ఆ పాప రేపిస్టును గుర్తుపట్టింది
ముంబయి: తనపై అత్యంత పాశవికంగా లైంగికదాడికి పాల్పడిన వ్యక్తిని ఐదేళ్ల బాలిక గుర్తించింది. దీంతో ఘటన జరిగి తొమ్మిది రోజుల తర్వాత ఈ కేసు ఓ కొలిక్కి వచ్చింది. పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకోనున్నారు. తరచూ తన తల్లితో కలిసి బట్టల దుకాణానికి వచ్చే ఓ పాపను.. పూల కొట్టుకు వెళ్లినప్పుడు గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో అత్యాచారానికి పాల్పడిన ఘటన ముంబయిలో తొమ్మిది రోజుల కిందట జరిగింది.
ఈ దారుణానికి పాల్పడి అనంతరం అతడు రోడ్డుపక్కనే వదిలేసి వెళ్లాడు. దాంతో ఆ పాప అపస్మారక స్థితిలో కనిపించగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆ పాపకు రెండు సర్జరీలు చేయాల్సి ఉంది. ఈ కేసు మీద తీవ్ర విమర్శలు రావడంతో తీవ్రంగా పరిగణించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసేందుకు రకరకాల ప్రయోగాలు చేశారు. ఇందులో భాగంగా పది స్కెచ్ ఫొటోలు పాపకు చూపించగా 32 ఏళ్ల అలాం అన్సారీని నిందితుడిగా గుర్తించింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారుగుర్తించగా అందులో ఒకరిని గుర్తించింది.