gram sabha
-
అర్హుల జాబితాలపై అభ్యంతరాలు
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, రైతు భరోసా లబ్ధిదారుల ఎంపికకు చేపట్టిన గ్రామసభల్లో బుధ వారం రెండోరోజు కూడా పలు చోట్ల గందరగోళం తలెత్తింది. మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు సభల్లో పాల్గొన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన సభకు హాజరయ్యారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో పలు గ్రామసభల్లో పాల్గొన్నారు. ముంపు నుంచి తేల్చండి కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్‌లో జరిగిన గ్రామసభలో మంత్రి ఉత్తమ్‌కుమా ర్ రెడ్డి ప్రసంగాన్ని మహిళలు అడ్డుకున్నారు. నారాయణపూర్, మంగపేట, చెర్లపల్లిని నారాయణపూర్ ప్రాజెక్టులో ముంపు గ్రామాలుగా ప్రకటించి, నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. మహిళలు పట్టు వీడకపోవటంతో 3 గ్రామాలను ముంపు గ్రామాలుగా ప్రకటిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కొత్తపల్లి మండలం కమాన్‌పూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల జాబితాపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం తెలుపటంతో గందరగోళం ఏర్పడింది. సుడా మాజీ చైర్మన్‌కు ఇందిరమ్మ ఇల్లు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 41 డివిజన్లో జరిగిన వార్డు సభలో ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో మాజీ కార్పొరేటర్ విశాలిని రెడ్డి పేరు ఉండటంపై బీజేపీ నేతలు అభ్యంతరం తెలిపారు. విశాలిని రెడ్డి మాజీ కార్పొరేటర్ కాగా, ఆమె భర్త శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ (సుడా) మాజీ చైర్మన్. వారికి ఇందిరమ్మ ఇల్లు ఎలా ఇస్తారని ప్రజలు నిలదీశారు. మోర్తాడ్ మండలం ఓడ్యాడ్ గ్రామంలో అర్హుల జాబితాపై గ్రామస్తులు అభ్యంతరం తెలపటంతో అధికారులు సభను అర్ధాంతరంగా ముగించారు.ఖమ్మంలో రసాభాస ఖమ్మం జిల్లా రఘునాథపాలెం గ్రామసభలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం లేదని ప్రజలు అధికారులను నిలదీశారు. కూసుమంచి గ్రామసభలో అనర్హులను జాబితాలో చేర్చారని ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. తిరుమలాయపాలెం మండలంలో ని జల్లేపల్లి గ్రామంలో అర్హులకు పథకాలు అంద డం లేదని గ్రామస్తులు అధికారులను నిలదీశారు. మరికొన్ని జిల్లాల్లో.. నారాయణపేట జిల్లా మాగనూర్ మండలం ఉజ్జెలి గ్రామంలో ఆత్మీయ భరోసా అర్హుల జాబితాపై గ్రామస్తులు నిరసన తెలిపారు. భూమి లేని కూలీలు 95 మంది ఉంటే, 12 మందినే ఎంపిక చేస్తారా? అని అధికారులను నిలదీశారు. మంచిర్యాల జిల్లా భీమారం, తలమడగు మండలం రుయ్యడిలో అర్హుల పేర్లు జాబితాలో లేవని గ్రామస్తులు గొడవకు దిగారు. తమ గ్రామంలో ఉన్న డంప్‌యార్డును తొలగించాలని సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామస్తులు గ్రామసభను బహిష్కరించారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని నర్సాయపల్లి గ్రామసభలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు ఎం మండలంలోని కూరెళ్లలో గ్రామసభలో గందరగోళం ఏర్పడింది. గ్రామంలో 520 మంది ఇళ్లకోసం దర ఖాస్తు చేయగా, 25 మందికే మంజూరు కావడంపై గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం మల్లాపూర్‌లో గ్రామసభ జరుగుతుండగా జాబితాలో పేరు లేదన్న కోపంతో ఓ వ్యక్తి ఆ జాబితా ప్రతులను ఎత్తుకుపోయాడు. విజయవంతంగా గ్రామసభలు: ప్రభుత్వంనాలుగు సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపికచేసేందుకు నిర్వహిస్తున్న గ్రామసభలు విజయవంతంగా కొనసాగుతున్నా యని ప్రభుత్వం ప్రకటించింది. 9,844 గ్రామాలు, వార్డులలో సభలు జరిగాయని, 60 శాతం సభలను విజయవంతంగా నిర్వహించినట్లు బుధవారం తెలిపింది. గ్రామసభల్లో నాలుగు పథకాలకు సంబంధించి ఇప్పటివరకు 10,09,131 దరఖాస్తులు అందినట్లు వెల్లడించింది. రెండో రోజు బుధవారం 3,608 గ్రామ సభలు, 1,055 వార్డు సభలు కలపి మొత్తం 4,663 సభలను నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది. మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో 12,914 గ్రామ సభలు, పట్టణ ప్రాంతాల్లో 3,484 వార్డు సభలు కలిపి 16,398 సభలు నిర్వహించాల్సి ఉంది. -
సారూ.. మా పేర్లు ఎందుకు లేవు?
సాక్షి నెట్వర్క్: లబ్ధిదారుల జాబితాలో మా పేరు లేదంటూ ఆయా జిల్లాల్లో ప్రజలు అధికారులను ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం రైతుభ రోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, తెల్లరేషన్‌కార్డుల పథకాల అమలుకు ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాలను ప్రకటించింది. వీటిపై అభ్యంతరాల స్వీకరణకు మూడు రోజులపాటు నిర్వహించే గ్రామసభలు మంగళవారం మొదలుకాగా మొదటి రోజు అభ్యంతరాలు వెల్లువెత్తాయి. అర్హులను కాదని అనర్హులను ప్రకటించారంటూ జిల్లాల్లో నిరసన వ్యక్తం చేశారు. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తమ పేర్లు లేవంటూ ఆందోళన చేసిన వారే ఎక్కువగా ఉన్నారు. అయితే జాబితాలో పేర్లు లేనివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంతో ప్రజలు క్యూ కట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా: హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్న వారిని ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో చేర్చారని ఖమ్మం జిల్లా వెంకట్యాతండాలో ఎంపీడీఓను నిలదీశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాండురంగాపురం తండాలో అనర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారంటూ ప్రత్యేకాధికారి దేవరాజు తదితరులను స్థానికులు నిర్బంధించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా : అర్హుల జాబితా అంతా తప్పుల తడకగా ఉందని, తమకు గ్రామసభ వద్దని గట్టుప్పల్ మండల కేంద్రంలో ప్రజలు ఆందోళనకు దిగారు. మూడు గంటల పాటు సభను అడ్డుకున్నారు. ఆత్మకూర్ (ఎం) మండలంలోని రహీంఖాన్‌పేటలో నిర్వహించిన గ్రామ సభ రసాభాసగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా : చాలా చోట్ల తమ పేర్లు లేవని అధికారులను ప్రజలు నిలదీశారు. బెల్లంపల్లి పట్టణం కన్నాలబస్తీ ఒకటో వార్డులో రేషన్‌కార్డులకు అర్హులను ఎంపిక చేయడం లేదంటూ ఆందోళన చేపట్టారు. ఆర్డీవో హరికృష్ణను నిలదీశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా : ధర్మారం మండలం కమ్మరిఖాన్‌పేట గ్రామసభను బహిష్కరించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద గ్రామంలో కేవలం 52మంది లబ్ధిదారులనే ఎంపిక చేశారని, అందులో సగం మందికి వ్యవసాయ భూమలున్నాయని, అసలు గుంట భూమి లేని వారికి మాత్రం జాబితాలో చోటు కల్పించలేదంటూ పలువురు గ్రామసభను బహిష్కరించారు. రూ.2 లక్షల రైతు రుణమాఫీ కాలేదని బోయినపల్లి మండలం రత్నంపేట ప్రజాపాలన గ్రామసభలో పలువురు రైతులు అధికారులను నిలదీశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా: నందిపేట మండలం కుద్వాన్పూర్ గ్రామంలో మహిళలు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డిని నిలదీశారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే తమ గ్రామానికి 10 ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చి నెరవేర్చలేదంటూ ఎమ్మెల్యేను అడిగారు. డిచ్పల్లి, ఇందల్వాయి, మోపాల్, ధర్పల్లి, నిజామాబాద్ రూరల్, జక్రాన్‌పల్లి, సిరికొండ తదితర మండలాల్లో రసాభాసగా సభలు జరిగాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా : ఆమనగల్లు మండలం కోనాపూర్ కార్యదర్శి గ్రామసభ నిర్వహిస్తున్న సమయంలో దరఖాస్తులు తీసుకోకుండా, ఓ పార్టీకి చెందిన నాయకులతో దాబాకు వెళ్లి విందు చేసుకున్నారని స్థానికులు ఆరోపించారు. ఆదిబట్ల మున్సిపాలిటీ కొంగరకలాన్‌లో నిర్వహించిన వార్డు సభలు రసాభాసగా మారాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా: నవాబుపేట మండలం కొల్లూరు గ్రామసభలో జాబితాలో అర్హుల పేర్లు రాలేదని అధికారులను నిలదీశారు.మరికల్ మండలం రాకొండలో గ్రామసభ రసాభాసగా మారింది. ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురికి ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేర్లు రావడంతో గ్రామస్తులు ఆందోళన చేశారు. దీంతో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. పహారా మధ్య గ్రామసభను కొనసాగించాల్సి వచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మచ్చాపూర్ గ్రామసభ జరుగుతుండగా, అర్షం మనోజ్ వచ్చి... ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీంలో తాను లబ్ధిదారుల జాబితాలో ఉన్నానని, ఆ స్కీం తనకు వద్దంటూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.జనగామ మండలం శామీర్‌పేటలో నిర్వహించిన గ్రామసభకు వచ్చిన కలెక్టర్ రిజ్వాన్ బాషాను పలువురు ప్రశ్నించారు. రేషన్ కార్డులు, ఇతర పథకాలు వచ్చినోళ్లకే వస్తున్నాయి... మా సంగతేంటని ఓ వ్యక్తి కలెక్టర్‌ను నిలదీయగా, మరోసారి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. -
రసాభాసగా గ్రామసభలు
సాక్షి, అమరావతి/టాస్క్‌ఫోర్స్/నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం కూటమి ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా నిర్వహించిన గ్రామ సభలు చివరకు రసాభాసగా మారాయి. గ్రామాల్లో సమస్యలపైనా, గ్రామ అభివృద్ధికి నిర్వహించాల్సిన సభలు కాస్తా టీడీపీ నేతల జులుం ప్రదర్శించే కార్యక్రమంగా జరిగాయి. ఉద్యోగం చేయాలంటే తాము చెప్పినట్లుగానే వినాలని టీడీపీ నేతలు హెచ్చరించారు. తాము సూచించిన పనులే చేయాలని, పాతవి మంజూరైనా ఆపాల్సిందేనని కూడా కూటమి నేతలు పట్టుబట్టారు. గ్రామస్థులకు ఎక్కడా మాట్లాడే అవకాశం దక్కలేదు. ఇక వైఎస్సార్సీపీ సర్పంచ్‌లకు ఎక్కడా తగిన ప్రాధాన్యత లభించలేదు. టీడీపీ నేతలే ముందుండి సభలను నడిపించారు. కొన్ని చోట్ల వైఎస్సార్సీపీ సర్పంచ్‌లపై కూటమి నేతలు దౌర్జన్యానికి దిగారు. ఆ సర్పంచ్‌లను మాట్లాడనివ్వకుండా సభల నుంచి నెట్టివేశారు. కొత్తగా గ్రామాల్లో చేపట్టే పనులకు.. ముందే ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో గుర్తింపు పూర్తయింది. ఆ పనులకు ఉపాధి పథకం నిబంధనల ప్రకారం శుక్రవారం జరిగిన గ్రామసభల్లో మమ అనిపించారు. అరుపులు..కేకలు..తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో నిర్వహించిన గ్రామసభ కూటమి నేతల అరుపులు, కేకలతో çదద్దరిల్లిపోయింది. జగనన్న కాలనీకి రోడ్లు, డ్రైన్ నిర్మించాలని బీజేపీ నాయకుడు మోది సత్తిబాబు సూచిస్తే.. జనసేనకు చెందిన జయసుధ దానికి అడ్డు చెప్పారు. దీంతో ఆ స్థలాల్లో ఇళ్లు కట్టుకుంటున్న కొందరు మహిళలు తిరగబడ్డారు. వారి మధ్య తోపులాట జరిగింది. ఇదే సమయంలో మిగిలిన వారు కూడా సమస్యల పరిష్కారానికి పట్టుపట్టడంతో ఇరువర్గాల నుంచి కేకలు, అరుపులు మిన్నంటాయి. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం వాండ్రంగి గ్రామసభలో కూటమి నాయకుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. జలుమూరు మండలం జోనంకి గ్రామసభలో కూడా అదే పరిస్థితి నెలకొంది. టీడీపీ కార్యకర్తలు సర్పంచ్‌కు చెప్పులు చూపుతూ ‘మా ప్రభుత్వం మా ఇష్టం ఎవరు అడ్డు వస్తారో చూస్తాం’ అని పరుష పదజాలంతో దూషించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో గ్రామçÜభలు మొక్కుబడిగా జరిగాయి. అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రసంగాలే తప్ప సమస్యల పరిష్కారానికి చేసిందేమీ లేదని ప్రజలు నిట్టూర్చారు.విజయనగరం జిల్లాలో జరిగిన గ్రామ సభల్లో కూటమి నేతలు అధికార జులుం చూపించారు. ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించలేదు. ఏవిధమైన అధికార హోదాలేని కూటమి నేతలకు వేదికపై కుర్చీలు వేశారు. అధికారులను భయపెట్టి కుర్చీలు వేయించుకున్నారు. భూములు, చెరువులు ఆక్రమణలపై కొన్ని చోట్ల వాగ్వాదాలు జరిగాయి. దళిత నేతలపై దాష్టీకందళిత నేతపై పంచాయతీ కార్యాలయంలో టీడీపీ నేత దాడి చేసి గాయపరచిన ఘటన ఏలూరు జిల్లా పెదవేగి మండలం ముండూరు గ్రామ సభలో జరిగింది. స్టెంట్ వేయించుకున్నానని చెప్పినా కూడా మెడ వంచి పొట్టలో గుద్దడం గమనార్హం. గ్రామ సభ అనంతరం వైఎస్సార్సీపీకి చెందిన గ్రామ సర్పంచ్ రాచూరి దేవి, ఆమె భర్త రాచూరి బాలస్వామి గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడికి టీడీపీ నేత అన్నపనేని సురేష్ వచ్చి చేసిన పనులకు సంతకం పెట్టాలని సర్పంచ్‌ను డిమాండ్ చేశాడు. దీనికి ఆమె నిరాకరించారు. వెంటనే ఆగ్రహించిన సురేష్.. పక్కనే ఉన్న బాలస్వామి మెడ వంచి పొట్టలో పిడిగుద్దులు గుద్దాడు. ఈ ఘటన తర్వాత ముండూరు రహదారిపై దళిత నేతలు నిరసనకు దిగారు. ప్రకాశం జిల్లా కంభం సచివాలయంలో దళిత సర్పంచ్‌పై టీడీపీ నాయకులు మూకుమ్మడిగా గొడవకు దిగారు. తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలంలోని లింగమనాయుడుపల్లిలో గ్రామసభ సాక్షిగా ఓ టీడీపీ నేత దళితులను కులం పేరుతో దూషించాడు. సంఘమిత్రను ఎందుకు తొలగిస్తున్నారంటూ దళితులు ప్రశ్నించడంతో టీడీపీ నేత గొడవకు దిగాడు. సర్పంచ్లపైదుర్భాషలువిజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు గ్రామసభలో సర్పంచ్ రాచమళ్ల పూర్ణచంద్రరావుపై టీడీపీ వార్డు సభ్యులు కోనేరు నారాయణ, బసవయ్య దురుసుగా ప్రవర్తించారు. ప్రభుత్వం మాది మీ పెత్తనం ఏమిటి.. మీరు చేసింది చాలు ఇక మేము చూసుకుంటామంటూ దుర్భాషలతో రెచ్చిపోయారు. తాను బీసీ ననే చులకన భావంతో టీడీపీ నాయకులు ప్రతి విషయంలో తనపై రెచ్చిపోతున్నారని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా రూరల్ మండలం తోకావారిపాలెం గ్రామ సభలో అధికారులను టీడీపీ నాయకులు బెదిరించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దండిగుంట గ్రామసభలో సర్పంచ్‌ని టీడీపీ నేతలు బెదిరించారు. ‘సభ నుంచి వెళ్లిపోండి. ఈ ఐదు సంవత్సరాలు మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు’ అంటూ టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ సర్పంచ్ బెల్లకొండ సుప్రజను బెదిరించారు. బాపట్ల జిల్లాలో జరిగిన గ్రామ సభల్లో పలుచోట్ల వైఎస్సార్సీపీకి చెందిన సర్పంచ్‌లను పిలవకుండా సభలను తూతూ మంత్రంగా జరిపారు. ప్రకాశం జిల్లా తర్లుపాడులో ‘తాను చెప్పినట్టు వినకపోతే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని ఎక్కడికైనా వెళ్లిపో..’ అంటూ గ్రామసభలో సచివాలయ ఉద్యోగిని టీడీపీ నాయకుడు కాళంగి శ్రీనివాసులు బెదిరించారు. కంభం–3 సచివాలయం పరిధిలో గుర్తించిన పనుల వివరాలను మహిళా ఉద్యోగి చదువుతున్న సమయంలో టీడీపీ నాయకులు జోక్యం చేసుకుని ‘ఎవరిని అడిగి తీర్మానాలు చేసుకున్నారు... మాకు చెప్పాలి కదా...’ అంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో ఆ మహిళా ఉద్యోగి కంటతడి పెట్టారు. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం నేమకల్లు గ్రామంలో రెచ్చిపోయిన టీడీపీ నేతలు.. తమకు చెప్పకుండా ఎలా నిర్వహిస్తారంటూ గ్రామ సభను అడ్డుకున్నారు. అధికారులను, సర్పంచ్‌ను దూషించారు. -
ఉత్తుత్తి గ్రామసభలే!
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పనుల్లో ఏమేమి చేయాలో ముందే నిర్ణయించుకుని, వాటికి అధికార ముద్ర కోసం ఉత్తుత్తి గ్రామ సభలు నిర్వహించడానికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. శుక్రవారం (నేడు) రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహిస్తామంటూ ఆర్భాటం చేస్తోంది. ఉపాధి హామీ పథకం నిబంధనలకు తూట్లు పొడుస్తూ గ్రామ సభల నిర్వహణకు సంబంధించి కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.గ్రామాల్లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సచివాలయాల భవనాలు, రైతుభరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణ పనులన్నింటినీ పక్కనపెట్టి, ఉపాధి హామీ పథకం మెటీరియల్ కేటగిరీ నిధులతో కొత్తగా గ్రామాల్లో అధికార పార్టీ నేతలకు పనులను కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వ పెద్దలు సిద్ధమయ్యారు. ప్రస్తుతం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం మెటీరియల్ కేటగిరి నిధుల నుంచి ఒక్కో నియోజకవర్గానికి రూ. 10 కోట్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ. 2 వేల కోట్ల మేర కొత్త పనులు గుర్తింపు ప్రక్రియ అంతా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో దాదాపు పూర్తయింది. నిజానికి.. ఉపాధి పథకంలో చేపట్టే ఏ పనైనా నిబంధనల ప్రకారం ముందుగా గ్రామసభ ఆమోదం పొందాలి.అందుకే కూటమి పెద్దలు తమ వాళ్లకి కట్టబెట్టే పనులకు ఆమోదం తెలపడానికి ఉత్తుత్తి గ్రామ సభలు నిర్వహించనున్నారు. ఎందుకీ హడావుడి పవన్.. ఈ ఉత్తుత్తి గ్రామ సభల నిర్వహణపై ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కొద్దిరోజులుగా ఎక్కడాలేని హడావుడి చేస్తుండడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకేరోజు గ్రామసభలు నిర్వహించాలని పక్షం రోజులుగా పవన్ కళ్యాణ్ చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇదే అంశంపై ఆయన సోమవారం అన్ని జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. అన్ని గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామసభలు జరగడం కొత్త కాదని, ఏటా నాలుగు విడతలుగా (ఏప్రిల్ 24న, ఆగస్టు 15న, అక్టోబర్ 2న, జనవరిలో మరో విడత) గ్రామ సభలు జరుగుతూనే ఉంటాయని అధికారులు గుర్తు చేస్తున్నారు.ఇప్పుడే ఎందుకింత హడావుడి చేస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. 9.92 లక్షల పనులకు జనవరిలోనే ఆమోదం సాధారణంగా ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి ఆరు నెలల ముందు నుంచే.. పంచాయతీలో చేపట్టాల్సిన పనులు, పేదలకు పనిదినాల కల్పనకు ఉన్న అవకాశాలు గుర్తించే ప్రక్రియ మొదలు పెట్టి ఫిబ్రవరిలో పూర్తి చేస్తారు. ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా గ్రామ, జిల్లా, రాష్ట్ర స్థాయి లేబర్ బడ్జెట్ రూపకల్పనతో గ్రామాల వారీగా పనుల గుర్తింపు, ఆ పనులకు గ్రామ సభలో ఆమోదం వంటి ప్రక్రియ కూడా ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు కల్లా అధికారులు పూర్తి చేశారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూలీలకు కల్పించే పనులతో పాటు మెటీరియల్ నిధులతో చేపట్టే ఇతర అభివృద్ధి పనులన్నీ కలిపి మొత్తం 9.92 లక్షల పనులకు ఈ ఏడాది జనవరిలోనే గ్రామ సభల్లో ఆమోదం తీసుకొని, ఆ పనుల జాబితాను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు అప్పుడే అందజేశారు. అందులో దాదాపు 8.53 లక్షల పనులు పురోగతి దశలో ఉన్నాయి. అయితే, తమ నాయకులకు ఆర్థిక లబ్ధిని చేకూర్చే మట్టి రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణ పనులకు కొత్తగా అనుమతులు తెలిపేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అయింది. -
వితంతువులపై గ్రామ పంచాయితీ సంచలన తీర్మానం.. దేశంలోనే తొలి గ్రామంగా
ముంబై: భర్త చనిపోయిన వితంతు మహిళలు కూడా గౌరవంగా జీవించేలా ప్రభుత్వాలు కొత్తగా చట్టాలు తీసుకురావాలని రాష్ట్రంలోని మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విధవరాళ్లకు చేసే ఆచారాలను వ్యతిరేకిస్తూ ఇటీవల కొల్హాపూర్ జిల్లాలోని హెర్వాడ్ గ్రామం చేసిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుని వితంతు మహిళలు కూడా గౌరవంగా జీవించే హక్కును కల్పించేలా కొత్తగా చట్టాన్ని తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా వితంతు తిరోగమన పద్ధతులకు స్వస్తి పలకాలని ఆయా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వితంతు మహిళల పట్ల తిరోగమన ఆచారాలకు వ్యతిరేకంగా ఇటీవల కొల్హాపూర్ జిల్లాలోని హెర్వాడ్ గ్రామంలో ఈనెల 4న చేసిన తీర్మానానికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు ఇదేవిధమైన తీర్మానాలు తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. హెర్వాడ్ మోడల్ ను రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు ఆదర్శంగా తీసుకోవాలని ఆ ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. వింతతు మహిళల పట్ల చేసే ఆచార వ్యవహారాలైన గాజుల విరగ్గొట్టడం, వాటిని తీసివేయడం, మరెప్పుడూ ధరించకుండా నిషేధించడం, బొట్టు (సింధూరాన్ని) తీసివేయడం, మంగళసూత్రాన్ని తెంచివేయడం, కాలి మెట్టెల్ని తీసివేయడం వంటి ఆచారాల్ని ఇకపై పాటించకుండా షిరోల్ తాలూకాలోని హెర్వాడ్ గ్రామ పంచాయతీ తీర్మానించింది. వివాహ వేడుకలు, శుభకార్యాలు, మతపరమైన వేడుకలు, సామూహిక వేడుకల్లో పాల్గొనకూడదనే సంప్రదాయాన్ని హెర్వాడ్ పంచాయతీ తీర్మానంలో తీవ్రంగా వ్యతిరేకించింది. ఇకపై అటువంటి ఆచారాలను వితంతు మహిళలెవరూ గ్రామంలో ఎవరూ పాటించనవసరంలేదని తేల్చిచెప్పింది. ఆదర్శంగా నిలిచిన గ్రామ పంచాయతీ తీర్మానం ఈ గ్రామ పంచాయతీ తీసుకున్న తీర్మానం వితంతు మహిళలు మరింత గౌరవంగా జీవించే హక్కును కల్పించడంతో పాటుగా ఇతర గ్రామ పంచాయతీలకు, రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది. హెర్వాడ్ గ్రామ పంచాయతీ తీసుకున్న తీర్మానం వెనుక షోలాపూర్ జిల్లాలలోని సంఘ సంస్కర్త మహాత్మ పూలే సామాజిక సంక్షేమ సంస్థకు చెందిన ప్రతినిధి ప్రమోద్ జింజాడే చాలా కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...వితంతు మహిళలు గౌరవంగా జీవించాలని నిర్ణయం తీసుకున్న తొలి గ్రామంగా దేశ చరిత్రలోనే హెర్వాడ్ గ్రామం నిలిచిందని జింజాడే పేర్కొన్నారు. ఈ తీర్మానాన్ని మరో ఏడు గ్రామ పంచాయతీలు అనుసరించినట్లు ఆయన తెలిపారు. అయితే ఇటువంటి తీర్మానాలు కూడా దురాచారాలను రూపుమాపలేవని, వీటిని పూర్తిగా నిర్మూలించేందుకు చట్టాలు చేసి వాటిని పటిష్టంగా అమలు చేయడమే సమస్యకు అసలు పరిష్కారమని ఆయన తెలిపారు. దీనిపై చట్టాన్ని చేసేందుకు మండలి డిప్యూటీ చైర్పర్సన్ నీలం గొర్హెతో సమావేశమైనట్లు ఆయన వెల్లడించారు. అయితే ఈ విషయాన్ని అసెంబ్లీలోని రెండు సభల్లోనూ జూలైలో జరిగే వర్షాకాల సమావేశాల్లో చర్చకు పెట్టేలా చూస్తాననని ఆమె హామీనిచ్చినట్లు ప్రమోద్ జింజాడే తెలిపారు. చదవండి: రూ.లక్షకి రెండు లక్షలు.. అట్లుంటది మనతోని.. అయితే ఈ విషయానికి సంబంధించి కొత్త చట్టం చేయాలా లేదా పాత చట్టాల ద్వారానే అమలు చేయవచ్చా అనే అంశాన్ని న్యాయ విభాగం ఒకసారి పరిశీలించాల్సి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. వితంతు మహిళలపట్ల ఈ విధమైన దురాచారాలకు పాల్పడే గ్రామస్తులు, బయటవారిపై ఏడాది పాటు జైలు శిక్షను, రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధించాలని ప్రమోద్ జింజాడే మండలి డిప్యూటీ చైర్మన్ గొర్హెకు ప్రతిపాదించారు. అదే బంధువులైతే 15 రోజుల నుంచి నెలరోజుల పాటు జైలు శిక్ష, రూ.5వేల నుంచి రూ.50వేలకు వరకు జరిమానా విధించా లని ఆయన ప్రతిపాదించారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో ఒక పర్యవేక్షణ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఆ కమిటీలో 50 శాతం మహిళలే ఉండాలని, అందులో సగంమంది వితంతువులు ఉండాలని పేర్కొన్నారు. -
‘అభివృద్ధి’కి కలిసికట్టుగా పనిచేద్దాం
సాక్షి, రంగారెడ్డి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గ్రామ అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన రంగారెడ్డి జిల్లా గుమ్మడవెల్లి గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఎంపీ ఒక గ్రామాన్ని ఎంచుకుని అభివృద్ధి చేయాలని ప్రధాని మోదీ సూచించారని తెలిపారు.తాను గెలిచిన ప్రాంతంలో గ్రామాలు లేనందున దగ్గరలోనే ఏదో ఒక గ్రామం తీసుకోవాలని అనుకున్నానని తెలిపారు. ‘గుమ్మడవెల్లి గ్రామానికి కనెక్టివిటీ ఉన్నా జరగాల్సిన అభివృద్ధి జరగలేదు. గ్రామ అభివృద్ధి కోసం మీతో కలిసి పని చేస్తా.. కుల,మతాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి కృషి చేయాలి’ అని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. తనపై వస్తున్న విమర్శలపై కిషన్‌రెడ్డి స్పందిస్తూ.. అత్యవసర పరిస్థితులు వచ్చిప్పుడు ఢిల్లీ వెళ్తున్నానని తెలిపారు. ఢిల్లీలో లొల్లి జరుగుతుంటే తాను ఊర్లలో తిరుగుతున్నానని సోషల్ మీడియాలో చేస్తోన్న దుష్ప్రచారాన్నిఆయన తప్పుబట్టారు. గ్రామాభివృద్ధిలో లక్ష్యంగానే తాను ఈ సభలో పాల్గొనేందుకు వచ్చానని ఆయన తెలిపారు. ఎన్ఐఆర్డీ నేరుగా ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని సూచించారు. స్వర్ణ భారత్ ట్రస్ట్‌ను కూడా గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేలా కృషి చేస్తానని చెప్పారు. అపోలో,కేర్,నిమ్స్, సరోజినీదేవి ఆసుపత్రుల నుంచి వైద్యులను రప్పించి వైద్యసేవలు అందేలా చూస్తామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. -
‘పెట్టుబడి’పై ప్రత్యేక గ్రామసభలు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో సాగుకు యోగ్యం కాని భూముల నిర్ధారణకు వచ్చే నెలలో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించాలని వ్యవ సాయ శాఖ నిర్ణయించింది. ‘రైతులకు పెట్టుబడి సాయం’ పథకాన్ని సాగుకు యోగ్యమైన భూములకే వర్తింపజేయాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేయడం, సీఎం చంద్రశేఖర్‌రావు కూడా అందుకు సుముఖత వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ శాఖ నుంచి భూములు, రైతుల వివరాలు తీసుకుని ఆ ప్రకారం గ్రామసభలు నిర్వహించనుంది. ఆ సమాచారం పంపాల్సిందిగా రెవెన్యూ శాఖ ను కోరింది. వచ్చే నెల మొదటి వారంలోపు సమాచారం ఇస్తామని రెవెన్యూ శాఖ హామీ ఇవ్వడంతో రెండో వారంలో గ్రామసభలు నిర్వహించనున్నారు. రెవెన్యూ, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో మండల వ్యవసాయాధికారి యూనిట్‌గా సభలు జరుగుతాయి. ఓ రోజు సభ.. రెండ్రోజులు పరిశీలన.. రాష్ట్రంలోని 1.62 కోట్ల ఎకరాల సాగు భూమి ని పట్టా భూమిగా రెవెన్యూ శాఖ తేల్చింది. ఆ ప్రకారం వచ్చే ఖరీఫ్‌లో ఎకరాకు రూ. 4 వేల చొప్పున రైతులకు పెట్టుబడి సాయం అందించనుంది. సాగుకు యోగ్యం కాని భూమి ఉన్న రైతులకు సాయం అందిస్తే విమర్శలొచ్చే అవకాశం ఉందని, అలాంటి భూమికి సాయం చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భూములను గుర్తించేందుకు రెవెన్యూ శాఖ ఇచ్చిన భూమి వివరాలు, రైతు జాబితా ఆధారంగా గ్రామసభలు నిర్వహించనున్నారు. సాగుకు యోగ్యంకాని పట్టా భూమిపై గ్రామ సభల్లో ఆరా తీసి ఆ భూమిని, రైతులను జాబి తా నుంచి తొలగిస్తారు. సంబంధిత భూమి రైతులు అంగీకరించకుంటే అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతారు. రెవెన్యూ, వ్యవసాయాధికారులు, సర్పంచ్ సమక్షంలో సాగు భూమా కాదా నిర్ధారిస్తారు. ఈ ప్రక్రియ ఒక్కో గ్రామంలో 3 రోజులు జరుగుతుంది. రాష్ట్రవ్యా ప్తంగా 10 రోజుల్లో ప్రక్రియను ముగిస్తారు. ఆ భూమినీ సాగులోకి తెస్తామంటే? సాగుకు యోగ్యంకాని ఓ మోస్తరు కొండలు, గుట్టలున్న భూమిని పెట్టుబడి సొమ్ముతో సాగులోకి తీసుకొస్తానని ఏ రైతైనా గ్రామసభలో చెబితే అంగీకరించాలని యోచిస్తున్నారు. తర్వాతి ఏడాది సాగులోకి తీసుకొచ్చేలా రైతు నుంచి హామీపత్రం తీసుకుని సాయం అందజేయనున్నారు. భారీ గుట్టలు, కొండలుంటే మాత్రం అంగీకరించకూడదని అధికారులు భావిస్తున్నారు. కొండలు, గుట్ట లను కంకర చేసి అమ్ముకొని తర్వాత నిర్ణీత ఏడాదిలో భూమిని సాగులోకి తెస్తానని ఎవరైనా ఆచరణాత్మక హామీ ఇస్తే సమ్మతించాలని యోచిస్తున్నారు. ఆ ప్రకారం మార్గదర్శకాలు ఖరారు చేసే అవకాశముంది. -
గ్రామసభ అనుమతితోనే మద్యం షాపులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని షెడ్యూల్ ప్రాంతాల్లో మద్యం షాపులు పెట్టాలంటే ఆయా గ్రామసభల తీర్మానాలు తప్పక ఉండాలని, గ్రామసభ ఆమోదం లేకుండా మద్యం షాపులకు అనుమతివ్వడానికి వీల్లే దని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖను ఆదేశిస్తూ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఎం.గంగారావులతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘పెసా’ యాక్ట్ ప్రకారం ఆదివాసీ ప్రాంతా ల్లో మద్యం షాపుల ఏర్పాటుకు గ్రామసభ ఆమోదం తప్పనిసరని, 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ చట్టంలో గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక హక్కు కల్పిస్తూ ‘పెసా’ నిబంధనల్ని అమల్లోకి తెచ్చారన్న పిటిషనర్ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆదివాసీ ప్రాంతాల్లోని 17 గ్రామాల్లో మద్యం షాపుల ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ ఉత్తర్వుల మేరకు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ జారీచేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ పోడెం రత్నం అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. మద్యం షాపుల ఏర్పా టుకు చట్ట నిబంధనల్ని అమలు చేయాలంటూ గతనెలలో సింగిల్ జడ్జి ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేశారు. దీనిపై పిటిషనర్ పోడెం రత్నం అప్పీల్ చేయడంతో ధర్మాసనం గురువారం సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవరిస్తూ తీర్పునిచ్చింది. మద్యం షాపుల ఏర్పాటుకు నోటీసులు జారీ చేసిన నెలరోజుల్లో గ్రామ పంచాయతీలు అంగీకరిస్తూ తీర్మానాలు వస్తాయనే ఆశాభావంతో ముందుగానే అనుమతులివ్వడం చెల్ల దని స్పష్టం చేసింది. జిల్లాలోని ఆదివాసీ ప్రాంతంలో 17 మద్యంషాపుల ఏర్పాటుకు ఇంతవరకు నోటీసు లు జారీ కాలేదని, గ్రామ సభలు అనుమతి కోరలేదని పిటిషనర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. షెడ్యూల్ ప్రాంతాల్లో గ్రామసభలుంటేనే మద్యం షాపులకు అనుమతి ఇవ్వాలని లేకుంటే వద్దని ఎక్సైజ్ శాఖను ఆదేశించింది. -
ప్రజాప్రతినిధి భర్తా.. మజాకా..!
♦ వ్యవసాయశాఖ అధికారిని తిట్టిన వైనం ♦ గ్రామ సభ సమాచారం ఇవ్వలేదంటూ బెదిరింపులు గీసుకొండ(పరకాల): మండలంలోని ఓ ముఖ్య మహిళా ప్రజాప్రతినిధి భర్త, టీఆర్ఎస్ నాయకుడు. ఇప్పటికే ఆయనపై అనేక ఆరోపణలున్నాయి. తాజాగా మండలంలోని వ్యవసాయశాఖలో పనిచేసే ఓ ఆధికారిపై బూతు పురాణం అందుకున్న సంఘటన మూడు రోజుల క్రితం జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. శనివారం రాత్రి వ్యవసాయశాఖ అధికారి మొబైల్‌కు కాల్ వచ్చింది. రిసీవ్ చేసుకోగానే తప్పతాగిన మైకంలో ఉన్న సదరు మహిళా ప్రజాప్రతినిధి భర్త ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఆగ్రహంతో ఊగిపోయాడు. తల్లి, చెల్లి..భార్య.. అని చూడకుండా అసభ్యకరంగా మాట్లాడాడు. మండలంలో రైతు సమితుల ఏర్పాటు కార్యక్రమాల వివరాలను తనకు చెప్పడం లేదని, సబ్సిడీ ట్రాక్టర్ల విషయంలోనూ తనను లెక్కలోకి తీసుకోవడం లేదంటూ.. అంతా ఎమ్మెల్యే చెప్పినట్లే వింటున్నావంటూ దుర్భాషలాడాడు. దీంతో మనస్థాపం చెందిన సదరు అధికారి విషయాన్ని వ్యవసాయ అధికారుల సంఘం ప్రతినిధులకు చెప్పుకున్నట్లు సమాచారం. వారంతా కలిసి కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్‌ను కలిసి విన్నవించడానికి సోమవారం వెళ్లగా ఆయన గ్రీవెన్స్ డే సందర్భంగా బిజీగా ఉండటంతో వీలు కాలేదని తెలుస్తోంది. త్వరలోనే కలెక్టర్‌ను కలిసి సదరు నాయకుడిపై ఫిర్యాదు చేయనున్నటుల సమాచారం. సదరు వ్యవసాయ అధికారి తనకు జరిగిన అవమానాన్ని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దృష్టికి రెండు రోజుల క్రితమే తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. ఏఓను బెదిరించిన గీసుకొండ ఎంపీపీ భర్తపై చర్య తీసుకోవాలి హన్మకొండ: గీసుకొండ మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్‌ను బెదిరిం చిన గీసుకొండ ఎంపీపీ భర్త రాజయ్యపై చర్య తీసుకోవాలని వ్యవసాయ అధికా రుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. రైతు సమన్వయ సమితిల ఏర్పాటుతో ఏ విధమైన సంబంధం లేని వారు వ్యవసాయ అధికారులు వి«ధులకు అటంకం కల్పిస్తూ అసభ్యకరమైన పదజాలంతో దూషించడాన్ని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జె.అవినాష్‌వర్మ, నాయకులు సురేష్‌కుమార్, బి.రాంజీ, కె.నగేష్, విజయ్‌చంద్ర, ఎన్.శ్రీధర్ ఒక ప్రకటనలో ఖండించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే సామూహిక సెలవులో వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని, రక్షణ లేని, ఆత్మగౌరవానికి భంగం కలిగే చోట విధులు నిర్వహించలేమని స్పష్టం చేశారు. -
పంచాయతీలపై ‘పచ్చ’పవర్
-
పంచాయతీలపై ‘పచ్చ’పవర్
జన్మభూమి కమిటీల ఆధ్వర్యంలో గ్రామసభలు.. సర్పంచుల ఆఖరి అధికారంపై వేటు ►కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఆదేశాలు ►భూసేకరణకు అడ్డంకులు లేకుండా సర్కారు పెద్దల ఎత్తులు ►సర్పంచులు ఇక డమ్మీలే.. పెత్తనం అధికార పార్టీ కార్యకర్తలదే ►పంచాయతీరాజ్ చట్టం అపహాస్యం..స్థానిక సంస్థలు నిర్వీర్యం ►పంచాయతీలకు కేంద్రం ఇచ్చే నిధులు పచ్చచొక్కాల జేబుల్లోకే సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ గ్రామ సర్పంచుల అధికారాలను ఒక్కొక్కటిగా కత్తిరించేసిన రాష్ట్ర ప్రభుత్వం వారి ఆఖరి అధికారంపై కూడా వేటు వేసేందుకు సన్నద్ధమవుతోంది. రాజ్యాంగ స్ఫూర్తిని అపహాస్యం చేస్తూ.. గ్రామ సర్పంచులను డమ్మీలుగా మార్చేసి, వారికి ఉండే కీలక అధికారాన్ని జన్మభూమి కమిటీలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించేందుకు జరగాల్సిన గ్రామసభల నిర్వహణ అధికారాన్ని ఇకపై జన్మభూమి కమిటీలకు అప్పగించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం కలెక్టర్ల సమావేశంలో అధికారులను ఆదేశించారు. 1994 పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 6 ప్రకారం.. గ్రామసభలకు స్థానిక సర్పంచి అధ్యక్షత వహించాలి. సర్పంచి లేకపోతే ఉపసర్పంచి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించాలి. గ్రామ సర్పంచే గ్రామసభ నిర్వహణకు అనుమతి తెలపాలని పంచాయతీరాజ్ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం జన్మభూమి కమిటీ సభ్యుల నేతృత్వంలో గ్రామసభలను నిర్వహించాలని ఆదేశించడం గమనార్హం. భూసేకరణకు అడ్డు తొలగించుకోవడానికే! రాష్ట్రంలో విలువైన భూములను ప్రైవేట్ కంపెనీలకు అప్పనంగా కట్టబెట్టాలనుకుంటున్న ప్రభుత్వ పెద్దల కుట్రలకు గ్రామసభలు అడుగడుగునా అడ్డు తగులుతున్నాయి. ఏ గ్రామంలోనైనా భూసేకరణ చేపట్టాలంటే అక్కడి గ్రామసభ ఆమోదం తప్పనిసరి. నిబంధనల ప్రకారం.. గ్రామంలో అందరూ అంగీకరించి, తీర్మానం చేస్తే తప్ప భూములను సేకరించడానికి వీల్లేదు. ఇదే నిబంధన ప్రభుత్వ పెద్దలకు పెద్ద ఆటంకంగా మారింది. అందుకే గ్రామసభ నిర్వహణ అధికారాన్ని సర్పంచుల నుంచి లాగేసి, సొంత పార్టీ కార్యకర్తలతో నిండి ఉండే జన్మభూమి కమిటీలకు అప్పగిస్తే ఇక తమకు అడ్డే ఉండదని నిర్ణయానికొచ్చారు. మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్య భావనను సమాధి చేస్తూ గ్రామాల్లో పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పల్లెల్లో పింఛన్లు, ఇళ్ల మంజూరు వంటి సంక్షేమ కార్యక్రమాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా జన్మభూమి కమిటీల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ కమిటీల చలవతో నకిలీ లబ్ధిదారులు ప్రభుత్వ సొమ్మును మింగేస్తున్నారు. అసలైన లబ్ధిదారులు మాత్రం నష్టపోతున్నారు. భూసేకరణకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకోవడంతోపాటు గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో ‘పచ్చ’ చొక్కాల జేబులు నింపడానికే గ్రామసభల అధికారాన్ని జన్మభూమి కమిటీలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆ కమిటీల నిండా టీడీపీ మనుషులే ఇప్పటికే వృద్ధాప్య, వితంతు పింఛన్లు వంటి సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో గ్రామ సర్పంచులకు ఉండే అధికారాలను ప్రభుత్వం తెగ్గొట్టి, జన్మభూమి కమిటీ సభ్యులకు విశేషాధికారాలు కల్పించిన విషయం తెలిసిందే. జన్మభూమి కమిటీ సభ్యులుగా దాదాపు అన్నిచోట్లా అధికార పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులే నియమితులయ్యారు. రాజకీయ కారణాలతో పలువురు అర్హులకు పింఛన్లు నిలిపి వేసినట్లు లక్షల్లో ఫిర్యాదులు వచ్చాయి. వందలాది మంది హైకోర్టును ఆశ్రయించి తిరిగి పింఛన్లు పొందారు. ఇప్పడు గ్రామసభ నిర్వహణ అధికారాన్ని జన్మభూమి కమిటీ సభ్యులకు అప్పగించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీల అధికారాలకు తూట్లు గత మూడేళ్లుగా దేశవ్యాప్తంగా పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా వచ్చే నిధులు పెరిగాయి. 14వ ఆర్థిక సంఘ సిఫార్సులతో గ్రామ పంచాయతీకి కేంద్రం నేరుగా ఇచ్చే నిధులతోపాటు ఉపాధి హామీ పథకంలో గ్రామాలవారీగా కేటాయించిన నిధులను గ్రామ పంచాయతీలు అభివృద్ధి పనుల కోసం స్వతంత్రంగా ఖర్చు పెట్టుకోవచ్చు. రాష్ట్రంలో దాదాపు 13,000 గ్రామ పంచాయతీలు ఉండగా, రెండు పథకాల అమలుకు మూడేళ్లుగా ఏటా రూ.5,000 కోట్ల చొప్పున కేంద్రం నుంచి నిధులొచ్చాయి. జనాభాపరంగా పంచాయతీని బట్టి ఏడాదికి రూ.7 లక్షల నుంచి రూ.25 లక్షలు ఆర్థిక సంఘం రూపేణ నిధులు అందగా, ఉపాధి హామీ పథకంలో అదనంగా ప్రతి పంచాయతీకి రూ.10 కోట్ల చొప్పున నిధులు కేటాయించారు. పంచాయతీల వారీగా కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన పథకాలకు మళ్లిస్తున్నారు. గ్రామాల్లో అధికార పార్టీ నేతలకు నామినేషన్‌పై పనులు అప్పగించేందుకు ప్రభుత్వం సర్పంచుల అధికారాలపై ఆంక్షలు విధించడం ప్రారంభించింది. పంచాయతీ నిధుల ఖర్చు విషయంలో అధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే పెత్తనం చెలాయిస్తోంది. సర్పంచుల అధికారాల విషయంలోనూ జన్మభూమి కమిటీ సభ్యుల జోక్యం పెరుగుతోంది. గ్రామసభ అంటే? గ్రామంలోని ఓటర్లు ప్రతి ఏటా విధిగా నాలుగు సార్లు సమావేశం కావాలి. దీన్నే గ్రామసభ అంటారు. సమావేశమై రాష్ట్ర ప్రభత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించాలి. గ్రామ సభకు పూర్తి ప్రచారం కల్పించాలి. గ్రామం లో ఓటర్లందరికీ అందుబాటులో ఉండే ప్రాంతంలో పగటి పూటే ఈ సభ నిర్వహిం చాలి. గ్రామ పంచాయతీలో చేపట్టాల్సిన పనుల గురించి సమీక్షించాలి. అనంతరం తీర్మానం చేయాలి. గ్రామ సర్పంచి గ్రామ సభకు అధ్యక్షత వహించాలని పంచాయ తీరాజ్ చట్టం సెక్షన్ 6 రూల్ నంబరు 5లో స్పష్టంగా పేర్కొన్నారు. 1997 ఏప్రిల్‌లో పంచాయతీరాజ్ శాఖ జారీ చేసిన జీవో 162లోనూ ఇదే విషయాన్ని తెలియజేశారు. గ్రామసభలో గ్రామ ఆదాయ, వ్యయాలపై చర్చించి అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాల్సి ఉంటుంది. ఏ పనికి ఎంత ఖర్చు పెట్టాలో కూడా సభలో నిర్ణయిస్తారు. జూలైలో నిర్వహించాల్సిన రెండో సభలో గ్రామంలో అభివృద్ది కార్యక్రమాలపై సమీక్షతోపాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు గ్రామ పరిధిలో లబ్ధిదారుల ఎంపికను చేపట్టాలి. అక్టోబరు నెలలో నిర్వహించాల్సిన గ్రామసభలోనూ ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపికతోపాటు గ్రామంలో మంచినీటి సరఫరా, ఇతర అభివృద్ది కార్యక్రమాలపై సమీక్షించాల్సి ఉంటుంది. జనవరి 2న నాలుగో గ్రామసభ నిర్వహించాలి. ఏడాదిపాటు గ్రామంలో చేపట్టిన పనులపై నాలుగో గ్రామసభలో చర్చించాలి. గ్రామ పంచాయతీల్లో గ్రామసభ నిర్వహణ, విధులు, అధికారాలపై 2013 నవంబరు 7న రాష్ట్ర సాధారణ పరిపాలన విభాగం జీవో నంబరు 791 జారీ చేసింది. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే 14వ ఆర్థిక సంఘం నిధులతోపాటు గ్రామానికి కేటాయించిన ఇతర నిధులతో స్థానికంగా ఏయే పనులు చేపట్టాలన్న దానిపై గ్రామసభలో చర్చించి, ఆమోదం పొందాల్సి ఉంటుంది. -
రసాభాసగా గ్రామసభలు
-
రసాభాసగా గ్రామసభలు
మచిలీపట్నం: బందర్ పోర్టు, కోస్టల్ కారిడార్ల ఏర్పాటు కోసం కావాల్సిన భూములను సేకరించేందుకు ఏపీ ప్రభుత్వం తలపెట్టిన గ్రామసభలు రసాభాసగా మారాయి. మంగళవారం మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్(మడ) అధికారులతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. బుద్దాలపాలెం, మేకావానిపాలెం, కోన పోలాటితిప్ప గ్రామాల్లో ల్యాండ్‌పూలింగ్‌కు వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. 2015 ఆగస్టులో ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చే యకుండానే పూలింగ్‌కు రావటమేమిటని ప్రశ్నించారు. గ్రామసభల వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు.