మారాడు. దానికోసం తీసుకున్న లోనే అది. అదో వెంటాడే బెదిరింపు, బ్లాక్‌మెయిల్‌గా ఎలా మారింది? ఈశ్వర్ కాస్త చదువుకున్నవాడు. టెక్నాలజీ ఉపయోగం తెలిసినవాడు. అందుకే స్మార్ట్ ఫోన్ తీసుకున్నాడు. ఇన్స్టంట్ లోన్ యాప్స్ గురించి విన్నాడు. ఆరాలు, తనిఖీలు లేకుండా లోన్స్ ఇస్తాయని, ఇలా ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని అలా ప్రెస్ చేస్తే చాలు.. లక్ష రూపాయల లోనైనా ఇట్టే అకౌంట్లో పడిపోతుందని. ‘కాగితాలు పట్టుకొని బ్యాంక్‌ల చుట్టూ తిరిగే కంటే ఇది నయం కదా’ అనుకున్నాడు. వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇరవై వేలు లోన్ తీసుకున్నాడు ఈశ్వర్. వడ్డీ కింద కొంత కట్ చేసి మిగిలిన రొక్కాన్ని వెంటనే ఈశ్వర్ అకౌంట్లో వేసేశారు. వారం రోజుల్లో ఆ మొత్తాన్ని చెల్లించే షరతుతో. అంతకుముందే తెలిసినవాళ్ల దగ్గర అప్పు అడిగి ఉన్నాడు ఈశ్వర్. కాబట్టి వారం రోజుల్లో ఆ డబ్బును ఇటు సర్దుబాటు చేయొచ్చనే ధీమాతో ఉన్నాడు. కాని ఆ డబ్బు అందలేదు. సరిగ్గా వారం తర్వాత లోన్ రికవరీ నుంచి ఫోన్లు మొదలయ్యాయి. ముందు మర్యాదగా.. తర్వాత బెదిరింపులతో. ఆనక వాళ్లే ఇంకో మార్గం సూచించారు. మరో ఇన్స్టంట్ లోన్ తీసుకొని ఈ లోన్ తీర్చొచ్చని. ఓకే అన్నాడు ఈశ్వర్ ఆ గండం గట్టెక్కడానికి. దాన్నీ అనుకున్న సమయంలో తీర్చలేకపోయాడు. అలా ఆ రొటేషన్‌లో 20వేల ఆ అప్పు 2 లక్షలై ఇన్స్టంట్ లోన్ బాధితుడిగా మిగిలాడు ఈశ్వర్. దీన్నే ఇన్స్టంట్ లోన్ ఫ్రాడ్స్ అంటున్నారు సైబర్‌క్రైమ్ భాషలో. తెలుసుకోవాల్సినవి.. ఇలాంటి ఇన్స్టంట్ లోన్ యాప్స్‌కి లైసెన్స్ వివరాలు, వెబ్సైట్ అడ్రస్‌లు ఉండవు. లైసెన్స్, కంపెనీ గురించి ఎలాంటి సమాచారం లేకుండా కేవలం ప్లేస్టోర్‌లోనే దర్శనమిస్తాయి. కొన్ని మాత్రం ఈ మెయిల్, ఫోన్ నంబర్లను ఇస్తాయి. శాలరీ అడ్వాన్స్ లోన్స్, ఇన్స్టంట్ పర్సనల్ లోన్స్ అని రెండురకాలుగా ఉంటాయివి. 60 రోజుల కంటే తక్కువ గడువు ఉన్న లోన్ యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ అనుమతించదు. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా అలాంటి యాప్స్ ఏవైనా ఉంటే వాటిని గూగుల్ ప్లే స్టోర్ తిరస్కరిస్తుంది. దాంతో ఈ దొంగ యాప్‌లో పేర్లు మార్చుకొని మళ్లీ గూగుల్ ప్లే స్టోర్‌లో జొరబడే ప్రయత్నం చేస్తాయి. ఈ రకమైన యాప్‌లను డౌన్లోడ్ చేసుకునే సమయంలో మీ పర్సనల్ డేటా యాక్సెస్‌ను అవి తీసుకోకుండా నివారించలేమన్నది గుర్తుంచుకోవాలి. చెక్కులు, సిబిల్ స్కోర్ వంటివి లేకుండా, చూడకుండానే ఇచ్చే ఈ లోన్స్ లిమిటెడ్ ఆఫర్స్ అంటూ వినియోగదారులను ఊరిస్తుంటాయి. ఆరుదశల్లో లోను మంజూరు చేస్తాయివి. 1. ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేయడం. 2. డౌన్లోడ్ అయ్యాక వంద శాతం రీడ్ యాక్సెస్‌ను డిమాండ్ చేస్తుంది మీ ఫోన్లోని ఫొటోగ్రాప్స్, ఫోన్ బుక్, లొకేషన్ సర్వీసెస్ సహా. 3. మీ ఫోటో ఐడీ, ఆధార్ నంబర్, సెల్ఫీని అప్లోడ్ చేయమంటాయి రిజిస్టర్ ఫోన్ నంబర్ నుంచి. 4. ఎలక్ట్రానిక్ అథెంటికేషన్ అయిపోయాక లోన్ మంజూరు అవుతుంది. 5. ఈ లోన్ రు.500 నుంచి రు.50 వేల వరకు ఉంటుంది. మంజూరు సమయంలోనే వడ్డీ కట్ చేసుకుంటారు. అసలు మీద 40 నుంచి 50 శాతం వడ్డీ ఉంటుంది. వడ్డీ, ప్రాసెసింగ్ ఫీ, జీఎస్టీ అన్నీ కలుపుకొని. సకాలంలో ఈ లోన్ చెల్లించకపోతే బెదిరింపులు, బ్లాక్‌మెయిల్స్‌కు దిగుతారు.. మీతోపాటు మీ ఫోన్‌బుక్‌లో ఉన్న నంబర్లన్నిటికీ ఫోన్ చేసి మరీ. వేరే వేరే నంబర్ల నుంచి రాత్రి, పగలు తేడా లేకుండా రోజుకి కనీసం వందసార్లు ఇలా ఫోన్లు చేసి హింసిస్తుంటారు. పేరున్న బ్యాంకులేవీ ఇలాంటి లోన్స్ ఇవ్వవు. ఇన్స్టంట్ లోన్ యాప్స్‌ను గుడ్డిగా అనుసరించకుండా వాటి కాంటాక్ట్ నంబరు, వెబ్సైట్ సమాచారం, చిరునామాను చెక్ చేసుకోండి. వాటి రివ్యూను చూసుకోండి. అలాగే డౌన్లోడ్ సమయంలో మీ లొకేషన్, గ్యాలరీ, ఫోన్‌బుక్ వంటి వాటికి యాక్సెస్ ఇచ్చేముందు ఒకటికి వందసార్లు ఆలోచించుకోండి. – అనిల్ రాచమల్ల, ఇంటర్నెట్ ఎథిక్స్ అండ్ డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్నౌఫౌండేషన్ -
6 లక్షల డాలర్లు లూటీ; ఎన్నారై డాక్టర్ అరెస్ట్
న్యూయార్క్ : కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో చిన్న వ్యాపారాలను ఆదుకునేందుకు ఉద్ధేశించిన ప్రభుత్వ హామీ రుణాలలో దాదాపు 6,30,000 డాలర్లు మోసపూరితంగా సంపాదించినట్లు భారత సంతతికి చెందిన నేత్ర వైద్య నిపుణుడిపై కేసు నమోదయ్యింది. వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్‌లోని రైకు చెందిన అమీత్ గోయల్(57)పై ఇంతక ముందు కూడా 2019 నవంబర్‌లో ఆరోగ్య సంరక్షణ విషయాలకు సంబంధించి తప్పుడు ప్రకటనలు చేసినట్లు అభియోగాలు ఎదుర్కొన్నారు. అయితే ప్రస్తుతం అమిత్ బెయిల్‌పై ఉన్నారు. (తీరు మారని పాక్.. అమెరికా ఫైర్! ) తాజాగా డాక్టర్ అమిత్ గోయల్‌ను క్రిమనల్ నేరాలకు పాల్పడిన ఆరోపణలపై అరెస్టు చేయనున్నట్లు యునైటెడ్ స్టేట్స్ అటార్నీ ఆడ్రీ స్ట్రాస్ గురువారం వెల్లడించారు. కోవిడ్-19 సంబంధిత ప్రభుత్వ-హామీ రుణాలను మోసపూరితంగా పొందినందుకు పెండింగ్‌లో ఉన్న నేరారోపణల కారణంగా జూన్ 26న అతన్ని అరెస్టు చేయనున్నట్లు తెలిపారు. యూఎస్ స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహిస్తున్నపేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ (పీపీపీ) నిధులను అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు అమిత్ ఒకే వ్యాపారానికి రెండు వేరు దరఖాస్తులు రూపొందించాడు. తప్పుడు పత్రాల ద్వారా ప్రభుత్వం నుంచి అక్రమంగా డబ్బులు కాజేశాడు. అయితే పీపీపీ నిబంధనల ప్రకారం ఒకరికి ఒక లోన్ మాత్రమే అందజేయడం జరుగుతుంది. అలాగే ప్రతి వ్యాపారికి తమ నెలవారీ పేరోల్ ఖర్చుల ఆధారంగానే వారికి ఇచ్చే గరిష్ట లోన్‌ను నిర్దేశిస్తారు.(భారత్‌లో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు) కాబట్టి తప్పుడు పత్రాలను రూపొందించి మోసానికి పాల్పడిన ఘటనలో అమిత్‌ను పోలీసులు అరెస్టు చేయనున్నారు. ‘ఇప్పటికే రోగులకు మిలియన్ల డాలర్ల భీమాదారులను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గోయల్ కరోనా కారణంగా మరో కొత్త మోసానికి పాల్పడ్డాడు’ అని స్ట్రాస్ పేర్కొన్నారు. అమిత్‌పై ఆరు కేసులు ఉన్నాయని మొత్తం 6,30,000 డాలర్ల ప్రభుత్వ సొమ్మును దోచుకున్నట్లు ఆయన తెలిపారు. (ట్రంప్ నిర్ణయం చైనాకు వరం’ ) -
రుణాలిప్పిస్తామంటూ బురిడీ
సాక్షి, గిద్దలూరు(ప్రకాశం/కడప) : దురాశపరులకు గాలమేసి, పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలని చూసే కేటుగాళ్లు, మాయ లేడీలకు నేటి సమాజంలో కొదువలేదు. గిద్దలూరులోని మెప్మా కార్యాలయంలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు కూడా ఇదే బాటలో నడిచి ఎలాగైనా పెద్ద మొత్తంలో నగదు సంపాదించాలని భావించారు. సబ్సిడీ రుణాలు ఇప్పిస్తామని, ఇంటి రుణాలు ఇప్పిస్తామని నమ్మబలికి కొందరి నుంచి లక్షల్లో నగదు వసూలు చేశారు. వీరిరువురు గత ఏడాదిన్నర కాలంలో రూ.రెండు కోట్ల మేర వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. బురిడీ కొట్టించేదిలా.. స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి నమ్మిస్తారు. ఒక్కో లోనుకు ముందుగా రూ.50 వేలు చెల్లిస్తే మీ బ్యాంకు ఖాతాలో రూ.5.50 లక్షలు వస్తాయని, ఇందులో రూ.3 లక్షలు బ్యాంకు లోను, మరో రూ.2.50 లక్షలు ప్రభుత్వ రాయితీ ఉంటుందని ఆశకల్పించారు. దీంతో ఆశావహులు నాకు ఒకటి కాదు.. వేరేవాళ్ల పేరుతో మరో రెండు లోన్లకు డబ్బులు చెల్లిస్తామని ఆశపడ్డారు. ఇలా కొందరు 10 వరకు రుణాలు కావాలంటూ రూ.50 వేల చొప్పున వీరికి చెల్లించారు. ఇలా దాదాపు 300కు పైగా యూనిట్లకు రూ.50వేల చొప్పున రూ.కోటిన్నర వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అనుమానం వచ్చిన వారికి స్వచ్ఛాంధ్ర మహిళా సంఘం పేరుతో ఉన్న బ్యాంకు చెక్కుల్లో రూ.5.50 లక్షలు రాసి ఇస్తారు. ఈ చెక్కులు ఎక్కువ రోజులు చెల్లవని తిరిగి కొత్త చెక్కులు ఇస్తామని చెప్పి చెక్కులు ఇవ్వకుండా తిప్పుకున్న సంఘటనలు ఉన్నాయి. గృహాలకు లోన్లు మంజూరు చేస్తామని... పక్కా గృహాలకు రుణాలు మంజూరు చేయిస్తామని ఒక్కో ఇంటికి రూ.3.50 లక్షలు వస్తుందని, ఇందులో రూ.1.50 లక్షలు సబ్సిడీ, రూ.2 లక్షలు బ్యాంకు లోనుగా చెప్పారు. ఇందుకు తమకు రూ.50 వేలు ఇవ్వాలని, ముందుగా రూ.13 వేల చొప్పున వసూలు చేశారు. ఇళ్ల నిర్మాణం చేపట్టాలంటే పూరి గుడిసెలు ఉన్న ప్రాంతంలో ఫొటోలు తీయించుకోవాలని చెప్పడంతో ఏడాది క్రితం 50 మంది వరకు ఆటోల్లో దిగువమెట్టకు వెళ్లి అక్కడ పూరి గుడిశెల వద్ద ఫొటోలు తీయించుకున్నారు. ఇలా దళితులు తమ ఆర్థిక స్థోమతను బట్టి ఒక్కొక్కరు రెండు, మూడు గృహాలకు నగదు చెల్లించారు. ఇలా రూ.50 లక్షలకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. కడప, కర్నూలు జిల్లాల్లోనూ బాధితులు.. బాధితుల్లో ఎక్కువగా గిద్దలూరు పట్టణంతో పాటు, మండలంలోని గ్రామాలు, రాచర్ల, కొమరోలు మండలాల్లోనూ, వైఎస్సార్ కడప జిల్లా కలసపాడు, పోరుమామిళ్ల, కర్నూలు జిల్లాలోని మహానంది, నంద్యాల ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఐదు రోజుల క్రితం గౌతవరం గ్రామానికి చెందిన ఓ ఆటో డ్రైవర్ మధ్యవర్తిగా ఉంటూ 15 మందితో నగదు కట్టించినట్లు సమాచారం. ఇతని ద్వారా నాలుగు రుణాలకు నగదు చెల్లించేందుకు ముందుకొచ్చిన ఓ యువకుడు రూ.1.,90 లక్షలు చెల్లించి మిగిలిన రూ.10వేలు ఇచ్చేందుకు గిద్దలూరు రాగా తాను మోసపోయానని గ్రహించి వాపోయాడు. యడవల్లికి చెందిన ఓ తలారి రూ.లక్ష, రంగారెడ్డిపల్లెకు చెందిన ఓ యువకుడు రూ.2లక్షలు, కర్నూలు జిల్లా అల్లీనగరంకు చెందిన ఓ మహిళ రూ.3.50 లక్షలు, సత్యవోలుకు చెంది ఓ చిరుద్యోగి రూ.60 వేలు, అదే గ్రామానికి చెందిన మరికొందరు రూ.4 లక్షల వరకు చెల్లించినట్లు సమాచారం. రెండు రోజుల క్రితం పోరుమామిళ్లలో రూ.6 లక్షలు చెల్లించినట్లు సమాచారం. సబ్సిడీ రుణాలు ఇస్తున్నట్లు ఓ బ్యాంకు మేనేజరు (ప్రస్తుతం బదిలీపై వెళ్లిన)తోనూ చెప్పించారని, ఆ నమ్మకంతోనే తాను అప్పు తెచ్చి రూ.3.50 లక్షలు చెల్లించినట్లు ఓ బాధితురాలు వాపోయింది. వీరి మోసాలకు ఓ బ్యాంకు మేనేజరు, వెలుగు ఏపీఎం, ఉయ్యాలవాడకు చెందిన రంగయ్య, స్పందన ఫైనాన్స్ కంపెనీలో పనిచేసిన బసవయ్య, నంద్యాలకు చెందిన ఓ యువకుడితో పాటు, గిద్దలూరుకు చెందిన ఓ అంగన్వాడీ టీచర్, గౌతవరంకు చెందిన ఆటో డ్రైవర్ సహకరించారని, వారికి పరిచయం ఉన్నవారితోనూ నగదు కట్టించినట్లు తెలుస్తోంది. దీనిపై సమగ్ర విచారణ జరిపి నింధితులపై చర్యలు తీసుకుని తమ డబ్బు తమకు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. స్పందనలో ఫిర్యాదు.. దీనిపై సీఐ సుధాకర్‌రావును వివరణ కోరగా ముగ్గురు బాధితులు స్పందనలో ఫిర్యాదు చేశారని, ఎస్పీ ఆదేశాల మేరకు విచారణ ప్రారంభించామని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు పంపనున్నట్లు ఆయన తెలిపారు. -
ఆశకు పోతే.. స్పాట్ పెట్టేస్తారు!
‘ఎటువంటి డాక్యుమెంట్లు అవసరం లేదు.. ప్రాసెసింగ్ ఫీజు చెల్లిస్తే చాలు రూ.లక్ష ఇంటి వద్దకే వచ్చి రుణం ఇప్పిస్తాం’ అంటూ పలమనేరులో పలు సంస్థలు వెలుస్తున్నాయి. ఇందుకు సంబంధించిన కీలక వ్యక్తులు ఎక్కడుంటారో ఎవరికీ తెలియదు. స్థానికంగా ఉండే కొందరు నిరుద్యోగులను మచ్చిక చేసుకుని వారు ఈ తంతంగాన్ని నడిపిస్తున్నారు. తాజాగా బైక్‌లపై గ్రామాల్లోకి వెళ్లి ఆధార్ కార్డు ఇస్తే చాలంటూ ప్రచారం చేస్తున్నారు. వీరి మోసపు మాటల వలలో పడి ప్రాసెసింగ్ ఫీజు కింద చాలా మంది రూ.3700 చెల్లిస్తున్నారు. ఇప్పటికే రెండు సంస్థలు ఇలా మోసం చేసి బోర్డు తిప్పేశాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సాక్షి, పలమనేరు : పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా ఆశపడే వారున్నంతవరకు మోసం చేసే వారి జేబులు నిండుతూనే ఉంటాయి. వారం రోజుల కిందట ఖరీదైన కారులో ఓ యువకుడు పలమనేరులోని గడ్డూరు ఇందిరమ్మ కాలనీకొచ్చాడు. అతని మనుషులు కొందరు కర్ణాటకనుంచి బ్యాంకు అధికారి వచ్చారని ఆధార్ కార్డు చూపించి రుణాలు తీసుకోవచ్చంటూ ప్రచారం చేశారు. కేవలం గంటల వ్యవధిలో ఈ విషయం కాలనీమొత్తం పాకింది. భారీగా జనం ఆధార్ కార్డులతో అతని కారువద్దకు చేరుకున్నారు. నలుగురైదుగురుకి కలిపి రూ.30వేలు రుణమిస్తామని ఇందుకోసం ఆధార్కార్డునెంబరు, రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.300 చెల్లించాలని ఆయన చెప్పాడు. రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ ఫీజు రూపేనా రూ.60వేలు వసూలైంది. మూడోరోజు ఆ బ్యాంకు అధికారి రాలేదు. ఆయన మొబైల్ స్విచ్ఆఫ్ అయింది. దీంతో బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెండ్రోజుల క్రితం సీఐ శ్రీధర్ నిందితుడిని పట్టుకొచ్చారు. విచారణలో కర్ణాటక రాష్ట్రం కోలారుకు చెందిన ఉమెష్గా గుర్తించారు. ఎవరిదో ఖరీదైన కారు తీసుకుని షోకులు చూపి ఇలాంటి మోసాలకు పాల్పడుతుంటాడని వెల్లడైంది. అతనిపై కేసునమోదు చేసి రిమాండ్‌కు పంపారు. దురాశకుపోతే దుఃఖం తప్పదని తెలిసినా నిమిషాల్లో రుణాలు దక్కుతాయంటూ అడియాశకు పోయి చాలామంది ఉన్న డబ్బును పోగొట్టుకుంటున్నారు పోలీసులకు ఫిర్యాదు.. పట్టణంలోని కొత్తపేటలో మూడేళ్ల కిందట వెలసిన ఓ సంస్థ మహిళలకు రుణాలిస్తామంటూ గ్రూపులను తయారు చేసింది. ఇందుకోసం వందలసంఖ్యలో ఏజెంట్లను పెట్టుకుంది. వారిద్వారా పల్లెల్లో పొదుపులు ప్రారంభించింది. ఇలా వీరివ్యాపారం కోట్లకు చేరుకుంది. ఆవెంటనే ఇక్కడున్న కార్యాలయం మూతపడింది. బాధితులు, ఏజెంట్లు కలసి సుమారు రూ.మూడుకోట్ల దాకా మోసపోయామంటూ పదిరోజుల కిందట స్థానిక పోలీసులు అశ్రయించారు. సంబంధిత సంస్థ నిర్వాహకులు ఇక్కడికొచ్చి త్వరలో డబ్బులు చెల్లిస్తామంటూ చెప్పినట్టు తెలిసింది. రూ. లక్షకు లక్షంటూ మోసం తమ సంస్థలో రూ.లక్ష డిపాజిట్ చేస్తే రెండేళ్లలో రూ.రెండు లక్షలిస్తామంటూ రెండేళ్ల కిందట పలమనేరు బజారువీధిలో ఓ సంస్థ వెలిసింది. స్థానికంగా ఏజెంట్లను పెట్టుకుని భారీగా డిపాజిట్లు సేకరించింది. ఏడాది తర్వాత సంస్థ బోర్డు తిప్పేసింది. పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పుంగనూరులో నిందితులను పట్టుకున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా రుణాలిస్తామని డిపాజిట్లు, రిజిస్ట్రేషన్ ఫీజులు కట్టించుకునే వారిని ప్రజలు నమ్మకూడదు. అప్పటికప్పుడే రుణాలిచ్చి ఫీజు పట్టుకున్నా ఫర్వాలేదుగానీ ముందుగానే డిపాజిట్ చేయించుకుని ఆపై లోన్ ఇస్తామంటే మోసం చేస్తున్నట్టుగానే భావించాలి. ఇప్పటికే ఇలాంటి మోసాలపై పలు ఫిర్యాదులు అందాయి. ఇలాంటి సంస్థల మాయలో పడకూడదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు మోసపోయామని చివర్లో మా వద్దకు వస్తున్నారు. –శ్రీధర్, సీఐ, పలమనేరు మాయమాటలు నమ్మకూడదు ఎటువంటి ధ్రువపత్రాలు లేకుండా అప్పటికప్పుడే రుణాలిస్తామంటే జనం నమ్మేస్తున్నారు. ప్రజలు ఆశకు వెళ్లి మోసపోతున్నారు. ఇది జరిగేపనేనా అని కాస్త ఆలోచించాలి. మా వద్ద పని చేసేవారికి కూడా చెబుతున్నాం. ఇలాంటి మాయమాటలను నమ్మొద్దని సూచిస్తున్నాం. డబ్బులు ఊరికే వస్తాయా జాగ్రత్తగా ఉండాలి. –రమేష్ రెడ్డి, పారిశ్రామిక వేత్త, పలమనేరు -
రుణాలిస్తామని రూ.లక్షల్లో టోకరా
సాక్షి, మహబూబాబాద్ అర్బన్: తక్కువ వడ్డీకే రుణాలిస్తామని, ఒక్కొక్కరి నుంచి రూ.2800 చొప్పున వసూలు చేసి నట్టేటా ముంచారు. పదిమంది గ్రూపుగా ఏర్పడితే ఒక్కొక్కరికి రైస్‌కుక్కర్‌తో పాటు, రూ.50వేల వరకు ఒక్కరూపాయి వడ్డికే రుణాలు ఇస్తామని, ఒక్కొక్కరి వద్ద రూ.2800ల చొప్పున పలువురి వద్ద లక్షల రూపాయలు వసూలు చేసిన గుర్తుతెలియని వ్యక్తులు ఉడాయించిన సంఘటన మండల కేంద్రంలోని శివారు బ్రహ్మంగారితండా, బడితండాలో బుధవారం చోటు చేసుకుంది. తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రహ్మంగారితండాకు 15 రోజుల క్రితం నలుగురు వ్యక్తులు వాహనంలో వచ్చి తమది విజయవాడ అని, మాకు ఉన్న సంస్థ ద్వారా మీకు ఒక్కొక్కరికి రూ.50వేల వరకు రుణాలు ఇస్తామని, ఇందుకు మీరు పదిమంది చొప్పున గ్రూపుగా ఏర్పడి, ఒక్కొక్కరు రూ.2800ల చొప్పున చెల్లించాలన్నారు. కానీ, మీకు రూ.50వేల రుణాలిస్తామన్న విషయం ఎవరికి చెప్పొద్దన్నారు. అదేవిధంగా ఒక్కొక్కరికి రైస్‌కుక్కర్ ఇస్తామని ఎవరైనా అడిగితే మీరు ఇచ్చిన డబ్బులకు రైస్‌కుక్కర్ ఇచ్చినట్లు చెప్పాలని వారిని నమ్మించారు. దీంతో తండాల్లో పలు గ్రూపులు ఏర్పడ్డాయి. ఒక్కొక్కరు రూ.2800ల చొప్పున చెల్లించారు. దీంతో ఇంటింటికీ కొంతమందికి రూ.600ల నుంచి రూ.800ల లోపు విలువగల రైస్కుక్కర్లను ఇచ్చి నమ్మించారు. కాగా, ఈనెల 26న మీ తండాకు వచ్చి ప్రతి ఒక్కరికి రూ.50వేలు ఇస్తామని చెప్పారు. దీంతో తండావాసులు వారి కోసం ఎదురుచూస్తుండిపోయారు. సాయంత్రం వరకూ రాకపోవడంతో మండల కేంద్రంలో ఉన్న ఆఫీస్ వద్దకు వెల్లి చూడగా తాళం వేసి వెల్లిపోయినట్లు యజమాని తెలిపింది. వెంటనే వారికి ఇచ్చిన ఫోన్ నెంబర్లకు బాధితులు ఫోన్ చేయగా స్విచ్ఆఫ్ వస్తుండటంతో, తమను మోసగించారంటూ తండావాసులు లబోదిబోమన్నారు. ఈ విషయాన్ని స్థానిక విలేకరులకు తెలిపారు. అసలు ఒక్కరూపాయి వడ్డికి రూ.50వేల రుణం ఇస్తామని, తక్కువ విలువైన రైస్కుక్కర్లను ఇచ్చి తమను మోసగించారంటూ తండావాసులు వాపోయారు. రూ.50వేలు ఇస్తామని చెప్పడంతో తమ వద్ద ఉన్న బంగారు ఆభరణాలు కుదువపెట్టి మరి డబ్బులు చెల్లించామంటూ పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తమతోపాటు చుట్టుపక్కలున్న తండావాసులు, పలుగ్రామాల ప్రజలు మోసపోయినట్లుగా తండావాసులు తెలిపారు. -
బోగస్ రుణాలపై క్రిమినల్ కేసులు పెట్టారా...?
కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్‌ను కోరిన వైఎస్సార్ సీపీ నాయకులు... పార్వతీపురం: సీతానగరం మండలంలో ఇటీవల వెలుగు చూసిన నకిలీ 1–బి, బోగస్ రుణాలకు సంబంధించిన వ్యవహారంలో ఏమైనా క్రిమినల్ కేసులు పెట్టారా...? అని వైఎస్సార్ సీపీ పార్వతీపురం నియోజకవర్గం సమన్వయకర్త జమ్మాన ప్రసన్న కుమార్ ప్రశ్నించారు. మంగళవారం స్థానిక కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్ రమేష్‌ను కలిసిన ఆయన కార్పొరేషన్ బ్యాంకు నుంచి వ్యవసాయ రుణాలు పొందిన లబ్ధిదారుల జాబితా కావాలని సమాచార హక్కు చట్టం ప్రకారం కోరారు. అనంతరం మాట్లాడుతూ అధికార పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు, సీతానగరం తహసీల్దారు కార్యాలయ ఉద్యోగులతో కుమ్మక్కై, అధికార పార్టీ ఎమ్మెల్యే అండదండలతో దాదాపు రూ.6కోట్ల వరకు పలు బ్యాంకుల్లో రుణాలు పొందినట్లు ఆరోపణలు వెలుగు చూశాయన్నారు. ఆయనతోపాటు ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు బ్యాంకు ముందు కాసేపు నిరసన తెలిపారు. ప్రభుత్వాధికారులు, బ్యాంకులు స్పందించని పక్షంలో తాము సీబీఐకి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కౌన్సిలర్లు గొల్లు వెంకట్రావు, ఓ. రామారావు, ఎంపీటీసీలు గండి శంకరరావు, చింతల జగన్నాధం, బడే రామారావు, సర్పంచ్‌లు యాండ్రాపు తిరుపతిరావు, బొమ్మి రమేష్ ,బైరిపూడి కరుణేశ్వరరావు, గణేష్‌లతో పాటు ఆపార్టీ నాయకులు చుక్క లక్షు్మంనాయుడు, పాలవలస గోవింద్, నరసన్ననాయుడు తదితరులు పాల్గొన్నారు.