తప్పుడు కేసు పెట్టిన మోడల్‌కు ఝలక్
జర్మనీ: తనపై లైంగిక దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసి విచారణ అధికారులను తప్పుదోవపట్టించిందని ఓ జర్మన్ మోడల్ కు అక్కడి కోర్టు ఝలక్ ఇచ్చింది. అసలు ఆమెపై లైంగిక దాడి జరగలేదనే, ఉద్దేశ పూర్వకంగానే ఆ వీడియో తయారు చేశారని, అందులో కొన్ని మాటలు కూడా వారే కావాలని చేసినట్లు ఉన్నాయని చెప్పింది. ఆమె దాదాపు 20 వేల యూరోలు కోర్టుకు జరిమానా కట్టాలని ఆదేశించింది.
జినా లిసా లాఫింక్ అనే జర్మన్ మోడల్ తనపై సాకర్ ప్లేయర్ పార్డిస్ ఎఫ్, సెబాస్టియన్ పింటో తనకు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి చేశారని ఆరోపించింది. దానికి సంబంధించిన వీడియో ఒకటి కూడా సోషల్ మీడియాలో వచ్చింది. అందులో నో.. నో.. నో.. అనే అరుపులు వినిపించాయి. అయితే, ఆమెకు జరిపిన పరీక్షల్లో అసలు మత్తుమందే ఇవ్వనట్లు తెలిసింది. అంతేకాకుండా ఆ వీడియో కూడా నిందితులకు వ్యతిరేకంగా కావాలనే తయారు చేసినట్లు తెలుస్తోందని కోర్టు పేర్కొంది. కాగా, అక్కడి మహిళా సంఘాలు కూడా కేవలం పబ్లిసిట స్టంట్ కోసమే ఆ మోడల్ ఇలాంటి వీడియోను తయారుచేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.