పెట్టుబడులకు భరోసా: ఈటెల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామికవేత్తల పెట్టుబడులకు ఎలాంటి ఢోకా ఉండదని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ భరోసా ఇచ్చారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విరివిగా పెట్టుబడులు రావాలన్నారు. ఐసీఎస్ఐ (ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా) రెండురోజుల ప్రాంతీయ సమావేశం ఆదివారం నగరంలోని మాదాపూర్‌లో ముగిసింది. మంత్రి రాజేందర్ మాట్లాడుతూ పెట్టుబడుల ప్రోత్సహకానికి కంపెనీ సెక్రటరీల సహకారం అవసరమన్నారు. పెట్టుబడులను ఆకర్షించడానికి అనువైన వాతావరణం నెలకొందని చెప్పారు. అనంతరం కంపెనీ కోర్సులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పతకాలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఐసీఎస్ఐ హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు వాసుదేవరావు, కోశాధికారి ఏవీ రావు, సుధీర్‌బాబు పాల్గొన్నారు.
మూడెకరాలు కేటారుుంచాలి: వుంత్రికి ఎరుకల సంఘం వినతి
హైదరాబాద్: ఆర్థికంగా, సామాజకంగా వెనకబడిన ఎరుకల కులస్తులకు మూడెకరాల భూమి, సొంత ఇల్లు నిర్మించి ఇప్పించేందుకు కృషి చేయాలని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌కు రాష్ట్ర ఎరుకల ప్రజా సంఘం విజ్ఞప్తి చేసింది. ఆదివారం సంఘ చైర్మన్ కూతాడి శ్రీనివాస్, అధ్యక్షుడు కూతాడి కుమార్ల ఆధ్వర్యంలో వుంత్రిని కలసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఎరుకల కులస్తుల ఆరాధ్య దైవమైన ఏకలవ్యుని విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్టించాలని, ఎరుకల రాష్ట్ర సంఘానికి హైదరాబాద్‌లో స్థలాన్ని కేటాయించి భవనాన్ని నిర్మించి ఇవ్వాలని, ఎరుకలకు ప్రత్యేక ఐటీడీఎను మంజూరు చేయాలని, చట్ట సభల్లో ఎరుకలకు ప్రత్యేక స్థానం కల్పించాలని వినతి పత్రంలో కోరినట్లు తెలిపారు. మంత్రిని కలసిన వారిలో సంఘ ప్రధాన కార్యదర్శి నల్లగొండ శ్రీనివాస్, మహిళాధ్యక్షురాలు శ్యామల, ఉపాధ్యక్షులు వెలుగు నాగార్జున, కోశాధికారి రాజు, ఎం.వి.రమణ తదితరులు ఉన్నారు.