Halmarking
-
బంగారు నగలపై కేంద్రం కొత్త రూల్.. ఇకపై ఇది తప్పనిసరి!
బంగారు నగలు కొనేవారికి ముఖ్యమైన వార్త ఇది. బంగారు ఆభరణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇకపై హాల్‌మార్క్ లేని ఆభరణాలు విక్రయించేందుకు వీలు ఉండదు. బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేయాలనే ఆలోచనను ప్రభుత్వం 18 నెలల క్రితమే బయటపెట్టింది. తాజాగా మార్చి 31 తర్వాత హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (హెచ్‌యూఐడీ) లేని బంగారు ఆభరణాలను విక్రయించేందుకు అనుమతించబోమని వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. నాలుగు అంకెలు, ఆరు అంకెలు ఇలా హాల్‌మార్కింగ్ విషయంలో ఉన్న గందరగోళాన్ని తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి ఆరు అంకెల ఆల్ఫా న్యూమరిక్ హాల్‌మార్కింగ్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఇది లేకుండా బంగారం లేదా బంగారు నగలు విక్రయించేందుకు వీలుందడదు. చదవండి: మైక్రోసాఫ్ట్ కిచిడీ రెడీ! బిల్ గేట్స్‌కు స్మృతి ఇరానీ వంట పాఠాలు హెచ్‌యూఐడీ అంటే ఏమిటంటే.. హెచ్‌యూఐడీ అంటే హాల్‌మార్కింగ్ యూనిక్ ఐడెంటిఫికేషన్. ఇది ఆరు అంకెల ఆల్ఫా న్యూమరిక్ కోడ్. ఈ అంకెల్లో ఇంగ్లష్ అక్షరాలతో పాటు సంఖ్యలు కూడా ఉంటాయి. దీంతో మనం కొలుగోలు చేసిన బంగారం ప్రామాణికత, స్వచ్ఛత తెలుస్తుంది. హెచ్‌యూఐడీ కోడ్ ఉంటే నగల వ్యాపారులు వినియోగదారులను మోసం చేయలేరు. ప్రస్తుతం దేశంలో 1338 హాల్‌మార్కింగ్ కేంద్రాలు ఉన్నాయి. -
ఆభరణాలకు హాల్‌మార్కింగ్ తప్పనిసరి!
న్యూఢిల్లీ: బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది. జనవరి నుంచీ అమలు చేయడానికి కసరత్తు చేస్తోంది. దీనితోపాటు క్యారెట్ కౌంటింగ్‌ను తప్పనిసరి చేయాలన్నది కేంద్రం సంకల్పమని ఆహార, వినియోగ వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ శుక్రవారం పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం వినియోగదారులు తాము కొనుగోలు చేసిన ఆభరణాల నాణ్యతను గురించి తెలుసుకోలేకపోతున్నారు. అందుకే మేము హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేయాలన్న దిశగా అడుగులు వేస్తున్నాము. జనవరి నుంచీ అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నాం’’ అని పాశ్వాన్ పేర్కొన్నారు. ‘‘ఒక ఆభరణం 14 క్యారెట్లు, 18 క్యారెట్లు, 22 క్యారెట్లలో ఏ కేటగిరీకి చెందిదో వినియోగదారునికి అమ్మకందారు తప్పనిసరిగా ధ్రువీకరించగలగాలి. ఈ మేరకు చర్యలకు కసరత్తు జరగుతోంది’’ అని పాశ్వాన్ వివరించారు. -
హాల్‌మార్క్ ఉన్నా స్వచ్ఛతలో తేడాలు..
పసిడి సర్టిఫికేషన్‌పై వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక న్యూఢిల్లీ : భారత్‌లో హాల్‌మార్క్ సర్టిఫికేషన్ ఉన్న పసిడి ఆభరణాల్లో సైతం నాణ్యతకు సంబంధించి వ్యత్యాసాలు ఉంటున్నాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) వెల్లడించింది. ప్రస్తుతం 8 బిలియన్ డాలర్లుగా ఉన్న పసిడి ఆభరణాల ఎగుమతులను వచ్చే ఐదేళ్లలో 40 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలంటే హాల్‌మార్కింగ్ వ్యవస్థను మరింత మెరుగుపర్చుకోక తప్పదని పేర్కొంది. గోల్డ్ డిపాజిట్ స్కీము విజయవంతం కావాలన్నా కూడా ఇది కీలకమని ఒక నివేదికలో తెలిపింది. బంగారం స్వచ్ఛత ప్రమాణాలను తెలిపే హాల్‌మార్క్ సర్టిఫికేషన్‌ను వినియోగదారుల వ్యవహారాల శాఖలో భాగమైన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) పర్యవేక్షిస్తోంది. హాల్‌మార్కింగ్ అన్నది ప్రస్తుతం తప్పనిసరి కాకుం డా స్వచ్ఛందంగానే ఉంటోంది. దేశీయంగా 30% ఆభరణాలకు హాల్‌మార్కింగ్ ఉంటున్నప్పటికీ.. వాటి నాణ్యత, కొన్ని హాల్‌మార్కింగ్ సంస్థల విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా ఉంటున్నాయని డబ్ల్యూజీసీ పేర్కొంది. ఫలితంగా కచ్చితమైన ప్రమాణాలున్న ఆభరణాలు 30 శాతం కన్నా ఇంకా తక్కువే ఉండొచ్చని వివరించింది. బీఐఎస్ వద్ద చాలినన్ని వనరులు లేకపోవడం వల్ల కూడా నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా అమలయ్యేలా చూడటంలో సమస్యలు ఎదురవుతున్నాయని డబ్ల్యూజీసీ ఇండియా ఎండీ సోమసుందరం పీఆర్ చెప్పారు. ఇక హాల్‌మార్కింగ్ సెం టర్లు సైతం మౌలిక సదుపాయాల కొరత, తక్కువ లాభదాయకత త దితర సమస్యలు ఎదుర్కొంటున్నాయని వివరించారు. దేశీయంగా బీఐఎస్ గుర్తింపు పొందిన హాల్‌మార్కింగ్ కేంద్రాలు 220 ఉన్నాయి. తీసుకోతగిన చర్యలు.. చాలా మంది కొనుగోలుదారులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి హాల్‌మార్కింగ్‌పై పెద్దగా అవగాహన ఉండటం లేదని డబ్ల్యూజీసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో కొనుగోలుదారుల్లో బంగారం హాల్‌మార్కింగ్ వల్ల ప్రయోజనాల గురించి అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని డబ్ల్యూజీసీ పేర్కొంది. బ్రిటన్ తరహాలో వచ్చే నాలుగైదు సంవత్సరాల్లో హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేయాలని డబ్ల్యూజీసీ తెలిపింది.