చాంపియన్ గజ్వేల్ యూత్ క్లబ్
సాక్షి, హైదరాబాద్: నెహ్రూ యువ కేంద్ర, గాంధీనగర్ స్పోర్ట్స్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన హైదరాబాద్ జిల్లా ఓపెన్ వాలీబాల్ టోర్నమెంట్లో గజ్వేల్ యూత్ క్లబ్ చాంపియన్‌గా నిలిచింది. గాంధీనగర్‌లో జరిగిన టైటిల్ పోరులో గజ్వేల్ యూత్ క్లబ్ 25–23, 25–18తో మాసబ్ ట్యాంక్‌పై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో మాసబ్ ట్యాంక్ 25–10, 17–25, 15–11తో జీవైసీ టీమ్‌పై గెలుపొందగా, గజ్వేల్ యూత్ క్లబ్ 25–15, 15–25, 15–13తో శాట్స్ టీమ్‌ను ఓడించింది.
ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా వాలీబాల్ సంఘం కార్యదర్శి మురళీ మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ మాజీ క్రీడాకారుడు రాజ్ కుమార్, హైదరాబాద్ జిల్లా వాలీబాల్ సంఘం సంయుక్త కార్యదర్శి కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.