HYDRA
-
కోహెడలో హైడ్రా పంజా
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఆదివారం పంజా విసిరింది. అక్కడి అనేక ప్రాంతాల్లో వెలసిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చేశారు. సర్వే నంబర్ 951, 952ల్లోని గ్రామపంచాయతీ లేఔట్లో తమ ప్లాట్లను సమ్మిరెడ్డి బాల్‌రెడ్డి అనే వ్యక్తి ఆక్రమించారని, రహదారులు లేకుండా అడ్డుగోడలుగా కట్టారని రాధే ధామం లే ఔట్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు పలువురు ఇటీవల హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా అధికారులు పలు పత్రాలను పరిశీలించారు. 1986లో భూ యజమానులు కె.రాములు, పెద్దయ్య, ఈసయ్య గ్రామ పంచాయతీ లేఔట్ వేసినట్టు నిర్ధారించారు. సమ్మిరెడ్డి బాల్‌రెడ్డి ఆ భూమిని స్వా«దీనం చేసుకుని, ఫాం హౌస్ నిర్మించడంతో పాటు లే ఔట్లోని పలు ప్లాట్లను సొంతం చేసుకుంటూ అంతర్గత రహదారులను బ్లాక్ చేసినట్టు వెల్లడైంది. దీంతో అన్ని పత్రాలతో తమ కార్యాలయంలో హాజరు కావాలని ఇరుపక్షాలకు హైడ్రా నోటీసులు జారీ చేసింది. శనివారం వారు హాజరు కాగా రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సమక్షంలో క్షుణ్ణంగా పరిశీలించింది. ఫామ్‌హౌస్, షెడ్, కాంపౌండ్ వాల్, ఫెన్సింగ్ నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేవంటూ తుర్కయాంజాల్ మున్సిపల్ అధికారుల స్పష్టం చేశారు. ప్లాట్లను తమకు అమ్మిన తర్వాత సమ్మిరెడ్డి ఈ భూమిని తాను కొన్నట్టు రికార్డులు సృష్టించారని ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధుల ఆరోపించారు. హైడ్రా ఇరుపక్షాలతో పాటు రెవెన్యూ, మున్సిపల్ అధికారులను విచారించి సమ్మిరెడ్డి బాల్‌రెడ్డి నిరి్మంచిన ఫాంహౌస్‌తో పాటు ప్రహరీ, ఫెన్సింగ్ కూల్చివేతకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు ఆదివారం భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలను కూల్చేశారు. ఈ సందర్భంగా సుమారు 170 ప్లాట్లకు కబ్జాదారుల నుంచి అధికారులు విముక్తి కల్పించారు. వీటిలో పార్కులు, క్రీడా స్థలాలు ఉన్నాయి. -
హైడ్రాపై తెలంగాణ హైకోర్టు సీరియస్
-
ఎన్నిసార్లు చెప్పినా మారరా?
సాక్షి, హైదరాబాద్: ‘ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా? అక్రమ నిర్మాణమని శుక్రవారం నోటీసులిచ్చి.. శనివారం హాజరుకు ఆదేశాలిచ్చి.. ఆదివారం కూల్చివేస్తారా? అంత తొందరేముంది? కూల్చి వేతలు చేపట్టే ముందు సహేతుక సమయం ఇవ్వాలి కదా?’ అని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడ గ్రామంలోని తన ఆస్తుల కూల్చివేతను సవాల్ చేస్తూ సామ్రెడ్డి బాల్‌రెడ్డి హైకోర్టులో ఆదివారం హౌజ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైడ్రా నోటీసులు చట్టవిరుద్ధమని, వాటిని రద్దు చేస్తూ ఆదేశాలివ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్‌కు న్యాయమైన అవకాశం ఇవ్వకుండా తదుపరి చర్యలు తీసుకోవద్దని హైడ్రాను ఆదేశించారు. అవసరమైన పత్రాలు సమర్పించడానికి పిటిషనర్‌కు ఒక వారం సమయం ఇచ్చారు. ముఖ్యంగా సెలవు దినాల్లో కూల్చివేతలు చేపట్టవద్దని, కాదని చేపడితే కఠిన చర్యలు ఉంటాయని హైడ్రాను హెచ్చరించారు. ఒక్కరోజులో పత్రాలు సమర్పించటం ఎలా సాధ్యం?..: తన ఆస్తులకు సంబంధించిన పత్రాలు సమర్పించేందుకు హైడ్రా ఒక్క రోజే సమయం ఇచ్చిందని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ‘అక్రమ నిర్మాణమని శుక్రవారం అధికారులు నోటీసులు జారీ చేశారు. వ్యక్తిగతంగా హాజరుకావాలని శనివారం సమయం ఇచ్చారు. ఆ వెంటనే ఆదివారం కూల్చివేత ప్రక్రియ చేపట్టారు. టైటిల్ లింక్ పత్రాలు, పట్టాదార్ పాస్‌బుక్, ఇతర అన్ని డాక్యుమెంట్లతో రావాలని ఆదేశించిన అధికారులు.. ఒక్క రోజే సమయం ఇచ్చారు. అధికారుల తీరు చట్టవిరుద్ధం. నోటీసులను నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇవ్వండి’ అని కోరారు. దీంతో హైడ్రా తీరుపై అసహనం వ్యక్తంచేసిన ధర్మాసనం.. వారంలోగా అధికారులకు డాక్యుమెంట్లు అందజేయాలని ఆదేశించింది. వాటిని పరిశీలించి చట్టప్రకారం చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిస్తూ విచారణను వాయిదా వేసింది. -
హైదరాబాద్‌లో మరోసారి హైడ్రా భారీ కూల్చివేతలు.. ఈసారి ఎక్కడంటే?
సాక్షి,హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది.తమ ప్లాట్లలో ఫామ్‌హౌస్ కట్టారని, తమకు న్యాయం చేయాలని కోరుతూ వందల మంది బాధితులు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ఆశ్రయించారు. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ బాధితుల సమస్యల్ని విన్నారు. బుల్డోజర్లతో రంగంలోకి దిగారు. అక్రమ నిర్మాణాల్ని తొలగించేస్తున్నారు.తాజాగా, రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ కోహెడలో హైడ్రా భారీ కూల్చివేతలకు శ్రీకారం చుట్టింది. కోహెడ సర్వే నెంబర్ 951, 952లో 7.28 గుంటల భూమిని రియల్టర్ సంరెడ్డి బాల్‌రెడ్డి కబ్జా చేశాడు. కబ్జా చేసిన ప్లాట్లలో ఫాం హౌస్ నిర్మించాడు. దీంతో 170 మంది ప్లాట్ల యజమానులు హైడ్రాను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో హైడ్రా రంగంలోకి దిగింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చి వేతలకు ఉపక్రమించింది.రంగనాథ్ వార్నింగ్మొన్నటికి మొన్న శంషాబాద్ మున్సిపాలిటీలో శుక్రవారం(ఫిబ్రవరి7) హైడ్రా కొరడా ఝలిపించింది. రోడ్డుపై అనుమతులు లేకుండా ఏర్పాటుచేసిన 39 హోర్డింగ్‌లను తొలగించింది. హోర్డింగ్‌లు ఏర్పాటు చేసిన యజమానులపై చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఇటీవలే హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సంపత్ నగర్, ఊట్పల్లిలో అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి కట్టిన నిర్మాణాలను, అలాగే రోడ్లపై అడ్డుగా కట్టిన నిర్మాణాలను తొలగించింది.సంపత్ నగర్లో ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి కొందరు అక్రమ కట్టడాలను నిర్మించారు. అలాగే ఊట్పల్లిలో రోడ్డుకు అడ్డంగా ఓ గేటును ఏర్పాటు చేశారు. వీటితో పాటు మరికొన్ని నిర్మాణాలను తొలగించే చర్యలు చేపట్టింది. ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువులు, పార్క్ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది.ఈ క్రమంలో శంషాబాద్ మున్సిపాలిటీని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. శంషాబాద్ మున్సిపాలిటీలో చెరువులు కుంటలు కూడా కబ్జా అయినట్లు తన దృష్టికి వచ్చిందని వాటి పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
శంషాబాద్‌లో మళ్లీ ‘హైడ్రా’ కొరడా.. కమిషనర్ వార్నింగ్
సాక్షి,శంషాబాద్:శంషాబాద్ మున్సిపాలిటీలో శుక్రవారం(ఫిబ్రవరి7) హైడ్రా కొరడా ఝలిపించింది. రోడ్డుపై అనుమతులు లేకుండా ఏర్పాటుచేసిన 39 హోర్డింగ్‌లను తొలగించింది. హోర్డింగ్‌లు ఏర్పాటు చేసిన యజమానులపై చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.ఈ క్రమంలో శంషాబాద్ మున్సిపాలిటీని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. శంషాబాద్ మున్సిపాలిటీలో చెరువులు కుంటలు కూడా కబ్జా అయినట్లు తన దృష్టికి వచ్చిందని వాటి పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఇటీవలే హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సంపత్ నగర్, ఊట్పల్లిలో అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి కట్టిన నిర్మాణాలను, అలాగే రోడ్లపై అడ్డుగా కట్టిన నిర్మాణాలను తొలగించింది.సంపత్ నగర్లో ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి కొందరు అక్రమ కట్టడాలను నిర్మించారు. అలాగే ఊట్పల్లిలో రోడ్డుకు అడ్డంగా ఓ గేటును ఏర్పాటు చేశారు. వీటితో పాటు మరికొన్ని నిర్మాణాలను తొలగించే చర్యలు చేపట్టింది. ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువులు, పార్క్ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది. -
హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుప్రీంకోర్టు లాయర్ ముఖీం వాగ్వాదం
-
శంషాబాద్ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
-
పటాన్చెరులో హైడ్రా కూల్చివేతలు.. బోర్డులు ఏర్పాటు!
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణలో హైడ్రా(HYDRA) కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరోసారి కొరడా ఝలిపించింది. తాజాగా ముత్తంగిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. పార్క్ స్థలంలో ఆక్రమణలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. శుక్రవారం ఉదయమే అక్కడికి చేరుకున్న హైడ్రా అధికారులు, పోలీసులు.. అక్రమ నిర్మాణాలను తొలగించారు. పోలీసుల బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.తెలంగాణలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే శుక్రవారం ఉదయం సంగారెడ్డి(Sanga Reddy) జిల్లా పటాన్చెరు(Patancheru) మండలం ముత్తంగి గ్రామంలో 296 సర్వే నంబర్లలో ఉన్న గాయత్రి వెంచర్ పార్క్ స్థలంలో నిర్మించిన షెడ్డును హైడ్రా అధికారులు కూల్చివేశారు. ముందుస్తు సమాచారం మేరకు రంగంలోకి దిగిన అధికారులు పూర్తి ఆధారాలతో కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. అక్కడ అధికారులు, పోలీసుల పర్యవేక్షణలో కూల్చివేతలు జరుగుతున్నాయి.ఇదిలా ఉండగా.. తెలంగాణలో చెరువు భూములు, ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు తీసుకొచ్చిన హైడ్రా ఇప్పటికే కొన్ని వందల ఎకరాల ప్రభుత్వ భూములను రక్షించింది. ఈ క్రమంలో పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. మూడు రోజుల క్రితమే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా మరోసారి పంజా విసిరింది. అమీన్పూర్ చెరువులో ఏపీకి చెందిన నేత అక్రమ నిర్మాణాన్ని హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. చెరువును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేసినట్లు హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. దీనిపై విచారణ జరిపిన హైడ్రా అక్రమాలు జరిగింది నిజమేనని నిర్ధారించుకుని కూల్చివేతలకు దిగింది. గతంలోనూ అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. అయితే ఇక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో కూల్చివేతలు కొనసాగించాలని నిర్ణయించింది.స్వాధీన స్థలాల్లో హైడ్రా బోర్డులుప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, పార్కుల స్థలాల ఆక్రమణలను తేల్చి కూల్చేసిన స్థలాల్లో ‘ప్రొటెక్టెడ్ బై హైడ్రా’ అని బోర్డులు పెట్టాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న స్థలాల్లో ప్రభుత్వ స్థలం అని ఏర్పాటుచేసిన బోర్డులను తొలగించి ఆక్రమిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, దీంతో హైడ్రా ప్రొటెక్షన్‌లో ఉన్నట్టుగా బోర్డులు పెట్టాలని సూచించారు. -
మళ్లీ అమీన్పూర్లో ‘హైడ్రా’ కూల్చివేతలు
సాక్షి,హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా మరోసారి పంజా విసిరింది. ఇక్కడ హైడ్రా కూల్చివేతలు మళ్లీ మొదలయ్యాయి. అమీన్పూర్ చెరువులో ఏపీకి చెందిన నేత అక్రమ నిర్మాణాన్ని హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చెరువును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేసినట్లు హైడ్రాకు ఫిర్యాదులందాయి. దీనిపై విచారణ జరిపిన హైడ్రా అక్రమాలు జరిగింది నిజమేనని నిర్ధారించుకుని కూల్చివేతలకు దిగింది. గతంలోనూ అమీన్పూర్ మునిసిపాలిటీ పరిధిలో హైడ్రా పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. అయితే ఇక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో కూల్చివేతలు కొనసాగించాలని నిర్ణయించింది. అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిందేనని హైడ్రాకు ప్రభుత్వం ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. -
పోచారంలో కూల్చివేతలపై స్పందించిన హైడ్రా కమిషనర్
సాక్షి, హైదరాబాద్: పోచారంలో కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ (Hydra Commissioner) స్పందించారు. భద్రత పేరిట 200 ఎకరాల చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టారని.. అన్ని విషయాల్లో నిబంధనలు ఉల్లంఘించారని రంగనాథ్ తెలిపారు. పదుల ఎకరాల్లో ప్రభుత్వ భూమిని లాక్కొని.. ఎన్ఎంఆర్ సంస్థ కాంపౌండ్ వాల్ కట్టింది. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ కొనసాగుతోందన్నారు.కాగా, ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా పోచారం మున్సిపాలిటీలో కూడా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పలు కాలనీలకు, నివాస ప్రాంతాలకు వెళ్లేందుకు అవకాశం లేకుండా నిర్మించిన దివ్యనగర్ లే అవుట్ చుట్టూ ఉన్న ప్రహరీ గోడను అధికారులు తొలగిస్తున్నారు. పోచారం మున్సిపాలిటీలో ఉన్న దివ్య లే అవుట్ మొత్తం విస్తీర్ణం 200 ఎకరాల వరకూ ఉంటుంది. ఇందులో మొత్తం 2218 ప్లాట్లు వేశారు. ఈ ప్లాట్లలో 30 శాతం నల్ల మల్లారెడ్డివేనంటూ ఆరోపణలు ఉన్నాయి.ఇక, దివ్యనగర్ లే అవుట్ చుట్టూ ఉన్న ప్రహరీ కూల్చివేతతో మార్గం సుగమం అయిన కాలనీలు.. ఏకశిలా లే ఔట్, వెంకటాద్రి టౌన్షిప్, సుప్రభాత్ వెంచర్ -1 , మహేశ్వరి కాలనీ, కచ్చవాణి సింగారం, ఏకశిలా - పీర్జాదిగూడ రోడ్డు, బాలాజీనగర్, సుప్రభాత్ వెంచర్ -4 , వీజీహెచ్ కాలనీ, ప్రతాప్ సింగారం రోడ్డు, సుప్రభాత్ వెంచర్ -2, 3, సాయిప్రియ, మేడిపల్లి, పర్వతపురం, చెన్నారెడ్డి కాలనీ, హిల్స్ వ్యూ కాలనీ, ముత్తెల్లిగూడగా ఉన్నాయి.ఇదీ చదవండి: తెలంగాణలో మరో సంచలనం.. ఇంద్రసేనా రెడ్డి ఫోన్ ట్యాప్! -
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధిలో హైడ్రా కూల్చివేతలు
-
HYDRA: ఘట్కేసర్లో హైడ్రా కూల్చివేతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి అక్రమ నిర్మాణాలను హైడ్రా(Hydra) కూల్చివేస్తోంది. తాజాగా ఘట్కేసర్లో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మించిన నాలుగు కిలోమీటర్ల గోడను అధికారులు కూల్చివేశారు. అలాగే, మేడిపల్లిలోని దివ్యనగర్‌లో కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామునే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.వివరాల ప్రకారం.. ఘట్కేసర్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝళిపిస్తోంది. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన నాలుగు కిలోమీటర్ల కాంపౌండ్ వాల్‌ను అధికారులు కూల్చివేశారు. అయితే, నల్లమల్లారెడ్డి విద్యా సంస్థలు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కాంపౌండ్ నిర్మించినట్లు అనేకమైన ఫిర్యాదులు అందాయి. దీంతో, రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు.. అక్కడ సర్వే చేసి అది ప్రభుత్వ స్థలం అని నిర్ధారించారు. ఈ క్రమంలోనే గోడ కూల్చివేతలను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామునే అక్కడికి భారీగా పోలీసులు చేరుకున్నారు.అలాగే, రంగారెడ్డి జిల్లా పోచారం మున్సిపాలిటీలో కూడా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పలు కాలనీలకు, నివాస ప్రాంతాలకు వెళ్లేందుకు అవకాశం లేకుండా నిర్మించిన దివ్యనగర్ లే అవుట్ చుట్టూ ఉన్న ప్రహరీ గోడను అధికారులు తొలగిస్తున్నారు. పోచారం మున్సిపాలిటీలో ఉన్న దివ్య లే అవుట్ మొత్తం విస్తీర్ణం 200 ఎకరాల వరకూ ఉంటుంది. ఇందులో మొత్తం 2218 ప్లాట్లు వేశారు. ఈ ప్లాట్లలో 30 శాతం నల్ల మల్లారెడ్డివేనంటూ ఆరోపణలు ఉన్నాయి.ఇక, దివ్యనగర్ లే అవుట్ చుట్టూ ఉన్న ప్రహరీ కూల్చివేతతో మార్గం సుగమం అయిన కాలనీలు.. ఏకశిలా లే ఔట్, వెంకటాద్రి టౌన్షిప్, సుప్రభాత్ వెంచర్ -1 , మహేశ్వరి కాలనీ, కచ్చవాణి సింగారం, ఏకశిలా - పీర్జాదిగూడ రోడ్డు, బాలాజీనగర్, సుప్రభాత్ వెంచర్ -4 , వీజీహెచ్ కాలనీ, ప్రతాప్ సింగారం రోడ్డు, సుప్రభాత్ వెంచర్ -2, 3, సాయిప్రియ, మేడిపల్లి, పర్వతపురం, చెన్నారెడ్డి కాలనీ, హిల్స్ వ్యూ కాలనీ, ముత్తెల్లిగూడగా ఉన్నాయి. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. హైడ్రా ఇప్పటికే పలు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. ఈ సందర్బంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో భవిష్యత్తు తరాలకు మంచి నగరాన్ని అందించాలన్న సమున్నత లక్ష్యంతో హైడ్రా ఏర్పాటు అయ్యిందన్నారు. ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. నిర్మాణ అనుమతితో సంబంధం లేకుండా.. గతేడాది జూలైకి ముందు కట్టిన ఏ ఒక్క ఇంటిని హైడ్రా కూల్చివేయలేదని.. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు, పార్కు స్థలాల్లోని వ్యాపార కేంద్రాలను, నిర్మాణంలో ఉన్న నివాస సముదాయాలను మాత్రమే నేలమట్టం చేసినట్లు తెలిపారు. వీరిలో ప్రముఖులకు సంబంధించిన నిర్మాణాలు కూడా ఉన్నాయి. -
మీరు చేసే పనులు వల్ల ప్రజల్లో తిరగలేకపోతున్నాం: దానం
ఆదర్శ్ నగర్( హైదరాబాద్): నగరంలో ఫుట్‌పాత్ కూల్చివేతలపై(Demolished FootpathDemolish Footpaths) అధికారులు ఏకఫక్షంగా వవ్యహరిస్తున్నారని ఎమ్మెల్యే దానం నాగేదందర్(Danam Nagender) మండిపడ్డారు. పేద ప్రజల జీవనాధారాన్ని అధికారులు ధ్వంసం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఎలాంటి పబ్లిక్ నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఆదర్శనగర్ లో ఈరోజు(గురువారం) మీడియాతో మాట్లాడిన దానం నాగేందర్.. ‘ అధికారులు(GHMC Officials) చేసే పనుల వల్ల ప్రజల మధ్య మేము తిరగలేకపోతున్నాం. పేదల ఇండ్లను అధికారులు తొలిగించడం సరైంది కాదు.ఓల్డ్ సిటీ లో అక్రమ నిర్మాణాలు వారికి కనిపించడం లేదా?, మొదలు పెడితే అక్కడి నుండే తొలగింపులు చేయాలి. అధికారుల వైఖరి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది.హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాడిని... హైదరాబాద్ ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఉండలేను. అధికారులు తామే సుప్రీం అనుకుంటున్నారు... అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఆ ప్రభుత్వాలు మనుగడ ఉండదు.ప్రభుత్వ ఆధీనంలో అధికారులు పని చేయాలి. హైడ్రా చెరువులను కాపాడటానికి పని చేస్తుంది , దానిని స్వాగతిస్తున్నాను.మూసి ప్రక్షాళన చేయాలనేది ముఖ్యమంత్రి ఆకాంక్షతనకు రాజకీయం ఇచ్చింది హైదరాబాద్ కాబట్టి.. తాను ఖైరతాబాద్ నియోజకవర్గానికె పరిమితం కాదు..హైద్రాబాద్ లో ఎక్కడ ప్రజలకు ఇబ్బంది వచ్చినా దానం అన్నా ముందుంటాడు.గతంలో నేను హైడ్రా విషయంలో మాట్లాడిన ఇప్పుడు ఫుట్‌పాత్ ల విషయంలో మాట్లాడుతున్న అంటే అది ప్రభుత్వానికి చెడ్డపేరు రావొద్దనేదే నా అభిప్రాయంఇటీవల మాదాపూర్ లో ఫుట్పాథ్ పై కుమారి అంటి ని వేదిస్తున్నప్పుడు..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ఆమె జోలికి పోవొద్దని అధికారులకు ఏవిధంగా ఆదేశాలు ఇచ్చారో..ఇప్పుడు ఫుట్పాథ్ ఆక్రమణల కూల్చివేతల్లో కూడా ముఖ్యమంత్రి అదేవిధంగా ఆదేశాలు ఇవ్వాలి’ అని దానం పేర్కొన్నారు.హైడ్రాపై మరోసారి దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు -
చెరువుల కబ్జాపై కన్నెర్ర!
సాక్షి, హైదరాబాద్: ఆక్రమణదారుల చెర పడకుండా చెరువులను కాపాడేందుకు కంకణం కట్టుకున్న హైడ్రా (Hydraa) వాటి పరిరక్షణే లక్ష్యంగా దృష్టి సారిస్తోంది. ఇటీవల హైడ్రా బృందం శివారుల్లో పలు ప్రాంతాల్లో పర్యటించి చెరువుల పరిస్థితితోపాటు ప్రభుత్వ భూముల కబ్జాల సంగతి తేల్చేందుకు పర్యవేక్షణలు చేపట్టింది. ఈ సందర్భంగా స్థానికులు, బస్తీవాసులు, ప్రజలు తమ చెరువులు, కుంటలు కబ్జాకు గురయ్యాయని, భవనాలు, బహుళ అంతస్తులు వెలుస్తున్నాయని వినతులు సమర్పించారు. హైడ్రా కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి (Prajavani) కార్యక్రమంలో కూడా చాలామంది చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రాత పూర్వక ఫిర్యాదులను అందజేశారు. ఈ మేరకు హైడ్రా రాజధానికి సమీపంలోని చాలా చెరువులు ఆక్రమణకు గురైనట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.ఆక్రమణదారులు మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో సుమారు 200 చెరువులను, చెరువు శిఖం భూములను, బఫర్జోన్లలో పెద్ద ఎత్తున వెంచర్లు వేసి, రూ.వందల కోట్లు ఆర్జించారు. అసలు విషయం తెలియక స్థలాలు కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకొన్న సామాన్య, మధ్యతరగతి (Middle Class) ప్రజలు మాత్రం ఆర్థికంగా నష్టపోతున్నారు. వర్షాకాలంలో ఈ కాలనీలు, అపార్ట్మెంట్లు జలాశయాలుగా మారుతున్నాయి. హబ్సిగూడ, రామంతాపూర్ చెరువును ఆనుకొని ఏర్పడిన మూడు కాలనీలు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో మునకేస్తున్నాయి. కూకట్పల్లి, (Kukatpally) కుత్బుల్లాపూర్, ప్రగతినగర్, నిజాంపేట్, గాజుల రామారం, సరూర్‌నగర్, మేడ్చల్, దమ్మాయిగూడ, వెంకటాపూర్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, టోలిచౌకి, గుండ్లపోచంపల్లి, జల్పల్లి, బడంగ్పేట్, నాచారం, ఉప్పల్, చెంగిచర్ల, మల్కాజిగిరి, ఘట్కేసర్, పోచారం తదితర ప్రాంతాల్లో చెరువులు అదృశ్యమై కాలనీలు పుట్టుకొచ్చాయి. ఆక్రమణలో.. మేడ్చల్ నియోజకవర్గంలోని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ‘రా’చెరువు, చింతల చెరువులోని బఫర్ జోన్లను దర్జాగా కబ్జా చేసి, బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టారు. చెంగిచర్ల బస్సు డిపో సమీపంలో ఉన్న చెరువు కట్టను ధ్వంసం చేసి.. బహుళ అంతస్తుల భవనాలను నిర్మించటం వల్ల సమీపంలోని కాలనీలు జలమ యం కాగా, రోడ్లన్నీ అధ్వాన్నంగా మారాయి. పోచారం పురపాలక సంఘం పరిధిలోని వెంకటాపూర్ నాడెం చెరువు ఆక్రమణకు గురికావటంతో బహుళ అంతస్తులు వెలిశాయి. దమ్మాయిగూడ, నాగారం, (Nagaram) బోడుప్పల్, పీర్జాదిగూడ, ఘట్కేసర్ పురపాలక సంఘాల పరిధిలోని చెరువు భూముల్లో కూడా అక్రమంగా భవనాలు వెలిశాయి. రెవెన్యూ, నీటి పారుదల, పురపాలక శాఖల మధ్య సమన్వయం లేకపోవటం వల్లే ఈ కబ్జాల పర్వం మూడు పూవ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కుత్బుల్లాపూర్, గాజుల రామారం, కూకట్పల్లి, ఉప్పల్ సర్కిళ్లలో వరదలతో కాలనీలన్నీ జలమయంగా మారినప్పుడల్లా.. చెరువులు, కుంటల ఎఫ్టీఎల్ పరిధితో ఉన్న పలు అక్రమ కట్టడాలను మొక్కబడిగా కూల్చివేస్తున్నారు. వీరి అలసత్వాన్ని అవకాశంగా తీసుకుంటున్న కబ్జారులు కోర్టు కెళ్లుతుండటంతో వాటి జోలికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోంది.అంతంతే.. శివారుల్లో చెరువులు, కుంటల ఆక్రమణలు ,ప్రభుత్వ భూముల కబ్జాలపై ఫిర్యాదులు చేసినప్పుడు , కథనాలు వచ్చినపుడు లేదా ఉన్నతస్థాయి ఒత్తిళ్లు వచ్చినప్పుడు మాత్రమే ఇరిగేషన్, రెవెన్యూ యంత్రాంగం కదలి తూతూ మాత్రంగా కూల్చివేతలకు శ్రీకారం చుట్టి .. రాజకీయ పెద్దల జోక్యంతో చేతులు దులుపేసుకుంటున్నారు. కొన్ని చోట్ల కూల్చివేతలకు చేపట్టినా కొంత కాలం తర్వాత తిరిగి నిర్మాణాలు కొనసాగుతున్నాయి. శాఖల మధ్య సమన్వయ లోపం కబ్జాదారులకు అనువుగా మారుతోంది. హైడ్రా ఏర్పడిన తర్వాత కబ్జాదారులు, భూఅక్రమణ దారుల్లో వణుకు మొదలైంది. ఎప్పుడు తమ బండారం బయట పడి అక్రమ కట్టడాలు నేలమట్టమవుతాయోనని బిక్కుబిక్కుమంటున్నారు. చదవండి: చెట్టు చెట్టుకో కథ.. తెలంగాణలోని 9 చారిత్రక వృక్షాలివీ.. -
హైడ్రాపై మరోసారి దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఈ-కార్ రేస్‌లో కేటీఆర్‌కు తాను క్లీన్చిట్ ఇవ్వలేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. హైదరాబాద్‌కు ఇమేజ్ పెరిగిందని మాత్రమే చెప్పానని.. విచారణ జరిగేటప్పుడు కామెంట్ చేయడం సరికాదన్నారు. క్విడ్‌ప్రోకో జరిగిందా లేదా తేల్చాలి. హైడ్రా వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అయిందని మళ్లీ చెబుతున్నాను. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలి. తాను ఫైటర్‌ను.. ఉప ఎన్నికకు భయపడేది లేదని దానం అన్నారు.‘‘నేను ఏది మాట్లాడినా కూడా సంచలనమే అవుతుంది. మూసీపై కంటి తుడుపు చర్యల్లాగా ఒక్కరోజు మూసీ నిద్ర చేశారని.. వారు నిద్ర చేయడానికి వెళ్లే ముందే ఏసీలు పెట్టించుకుని పడుకున్నారు. వారి ఇళ్లల్లోనే చేసిన జొన్న రొట్టెలు తినకుండా.. కిషన్ రెడ్డి బయట నుంచి ఇడ్లీలు తెప్పించుకుని తిన్నారు. హైదరాబాద్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉందని ఇక్కడికి కొన్ని సంస్థలు వచ్చి స్థిరపడ్డాయి. హైదరాబాద్ సేఫెస్ట్ సిటీ కాబట్టి ముంబయికి వెళ్ళే ఇన్వెస్టర్లు ఇక్కడికి వస్తున్నారు.’’ అని దానం నాగేందర్ చెప్పారు.‘‘పదేళ్ల అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర బడ్జెట్ చూస్తే ఖాళీగా ఉంది. అయినా ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ముందుకెళ్తుంది. రుణమాఫీ, రైతు భరోసా అమలు జరుగుతున్నందున సీఎంకి పాలాభిషేకం చేయాలి’’ అంటూ దానం నాగేందర్ వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు @సేల్! -
రంగారెడ్డి జిల్లా మణికొండలో హైడ్రా కూల్చివేతలు
-
మణికొండలో హైడ్రా కూల్చివేతలు
సాక్షి,హైదరాబాద్: మణికొండలో హైడ్రా(hydera) కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. నెక్నాంపూర్లో కూల్చివేతలు చేపట్టనుంది. హైడ్రా కమీషనర్ రంగనాథ్ అదేశాల మేరకు నెక్నాంపూర్ (Neknampur Lake)చెరువులో అక్రమంగా వెలసిన నిర్మాణాలను కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగనున్నాయి. హైదరాబాద్‌లో ప్రభుత్వ ఆస్తులు, చెరువల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా అక్రమార్క్ల గుండెల్లో దడ పుట్టిస్తోంది. చెరువులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన కబ్జారాయుళ్ల నుంచి గడిచిన కొన్ని నెలల వ్యవధిలో వందల ఎకరాల్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్రమణ నిర్మాణాల్ని కూల్చివేసింది. తాజాగా, కబ్జా కోరల్లో చిక్కుకున్న నెక్నాంపురా చెరువులో అక్రమ నిర్మాణాల్ని తొలగించనుంది. హైడ్రా పోలీసు స్టేషన్..ఇదిలా ఉండగా.. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కోసం ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటైంది. నగరంలోని బుద్ధ భవన్లో బీ–బ్లాక్ కేంద్రంగా కార్యకలాపాలు హైడ్రా ఠాణా కార్యకలాపాలు సాగించనుంది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఠాణాకు ఏసీపీ స్థాయి అధికారి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా (ఎస్హెచ్ఓ) ఉండనున్నారు. ఓఆర్ఆర్ లోపలి భాగం, దానికి ఆనుకొని ఉన్న మున్సిపాలిటీలు దీని పరిధిలోకి వస్తాయి. ఈ ఠాణాలో పని చేయడానికి సిబ్బంది, అధికారులను డిప్యూటేషన్ ప్రాతిపదికన తీసుకోనున్నారు. గణతంత్ర వేడుకల్లోగా హైడ్రా ఠాణా కార్యకలాపాలు ప్రారంభించేలా రంగనాథ్ కసరత్తు చేస్తున్నారు. దర్యాప్తులో జాప్యాన్ని నివారించేందుకు.. జలవనరుల్లో కట్టడాలకు అడ్డగోలు అనుమతులను హైడ్రా తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపై ఆయా పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయిస్తోంది. సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ)తోపాటు అనేక చోట్ల ఇప్పటికే కేసుల దర్యాప్తు సాగుతోంది. అయితే రోజువారీ కార్యకలాపాల్లో తలమునకలై ఉండే స్థానిక పోలీసులు ఈ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వలేకపోతుండటంతో దర్యాప్తు ఆలస్యమవుతోంది. ఇది కబ్జాకోరులు, అక్రమార్కులకు వరంగా మారుతుండటంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ (hydra commissioner ranganath) ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అందుకు సానుకూలంగా స్పందించిన సర్కారు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.పీడీపీపీ కింద కేసులు! జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువుల్లో అనేకం ప్రస్తుతం కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. వాటితోపాటు ప్రభుత్వ భూములు, పార్కులు సైతం అన్యాక్రాంతమయ్యాయి. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక చట్టం (పీడీపీపీ) కింద కేసులు నమోదు చేసే అవకాశాన్ని హైడ్రా పరిశీలిస్తోంది. -
HYD: అయ్యప్ప సొసైటీపై ‘హైడ్రా’ ఫుల్ ఫోకస్.. మరిన్ని కూల్చివేతలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అక్రమ కట్టడాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. తాజాగా మాదాపూర్‌లోని ఏడు అంతస్తుల అక్రమ నిర్మాణాన్ని హైడ్రా కూల్చివేసింది. ఇదే సమయంలో అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాలపై హైడ్రా దృష్టి సారించింది. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడ పర్యటించారు.మాదాపూర్‌లోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. అయ్యప్ప సొసైటీలోని అక్రమ కట్టడాల్లో హాస్టల్స్ పుట్టగొడుగుల్లా వెలిశాయి. తాజా పరిస్థితులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యవేక్షించారు. అక్రమ నిర్మాణాల కారణంగా రోడ్లపైనే డ్రైనేజీలు పారుతుండటాన్ని గుర్తించారు. దీంతో, అక్రమ కట్టడాలకు అనుమతిచ్చిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అధికారులపై చర్యలు తీసుకునేందుకు అనుమతి కోసం ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు రంగనాథ్ తెలిపారు.హైడ్రా పోలీసు స్టేషన్..ఇదిలా ఉండగా.. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కోసం ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటైంది. నగరంలోని బుద్ధ భవన్లో బీ–బ్లాక్ కేంద్రంగా కార్యకలాపాలు హైడ్రా ఠాణా కార్యకలాపాలు సాగించనుంది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఠాణాకు ఏసీపీ స్థాయి అధికారి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా (ఎస్హెచ్ఓ) ఉండనున్నారు. ఓఆర్ఆర్ లోపలి భాగం, దానికి ఆనుకొని ఉన్న మున్సిపాలిటీలు దీని పరిధిలోకి వస్తాయి. ఈ ఠాణాలో పని చేయడానికి సిబ్బంది, అధికారులను డిప్యూటేషన్ ప్రాతిపదికన తీసుకోనున్నారు. గణతంత్ర వేడుకల్లోగా హైడ్రా ఠాణా కార్యకలాపాలు ప్రారంభించేలా రంగనాథ్ కసరత్తు చేస్తున్నారు. దర్యాప్తులో జాప్యాన్ని నివారించేందుకు.. జలవనరుల్లో కట్టడాలకు అడ్డగోలు అనుమతులను హైడ్రా తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపై ఆయా పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయిస్తోంది. సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ)తోపాటు అనేక చోట్ల ఇప్పటికే కేసుల దర్యాప్తు సాగుతోంది. అయితే రోజువారీ కార్యకలాపాల్లో తలమునకలై ఉండే స్థానిక పోలీసులు ఈ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వలేకపోతుండటంతో దర్యాప్తు ఆలస్యమవుతోంది. ఇది కబ్జాకోరులు, అక్రమార్కులకు వరంగా మారుతుండటంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అందుకు సానుకూలంగా స్పందించిన సర్కారు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.పీడీపీపీ కింద కేసులు! జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువుల్లో అనేకం ప్రస్తుతం కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. వాటితోపాటు ప్రభుత్వ భూములు, పార్కులు సైతం అన్యాక్రాంతమయ్యాయి. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక చట్టం (పీడీపీపీ) కింద కేసులు నమోదు చేసే అవకాశాన్ని హైడ్రా పరిశీలిస్తోంది. -
ఎట్ల బతుకుతున్నరయ్యా ఈ బస్తీలో..
హైదరాబాద్: ‘ఎట్ల బతుకుతున్నరయ్యా ఈ బస్తీలో.. సరిగా నడవడానికి సైతం బాటల్లేవు.. నిలబడే జాగా లేదు.. ఇరుకు సందులు.. మురికి కూపాలు’ అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. మంగళవారం ఆయన జూబ్లీహిల్స్‌లోని గురుబ్రహ్మనగర్ బస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా గుడిసెల మధ్య ఉన్న మురికి కాల్వల మీదుగా.. ఇరుకు సందుల నుంచి బయటకి వస్తూ.. ‘ఇదేం సందయ్యా.. నేనంటే సన్నగా ఉన్నాను కాబట్టి ఇందులో నుంచి రాగలిగాను. అదే కొంచెం దొడ్డుగా ఉన్నోడి పరిస్థితి ఏంది? అసలు ఇక్కడ ఎలా ఉండగలుగుతున్నారయ్యా’ అంటూ బస్తీవాసుల పరిస్థితిని చూసి ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ‘గల్లీ చిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది.. అనే పాట విన్నదే కానీ ఇప్పుడు నాకు ప్రత్యక్షంగా కనిపించింది’ అంటూ ముందుకు సాగారు. -
హైడ్రా ఠాణా ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువుల కబ్జాల నిరోధం, విపత్తుల వేళ సత్వర స్పందన తదితర లక్ష్యాలతో ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కోసం ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటైంది. నగరంలోని బుద్ధ భవన్లో బీ–బ్లాక్ కేంద్రంగా కార్యకలాపాలు హైడ్రా ఠాణా కార్యకలాపాలు సాగించనుంది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఠాణాకు ఏసీపీ స్థాయి అధికారి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా (ఎస్హెచ్ఓ) ఉండనున్నారు. ఓఆర్ఆర్ లోపలి భాగం, దానికి ఆనుకొని ఉన్న మున్సిపాలిటీలు దీని పరిధిలోకి వస్తాయి. ఈ ఠాణాలో పని చేయడానికి సిబ్బంది, అధికారులను డిççప్యూటేషన్ ప్రాతిపదికన తీసుకోనున్నారు. గణతంత్ర వేడుకల్లోగా హైడ్రా ఠాణా కార్యకలాపాలు ప్రారంభించేలా రంగనాథ్ కసరత్తు చేస్తున్నారు. దర్యాప్తులో జాప్యాన్ని నివారించేందుకు.. జలవనరుల్లో కట్టడాలకు అడ్డగోలు అనుమతులను హైడ్రా తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపై ఆయా పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయిస్తోంది. సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ)తోపాటు అనేక చోట్ల ఇప్పటికే కేసుల దర్యాప్తు సాగుతోంది. అయితే రోజువారీ కార్యకలాపాల్లో తలమునకలై ఉండే స్థానిక పోలీసులు ఈ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వలేకపోతుండటంతో దర్యాప్తు ఆలస్యమవుతోంది. ఇది కబ్జాకోరులు, అక్రమార్కులకు వరంగా మారుతుండటంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అందుకు సానుకూలంగా స్పందించిన సర్కారు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పీడీపీపీ కింద కేసులు! జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువుల్లో అనేకం ప్రస్తుతం కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. వాటితోపాటు ప్రభుత్వ భూములు, పార్కులు సైతం అన్యాక్రాంతమయ్యాయి. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక చట్టం (పీడీపీపీ) కింద కేసులు నమోదు చేసే అవకాశాన్ని హైడ్రా పరిశీలిస్తోంది.చెరువులను పూడ్చడమంటే ధ్వంసం చేసినట్లేననే ఉద్దేశంతో ఈ దిశగా యోచిస్తోంది. ఈ చట్టం కింద కేసు నమోదు వల్ల బాధ్యుల నుంచి జరిగిన నష్టాన్ని రికవరీ చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. హైడ్రా ఠాణా పరిధి ఇలా... హైడ్రా విస్తరించి ఉన్న 2,053.44 చదరపు కిలోమీటర్లలో ఉండే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీలు, ప్రత్యేక పాలనా సంస్థలు ప్రత్యేక పరిపాలనా వ్యవస్థలుసికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, ఐలాలతో సహా 61 పారిశ్రామిక ప్రాంతాలుకార్పొరేషన్లు జీహెచ్ఎంసీ, బడంగ్పేట్, బండ్లగూడ జాగీర్, మీర్పేట్–జిల్లెలగూడ, బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేట్మున్సిపాలిటీలు పెద్ద అంబర్పేట్, ఇబ్రహీంపట్నం, జల్పల్లి, శంషాబాద్, తుర్కయాంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిబట్ల, తుక్కుగూడ, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, దమ్మాయిగూడ, నాగారం, ఘట్కేసర్, గుండ్ల పోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్, పోచారం.గ్రామ పంచాయతీలు రామచంద్రాపురం, ఐలాపూర్, కర్ధనూర్, కిష్టారెడ్డిపేట్, ముత్తంగి, పోచారం, సుల్తాన్పూర్, కాచివానిశింగారం, కొర్రెముల్, పీర్జాదిగూడ, ప్రతాపసింగారం, బాచారం, గౌరెల్లి, కుత్బుల్లాపూర్, తారామతిపేట్, చేర్యాల్, గుడుమకుంట, కీసర, రాంపల్లి, తిమ్మాయిపల్లి, యాద్గిర్పల్లి, మన్ఖల్, గౌడవెల్లి, పుద్దూర్, మంచిరేవుల, బొమ్మరాస్పేట్, గోల్కొండ కలాన్, గోల్కొండ కుర్థ్, హమీదుల్లానగర్, జన్వాడ. -
హైడ్రా తొలి పోలీస్‌స్టేషన్ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: హైడ్రా తొలి పోలీస్‌స్టేషన్‌ను తెలంగాణ హోంశాఖ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసే వారిపై ఇక హైడ్రా పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేయనున్నారు. బుద్ధభవన్‌లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తూ..స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌గా ఏసీపీ స్థాయి అధికారిని ప్రభుత్వం నియమించనుంది. హైడ్రా పోలీస్ స్టేషన్‌కి కావలసిన పోలీస్ సిబ్బందిని కేటాయించాలని రాష్ట్ర డీజీపీకి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.కాగా, ప్రతి సోమవారం బుద్ధ భవన్ వేదికగా నగర ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పార్కులు, స్థలాలు, చెరువులకు సంబంధించి ఆక్రమణలపై నేరుగా ప్రజల నుండి ఫిర్యాదుల స్వీకరించనున్నారు.ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు ప్రజావాణి నిర్వహించనున్నారు. ప్రజావాణిలో ఫిర్యాదుదారులు ఆధారాలతో సహా రావాలని హైడ్రా కమిషనర్ సూచించారు. మొదటగా వచ్చిన 50 మంది ఫిర్యాదు దారులకు టోకెన్స్ ఇచ్చి.. ప్రాధాన్యతా క్రమంలో ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపిన రంగనాథ్ వెల్లడించారు.ఇదీ చదవండి: సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్ -
హైడ్రా మళ్లీ వీకెండ్ ఆపరేషన్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) తన వీకెండ్ ఆపరేషన్లను పునఃప్రారంభించింది. మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న 684 చదరపు గజాల ప్రభుత్వ స్థలంలో హైకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి అక్రమంగా నిర్మిస్తున్న ఐదు అంతస్తుల భవనాన్ని హైడ్రా అధికారులు ఆదివారం కూల్చేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం అక్కడ పర్యటించి పూర్వాపరాలు తెలుసుకున్నారు. హైడ్రా ఏర్పాటైన తొలినాళ్లలో దాదాపు ప్రతి వీకెండ్లోనూ ఓ అక్రమ నిర్మాణం కూల్చివేత ఉండేది. అక్రమ నిర్మాణాలెన్నో.. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ పరిధిలోని అయ్యప్ప సొసైటీలో అనేక అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. 100 ఫీట్ల రోడ్డులో ఉన్న 684 చదరపు గజాల ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఐదు అంతస్తుల్లో ఓ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇది అక్రమ నిర్మాణమని గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు.. గత ఏడాది ఫిబ్రవరి 14న షోకాజ్ నోటీసులు, 26న స్పీకింగ్ ఉత్తర్వులు ఇచ్చింది. వీటిని భవన యజమాని హైకోర్టు సవాల్ చేశారు. ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం అది అక్రమ నిర్మాణమని తేల్చి, కూల్చివేయాలని గత ఏడాది ఏప్రిల్ 19న ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ అధికారులు.. గత ఏడాది జూన్ 13న ఆ భవనం స్లాబ్‌కు అనేక చోట్ల పెద్ద పెద్ద రంధ్రాలు చేసి విడిచిపెట్టారు. వాటిని పూడ్చేసిన యజమానికి నిర్మాణం కొనసాగిస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం దీనిపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఇటీవల సదరు అక్రమ నిర్మాణంపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. రాత్రి 8 గంటల వరకు.. క్షేత్రస్థాయిలో పర్యటించిన ఏవీ రంగనాథ్, భవనాన్ని కూల్చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం ఉదయం ఆ భవనం వద్దకు చేరుకున్న ‘బాహుబలి క్రేన్’కూల్చివేత మొదలు పెట్టింది. రాత్రి 8 గంటల వరకు కూల్చివేత కొనసాగింది. అక్కడ పోలీసులు, హైడ్రా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భవనం ప్రధాన రహదారి పక్కనే ఉండడంతో విద్యుత్ సరఫరా ఆపేయడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ ప్రాంతంలో రోడ్డును ఆక్రమించి నిర్మించిన కట్టడాలన్నింటినీ కూల్చివేస్తామని హైడ్రా అధికారులు తెలిపారు. అనుమతిచ్చిన అధికారుల వివరాలపై ఆరా తీస్తున్నాం.. హైకోర్టు అక్రమం అని తేల్చినా భవన నిర్మాణం కొనసాగడానికి కారణమైన అధికారుల వివరాలు ఆరా తీస్తున్నాం. బాధ్యులపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాం. అయ్యప్ప సొసైటీలో దాదాపు అన్నీ అక్రమ నిర్మాణాలే. ఆ భవనాలకు ఫైర్ ఎన్ఓసీ, భవన నిర్మాణ అనుమతి కూడా లేదు. అయ్యప్ప సొసైటీలో ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీతో కలిసి సమీక్షిస్తాం. హైకోర్టు నుంచి స్పష్టమైన కూల్చివేత ఉత్తర్వులు ఉన్న వాటిని తొలి దశలో కూల్చేస్తాం. – ఏవీ రంగనాథ్, హైడ్రా కమిషనర్. -
హైడ్రా దూకుడు.. 6 అంతస్తుల భవనం కూల్చివేత
-
మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్
-
HYD: మాదాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అనుమతులు లేకున్నా నిర్మాణాలు చేపట్టిన భవనాలను హైడ్రా కూల్చివేస్తోంది. తాజాగా హైడ్రా.. నగరంలోని మాదాపూర్‌లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. మాదాపూర్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా(HYDRA) ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భారీ భవనాన్ని హైడ్రా కూల్చివేస్తోంది. అయ్యప్ప సొసైటీలో సెట్ బ్యాక్ లేకుండా నిర్మిస్తున్న ఆరు అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. అయితే, అనుమతులు లేకుండా చేపట్టిన భవనంపై హైడ్రాకు పలు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు మార్లు అధికారులు హెచ్చరించినా బిల్డర్ మాత్రం పట్టించుకోలేదు. దీంతో, రంగంలోకి దిగిన హైడ్రా.. ఆదివారం నిర్మాణాన్ని నేలమట్టం చేసింది. ఇక, అంతకుముందు.. ఈ భవన నిర్మాణంపై స్థానికులు హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో, హైడ్రా రంగనాథ్ మాదాపూర్(Madhapur)లో పర్యటించారు. ఈ క్రమంలో అక్కడ భవన నిర్మాణానికి అనుమతులు లేవని తేలడంతో రంగనాథ్ కూల్చివేతకు ఆదేశించారు. దీంతో, నేడు భవనాన్ని కూల్చివేశారు.