heat deaths
-
కేంద్ర మంత్రి ఉల్లిపాయల ఐడియా!.. మీరూ ట్రై చేస్తారా..?
గ్వాలియర్: ఎండాకాలం విపరీతంగా ఎండలు పెరిగిపోతున్నాయి. వడగాల్పుల నుంచి తట్టుకోవడానికి రకరకాల వంటింటి చిట్కాలు పాటిస్తుంటారు. కేంద్ర విమానయాన శాఖమంత్రి జ్యోతిరాదిత్య సింథియ కూడా ఉల్లిపాయల చిట్కాను పాటిస్తున్నట్లు చెప్పారు. ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికి అధికారులకు కూడా ఆయన ఆ చిట్కాను సూచించారు. వేడికి ఉల్లిపాయల ఐడియా మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో ఎండలు విపరీతంగా పెరిగాయి. దాదాపు 45డిగ్రీల సెల్సియస్ వరకు చెరుకున్నాయి. దీంతో రోజురోజుకూ వడదెబ్బతో మరణాల సంఖ్య పెరుగుతోంది. గత వారం రోజుల్లోనే 50 మంది ఆసుపత్రిలో చేరారు. దీంతో కేంద్ర మంత్రి సింథియా వేడినుంచి తప్పించుకోవడానికి ఉల్లిపాయలు తెచ్చుకోవాలని సూచనలు చేశారు. అధికారులు కూడా పాటించాలని సూచించారు. తానూ పాటిస్తున్నట్లు చెప్పారు. ఎండాకాలం అయినందున ఇంటి నుంచి బయటకు వెళ్లేప్పుడే తన పాకెట్లో ఉల్లిగడ్డలు వెంట తెచ్చుకుంటున్నారట సింథియా. వాటిని ఉపయోగించి శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చని చెప్పారు. వేసవి ఎండల్లోనూ పార్టీ కార్యక్రమాల్లో నిరాటంకంగా పనిచేయగలుగుతున్నానని తెలిపారు. ఉల్లిపాయలు శరీరంలో వేడిని గణనీయంగా తగ్గిస్తాయని వెల్లడించారు. మధ్యప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. అజయ్ పాల్ కూడా ఎండల వేడి నుంచి తప్పించుకోవడానికి పలు సూచనలు చేశారు. తగిన మోతాదుల్లో నీటిని తాగాలని సూచించారు. ఇదీ చదవండి:'సెంట్రల్ విస్టాపై ప్రతిపక్షాలది తప్పుడు చర్య.' -
ఆ కిరణాలతోనే వడదెబ్బ మరణాలు
అతినీలలోహిత కిరణాల వల్లే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వడదెబ్బతో మృతుల సంఖ్య పెరుగుతోందని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) స్పష్టం చేసింది. డబ్ల్యూఎంవో విడుదల చేసిన ఆల్ట్రా వయొలెట్ (యూవీ) రేడియేషన్ ఇండెక్స్ లో.. భారత దేశంలోని ఈ రెండు రాష్ట్రాల్లో తీవ్రత 12 గా నమోదైంది. యూవీ ఇండెక్స్ 12 దాటడం మానవ శరీరానికి తీవ్ర హాని కలిగిస్తుందని, ఇంత తీవ్రతతో వచ్చే అతినీల లోహిత కిరణాల వల్ల వడదెబ్బ తగిలి మృతి చెందడమే కాకుండా చర్మ కేన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈ రేడియేషన్ తీవ్రత మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య ఎక్కువగానూ, ముఖ్యంగా ఒంటి గంట ప్రాంతంలో అత్యధికంగా నమోదవుతోందని పేర్కొంది. సాయంత్రం నాలుగు గంటల తర్వాత మాత్రమే రేడియేషన్ తీవ్రత తగ్గుముఖం పడుతున్నట్లు తెలిపింది. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే చర్మరక్షణ కోసం సన్ స్క్రీన్స్ ఉపయోగించడం, కూలింగ్ గ్లాసెస్ ధరించడం, శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండటానికి ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవడం మంచిదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.