భారత్కు ఎందుకు వెళ్లారు?
షహర్యార్ను వివరణ కోరిన పాక్
కరాచీ: బీసీసీఐతో చర్చల కోసం ఇటీవల భారత్లో పర్యటించిన పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ను పాకిస్తాన్ ప్రభుత్వం వివరణ కోరింది. ఈమేరకు ఆయనకు ఘాటుగా లేఖ రాసింది. డిసెంబర్లో భారత్, పాక్ జట్ల మధ్య జరగాల్సిన క్రికెట్ సిరీస్ గురించి చర్చించేందుకు బీసీసీఐ ఆహ్వానం మేరకు ఖాన్ భారత్కు వచ్చారు. అయితే శివసేన ఆందోళనతో ఈ చర్చలు రద్దయ్యాయి. ఈ వ్యవహారంపై పాక్ అంతర్గత వ్యవహారాల సమన్వయ మంత్రిత్వ శాఖ సీరియస్ అయ్యింది.
‘భారత పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని మంత్రి మియాన్ రియాజ్ పీర్జాదా కోరారు. పర్యటనకు ముందు విదేశీ వ్యవహారాల శాఖను సంప్రదించారా? లేదా? అలాగే ప్రధాని అనుమతి ఉందా.. అనే విషయంపై స్పష్టత ఇవ్వమన్నారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇలా వెళ్లడం తొందరపాటు అవుతుంది’ అని ప్రభుత్వం ఆ లేఖలో తెలిపినట్టు పీసీబీ అధికారి ఒకరు పేర్కొన్నారు.