విషాదం.. 69 మంది పిల్లలకు జన్మను ఇచ్చి..
గాజా: పాలస్తీనాకు చెందిన 40 ఏళ్ల మహిళ 69 మంది పిల్లలకు జన్మనిచ్చి మరణించింది. ఆమెకు ప్రతికాన్పులో కవల పిల్లలే పుట్టారు. ఆమె ఇంతకుముందు 16 సార్లు కవలలకు (ఇద్దరు) జన్మను ఇచ్చింది. ఏడు కాన్పుల్లో ముగ్గురేసి పిల్లలు, మరో నాలుగుసార్లు నలుగురు చొప్పున పిల్లలు జన్మించారు. ఇలా మొత్తం 69 మంది జన్మించారు. గత ఆదివారం గాజాలో ఆమె ప్రసవ సమయంలో మరణించింది.
ఆమె ఎవరు, పేరు, భర్త వివరాలు తెలియరాలేదు. కాగా గిన్నిస్ బుక్ రికార్డుల ప్రకారం ఇంతమంది పిల్లలను కనడం ఇదే తొలిసారి కాదు. రష్యాకు చెందిన వాసిల్వేయా అనే మహిళ 69 మంది పిల్లలకు జన్మను ఇచ్చింది.