Grocery stores
-
కిరాణా కొట్లకు ‘క్విక్’ దెబ్బ
సాక్షి, అమరావతి: ఆన్లైన్ కొనుగోళ్ల సంస్కృతి పెరుగుతోంది. ఏ వస్తువు కావాలన్నా ప్రజలు ఆన్లైన్ వైపే చూస్తున్నారు. ఇటీవల మార్కెట్లోకి దూసుకొచ్చి¯]∙క్విక్ కామర్స్ సంస్థలు జెప్టో, బ్లింకిట్ వంటి కంపెనీలు వినియోగదారులు కోరుకున్న వస్తువులను 10 నిమిషాల్లోనే ఇంటికి డెలివరీ చేస్తున్నాయి. ఈ ప్రభావం కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. దీనివల్ల దేశవ్యాప్తంగా గత ఏడాది 2 లక్షల కిరాణా షాపులు మూతపడ్డాయి. ఈ విషయాన్ని ఆల్ ఇండియా కన్సూ్యమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ (ఏఐసీపీడీఎఫ్) నివేదిక వెల్లడించింది.క్విక్ కామర్స్ వల్లే..క్విక్ కామర్స్ (శీఘ్ర వాణిజ్యం) ప్లాట్‌ఫామ్‌ల రాకతోనే కిరాణా షాపులు మూతపడుతున్నట్టు ఏఐసీపీడీఎఫ్ అధ్యయనం వెల్లడించింది. దేశంలోని మెట్రో నగరాలతోపాటు చిన్నపాటి పట్టణాల్లోనూ క్విక్ కామర్స్ ఊపందుకోవడంతో పచారీ దుకాణాలు మూతపడుతున్నాయి. కాలు బయటకు పెట్టకుండా ఇంటికే వేగంగా సరుకులు రావాలని కోరుకుంటున్న వినియోగదారులు బ్లింకిట్, జెప్టో వంటి ఫాస్ట్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆర్డర్లు చేసేందుకు ఇష్టపడుతున్నారు.ఫలితంగా సంప్రదాయ కిరాణా షాపులు దెబ్బతింటున్నాయి. దేశం మొత్తం మీద సుమారు 1.30 కోట్ల కిరాణా షాపులు ఉంటే.. క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ వల్ల కేవలం ఏడాది కాలంలోనే కనీసం 2 లక్షల కిరాణా స్టోర్లు, చిన్నాచితక రిటైల్ ఔట్లెట్లు మూతపడ్డాయి. ముఖ్యంగా మెట్రో నగరాలతోపాటు ప్రధాన నగరాల్లోని కిరాణా దుకాణాలపై క్విక్ కామర్స్ ప్రభావం ఎక్కువగా ఉందని ఏఐసీపీడీఎఫ్ స్పష్టం చేసింది. నగరాల్లోనే 45 శాతంమూతపడిన దుకాణాల్లో 45 శాతం మెట్రో నగరాల్లోనే ఉన్నాయి. ప్రధాన నగరాల్లో 30 శాతం, పట్టణాల్లో 25 శాతం కిరాణా షాపులు కనుమరుగయ్యాయి. క్విక్ కామర్స్ కంపెనీలు విస్తరిస్తున్న వేగానికి దశాబ్దాలుగా భారత రిటైల్ రంగానికి వెన్నెముకగా ఉన్న కిరాణా దుకాణాలు ఖాతాదారులను, లాభదాయకతను కోల్పోతున్నాయని ఏఐసీపీడీఎఫ్ జాతీయ అధ్యక్షుడు ధైర్యశీల్ పాటిల్ స్పష్టం చేశారు. తగ్గింపు ధరల పేరుతో ప్రజలను ఆకర్షిస్తున్న ఆన్లైన్ వాణిజ్య సంస్థలు కిరాణా షాపుల వినియోగదారులను కొల్లగొడుతున్నాయని తెలిపారు.40 నుంచి 60 శాతం వరకు తగ్గింపులతో వస్తువులను విక్రయించడం ఏ కంపెనీకి వాస్తవికమైనది లేదా స్థిరమైనది కాదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో క్విక్ కామర్స్ సంస్థల చట్టవిరుద్ధ ధరలపై విచారణ జరిపించాలని పాటిల్ డిమాండ్ చేశారు. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు రాసిన లేఖలో ఈ–కామర్స్, క్విక్ కామర్స్ భారీ తగ్గింపులపై ఏఐసీపీడీఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ధరలపై దర్యాప్తు చేయాలని కోరింది. క్విక్ కామర్స్ సంస్థల విస్తరణను అడ్డుకోకపోతే కిరాణా షాపులను కాపాడుకోవడం కష్టమని స్పష్టం చేసింది.అద్దెలు చెల్లించడం కష్టంగా ఉందిమాల్స్, డీమార్ట్, స్మార్ట్ బజార్, బిగ్ బాస్కెట్ వంటి సూపర్ మార్కెట్లు రావడంతో చిన్నచిన్న కిరాణా షాపుల్లో విక్రయాలు తగ్గిపోయాయి. ఆన్లైన్ సంస్థలు గ్రామీణ ప్రాంతాలకు సైతం డోర్ డెలివరీలు చేçస్తుండటంతో కిరాణా షాపులకు కొనుగోలుదారులు రావడం లేదు. వ్యాపారం లేక షాపుల అద్దెలు కూడా చెల్లించలేని దుస్థితి నెలకొంది. సరుకులు, షాపుల నిర్వహణ కోసం చేసిన అప్పులు చెల్లించలేక, సిబ్బందికి జీతాలు ఇవ్వలేక వంటి కారణాలతో కిరాణా షాపులు మూతపడుతున్నాయి. – బొలిశెట్టి సత్యనాగ బాలరాజు, అధ్యక్షుడు, పెడన వర్తక సంఘం, కృష్ణా జిల్లాకిరాణా వ్యాపారాలకు గడ్డుకాలమేకిరాణా వ్యాపారులకు గడ్డుకాలం వచ్చింది. ఒకవైపు ఆన్లైన్ మార్కెట్, మరోవైపు చిన్న పట్టణాల్లో మెగా మార్ట్ల రాకతో దశాబ్దాల కాలంగా స్థానికంగా చేస్తున్న కిరాణా వ్యాపారాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఆన్లైన్, మాల్స్ పోటీని తట్టుకుని నిలబడలేక నష్టాల బాట పట్టాం. అద్దె షాపుల్లో సిబ్బందితో నడిపే కిరాణా వ్యాపారాలు పరిస్థితి మరీ దయనీయంగా మారింది. వాస్తవానికి కిరాణా షాపుల్లో సరుకుల నాణ్యత చూసి కొనుక్కునే అవకాశంతోపాటు అరువు తీసుకునే వెసులుబాటు కూడా ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. – అద్దంకి వెంకట శివప్రసాదరావు, కార్యదర్శి, భీమవరం కిరాణా మర్చంట్స్ అసోసియేషన్, పశ్చిమగోదావరి -
‘క్విక్’ డెలివరీతో పోటీ కిరాణా హైరానా
సాక్షి, హైదరాబాద్: బస్తీలు, కాలనీలు, సందుల్లో ఉండే కిరాణా దుకాణాలు తెరుచుకోకముందే పొద్దుపొద్దునే అవసరమయ్యే టూత్పేస్ట్లు, సబ్బులు, ఇతర చిన్నాచితకా సరుకు లు మొదలు నిత్యావసరాలు సైతం నిమిషాల్లోనే ఇళ్లకు చేరిపోతున్నాయి. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఈ– కామర్స్, క్విక్ (క్యూ)–కామర్స్ ద్వారా ’ఆన్–డిమాండ్ డెలివరీ’’ఇ–కిరాణా’తో వంటి వాటితో నిమిషాల వ్యవధిలోనే వేగంగా సరుకులు వచ్చిపడుతున్నాయి. చిల్లర సామాన్లు మొదలు అన్నీ ఈ–కామర్స్ వ్యాప్తితో జెప్టో, బీబీ(బిగ్ బా స్కెట్), జొమాటో(బ్లింకిట్), ఇన్‌స్టా మార్ట్ (స్విగ్గీ) తదితరాలతో కిరాణా దుకాణాలకు పోటీ తప్పడం లేదు. నిమిషాల్లోనే డెలివరీ చేసే ఈ–కామర్స్ బిజినెస్ క్ర మంగా దేశంలో పుంజుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా చోటుచేసుకుంటున్న మార్పుచేర్పుల్లో భాగంగా ఫాస్ట్ ఫుడ్ నుంచి ఫాస్ట్ ఇంటర్నెట్ వరకు.. ఇన్స్టంట్ మెసేజింగ్ నుంచి ఆన్–డిమాండ్ స్ట్రీమింగ్ వరకు వివిధరకాల వినియోగదారులు వేగవంతమైన సేవలు కోరుకుంటున్నారు. ఈ–కామర్స్, క్యూ–కామర్స్ ద్వారా కిరాణా వస్తువులు మొదలు ఎల్రక్టానిక్ పరికరాలు, వస్తువులు, రెడిమేడ్ దుస్తులు, అత్యవసరమైన మందుల దాకా కొద్దినిమిషాల వ్యవధిలోనే డోర్ డెలివరీ కావాలని కస్టమర్లు ఆశిస్తున్నారు. దీంతో ఈ తరహా వేగవంతమైన డెలివరీ సిస్టమ్ అందిస్తున్న ఈ–కామర్స్ సంస్థల నుంచి ప్రధానంగా సంప్రదాయ కుటుంబపరమైన వ్యాపారంలో భాగంగా ఉన్న కిరాణా మర్చంట్స్, వ్యాపారులు తీవ్రమైన పోటీని ఎదుర్కోక తప్పడం లేదు. సాంకేతికత సాయంతో సత్వరమే... క్యూ–కామర్స్ ఆన్–డిమాండ్ విధాన వినియోగంతోపాటు కృత్రిమమేధ ఆధారంగా అల్గారిథమ్‌లు, ఇతర అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా అత్యంత వేగంగా వినియోగదారులకు ఆర్డర్లు చేరవేస్తున్నారు. స్థానిక మైక్రో– వేర్‌హౌస్‌లను ఉపయోగించడం ద్వారా రిటైలర్లు వేగంగా డె లివరీ చేయడంతోపాటు రవాణా ఖర్చులను తగ్గించేందుకు దోహదపడుతున్నారు. కస్టమర్ల నుంచి వచ్చే ఆర్డర్ల ప్రాసెసింగ్ వేగవంతం చేసి, లోటుపాట్లు, లోపాల తగ్గింపునకు ఈ విధానం రో»ొటిక్లను కూడా ఉపయోగిస్తున్నాయి, కచ్చితమైన డిమాండ్ అంచనా క్యూ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు వినియోగదారు ప్రవర్తనను అంచనా వేయడానికి మెషీన్ లెరి్నంగ్ అల్గారిథమ్‌లను ఉపయోగిస్తాయి. క్యూ–కామర్స్ డిమాండ్ రాబోయే రోజుల్లో మరింత వేగంగా పుంజుకుంటుందని మెకన్సీ 2020 నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం మొత్తం వినియోగదారుల రిటైల్ వ్యయంలో 10 శాతం వాటాను ఇది సాధించే అవకాశాలున్నాయని, ఈ మార్కెట్ 2025 నాటికి 5 బిలియన్ల విలువకు చేరుకుంటుందని అంచనా. ఆన్–డిమాండ్ ఎకానమీ పెరుగుదలతో సంప్రదాయ సరఫరా గొలుసు విధానాన్ని అనుసరించే బదులు, క్విక్ కామర్స్ కంపెనీలు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాయి. క్విక్ కామర్స్ ఇప్పటికే ఉన్న పరిశ్రమలను విజయవంతంగా ఏకీకృతం చేశాయి. జనసాంద్రత అధికంగా ఉన్న నగరాల్లో వ్యూహాత్మక హైపర్–లోకల్ మైక్రో–ఫుల్ఫిల్మెంట్ సెంటర్ల నెట్‌వర్క్‌ను పెంచడం ద్వారా క్విక్ కామర్స్ సంప్రదాయ కిరాణా వ్యాపారాన్ని అధిగమిస్తోంది.క్యూ–కామర్స్ వారానికి ఏడురోజులు, 24 గంటలు పనిచేస్తుండడంతో ఆధునిక జీవనశైలి డిమాండ్లకు అనుగుణంగా వినియోగదారులు ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా కొనుగోళ్లు చేసే సౌలభ్యం ఉంది. పోటీని తట్టుకునేలా ‘కిరాణా’ కొత్త ఆలోచనలు దేశవ్యాప్తంగా ఉన్న 1.20 కోట్ల సంప్రదాయ కిరాణాస్టోర్లలో సగం దాకా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా క్యూ–కామర్స్ చురుగ్గా సాగుతున్న పది నగరాల్లో దాదాపు మూడోవంతు రిటైలర్ల వ్యాపారాలు 35 శాతం దాకా వీటి ద్వారా ప్రభావితమైనట్టు ఆన్లైన్ కమ్యూనిటీ నైబర్హుడ్షాప్స్ కిరణ్క్లబ్ నివేదిక తేల్చింది. ప్రస్తుతానికి కిరాణా వ్యాపారాలపై క్యూ–కామర్స్ ప్రభావం పరిమితంగా ఉన్న రానున్న రోజుల్లో ఇది పెరిగితే తట్టుకునేందుకు వీలుగా కిరాణా దుకాణదారులు కొత్త ఆలోచనలు చేస్తున్నారు. క్యూ–కామర్స్, ఇతర డెలివరీ యాప్‌లను నియంత్రించేలా సిద్ధమయ్యారు. ► కస్టమర్లకు ఉచిత హోండెలివరీ సౌకర్యం పెంచడం, ఎక్కువ మంది పనివారిని నియమించుకొని వేగంగా వినియోగదారుల ఇళ్లకు (గంటలోపే) వస్తువుల చేరవేత వంటివాటిపై దృష్టిపెడుతున్నాయి. ► మరికొందరు తమ పాత కస్టమర్లతో వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసుకొని కొత్త వస్తువులు, ఉత్పత్తులకు సంబంధించిన అప్డేట్స్ పంపిస్తూ ఆఫర్లు, డిసౌంట్లు వంటివి అందుబాటులోకి తెస్తున్నారు. ► వాట్సాప్‌పైనే కస్టమర్లకు కావాల్సిన వస్తువుల ఆర్డర్లు స్వీకరించి వ్యాపారం కాపాడుకునే ప్రయత్నాల్లో కిరాణా షాప్ యాజమానులు నిమగ్నమయ్యారు. ► క్యూ–కామర్స్ ద్వారా అందించలేని కొత్త కొత్త ఉత్పత్తులు, విభిన్నరకాల వస్తువులు, ఫ్లేవర్లు అందించేందుకు, వీటికి సంబంధించిన సమాచారం కస్టమర్లకు చేరవేసి వారిని ఆకర్షించే ప్రయత్నాల్లో నిమగ్నమవుతున్నారు. -
కిరాణా కొట్టులో గంజాయి!
‘‘ఒడిశాకు చెందిన అనంత కుమార్ బారిక్ బాలానగర్‌లో కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు తనిఖీ చేయగా 3 ప్యాకెట్లలో 120 చాక్లెట్లు బయటపడ్డాయి. ఒడిశా నుంచి వీటిని తీసుకొచ్చి విద్యార్థులకు, కూలీలకు విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.’’ ‘‘ఇటీవల చర్లపల్లిలోని పాన్ డబ్బాలో ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేపట్టి 18 కిలోల గంజాయి చాక్లెట్లు స్వాదీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి వీటిని తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.’’ సాక్షి, హైదరాబాద్: ... ఇలా పాఠశాల విద్యార్థులు, యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయదారులు దందా కొనసాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త దారులు, కొత్త రుచులతో మత్తులో దించుతున్నారు. తొలుత ఉచితంగా అందించి వ్యసనంగా మారిన తర్వాత ఎక్కువ ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పిప్పి నుంచి చాక్లెట్లుగా.. గంజాయి నుంచి హాష్ ఆయిల్ తీసిన తర్వాత పిప్పి మిగులుతుంది. ఈ పిప్పిని వృథాగా పారేయకుండా దానికి కొన్ని రసాయనాలు, ద్రవ రూప చాక్లెట్ల మిశ్రమాన్ని కలిపి వీటిని తయారు చేస్తున్నారు. చిన్న చిన్న దుకాణాల్లో విక్రయించే ఐస్‌క్రీమ్‌లపై హాష్ ఆయిల్ చల్లి ఇవ్వడం, చాకెట్లలో మధ్యలో ఉంచి తక్కువ ధరకు విక్రయించడం చేస్తున్నారు. కొన్నిసార్లు కస్టమర్లను పెంచుకోవడానికి ఉచితంగా కూడా అందిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి సరఫరా.. ఈ గంజాయి చాక్లెట్లను గల్లీలోని చిన్న చిన్న దుకాణాలు, పాన్‌షాపులు, కిరాణా కొట్లలో విక్రయిస్తుంటారు. బీహార్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి నిర్మాణ రంగంలో వలస కూలీలు వీటిని అక్రమ మార్గంలో వీటిని నగరానికి తీసుకొస్తున్నారు. ఈ చాక్లెట్లు బంగారం, పసుపు రంగులో ఉంటాయి. 5 గ్రాములు బరువు ఉండే ఒక్క చాక్లెట్‌ను రూ.15–20 విక్రయిస్తున్నారు. ఇందులో 14 శాతం గంజాయితో పాటు ఇతర పదార్థాలుంటాయి. చారి్మనార్ గోల్డ్ పేర్లతో.. చారి్మనార్ గోల్డ్, చారి్మనార్ గోల్డ్ మునక్కా, వంటి స్థానిక పేర్లతో ఈ గంజాయి చాక్లెట్లను బ్రాండింగ్ చేస్తున్నారు. ఆయుర్వేదిక్ ఔషధం అంటూ ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు. చూసేవాళ్లకు అవి గంజాయి చాక్లెట్లు అని ఏమాత్రం అనుమానం కలగకుండా విక్రయదారులు ఈ ఎత్తుగడ వేస్తున్నారని పోలీసులు తెలిపారు. -
Heads Up For Tails: శునకాలకు కిరాణా స్టోర్
మనుషులకు కిరాణా దుకాణాలు ఉన్నాయి. శునకాలకు? పిల్లులకు? ఏవో నాలుగు రకాల తిండి, మెడ పట్టీలు, గొలుసులు... ఇవి అమ్మే పెట్ స్టోర్స్ కాకుండా వాటి ప్రతి అవసరాన్ని పట్టించుకుని వాటికి అవసరమైన టాప్ క్లాస్ వస్తువులను అమ్మే ఓ దుకాణం ఉండాలని భావించింది రాశి నారంగ్. పదేళ్ల నుంచి ఎంతో స్ట్రగుల్ అయ్యి నేడు నంబర్ వన్ స్థాయికి చేరింది. ఆమె ‘హెడ్స్ అప్ ఫర్ టెయిల్స్’ దేశవ్యాప్తంగా 75 రిటైల్ స్టోర్స్‌తో 30 పెట్ స్పాలతో సంవత్సరానికి 140 కోట్ల రూపాయల అమ్మకాలు సాగిస్తోంది. రాశి నారంగ్ పరిచయం. ఢిల్లీకి చెందిన రాశి నేడు దేశంలో అత్యధిక పెట్ స్టోర్లు కలిగిన సంస్థ ‘హెడ్స్ అప్ ఫర్ టెయిల్స్’కు ఫౌండర్. పెంపుడు జంతువుల రంగంలో కోట్ల వ్యాపారానికి వీలుంది అని గ్రహించిన తెలివైన అంట్రప్రెన్యూర్. ‘మాది వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబం. మా అత్తగారిది కూడా. మా ఇంట్లో చిన్నప్పుడు కుక్కల్ని పెంచేవాళ్లం. అయితే వాటి బాధ్యత మొత్తం కుటుంబం తీసుకునేది. కాని నాకు పెళ్లయిన కొత్తల్లో నాకంటూ ఒక కుక్క కావాలనుకుని ‘సారా’ అనే బుజ్జి కుక్కపిల్లను తెచ్చుకున్నాను. అదంటే చాలా ఇష్టం నాకు. దాని పుట్టినరోజుకు దానికేదైనా మంచి గిఫ్ట్ కొనిద్దామని ఢిల్లీ అంతా తిరిగాను. ఏవో కాలర్స్, గొలుసులు తప్ప దానికి తొడగడానికి మంచి డ్రస్సు గాని, కొత్త రకం ఆట వస్తువు గాని, మంచి ఫుడ్గాని ఏమీ దొరకలేదు. కుక్కలు పడుకునే బెడ్స్ కూడా ఎక్కడా దొరకలేదు. నేను చెబుతున్నది 2008 సంగతి. ఇంటికి ఖాళీ చేతులతో వచ్చి నా సారాను ఒళ్లో కూచోబెట్టుకుని ఆలోచించాక అర్థమైంది... నాలాగే కుక్కలను ప్రేమించేవారు ఎందరో ఉన్నారు. వారు కూడా ఇలాగే ఫీలవుతూ ఉంటారు. నేనే కుక్కలకు అవసరమైన ప్రాడక్ట్స్ ఎందుకు తయారు చేయించి అమ్మకూడదు అనుకున్నాను. అలా నా యాత్ర మొదలైంది’ అంటుంది రాశి. మొదటి స్టోర్ ఢిల్లీలో... అయితే ఆ ఆలోచన వచ్చాక పని మొదలెట్టడం అంత సులువు కాలేదు. రాశి హెచ్.ఆర్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. ఉద్యోగం కూడా చేసింది. ‘అంత చదువు చదివి కుక్కల వస్తువులు అమ్ముతావా’ అని ఫ్రెండ్స్ అన్నారు. ‘ఏదో హాబీలాగా కాలక్షేపం చేస్తుందిలే’ అని భర్త, అత్తమామలు అనుకుని వదిలేశారు. కాని రాశి ఆలోచన వేరుగా ఉంది. కుక్క అంటే ఆమె దృష్టిలో మరో ఫ్యామిలీ మెంబరే. ‘శునకాల పట్ల మన భారతీయుల దృష్టి ఇటీవల మారింది. అంతకుముందు వాటిని ఇంటి బయట కట్టేసి వాచ్ డాగ్‌లుగా చూసుకునేవారు. ఇప్పుడు ఇంట్లోనే ఒక ఫ్యామిలీ మెంబర్‌గా చూసుకుంటున్నారు. వాటికి క్వాలిటీ ఆహారం వస్తువులు మందులు ఇవ్వడంతో వాటి ఆరోగ్యం, వాటితో ఆనందం పొందాలని అనుకుంటున్నారు. కాని అలాంటి వస్తువులు ప్రత్యేకంగా దొరకడం తక్కువ. నేను రంగంలో దిగాను’ అంటుంది రాశి. కుక్కల ఒంటి తీరు, బొచ్చును బట్టి బట్టలు కుట్టి దుస్తులు తయారు చేయడం రాశి చేసిన మొదటి పని. అవి పడుకునే తీరును బట్టి అందమైన బెడ్స్ తయారు చేయడం. అవి ఆడుకోవడానికి రకరకాల వస్తువులు. వాటి ముఖ్య ఆహారం, అల్పాహారం కోసం రకరకాల క్వాలిటీ పదార్థాలు, అందమైన మెడ పట్టీలు, ప్రమాదకర రసాయనాలు లేని షాంపూలు, డియోడరెంట్లు... ఇవన్నీ ఒకచోట చేర్చి వాటిని షాపులకిచ్చి అమ్మాలనుకుంది. ‘కాని పెట్ స్టోర్లు అమ్మే వ్యాపారులు సగటు వ్యాపారులు. నేను తీసుకెళ్లిన ప్రాడక్ట్లు చూసి ఇలాంటివి అమ్మం. ఇవి ఎవరూ కొనరు అని నన్ను వెనక్కు పంపించేసేవారు. ఇక చూసి చూసి నేనే ఒక షాపు తెరిచాను. అలా ఢిల్లీలో హెడ్స్ అప్ ఫర్ టెయిల్స్ మొదటి షాపు మొదలైంది’ అంటుంది రాశి. సుదీర్ఘ విరామం తర్వాత... ఢిల్లీలో షాపు నడుస్తుండగానే రాశి భర్తకు సింగపూర్‌లో ఉద్యోగం వచ్చింది. అతనితో పాటు వెళ్లి అక్కడ 7 ఏళ్లు అక్కడే ఉండిపోయి 2015లో తిరిగి వచ్చింది రాశి. ‘అన్నాళ్లు నేను షాపును అక్కడి నుంచే నడిపాను. విస్తరించడం వీలు కాలేదు. కాని తిరిగి వచ్చాక ఈ ఐదారేళ్లలోనే ఇంత స్థాయికి తీసుకొచ్చాను’ అంటుంది రాశి. ఆమె దార్శనికతను గ్రహించిన సంస్థలు భారీగా ఫండింగ్ చేయడంతో రాశి తన స్టోర్స్‌ను పెంచుకుంటూ వెళ్లింది. అంతే కాదు కుక్కలు, పిల్లులు, కుందేళ్లు, పిట్టలు... వీటి సంరక్షణకు స్పాలు కూడా మొదలెట్టింది. అన్నీ పెట్ ఫ్రెండ్లీ షాపులు. రాశి ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ‘క్యాట్ ఓన్లీ స్టోర్’ కూడా తెరిచింది. అన్ని మెట్రో నగరాల్లో ‘హెడ్స్ ఫర్ టెయిల్స్’ షాపులు ఉన్నాయి. కుక్కలకు కావాల్సిన 100కు పైగా వస్తువులు, జాతిని బట్టి వాడాల్సిన వస్తువులు అమ్మడం ఈమె సక్సెస్‌కు కారణం. ఒక పనిలో పూర్తిగా శ్రద్ధతో నిమగ్నమైతే రాశిలా ఎవరైనా విజయం సాధించవచ్చు. -
చిన్న పట్టణాల్లోనూ దూసుకెళ్దాం!
న్యూఢిల్లీ: క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు (సత్వర సేవలు అందించేవి/క్యూఎస్ఆర్), మధ్య స్థాయి గ్రోసరీ రిటైల్ సంస్థలు చిన్న పట్టణాల్లోకి వేగంగా విస్తరించే ప్రణాళికలతో ఉన్నాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి మార్కెట్లు కరోనా లాక్డౌన్ల నుంచి కోలుకుంటుండడం.. డిమాండ్ క్రమంగా పుంజుకుంటున్న నేపథ్యంలో అవకాశాలను సొంతం చేసుకునేందుకు ఈ సంస్థలు వేగంగా విస్తరించాలనుకుంటున్నాయి. డోమినోస్ పిజ్జా, మెక్‌డొనాల్డ్, కేఎఫ్‌సీ ఇవన్నీ క్యూఎస్ఆర్ కిందకే వస్తాయి. వీటితోపాటు గ్రోసరీ గొలుసు దుకాణాల సంస్థ మోర్ సైతం చిన్న పట్టణాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. చిన్న పట్టణాల్లో వీటి వ్యాపారం వేగంగా వృద్ధి చెందుతుండడం ఆయా సంస్థలకు ఉత్సాహాన్నిస్తోంది. యువత నుంచి తమ ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువగా ఉంటోందని, ఆకర్షణీయమైన ధరలు కూడా వినియోగదారులకు చేరువ చేస్తున్నట్టు ఈ సంస్థలు చెబుతున్నాయి. దేశంలో అతిపెద్ద క్యూఎస్ఆర్ అయిన జుబిలంట్ ఫుడ్ వర్క్స్ డోమినోస్ పిజ్జా, డంకిన్ డోనట్స్ బ్రాండ్ల కింద దేశవ్యాప్తంగా 1,360 రెస్టారెంట్లను నిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో (2020–21) కొత్తగా 135 స్టోర్లను ప్రారంభించిన ఈ సంస్థ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఇంచుమించుగా ఇదే స్థాయిలో నూతన స్టోర్లను కొత్తగా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. టైర్–1 పట్టణాలతో పోలిస్తే ఇతర పట్టణాల్లో వ్యాపార వృద్ధి ఎక్కువగా ఉన్నట్టు మార్చి ఫలితాల తర్వాత ఇన్వెస్టర్ల సదస్సులో ఈ కంపెనీ తెలిపింది. వృద్ధి బాటలోకి.. ‘‘మార్చి త్రైమాసికంలో తిరిగి వృద్ధి బాటలోకి అడుగు పెట్టాం. భారీగా నూతన స్టోర్లను ప్రారంభించడం కూడా జరిగింది. మార్జిన్లతోపాటు పోర్ట్‌ఫోలియోలోని బ్రాండ్ల సంఖ్య కూడా పెరిగింది’’ అని జుబిలంట్ ఫుడ్ వర్క్స్ సీఈవో ప్రతీక్పోట తెలిపారు. కరోరా రెండో విడత పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌పై ప్రభావం చూపించిందని.. నూతన వినియోగదారులకు చేరువ కావడమే వృద్ధి చోదకం అవుతుందని ఈ పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ‘‘టైర్ 2, 3, 4 పట్టణాల్లోకి ప్రముఖ బ్రాండ్లు విస్తరిస్తున్నాయి. ఎందుకంటే ఈ చిన్న పట్టణాల్లో ఆయా కంపెనీలకు ఆదాయ వృద్ధి ఎక్కువగా ఉంటోంది’’ అని అనరాక్ రిటైల్ సంయుక్త ఎండీ పంకజ్ రెంజెన్ చెప్పారు. స్టోర్లను పెంచుకుంటూనే ఉన్నాయ్.. సాధారణంగా రెస్టారెంట్ల వ్యాపారం డెలివరీపైనే ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. దీంతో చిన్న పట్టణాల్లో చిన్న స్టోర్లను ఏర్పాటు చేయడం ద్వారా స్థానికంగా డెలివరీ డిమాండ్‌ను చేరుకోవచ్చని కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నారు. ‘‘కరోనా కారణంగా సమస్యలు ఏర్పడినప్పటికీ టైర్–2, 3 పట్టణాల్లో, మెట్రోల్లోనూ మా ఫ్రాంచైజీ రెస్టారెంట్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూనే ఉంది’’అని కేఎఫ్‌సీ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. కోజికోడ్, నిజామాబాద్, ముజఫర్‌పూర్, భాగల్పూర్ తదితర పట్టణాల్లో కేఎఫ్‌సీకి చెందిన యూమ్ రెస్టారెంట్లను తెరిచినట్టు చెప్పారు. మధ్య స్థాయి గ్రోసరీ రిటైల్ సంస్థలు సైతం చిన్న పట్టణాల్లో విస్తరణపై దృష్టి పెట్టాయి. ఆగ్రా, ఫైజాబాద్, ముజఫర్‌పూర్, సితాపూర్, భువనేశ్వర్ తదితర ప్రాంతాల్లో విస్తరణ కోసం మోర్ సంస్థ స్థలాలను లీజుకు తీసుకుంది. కరోనా వల్ల లాక్డౌన్లు విధించినప్పటికీ చిన్న పట్టణాల్లోని యువ వినియోగదారులు తమ వృద్ధి చోదకాలని కంపెనీలు చెబుతున్నాయి. డోమినోస్ తన యాప్‌లో హిందీని చేర్చగా.. త్వరలో ఇతర ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రణాళికతో ఉంది. -
సరుకులు లేవు.. సరఫరా చాలదు
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచే కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లకు సరుకు రవాణా క్లిష్టతరంగా మారింది. డిమాండ్ మేరకు నిత్యావసరాలు సరఫరా లేకపోవడం, గోదాముల్లో సరుకుల రవాణాకు, ప్యాకేజింగ్‌కు సిబ్బంది కొరత ఉండటంతో నిల్వలు క్రమంగా ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికే నగరంలోని చాలా సూపర్మార్కెట్లలో ఖాళీ ర్యాంకులు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా రోజువారీ అవసరాల్లో ప్రధానంగా వాడే ఉప్మా, ఇడ్లీ రవ్వలతో పాటు, టీ, కాఫీ పొడి, కారం, చక్కెర, పసుపు, నూనెలు, గోధుమపిండి వంటి సరుకులతో పాటు డిటర్జెంట్లు, హ్యాండ్‌వాష్‌లు, న్యాప్కిన్లు, డైపర్ల సరఫరా తగ్గడంతో వీటికి కొరత ఏర్పడుతోంది. డిమాండ్‌కు తగ్గట్లు లేని సరఫరా.. లాక్డౌన్ నేపథ్యంలో వినియోగదారులు పెద్ద ఎత్తున అవసరాలకు మించి కొనుగోళ్లు చేశారు. సాధారణంగా వారానికి సరిపడా సరుకులను కొనుగోలు చేసే అలవాటుకు భిన్నంగా కొందరు ముందుగానే పెద్దమొత్తంలో సరుకులను కొనుగోళ్లు చేశారు. దీంతో అవి నిండుకున్నాయని కిరాణా వర్తకులు తెలిపారు. ‘రాష్ట్రానికి మహారాష్ట్ర, కర్ణాటక నుంచి చక్కెర, గుజరాత్ నుంచి ఉప్పు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ నుంచి శనగపప్పు, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కందిపప్పు, రాజస్తాన్ నుంచి పెసరపప్పు, కృష్ణపట్నం, కాకినాడ, చెన్నై ఓడరేవుల నుంచి ముడి వంట నూనెలు వస్తుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సరుకులు తెచ్చే వాహనాలకు అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్దే ఇబ్బందులు ఎదురౌతున్నాయి. దానికి తోడు ఆయా రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఉధృతి తీవ్రంగా ఉండటంతో లారీ డ్రైవర్లు, క్లీనర్లు రవాణాకు ముందుకు రావడం లేదు. కొన్ని సరుకు రవాణా వాహనాలు వస్తున్నా, అవి అనేక చోట్ల చెక్‌పోస్టులు దాటాల్సి రావడంతో ఒక్క రోజులో వచ్చే వాటికి రెండున్నర రోజుల గడువుపడుతోంది’అని బేగంబజార్‌కు చెందిన వర్తకులు తెలిపారు. అదీగాక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కిరణా దుకాణాలు, సూపర్ మార్కెట్లకు సరుకులు సరఫరా చేసే బేగంబజార్ మార్కెట్లో రద్దీని నివారించేందుకు విడతల వారీగా దుకాణాలు తెరుస్తున్నారు. పప్పులు సరఫరా చేసే దుకాణం ఒక రోజు తెరిస్తే, మళ్లీ అది తెరిచే వంతు నాలుగు రోజులకు గానీ రావట్లేదు. దీంతోనూ తగినంత సరుకుల సరఫరా అనుకున్నంత జరగడం లేదని తెలుస్తోంది. ఇక సూపర్మార్కెట్ల గోదాముల్లో కొంత నిల్వలు ఉంటున్నా, వాటిని ప్యాకేజింగ్ చేసేందుకు సిబ్బంది రావడం లేదని మరికొందరు వ్యాపారులు చెబుతున్నారు.ప్యాకేజీ పనులకు గతంలో 30, 35 మంది కార్మికులతో చేపట్టే చోట ప్రస్తుతం ఐదుగురికి మించి లేకపోవడంతో స్టాక్‌ను మార్కెట్లకు తీసుకురావడం సైతం ఇబ్బందిగా మారిందని బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ సూపర్ మార్కెట్ మేనేజర్ ఒకరు వెల్లడించారు. దీంతో తమ మార్కెట్‌కు వచ్చే వారు సగం సరుకులే కొనుగోలు చేసి వెళుతున్నారని వెల్లడించారు. -
కిరాణా షాపులపై పోలీసుల దాడులు
ఉప్పల్ (హైదరాబాద్) : ఉప్పల్‌లోని కిరాణాషాపులపై మంగళవారం ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో భాగంగా అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ సరుకులను స్వాధీనం చేసుకున్నారు. 6 క్వింటాళ్ల బియ్యం, 28 క్వింటాళ్ల గోధుమలు స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. -
సేల్స్‌టాక్స్ ఉద్యోగి పేరుతో టోకరా !
కిరాణా స్టోర్స్‌లో రూ.1.25 లక్షల నగదు తీసుకుని మాయం మోటార్‌సైకిల్‌పై వచ్చి దందా ఉయ్యూరులో పట్టపగలు కలకలం ఉయ్యూరు, న్యూస్‌లైన్ : సేల్స్‌టాక్స్ ఆఫీసర్ తరఫున వచ్చానంటూ ఓ మోసగాడు ఓ కిరా ణా దుకాణం నిర్వాహకులకు టోకరా వేశాడు. దుకాణంలో యజమాని భార్య ఉండటాన్ని అదనుగా చూసుకుని దబాయించి ఏకంగా రూ. 1.25 లక్షల నగదుతో పరారయ్యాడు. వచ్చిన వ్యక్తి వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి కాదని తరువాత నిర్ధారణ కావటంతో ఆ వ్యాపారి కుటుంబంతో పాటు స్థానికులూ నివ్వెరపోయారు. ఉయ్యూరులో శుక్రవారం ఈ ఘటన జరిగింది. బాధితులు తెలిపిన సమాచారం ప్రకారం ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలోని రావిచెట్టు ఎదురుగా శ్రీమణికంఠ జనరల్ స్టోర్స్ ఉంది. దుకాణం యజమాని రాచిపూడి శివనాగరాజు స్థానికంగా సుపరిచితుడే. మధ్యాహ్న సమయంలో భోజనానికి షాపుపైనే ఉన్న ఇంట్లోకి వెళ్లాడు. నాగరాజు భార్య శివలీల కౌంటర్లో కూర్చుని వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం మూడు, నాలుగు గంటల సమయంలో టిప్‌టాప్‌గా తయారైన ఓ వ్యక్తి మోటార్‌సైకిల్‌పై షాపు వద్దకు వచ్చాడు. లోనికి వెళ్లి.. ‘లెసైన్స్ ఏది ? వ్యాపార లావాదేవీలు ఎంత? గుమస్తాకి జీతం ఎంత? లెసైన్స్ రెన్యువల్ అయిందా?’ అంటూ హడావుడి చేశాడు. దీంతో వ్యాపారి భార్య శివలీల ‘ఎవరు సర్ మీరు?’ అని ప్రశ్నించగా, ‘సేల్స్ టాక్స్ ఆఫీస్ నుంచి వ చ్చా, మా సార్ దూరంగా ఉన్నారు. మీ వ్యాపార లావాదేవీలు ఏమీ బాగోలేదు, ఆయన వచ్చారంటే ఇబ్బందులు పడతారు’ అంటూ దబాయించాడు. ‘కౌంటర్ లో క్యాష్ ఎంత ఉంది?’ అంటూ అని ప్రశ్నించాడు. రూ. 1.25 లక్షలు నగదు ఉందని, ఈ నెల 12న తమ కుమారుడి వివాహ సందర్భంగా బంగారు నగలు కొనేందుకు తెచ్చి ఉంచామని శివలీల చెప్పింది. ‘ముందు ఆ నగదు నాకిచ్చేయండి’ అంటూ హుకుం జారీ చేయటంతో కంగారులో శివలీల మొత్తం డబ్బు అతడి చేతికి ఇచ్చివేశారు. నకిలీ ఉద్యోగి ఆ నగదు తో ద్విచక్రవాహనంపై ఎక్కి దుకాణంలోని గుమస్తా నాగరాజన్‌ను వెనుక ఎక్కించుకుని మసీదు వరకు వెళ్లాడు. ‘ఇక్కడే ఉండు, మా సార్ దగ్గరికి వెళ్లి వస్తా’ అని గుమస్తాను దించి వెళ్లిపోయాడు. ఎంతసేపటికీ అతడు తిరిగి రాకపోవటంతో గుమస్తా వెనుదిరిగి వెళ్లి విషయాన్ని యజమాని నాగరాజుకు చెప్పాడు. ఆయన చుట్టుపక్కల ఆరా తీయగా, అసలు సేల్స్‌టాక్స్ ఆఫీసర్లు ఎవరూ తనిఖీకి రాలేదని తేలింది. దీంతో వ్యాపారి ఉయ్యూరు సీఐ మురళీరామకృష్ణకు ఫిర్యాదు చేశాడు. సీఐ ఆదేశాల మేరకు టౌన్ ఎస్సై జానకిరామయ్య దుకాణం వద్దకు వచ్చి విచారణ జరిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చే స్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.