Governor Najeeb Jung
-
ఎల్జీ కోర్టులో బంతి
సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చన్న ఊహాగానాలు ఒకరోజు వినిపిం చాయి. మరుసటి రోజు కాంగ్రెస్ అండతో ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చన్న వార్తలు వచ్చాయి. ఆప్, కాంగ్రెస్ ఉమ్మడిగా ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చన్న వార్తలు మరోరోజు వ్యాపించాయి. ఇవేవీ కావు.. ఎన్నికలు జరగడం తథ్యమని మరోరోజు ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఎమ్మెల్యే బేరసారాల గురించి ఆరోపణ లు, ప్రత్యారోపణలు రోజూ వినబడుతూనే ఉన్నాయి. ఢిల్లీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ఆదివారం రాత్రి హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలవడంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశముందనే ఊహాగానాలు మరోమారు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో 24 మంది ఆప్ ఎమ్మెల్యేలతోపాటు అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) నజీబ్ జంగ్‌తో సోమవారం భేటీ అయ్యారు. దీనిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు దాదాపు శూన్యంగానే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ తన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను విలేకరుల సమావేశంలో హాజరుపర్చి తన బలం చెక్కు చెదరలేదని చూపింది. అయితే ఎల్జీతో ఆప్ సభ్యుల సమావేశానికి రోహిణి ఎమ్మెల్యే రాజేష్ గార్గ్ గెర్హాజరయ్యారు. ఎమ్మెల్యేలు ఎన్నికలు కోరుకోవడం లేదని, ప్రభుత్వ ఏర్పాటుకు ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని గార్గ్ ఇదివరకే అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన గైర్హాజరు చర్చనీయాంశంగా మారింది. మరోమారు ఎన్నికలకు వెళ్లడానికి పలువురు ఎమ్మెల్యేలు సుముఖంగా లేకపోవడంతో ఊహాగానాలకు ఊపిరి లభిస్తోంది. ఎన్నికల్లో పోటీచేస్తే మరోమారు గెలుస్తామా? అన్న భయంతో ఎమ్మెల్యేలు ప్రజల ముందుకు ఓట్ల కోసం వెళ్లడానికి వెనుకాడుతున్నారు. ఆప్, బీజేపీ అగ్రనాయకత్వం ఎన్నికలనే కోరుతుండడంతో ప్రభుత్వం ఏర్పాటుకు దారులు తెరచుకోవడం లేదు. అన్ని పక్షాలూ తమ వైఖరిని స్పష్టం చేసిన నేపథ్యంలో ఇక నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత ఎల్జీ చేతిలోనే ఉంది. ఆయన ఆహ్వానిస్తే ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నిస్తామని బీజేపీ ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆయన బీజేపీని కోరుతారా లేక అసెంబ్లీని రద్దు చేస్తారా లేదా మరో ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన విధిస్తారా అన్న విషయం తేలాల్సి ఉంది. అందరితో చర్చించిన తరువాత రాష్ట్రపతికి నివేదిక సమర్పిస్తానని మాత్రమే లెఫ్టినెంట్ గవర్నర్ అన్నారు. ఢిల్లీలో త్వరలో ఎన్నికలు జరగకపోవచ్చన్న అనుమానాలకు ఆయన మాటలు తావిస్తున్నాయి. -
ఎన్నాళ్లీ నిరీక్షణ?
సాక్షి, న్యూఢిల్లీ:ఢిల్లీలో రాష్ట్రపతి పాలన కు ఐదు నెలలు నిండనున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 14న అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రాజీనామా చేసిన తర్వాత శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచి, ఆ తర్వాత అదే నెల 17న రాష్ట్రపతిపాలన విధించారు. గత ఐదు నెలలుగా లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అధికార యంత్రాంగం సహకారంతో పాలనను కొనసాగిస్తున్నారు. విద్యుత్, నీటి సమస్యల పరిష్కారంతోపాటు ధరల పెరుగుదలను నియంత్రించడం కోసం అక్రమ నిల్వలకు పాల్పడేవారిపై తనిఖీలు జరిపి కఠిన చర్యలు తీసుకోవడంలో నజీబ్ జంగ్ నేత త్వంలోని సర్కారు చురుగ్గా వ్యవహరించింది. అయిన్పటికీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. శాసనసభ ఎన్నికల పేరుతో అయితేనేమీ, రాష్ట్రపతిపాలన వల్లనైతేనేమీ ఏడాది కాలంగా అభివృద్ధి కార్యకలాపాలు మూలనపడ్డాయి. ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశాలు లేనట్లయితే ఎన్నికలు తప్పవని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అంటున్నారు. అన్ని పార్టీలు ఎన్నికలను కోరుకుంటునప్పటికీ ఎమ్మెల్యేలు మాత్రం అందుకు సుముఖంగా లేరు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికలకు సిద్ధమని ప్రకటించాయి. తగినంత సంఖ్యాబలం లేనందువల్ల ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం లేదని ఇంతకాలంగా అంటూ వచ్చిన భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం పునరాలోచనలో పడిపోయింది. విద్యుత్ సంక్షోభం, ఉల్లి, ఆలుగడ్డల ధరల పెరుగదల నేపథ్యంలో ప్రజల ముందుకు ఓట్ల కోసం వెళ్లడం సముచితం కాదనే అభిప్రాయాన్ని కొందరు భారతీయ జనతా పార్టీ నేతలు వ్యక్తంచేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా సతీష్ ఉపాధ్యాయ బాధ్యతలు చేపట్టాక పార్టీ వైఖరి స్పష్టమయ్యే అవకాశాలు మెరుగయ్యాయి. ఎన్నికలకు వెళ్లాలని పార్టీ గట్టిగా భావిస్తున్నప్పటికీ అందుకు ఎమ్మెల్యేలు మాత్రం సిద్ధంగా లేరు. సోమవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ఎమ్మెల్యేలు ఆయనకు ఈ విషయాన్నే చెప్పారని అంటున్నారు. ఎమ్మెల్యేలు బుధవారం సమావేశం అవుతారని, ప్రభుత్వం ఏర్పాటు చేయాలా? ఎన్నికలకు వెళ్లాలా ? అనే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయని ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జగ్దీశ్ ముఖి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని అంటున్నారు. ప్రస్తుతం ఢిల్లీ శాసనసభలో బీజేపీకి మొత్తం 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. డా. హర్షవర్ధన్, రమేష్ బిధూరీ, ప్రవేశ్ వర్మ ఎంపీలుగా ఎన్నికై, శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడంతో మొత్తం 70 మంది సభ్యులుండే ఢిల్లీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 67కి తగ్గిపోయింది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటుకు చేయడానికి 34 మంది ఎమ్మెల్యేలు అవసరం. స్వతంత్ర ఎమ్మెల్యే రామ్‌బీర్ షౌకీన్, జెడియు ఎమ్మెల్యే షోయబ్ ఇక్బాల్ బీజేపీకి మద్దతు ఇచ్చినట్లయితే మరో ముగ్గురు ఎమ్మెల్యేల సహాయం అవసరం. అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గానీ ఆప్ ఎమ్మెల్యేలు గానీ బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలుగానీ మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. దిగ్గజాలు సైతం ఓటమి చవిచూసిన ప్రతికూల పరిస్థితుల్లోఎన్నికలలో గెలిచినప్పటికీ పార్టీ తమకు ఉఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ సర్కారుకు బయటినుంచి మద్దతు ఇవ్వవచ్చని అంటున్నారు. -
హెల్ప్ డెస్కులు ప్రారంభం
న్యూఢిల్లీ: ‘ఎజెండా ఫర్ 100’లో భాగంగా ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) నాలుగు నాగరిక్ సువిధ కేంద్రాలను ప్రారంభించింది. ఐఎన్ఏ, రోహిణి, లక్ష్మీనగర్, ద్వారక ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ వీటిని ప్రారంభించారు. ఆస్తుల మార్పిడిపత్రాల అందజేత ఈ కేంద్రాల ప్రాథమిక బాధ్యత. ఈ విషయమై సంబంధిత అధికారి ఒకరు మాట్లాడుతూ డీ డీఏ ఫ్లాట్లు పొందినవారితోపాటు అందులో నివసిస్తున్నవారి సౌకర్యార్ధం వీటిని ప్రారంభించామన్నారు. ఇదిలాఉంచితే ‘ఎజెండా ఫర్ 100’లో భాగంగా డీడీఏ తన రికార్డులనన్నింటినీ డిజిటలీకరించనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను పట్టణాభివృద్ధి శాఖకు పంపింది. తన పరిధిలోని అన్ని సేవలను ఆన్‌లైన్‌ద్వారా వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురానుంది. -
పౌరులదే బాధ్యత
న్యూఢిల్లీ: పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత పౌరులదేనని, తమ ఇరుగుపొరుగులో చెట్లను నాటేందుకు ప్రజలు ప్రయత్నించాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జంగ్ గురువారం నాడు ఇక్కడి గర్హీ మండు అటవీ ప్రాంతంలో నేరేడు చెట్టును నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పర్యావరణం ఎంతో ప్రశస్తమైనదని, దాని పరిరక్షణకు అందరూ పాటుపడాలని లెఫ్టినెంట్ గవర్నర్ పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించాలని, రేపటి పచ్చదనానికి ఇప్పుడే ప్రయత్నించాలని చెప్పారు. ఇక్కడ జరిగిన చెట్లు నాటే కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ప్రభుత్వ అధికారులు, ఆరు పాఠశాలలకు చెందిన వంద మంది విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఉద్యానవనం ఆవశ్యకతను ఈ సందర్భంగా నజీబ్ జంగ్ విద్యార్థులకు బోధించారు. ఇటీవలి పెనుగాలుల కారణంగా నగరంలో భారీ సంఖ్యలో చెట్లు నేలకూలాయని అన్నారు. ఢిల్లీ వంటి మహానగరాల్లో పచ్చదనం అధికంగా ఉండాలని చెప్పారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు చెట్లు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని కోరారు. పండ్ల చెట్లు సహా సుమారు 250 మొక్కలను గర్హీ మండూ ప్రాంతంలో నాటారు. ఈ ప్రాంతంలో చెట్లు అధికంగాపెరిగితే విదేశీ పక్షులు కూడా అధికంగా వచ్చి స్థిరపడతాయని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది మరో ఐదు లక్షల చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపింది. యమునా నదిలోని ఓ-జోన్ ప్రాంతంలో 800 ఎకరాలలో విస్తరించి ఉన్న అతిపెద్ద అటవీ ప్రాంతం గర్హీ మండు. ఎన్డీఎంసీలో... పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) చాణక్యపురిలోని నెహ్రూ పార్కులో 100 మొక్కలు, 250 వివిధ రకాల చిన్న చెట్లను నాటింది. న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గ సభ్యురాలు మీనాక్షి లేఖీ ఓ మొక్కను నాటడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్డీఎంసీ చైర్మన్ జలజ్ శ్రీవాస్తవ, కార్యదర్శి నిఖిల్‌కుమార్, ఇతర సీనియిర్ అధికారులు, ఎమ్మెల్యే సురీందర్ సింగ్ తదితరులు మొక్కలు నాటారు. ఎన్డీఎంసీ ప్రాంతాన్ని పచ్చగా, కాలుష్యరహితంగా ఉంచే ప్రయత్నాల్లో భాగంగా ప్రతి ఏడాది సగటున ఐదు నుంచి పదివేల మొక్కలను నాటుతున్నామని జలజ్ శ్రీవాస్తవ చెప్పారు. లోధీ గార్డెన్, తాల్కటోరా గార్డెన్, నెహ్రూ పార్క్, సంజయ్ జీల్, శాంతీపథ్ వంటి ఐదు పెద్ద పార్కులను ఎన్డీఎంసీ నిర్వహిస్తోందని అన్నారు. ఇవి కాకుండా 128 ఎన్డీఎంసీ కాలనీ పార్కులు, 52 స్కూలు పార్కులు, 50 ఇతర పార్కులు తమ నిర్వహణలో ఉన్నాయని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో ఉన్న లక్ష వరకు చెట్లను, వివిధ కూడళ్లలో ఉన్న 30వేల చెట్లను కాపాడుతున్నామని అన్నారు. ఇవికాక కేంద్ర ప్రజా పనుల విభాగం (సీపీడబ్ల్యూడీ) పరిధిలో కూడా ఎన్డీఎంసీ 981 కాలనీ పార్కులను నిర్వహిస్తోంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్డీఎంసీ 33 బహిరంగ ప్రదేశాలలో ఎకో జిమ్‌లను ఏర్పాటు చేసింది. ఎంపీ మీనాక్షీ లేఖీ కోరిక మేరకు నెహ్రూ పార్క్‌లోనూ ఎకోజిమ్ను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్డీఎంసీ తెలిపింది. -
మహిళా పోలీసుల సంఖ్యను పెంచండి
న్యూఢిల్లీ: నగర పోలీసు విభాగంలోకి మరింత మంది మహిళా పోలీసులను తీసుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఢిల్లీ పోలీసులకు సూచించారు. మహిళా పోలీసుల సంఖ్య పెరగడం వల్ల భద్రతా వ్యవస్థ మరింత మెరుగుపడడమే కాకుండా పోలీసులు ప్రజలతో మమేకమయ్యే సున్నితత్వం పెరుగుతుందన్నారు. నగరంలోని విజ్ఞాన్‌భవన్‌లో గురువారం జరిగిన 12వ బీఎస్ఎఫ్ వ్యవస్థాపన దినోత్సవం, రుస్తుంజీ మెమోరియల్ లెక్చర్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన దళాధిపతులు, సీనియర్ అధికారులు, సిబ్బందినుద్దేశించి ఆయన ప్రసం గించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బిస్సీ కూడా పాల్గొన్నారు. ఆయన సమక్షంలోనే జంగ్ మాట్లాడుతూ.... ‘నగర పోలీసు విభాగంలోని వివిధ ర్యాంకుల్లో మహిళా పోలీసుల సంఖ్యను మరింత పెంచాలని కోరుతున్నా. అన్ని ర్యాంకుల్లో మహిళా పోలీసుల సంఖ్య పెరగడం వల్ల భద్రతా వ్యవస్థకు కొత్త సొబగులు అద్దినట్లు మాత్రమే కాకుండా పనితీరులో నాణ్యత పెరగడంతోపాటు సున్నితత్వం అలవడుతుందన్నారు. అందుకే మహిళా పోలీసుల సంఖ్య పెరగాలని బలంగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. భారత సరిహద్దు భద్రతాదళంలో మహిళల సంఖ్య తగినంతగా ఉండడంపై జంగ్ హర్షం వ్యక్తం చేశారు. వివిధ ర్యాంకుల్లో కొనసాగుతున్న మహిళా అధికారిణుల ప్రతిభ కూడా ఉత్తమంగా ఉంటోందని కొనియాడారు. పోలీసు, పారామిలటరీ విభాగంలో మహిళలు చేరడాన్ని అందరూ గర్వంగా భావిస్తారని చెప్పారు. బీఎస్ఎఫ్ జవాన్లు దేశంలోని అనేక సమస్యాత్మక ప్రాంతాల్లో పనిచేస్తున్నారని, వారందరినీ మనమంతా గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన నొక్కిచెప్పారు. ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగిన తర్వాత పోలీసు విభాగంలో మహిళల సంఖ్య పెరగాలనే డిమాండ్ సర్వత్రా వినిపించింది. అత్యాచారాలు, లైంగిక వేధింపులకు గురైనవారు పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలంటే స్టేషన్లో కనీసం ఓ మహిళా పోలీసు ఉండాలనే అభిప్రాయాన్ని సామాజికవేత్తలు బలంగా వినిపించారు. దీంతో అప్పటి ప్రభుత్వం మహిళా పోలీసుల సంఖ్య పెంచుతామని ప్రకటించింది. అయినప్పటికీ చర్యలు అంతంతమాత్రమే. ఢిల్లీ పోలీసు వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేకపోవడంతో నగరంలో మహిళల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతోంది. కేంద్రం తీసుకుంటున్న చర్యలు అంతంతమాత్రంగానే అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో జంగ్ చేసిన ఈ సూచన నగర పోలీసుల్లో మహిళా పోలీసుల సంఖ్యను ఎంతమేర పెంచుతుందో చూడాలి. ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు సత్కారం సరిహద్దు భద్రతాదళంలో అత్యత్తమ సేవలందించిన 30 మందికిపైగా ఉద్యోగులను జంగ్ సత్కరించారు. సరిహద్ద్దులను కాపాడడంలో, నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలను నియంత్రించడంలో బీఎస్ఎఫ్ సిబ్బంది అందిస్తోన్న సేవలను ఆయన కొనియాడారు. ఐదుసార్లు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి, ఈ సంవత్సరం పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న అసిస్టెంట్ కమాండెంట్ లవ్ రాజ్‌సింగ్ ధర్మ్శక్తును ఆయన అభినందించారు. మహిళా అధికారుల తొలి బ్యాచ్ త్వరలో బీఎస్ఎఫ్లో చేరనుండడంపట్ల హర్షం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీఎస్ఎఫ్ డైరక్టర్ జనరల్ డీకే పాఠక్ తమ బలగం అందిస్తోన్న సేవలను వివరించారు. డిప్యూటీ ఎన్ఎస్ఏ నేహచల్ సంధూ రుస్తుంజీ గురించి తెలియజెప్పారు. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ ‘రైటింగ్స్ ఆఫ్ రుస్తుంజీ’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. -
కాలుష్య పరిశ్రమలపై కఠినంగా వ్యవహరించండి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరం ఢిల్లీ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించడాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కాలుష్యం కలిగిస్తోన్న అన్ని పరిశ్రమలు మూసివేసేలా చూడాలని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ(డీపీసీసీ)ని లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మంగళవారం ఆదేశించారు. మొదట కాలుష్య విభాగాలకు నోటీసులు జారీ చేయాలన్నారు. డీపీసీసీ ఆదేశాలను పాటిం చని ఇన్స్పెక్టర్లపై చర్యలు తీసుకోవాలని పట్టణ అభివృద్ధి కార్యదర్శికి సూచించారు. సంబంధిత కమిషనర్లందరూ డీపీసీసీ ఉత్తర్వులు పాటించాలని ఆదేశించారు. విషపదార్థాలను శుద్ధి చేయకుండానే యమునా నదిలోకి వదిలినందుకు డీపీసీసీ ఇటీవల 112 పరిశ్రమలకు నోటీసులు జారీ చేసింది. ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు.. నగరంలో కాలుష్య స్థాయిలను నియంత్రించేం దుకు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మంగళవారం ఉన్నత స్థాయి కమిటీ నియమించారు. ఎల్జీ ఆదేశాల ప్రకారం ఈ కమిటీ రెండు అంశాలపై దృష్ట్టి సారిస్తుంది. ఢిల్లీ రోడ్లపై పెరుగుతోన్న వాహనాల కారణంగా కలుగుతోన్న కాలుష్యంతో పాటు పారిశ్రామిక వ్యర్థాలను, సీవేజ్ని వదలడం వల్ల యమునా నదిలో కాలుష్య స్థాయిలను లెక్కకట్టనుంది. నగరంలో కాలుష్యానికి సంబంధించిన అన్ని అంశాలను, అందుకు గల కారణాలు, దాని స్థాయిలు, కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యల ను పరిశీలించాలని నజీబ్ జంగ్ ఈ కమిటీకి సూచించారు. కాలుష్య సమస్య పరిష్కారానికి స్వల్ప కాలిక చర్యలతో పాటు దీర్ఘకాలిక పరిష్కారాలను సూచించాలని ఆదేశించారు. నగరంలో కాలు ష్య నియంత్రణకు చర్యలు చేపట్టడం కోసం అమలుకు వీలున్న పరిష్కారాలతో సమగ్ర నివేదికను రూపొందించి నాలుగువారాలలో సమర్పిం చాలని ఆయన కమిటీని ఆదేశించారు. ప్రధాన కార్యదర్శి నేతత్వంలో ఏర్పాటైన ఈ కమిటీలో ట్రాఫిక్ పోలీస్ కమిషనర్, పర్యావరణ శాఖ కార్యదర్శి. రవాణా విభాగం కమిషనర్ సభ్యులుగా ఉన్నారు. మల్టీమోడల్ రవాణా వ్యవస్థను సమీక్షించిన ఎల్జీ మెట్రోస్టేషన్ల పరిసరాల్లో ఢిల్లీ సమీకృత బహుళ రవాణా వ్యవస్థ (డిమ్టస్) మార్గాల నిర్మాణం కోసం యూనిఫైడ్ ట్రాఫిక్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ -ప్లానింగ్, ఇంజనీరింగ్ (యూటీటీటీఐపీఈసీ) సమర్పించిన ప్రజెంటేషన్‌ను లెప్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) నజీబ్ జంగ్ మంగళవారం పరిశీలించారు. ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండే మెట్రో స్టేషన్ల పరిసరాల్లో పాదచారులు, వాహనాల ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ఉపయోగించే విధానాలతో యూటీటీటీఐపీఈసీ ఈ ప్రజెంటేషన్ సమర్పించింది. ఇలాంటి నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు కావాల్సి ఉన్న 44 మెట్రో స్టేషన్లను యూటీటీటీఐపీఈసీ ఇప్పటికే గుర్తించింది. వీటిలో తొమ్మిది మెట్రో స్టేషన్ల కోసం సమగ్ర ప్రణాళికలను కూడా రూపొందించింది. మొదటి రెండు దశల్లో నిర్మించిన మెట్రో స్టేషన్లతో పని ప్రారంభించిన యూటీటీటీఐపీఈసీ మూడు నాలుగోదశ మెట్రో స్టేషన్లలో కూడా పనులు ప్రారంభించాలనుకుంటోంది. ప్రాజెక్టుల నిర్మాణదశలోనే వాటి పరిసరా ల్లో ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించిన ప్రణాళికలను రూపొందిం చాలని ఈ సంస్థ భావిస్తోంది. లక్ష్మీనగర్, నిర్మాణ్‌విహార్, ప్రీత్ విహార్, కార్కర్డూమా, ఛత్తర్పూర్ మెట్రో స్టేషన్ల సమీపంలో పనులు చేపట్టవలసిందిగా ఎల్జీ ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్‌ను (డీఎంఆర్సీ) ఆదేశించారు. ఐఎన్ఏ, ఎయిమ్స్, గ్రీన్‌పార్క్, హౌజ్ఖాజ్ మెట్రో స్టేషన్ల పనులు ప్రజాపనులశాఖ (పీడబ్ల్యూడీ)కు అప్పగిం చారు. ఈ మెట్రో స్టేషన్లకు సంబంధించిన పనులను తక్షణం చేపట్టి నిర్ణీత కాలంలో పూర్తిచేయాలని ఎల్జీ ఆదేశించారు. మిగతా 35 మెట్రోస్టేషన్ల ప్రణాళికలను కూడా త్వరలో పూర్తిలో పూర్తిచేయాలని నజీబ్ జంగ్ యూటీటీటీఐపీఈసీని ఆదేశించారు. ఈ ప్రణాళికల అమలులో జరుగుతున్న జాప్యంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మెట్రో స్టేషన్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో రద్దీని తగ్గించడానికి ప్రారంభించిన ప్రాజెక్టులను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయడానికి సంబంధిత విభాగాలన్నీ సహకరించాలని నజీబ్‌జంగ్ కోరారు. -
జంగ్ షురూ!
సాక్షి, న్యూఢిల్లీ: నగర లెఫ్టినెంట్ గవర్నర్ న జీబ్ జంగ్ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ శనివారం జారీ చేయడంతో డిసెంబర్ 4న ఢిల్లీ విధానసభకు జరిగే ఎన్నికల ప్రక్రియ మొదలైంది. దీంతో ఆయా పార్టీలు తమ తమ ఎన్నికల సన్నాహాల వేగాన్ని మరింతగా పెంచనున్నాయి. శనివారం నుంచే నామినేషన్ల పర్వం మొద లు కావడంతో ఏ పార్టీ అభ్యర్థి ఎవరు? ఏ స్థానంలో ఏ పార్టీ బలహీనంగా ఉంది? ఏ పార్టీ బలంగా ఉంది? మీడియా సర్వేలు ఏం చెబుతున్నాయి? ఏ పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి? తదితర విషయాలపై చర్చలు జోరందుకున్నాయి. 9వ తేదీన ఆరంభమైన నామినేషన్ల పర్వం నవంబర్ 16 వరకు కొనసాగుంది. నవంబర్ 18న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరిరోజు నవంబర్ 20. డిసెంబర్ 4న జరిగే పోలింగ్‌లో మొత్తం 1.15 కోట్ల ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటారు. పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ 11,763 పోలింగ్ బూత్‌లను ఏర్పాటుచేస్తోంది. నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా ఎన్నికలు జరగడం కోసం ఎన్నికల కమిషన్ 70 మంది సాధారణ పరిశీలకులను, 18 మంది వ్యయ పరిశీలకులను నియమించింది. ఓటర్లలో అవగాహనను పెంచి మరింత మంది ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొనేలా చేసేందుకు చేపట్టిన ప్రక్రియను పరిశీలించడం కోసం ఎన్నికల కమిషన్ తొలిసారిగా ముగ్గురు అవేర్నెస్ అబ్జర్వర్లను నియమించింది. ఈ ఎన్నికలలో తొలిసారిగా ‘నోటా’ బటన్ నొక్కే అవకాశాన్ని కూడా ఓటర్లకు కలిగిస్తారు. ఢిల్లీలో మొత్తం 70 నియోజకవర్గాలున్నాయి. వీటిలో 12 నియోజకవర్గాలు షెడ్యూల్డు కులాలకు రిజర్వ్ చేశారు. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం డిసెంబర్ 17న ముగుస్తుంది. ఎన్నికలలో అధికారం కోసం పోటీ ముఖ్యంగా మూడు పార్టీల మధ్య నెలకొంది. మూడు సార్లు అధికారంలోనున్న కాంగ్రెస్ మరోమారు అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తుండగా, ఢిల్లీపై పట్టు ఎలాగైనా సాధించడానికి బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ రెండు పార్టీలను మట్టికరిపించి ఢిల్లీపై విజయకేతనం ఎగురవేయాలని తొలిసారి ఎన్నికల బరిలోకి దూకుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. వివిధ టీవీ చానళ్లు నిర్వహించిన సర్వేల్లో ఆ పార్టీకి 18 నుంచి 25 స్థానాలు దక్కవచ్చని తేలింది.