Irrigation scheme
-
పైపులైన్‌తో పంటచేలకు సాగునీరు
సాక్షి, ఆదిలాబాద్: తాంసి మండలం వడ్డాడి గ్రామంలోని మత్తడివాగు మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుకు ఓ ప్రత్యేకత ఉంది. ఎడమ కాలువ నుంచి గ్రావిటీ ద్వారా చేలకు సాగునీరు అందిస్తుండగా, కుడివైపు పైపులైన్ ద్వారా నీటి సరఫరా చేస్తుండడమే ఆ ప్రత్యే కత. ప్రాజెక్టు నుంచి అండర్‌గ్రౌండ్‌లో పైపులైన్ వేసి చేలకు నీరందించే ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే తొలి సారిగా పనులు చేపట్టగా, ఇటీవల పూర్తయ్యాయి. ఇటీవల సీఎం జిల్లా పర్యటనకు వస్తున్నారని ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. కానీ ఆ పర్యటన రద్దు కావడంతో మళ్లీ ముహూర్తం చూస్తున్నారు.రైతులు భూములు ఇవ్వకపోవడంతో..మత్తడివాగు ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా 8,500 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. ఇక కుడి వైపు 1,200 ఎకరాల ఆయకట్టుకు స్థిరీకరణ ఏళ్లుగా నిలిచిపోయింది. కాలువల నిర్మాణం కోసం రైతులు తమ భూములు ఇచ్చేందుకు నిరాకరించడమే. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రత్యా మ్నాయ పద్ధతిపై దృష్టి సారించారు. అప్పట్లో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీశ్‌రావు తదితరులు మధ్యప్రదేశ్ పర్యటనకు వెళ్లినప్పుడు పైపులైన్ ద్వారా సాగునీరు అందిస్తున్న పథకాన్ని పరిశీలించారు. ఆ తర్వాత మహారాష్ట్రలోనూ ఇలాంటి స్కీమ్‌ను చూశాక మత్తడివాగు ప్రాజెక్టుకు కుడి కాలువ స్థానంలో పైపులైన్ వేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఆ తర్వాత దీనికి సంబంధించి జైన్ అనే కాంట్రాక్ట్ సంస్థకు రూ.7.34 కోట్లతో ఈ మైక్రో ఇరిగేషన్ పథక నిర్మాణానికి టెండర్ అప్పగించింది. ఈ కంపెనీకి కర్ణాటకలో ఇదివరకు ఇలాంటి స్కీమ్ నిర్మించిన అనుభవం ఉంది. ప్రాజెక్టు కుడివైపు అండర్‌గ్రౌండ్‌లో 9 కిలోమీటర్ల మేర ప్రధాన పైపులైన్ వేయగా, మరో 20 కిలోమీటర్లు అంతర్గత పైపులైన్ వేశారు. ప్రాజెక్టు సమీపంలోనే నిర్మించిన పంప్‌హౌస్ ద్వారా నీరు ఎత్తిపోసి పైపులైన్‌తో సరఫరా చేస్తారు. నీటి పంపిణీ ఇలా.. ప్రధాన పైపులైన్‌కు 25 బ్లాక్‌లు ఏర్పాటు చేశాం. మధ్యలో 8 ఔట్ లెట్లు నిర్మించాం. ఈ ఔట్ లెట్లు చేల వరకు నీటిని తీసుకెళతాయి. ఇలా 1200 ఎకరాలకు సాగునీరు సరఫరా చేస్తాం. ఈ ఔట్లెట్లకు నంబర్ ఇస్తాం. అక్కడ ఒక మీటర్ కూడా ఏర్పాటు చేస్తాం. తద్వారా ఏ ఔట్ లెట్లో ఎంత నీటి వినియోగం జరు గుతుందనేది నమోదవుతుంది. దీంట్లో సెన్సార్ విధా నంలో స్కాడా సిస్టమ్ అమలు చేస్తున్నాం. తద్వారా ఏ బ్లాక్‌లో, ఏ ఔట్లెట్లో నీటి వినియోగం జరుగుతుందనేది స్పష్టంగా తెలుస్తుంది. డిమాండ్ ఉన్నచోట నీటి సరఫరాకు ఈ సిస్టమ్ అనువుగా ఉంటుంది. – శ్రీనివాసరావు, డీఈ, నీటిపారుదల శాఖ, మత్తడివాగు ప్రాజెక్టుఇదీ ప్రాజెక్టు స్వరూపం..ఈ మధ్యతరహా ప్రాజెక్టును అప్పటి సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనులకు శ్రీకారం చుట్టారు. వైఎస్ మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత పల్లెబాట కార్యక్రమంలో భాగంగా జిల్లాకు వచ్చినప్పుడు ప్రాజెక్టుకు భూమిపూజ చేశారు. ఆ తర్వాత 2008లో ఆయన చేతుల మీదుగానే ఈ ప్రాజెక్టు ప్రారంభించారు. అప్పట్లో రూ.62.4 కోట్లు వెచ్చించారు. 0.571 టీఎంసీల సామర్థ్యంతో ఐదు గేట్లతో ప్రాజెక్టు నిర్మించారు. -
‘సాగు’ ప్రాజెక్టులపై హరీశ్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: సత్వర సాగునీటి ప్రయోజన పథకం కింద రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులకు నిధుల విడుదలలో కేంద్రం జాప్యం చేస్తోందంటూ ఈ నెల 19న ‘మాటలు సరే..మూటలేవీ’ అంటూ ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై నీటిపారుదల మంత్రి టి.హరీశ్‌రావు స్పందించారు. దీనిపై సోమవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ స్పెషల్ సీఎస్ జోషి, కార్యదర్శి వికాస్‌రాజ్, ఈఎన్సీలు మురళీధర్‌రావు, నాగేంద్రరావు, అనిల్, సీఈలు భగవంతరావు, బంగారయ్య, కాడా కమిషనర్ మల్సూర్, ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండేలు హాజరయ్యారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై)లో చేర్చిన దేవాదుల, కుమురం భీం, రాజీవ్ భీమా, ఎస్సారెస్పీ స్టేజ్–2, ఇందిరమ్మ వరదనీటి కాల్వ, పాలెంవాగు, పెద్దవాగు, మత్తడివాగు, ర్యాలివాగు, గొల్లవాగు, నీల్వాయి ప్రాజెక్టుల పనుల పురోగతి తదితర పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్టుల్లో మత్తడివాగు, నీల్వాయి, గొల్లవాగు, ర్యాలివాగు, పాలెంవాగు ప్రాజెక్టుల పనులు పూర్తయ్యాయని అధికారులు చెప్పారు. మిగతా పనులకు సంబంధించి ఎస్సారెస్పీ కింద రూ.31 కోట్లు, రాజీవ్ భీమా కింద రూ.108 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని వివరించారు. దేవాదులకు రూ.470 కోట్లు, నీల్వాయికి రూ.67 లక్షలు, మత్తడి వాగు కోసం రూ.2.6 కోట్లు, జగన్నాథ్‌పూర్‌కు రూ.32 కోట్లు, గొల్లవాగుకు రూ.2 కోట్లు గతంలో కేంద్రం మంజూరు చేసిన నిధుల వ్యయానికి సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లను వెంటనే జారీ చేయాలని సంబంధిత సీఈలను మంత్రి ఆదేశించారు. ప్రాజెక్టులను పూర్తిచేయటానికి అవసరమైన నిధులు వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరాలని, ఇందుకు మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీ అధ్యక్షతన జరగనున్న సమావేశంలో పాల్గొననున్నట్లు మంత్రి చెప్పారు. కేంద్రం నుంచి సకాలంలో నిధులు విడుదల చేయడంతో పాటు ప్రాజెక్టులకు అనుమతుల మంజూరు ప్రక్రియను సరళతరం చేయాలని, నాబార్డు నుంచి రుణాల విడుదలకు కేంద్రం చొరవ తీసుకోవాలని మంత్రి కేంద్రాన్ని కోరనున్నారు. -
‘చాగల్నాడు’ ఉన్నా.. చేను బీడే
రాజానగరం : జిల్లాలో మెట్ట ప్రాంత పొలాలకు గోదావరి నీటిని అందించి, సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యానికి ప్రభుత్వ నిర్లక్ష్యంతో గండి పడుతోంది. ఏడు మండలాల్లో వేలాది ఎకరాలకు నీరందించాల్సిన చాగల్నాడు ఎత్తిపోతల పథకం ఏనాడూ లక్ష్యం మేరకు ఉపయోగపడలేదు. ఏటా ఖరీఫ్‌లో మాత్రమే నీరిచ్చే పథకం ఆ సీజన్ అవసరాలనైనా సకాలంలో తీర్చిన దాఖలా లేదు. రైతులు ఎలాగోలా తంటాలు పడి నారుమడులు పోసుకుని, నాట్లు వేసుకున్నాక చేలు మూనతిరిగే దశలో మాత్రమే పథకం నుంచి నీరు అందుతోం ది. అంతేకాదు.. 2002లో ప్రారంభమైన నా టి నుంచి ఇప్పటి వరకూ నిర్దేశించిన ఏడు మండలాల్లో మూడింటికి ఒక్క ఎకరానికీ నీరివ్వలేదు. దీన్ని నమ్ముకుని నాట్లు వేసి నష్టపోయే కన్నా.. బీడుగా విడిచిపెడితేనే మేలని రైతులు అనుకునే పరిస్థితి దాపురించింది. పథకంలోని మూడు పంప్‌హౌస్‌లలో మోటార్లు ఎన్నడో పాడవగా గతంలో కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసింది. ఎన్నికల సమయంలో పథకానికి అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయిస్తామని, పాడైన మోటార్ల స్థానే కొత్తవి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ నేతలు ఇప్పుడు దాని గురించి నోరు మెదపడం లేదు. చాగల్నాడు పథకంలో కాతేరు, కోలమూరు, పాలచర్లలలో పంప్హౌస్లున్నారుు. గోదావరి నుంచి నీటిని సుమారు 48 మీటర్ల ఎత్తుకు ఈ మూడు పంప్‌హౌస్‌ల నుంచి అంచెలంచెలుగా ఎత్తిపోస్తూ ప్రధాన కాలువకు సరఫరా చేస్తుంటారు. ఒక్కో పంప్‌హౌస్‌లో మూడు చొప్పున మూడింటిలో తొమ్మిది మోటార్లు ఏర్పాటుచేశారు. ప్రతి పంప్‌హౌస్‌లో రెండు మోటార్లతో నీటిని తోడుతూ, ఒక మోటార్‌ను అట్టి పెడతారు. గతంలో తొమ్మిది మోటార్లూ పాడవగా ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ రాజానగరం తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా చేశారు. వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి రాజానగరం నుంచి మూడో పంప్‌హౌస్ ఉన్న పాలచర్ల వరకు పాదయాత్ర చేశారు. దాంతో ఒక్కో పంప్ హౌస్‌లో ఒక్కో మోటారుకు అరకొర మరమ్మతులు చేసి, గత రెండేళ్లుగా తూతూమంత్రంగా పథకాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పెందుర్తి అధికారపక్షం ఎమ్మెల్యేగానే కాక శాసనసభ హామీల అమలు కమిటీ చైర్మన్‌గా కూడా ఉన్నారు. పాడైన మోటార్ల స్థానే కొత్తవి ఏర్పాటు చేరుుంచాల్సిన బాధ్య త ఆయనపై ఉందని రైతులంటున్నారు. ఇదీ ఆయకట్టు.. ఈ ఎత్తిపోతలతో చాగల్నాడు ప్రాంతంలోని రాజమండ్రి రూరల్ మండలంలో 1,151, కోరుకొండలో 1,666, రాజానగరంలో 8,875, రంగంపేటలో 13,548, బిక్కవోలులో 4,975, అనపర్తిలో 2,439, మండపేటలో 1,654 ఎకరాల కు నీటిని అందించవలసి ఉంది. కానీ రాజమండ్రి రూరల్‌లో 200, కోరుకొండలో 300, రాజానగరంలో ఏడు వేలు, రంగంపేటలో 2,500 ఎకరాలకు మాత్రమే అందిచగలుగుతున్నారు. ఈ ఏడాది అది కూడా జరగలేదు. బిక్కవోలు, అనపర్తి, మండపేట మండలాల్లో పిల్లకాలువలను ఏర్పాటు చేసినా వాటిలోకి ఏనాడు నీరు వచ్చిన జాడ లేదు. సిబ్బందీ అంతంత మాత్రమే.. ఈ పథకం సమర్థంగా అమలు జరగకపోవడానికి సిబ్బంది కొరత కూడా ఒక కారణం. పథకం ప్రారంభంలో 58 సిబ్బంది ఉండగా ప్రస్తుతం 10 మందే పనిచేస్తున్నారు. మిగి లిన వారిని ఇతర పథకాలకు బదలాయిం చారు. సంబంధిత ఇంజనీర్‌ను దీనిపై వివర ణ కోరగా సిబ్బంది లేకపోవడమే మో టా ర్లు త్వరగా పాడవడానికి ప్రధాన కారణమన్నారు. ప్రస్తుతం ఈ పథకానికి ఏవిధమైన నిధులూ మంజూరు కాలేదని, సింగిల్ మో టార్లతోనే ఖరీఫ్‌కి నీళ్లు ఇస్తామని చెప్పారు. -
పాలమూరు ‘కొత్త’ భారం 10,000 కోట్లు
* ఎత్తిపోతల పథకం డిజైన్ మార్పుతో పెరగనున్న వ్యయం * రూ.32 వేల కోట్ల నుంచి రూ. 42 వేల కోట్లకు పెరిగిన అంచనాలు * 4,200 మెగావాట్లకు చేరుతున్న విద్యుత్ అవసరాలు * శ్రీశైలం నీటిని తరలించేందుకు రిజర్వాయర్లు, లిఫ్ట్‌ల సంఖ్య పెరగడమే కారణం * వ్యయంపై సర్కారు సందిగ్ధం.. ప్రత్యామ్నాయాలపై దృష్టి * ఇప్పటివరకు భారీ ప్రాజెక్టు ‘ప్రాణహిత’నే.. * దీని అంచనా వ్యయం రూ. 38,500 కోట్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోతోంది. ఇప్పటికే ఎంతో భారీ ప్రాజెక్టుగా చెబుతున్న ‘ప్రాణహిత-చేవెళ్ల’ అంచనా వ్యయాన్ని మించిపోనుంది. అంతేకాదు భారీ స్థాయిలో విద్యుత్ అవసరాలూ పెరిగిపోనున్నాయి. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని తరలించేలా రూపొందించిన కొత్త డిజైన్‌లో రిజర్వాయర్లు, లిఫ్టుల సంఖ్య పెరగడమే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఈ కొత్త డిజైన్ ప్రకారం పాలమూరు ప్రాజెక్టును చేపడితే.. నిర్మాణ వ్యయం ఏకంగా రూ.42వేల కోట్లకు, విద్యుత్ అవసరం 4,200 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా వేశారు. పాలమూరు ప్రాజెక్టుకు తొలి డిజైన్ ప్రకారం రూ.32 వేల కోట్ల వరకు వ్యయమవుతుందని... 3,300 మెగావాట్ల విద్యుత్ అవసరమని అంచనా వేశారు. కానీ తాజా డిజైన్‌తో నిర్మాణ వ్యయం, విద్యుత్ అవసరాలు 30 శాతం వరకు పెరగనున్నాయి. ఈ లెక్కన రాష్ట్ర ప్రాజెక్టుల్లో ఇప్పటివరకు రూ. 38,500 కోట్లతో భారీ ప్రాజెక్టుగా ఉన్న ప్రాణహిత-చేవెళ్లను పాలమూరు ఎత్తిపోతల పథకం దాటిపోనుంది. వ్యత్యాసం రూ.10 వేల కోట్లు.. పాలమూరు ప్రాజెక్టు తొలి డిజైన్ మేరకు జూరాల నుంచి వరద ఉండే 35 రోజుల్లో 70 టీఎంసీల నీటిని ఎత్తిపోసి... కోయిల్‌కొండ, గండేడు, కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్ల ద్వారా మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 10 లక్షల ఎకరాలకు నీటిని అందించాలి. జూరాల నుంచి కోయిల్‌కొండ వరకు రూ.15,950 కోట్లు, గండేడు వరకు రెండో దశకు రూ.8,650 కోట్లు, లక్ష్మీదేవునిపల్లి మూడో దశకు రూ.7,600 కోట్లతో మొత్తంగా రూ.32,200 కోట్ల వ్యయ అంచనా వేశారు. ఆ డిజైన్‌తో ముంపు అధికంగా ఉండడంతో.. శ్రీశైలం నుంచి నీటిని తీసుకునేలా కొత్త డిజైన్ రూపొందించారు. శ్రీశైలం నుంచి రంగారెడ్డి జిల్లాలోని కేపీ లక్ష్మీదేవునిపల్లి వరకు 70టీఎంసీల నీటిని తరలించేందుకు 6 రిజర్వాయర్లను (నార్లాపూర్ వద్ద 6 టీఎంసీలు, ఏదుల 3.4, వట్టెం 11, కర్వేని 16, లోకిరేవు 10, కేపీ లక్ష్మీదేవునిపల్లి వద్ద 10 టీఎంసీలతో) ప్రతిపాదించారు. వీటిని అనుసంధానిస్తూ ఓపెన్ కెనాల్లు, సొరంగాలను నిర్మించాలి, 5 చోట్ల ఎత్తిపోయాలి. ఈ రిజర్వాయర్ల నిర్మాణానికే రూ.9 వేల కోట్ల మేర ఖర్చవుతుందని లెక్కగట్టారు. ఇందులో కర్వేనికి రూ.1,500 కోట్లు, వట్టెంకు రూ.1,400 కోట్ల మేర అంచనా వేశారు. అయితే మొదటి డిజైన్‌తో పోలిస్తే రిజర్వాయర్ల సంఖ్య 3 నుంచి 6కు.. లిఫ్టుల సంఖ్య 3 నుంచి 5కి పెరిగింది, పంపింగ్ రోజులు సైతం 35 నుంచి 60 రోజులకు పెరగడంతో అంచనాలు భారీగా పెరిగాయి. మొత్తంగా మొదటి, రెండు డిజైన్ల మధ్య వ్యత్యాసం దాదాపు రూ.10 వేల కోట్లు. ప్రత్యామ్నాయాలపై దృష్టి డిజైన్ మార్పుతో అంచనాలన్నీ తారుమారు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం సందిగ్ధంలో పడింది. వ్యయాన్ని తగ్గించే ప్రత్యామ్నాయాలపై పరిశీలన చేయాలని అధికారులను ఆదేశించింది. ఇదంతా ఓ కొలిక్కి వచ్చేందుకు మరిన్ని రోజులు పట్టే అవకాశం ఉండడంతో ఈ నెల 31న శంకుస్థాపన చేయాలన్న నిర్ణయాన్ని వాయిదా వేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల మొదటి వారంలో శంకుస్థాపన చేయాలని భావిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు ఎత్తిపోతల పథకాల వివరాలు ప్రాణహిత-చేవెళ్ల పాలమూరు 160 టీఎంసీలతో 16.40లక్షల ఎకరాలకు నీరు 70 టీఎంసీలతో 10 లక్షల ఎకరాలకు నీరు ప్రయోజనం పొందే జిల్లాల సంఖ్య 7 మూడు జిల్లాలకు ప్రయోజనం ప్రాజెక్టు అంచనా రూ.38,500 కోట్లు సుమారు రూ.42 వేల కోట్లు అవసరమైన విద్యుత్ 3,159 మెగావాట్లు విద్యుత్ అవసరం 4,200 మెగావాట్లు ప్రాజెక్టు పరిధిలో మొత్తం రిజర్వాయర్లు 12 పథకంలో ప్రతిపాదించిన రిజర్వాయర్లు 6 -
‘పాలమూరు’కు 10 రోజుల్లో శంకుస్థాపన
సాక్షి, మహబూబ్‌నగర్: మరో పదిరోజుల్లో ప్రతిష్టాత్మక పాలమూరు ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు ఎంపీ జితేందర్‌రెడ్డి వెల్లడిం చారు. ఈ ప్రాజెక్టుతో పాలమూరు జిల్లాలో అదనంగా ఏడు లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందన్నారు. ఆదివారం ఆయన మహబూబ్‌నగర్‌లో విలేకరులతో మాట్లాడారు. రైతుల ఆత్మహత్యలపై ప్రతిపక్షాలు లేనిపోని విమర్శలు -
రైతులకు అండగా పోరాడతాం
ఏలూరు(ఆర్ఆర్ పేట) : పోలవరం ప్రాజెక్టు పనులను పక్కకు నెట్టి.. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మించడం ద్వారా జిల్లా ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందకుండా చేయాలని చూస్తున్న చంద్రబాబునాయుడు కుట్రలను ఇక్కడ సాగనిచ్చేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని హెచ్చరించారు. ఏలూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహిం చిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలుపుదల చేసేవరకూ తమ పార్టీ రైతులకు అండగా నిలబడి పోరాటాలు చేస్తుందని స్పష్టం చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పేరిట జిల్లా రైతుల ప్రయోజనాలకు గండికొట్టి ఇతర జిల్లాలకు గోదావరి జలాలను తరలిం చుకుపోవడానికి చంద్రబాబు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఈ పథకం ద్వారా కడపకు నీరు ఇస్తామని చంద్రబాబు, అనంతపురంతోపాటు రాయలసీమ జిల్లాలకు నీరందిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ పొంతనలేని ప్రకటనలు చేస్తూ రైతులను తికమక పెడుతున్నారన్నారు. ఈ పథ కం వల్ల జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు రైతుల వద్దకు వెళ్లలేకపోతున్నారని, తమ నాయకునికి ఈ విషయాన్ని చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. జిల్లాలోని టీడీపీ నాయకులకు దమ్ము, ధైర్యం ఉంటే తమతోపాటు ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇతర జిల్లాలకు నీరు ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని, ఇక్కడి రైతుల అవసరాలు తీరేవరకూ అటువంటి చర్యలకు పాల్పడితే ఎదుర్కొంటామని అన్నారు. మరో వారంలో ఈ పథకానికి శంకుస్థాపన చేసే ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నట్టు వార్తలు వెలువడిన నేపథ్యంలో దీనిని నిలుపుదల చేయించడానికి తమ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జిల్లాలో పాదయాత్ర చేయడానికి నిర్ణయించామని చెప్పారు. ఈ పథకం కారణంగా జిల్లా రైతులకు, ప్రజలకు కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తామన్నారు. కృష్ణా జిల్లాలోని బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే ఈ పథకానికి రూపకల్పన చేశారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా అనేక జిల్లాలకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉన్నప్పటికీ, ఆ ప్రాజెక్టును నిర్వీర్యం చేయడానికే పట్టిసీమ పథకాన్ని రూపకల్పన చేశారని నాని పేర్కొన్నారు. దీనిపై చంద్రబాబు జిల్లా ప్రజలకు సమాధా నం చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం కోసం మంజూరు చేసిన రూ.1,700 కోట్ల నిధులను పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేటాయిస్తే ఆ ప్రాజెక్టు పూర్తవుతుందని స్పష్టం చేశారు. అసలు పోలవరం ప్రాజెక్టును ఎప్పటికి పూర్తిచేస్తారో చెప్పాలని నాని ప్రశ్నించారు. కాగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఆ జిల్లాకు ఇంత నీరిస్తాం, ఈ జిల్లాకు ఇంత నీరిస్తాం అని ప్రకటిస్తున్నారే తప్ప మన జిల్లా రైతులకు ఎంత నీరిస్తారో చెప్పకపోవడం వెనుక మర్మమేమిటో స్పష్టం చేయాలని కోరారు. జిల్లా రైతుల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో పోరాట మార్గాన్ని ఎంచుకున్నామని, వారం పది రోజుల్లో పట్టిసీమపై ఉద్యమిస్తామని చెప్పారు. తొలుత జిల్లాలో సుమారు 25-30 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తామని, పట్టిసీమ ఎత్తిపోతల పథకం వల్ల రైతులు ఏం కోల్పోతున్నారనే విషయాలపై వారికి అవగాహన కల్పిస్తామన్నారు. దీనిపై దీర్ఘకాలిక పోరాటాలు చేయడానికి వెనుకాడబోమన్నారు. ఈ పథకాన్ని అడ్డుకునేందుకు అఖిలపక్ష కూట మిని ఏర్పాటు చేయడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నామని, అన్ని పార్టీలూ రైతుల ప్రయోజనాల కోసం ఉద్యమాలకు ముందుకు రావాలని కోరారు. టీడీపీ ఆగడాలు పెచ్చుమీరాయ్ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే జిల్లాలో టీడీపీ నాయకుల ఆగడాలు పెచ్చుమీరిపోయాయని ఆళ్ల నాని ధ్వజమెత్తారు. ఇసుకను అక్రమంగా తరలిస్తూ.. మాఫియాను తలపిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆగడాల కారణంగా సామాన్యులకు ఇల్లు కట్టుకునే అవకాశాలు సన్నగిల్లిపోతున్నాయన్నారు. జిల్లా ప్రజల సమస్యలపై ఎన్నిసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా వారికి చీమకుట్టినట్టైనా లేకపోవడం ప్రజల పట్ల వారికున్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తోందన్నారు. సమావేశంలో పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు, కేంద్ర పాలక మండలి సభ్యులు వంక రవీంద్ర, జీఎస్ రావు, ముఖ్య నాయకులు ఘంటా మురళి, ఇందుకూరి రామకృష్ణంరాజు, నియోజకవర్గాల కన్వీనర్లు గ్రంధి శ్రీనివాస్, తోట గోపీ, చీర్ల రాధయ్య, పుప్పాల వాసుబాబు, కొఠారు రామచంద్రరావు, తలారి వెంకట్రావు, మహిళా విభాగం అధ్యక్షురాలు వందనపు సాయిబాలపద్మ, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. -
పట్టిసీమ పథకాన్ని అడ్డుకుంటాం
తణుకు :ఉభయగోదావరి జిల్లాల్లోని రైతుల ప్రయోజనాలకు గండికొట్టే పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని ఉద్యమాల ద్వారా అడ్డుకుంటామని వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు, నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త వంక రవీంద్రనాథ్ హెచ్చరించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలవ రం మండలం పట్టిసీమ వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించి గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించే ప్రతిపాదనను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరి ప్రయోజనాల కోసం ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేయాలన్నారు. కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోస మే ఈ పథకాన్ని తెరపైకి తెచ్చారన్నా రు. ఈ పథకం పేరుతో రూ.1,300 కోట్లను దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికే డెల్టా ప్రాంతంలోని దాదాపు 10 లక్షల ఎకరాలకు రెండో పంటకు సాగునీరు అందే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సీలేరు జలాశయం నుంచి నీటిని తెచ్చుకుంటే తప్ప రెండో పంటకు కొద్దిపాటిగానైనా నీరు అందటం లేదన్నారు. ఉభయగోదావరి జిల్లాలో గోదావరి నదిపై ప్రస్తుతం ఉన్న ఎత్తిపోతల పథకాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందటం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పట్టిసీమ వద్ద ఎత్తిపోతల పథకం నిర్మిస్తే ఉభయ గోదావరి జిల్లాలోని ప్రజలు, రైతుల జీవన స్థితిగతులు దిగజారిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు నిర్మిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. గోదావరి వరదల సమయంలోనే నీటిని కృష్ణా డెల్టాకు తీసుకు వెళ్తామని చెప్పటం పచ్చి అబద్ధమని పేర్కొన్నారు. ఈ పథకాన్ని 6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్ప టం హాస్యాస్పదమని, పథకానికి అవసరమైన 30 పంపులను తయారు చేసేందుకే కనీసం రెండేళ్లు పడుతుందని వివరించారు. పోలవరం ప్రాజెక్టు కుడి ప్రదాన కాలువ ద్వారా నీటిని తీసుకువెళ్తామని చెబుతున్నారని, ఇంకా 29.25 కిలోమీటర్ల మేర కాలువ పనులు పూర్తికాలేదన్నారు. ఈ పనులు పూర్తి చేయాలంటే 1,776 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉం దన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఈ పథకం మూలన పడుతుందన్నారు. చంద్రబాబు తన నైజాన్ని పట్టిసీమ పథకం ద్వారా మ రోసారి గుర్తు చేస్తున్నారన్నారు. ఉభయగోదావరి జిల్లాల రైతులు, ప్రజల ప్రయోజనాలను మంట కలిపే ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణంపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
‘ఎత్తిపోతలు’ను వ్యతిరేకిస్తున్నాపట్టదా?
జంగారెడ్డిగూడెం రూరల్ :పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని జిల్లాలోని రైతులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని, ఈ పథకం పనులు జరిగితే తీవ్రంగా నష్టపోతామని మొరపెట్టుకుంటున్నా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు చీమకుట్టినట్టు కూడా లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని విమర్శించారు. రైతులు ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తున్నారనే విషయాన్ని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లకపోవడం దారుణమన్నారు. శనివారం జంగారెడ్డిగూడెంలో పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వందనపు సాయి బాలపద్మ ఇంటి వద్ద పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ జిల్లాలో ఇసుక మాఫియా రోజు రోజుకూ పెరిగిపోతుందన్నారు. ఈ మాఫీయూలో ఎక్కువశాతం అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు భాగస్వాములుగా ఉండటంతో చర్యలు చేపట్టాల్సిన అధికార యంత్రాంగం కూడా పట్టించుకోవడం లేదన్నారు. తక్కువ ధరకు ఇసుకను సామాన్య ప్రజలకు అందించేలా చూడాలని నాని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ముందు రైతులకు నిరంతరాయంగా 9 గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పిన ప్రభుత్వం రానున్న వేసవిలో ఎటువంటి కోతలు లేకుండా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. వే సవిలో తాగు, సాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం పనిచేయాలన్నారు. ప్రజా సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడేందుకు ఐదు అంశాలపై కార్యాచరణ రూపొందించామని, ఈ అంశాలపై ఈనెల 23న జరిగే సమావేశంలో చర్చించనున్నామని నాని తెలిపారు. ఈ నెలాఖరులోగా జిల్లాలో మండల, పట్టణ కమిటీలను పూర్తిచేస్తామని చెప్పారు. వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ వందనపు సాయిబాలపద్మ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి, తల్లాడ సత్తిపండు, నగర పంచాయతీ కౌన్సిలర్లు తాతకుంట్ల నాగ వెంకటలక్ష్మి, ముప్పిడి అంజి, నాయకులు బీవీఆర్ చౌదరి, రావూరి కృష్ణ, రాఘవరాజు ఆదివిష్ణు, కొయ్య రాజారావురెడ్డి, కేమిశెట్టి మల్లిబాబు, మంగా రామకృష్ణ, తాతకుంట్ల రవికుమార్, బుగ్గా సత్యనారాయణ, వందనపు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
మెట్ట రైతు నోట మట్టేనా
పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై అమిత శ్రద్ధ చింతలపూడి, తాడిపూడి పథకాలపై మాత్రం అశ్రద్ధ ఆ ప్రాజెక్టులను కనీసం పట్టించుకోని సర్కారు సకాలంలో పూర్తిచేస్తే 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు సాక్షి ప్రతినిధి, ఏలూరు :పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టి పొరుగు జిల్లాలకు గోదావరి నీటిని తరలించాలని ఉవ్విళ్లూరుతున్న పాలకులు జిల్లాలో మెట్ట రైతులకు ఉపయోగపడే చింతలపూడి, తాడిపూడి ఎత్తిపోతల పథకాలను మాత్రం కనీస మాత్రమైనా పట్టించుకోవడం లేదు. సాగునీటి సౌకర్యాలు అంతంతమాత్రంగా ఉన్న మెట్ట ప్రాంతంలోని 16 మండలాల పరిధిలో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే చింతలపూడి ఎత్తిపోతలు, మరో 60 వేల ఎకరాలకు నీరందించే తాడిపూడి ఎత్తిపోతల నిర్మాణాలను పూర్తిచేసే విషయంలో చంద్రబాబు సర్కారు ఇప్పటివరకు నోరుమెదపలేదు. గడచిన 8 నెలల కాలంలో ఐదుసార్లు జిల్లాకు వచ్చిన సీఎం చంద్రబాబు ఆ రెండు పథకాల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. జిల్లా మంత్రులు, ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు సైతం ఈ పథకాల ఊసే ఎత్తడం లేదు. చింతలపూడిపై చిన్నచూపు జిల్లాలోని మెట్ట ప్రాంతంలో 16 మండలాల పరిధిలోని 196 గ్రామాల్లో పంటలకు సాగునీరు అందించేందుకు 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2013 ఫిబ్రవరి నాటికి (నాలుగేళ్ల కాలవ్యవధి) పనులు పూర్తి కావాల్సినప్పటికీ ఇప్పటివరకు 18 శాతం మాత్రమే పూర్తయ్యాయి. మహానేత హఠాన్మరణం తర్వాత పనులు పూర్తిగా పడకేశాయి. గడువు ముగియడంతో పథకం పూర్తి చేసేందుకు మరో మూడేళ్లు (2016 ఫిబ్రవరి వరకు) పొడిగించారు. ఈ పథకాన్ని రెండు ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టారు. మొదటి ప్యాకేజీలో 1, 2, 3, పంప్ హౌస్‌లు, 0 కిలోమీటర్ల నుంచి 36 కిలోమీటర్ల వరకు ప్రధా న కాలువ పనులు, 13 కిలోమీటర్ల దూరం లీడింగ్ ఛానల్ పనులు, జల్లేరు రిజర్వాయర్ పటిష్టత పనులు చేపట్టాల్సి ఉంది. ప్యాకేజీ మొత్తం పనులను ఆరేళ్ల కాలంలో కేవలం 25 శాతం మాత్రమే పూర్తి చేయగలిగారు. నిర్మాణ పనులకు 18,208 ఎకరాల భూమిని సేకరిం చాల్సి ఉండగా, ఇందులో 6,683 ఎకరాల అట వీ భూమి ఉంది. మిగతా భూమిని రైతుల నుంచి సేకరించాల్సి ఉండగా, దీనిలో కేవలం 1,135 ఎకరాలు మాత్రమే సేకరించారు. రెండో ప్యాకేజీలో ప్రధాన కాలువ 36వ కిలోమీటరు నుంచి 68వ కిలోమీటరు వరకు చేపట్టాల్సి ఉంది. ఈ ప్యాకేజీకి సంబంధించి 6,801 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా, దీనిలో 634 ఎకరాల అటవీ భూమి ఉంది. ఇంకా 6,167 ఎకరాల భూమి సేకరించాల్సి ఉన్నప్పటికీ కేవలం 133 ఎకరాలు భూమి మాత్రమే సేకరించారు. ఈ ప్యాకేజీ కింద ఇప్పటివరకు 3 శాతం పనులు మాత్రమే పూర్తి చేశారు. ఈ లెక్కన చూస్తే వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి 97 శాతం పనులు పూర్తి చేయడమనేది అసాధ్యమేనని ఎవరైనా చెబుతారు. తాడిపూడి ఆయక ట్టంతా తడిసేదెప్పుడు? మెట్టలోని 14 మండల పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో 2 లక్షల 6వేల 600 ఎకరాలకు సాగునీరందించేందుకు తాడిపూడి పథకాన్ని రూపొం దించారు. 2007 సెప్టెంబర్ 25న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పథకం పనులకు శ్రీకారం చుట్టారు. ఆయన మరణానంతరం భూసేకరణను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నేటికీ ఈ పథకం ద్వారా పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందించలేని దుస్థితి నెలకొంది. సుమారు రూ.500 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పథకం పూర్తి కావడానికి 5,248 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా, 4,494 ఎకరాలు సేకరించారు. భూ సేకరణ పూర్తికాకపోవడంతో 53 వేల ఎకరాలకు పైగా నీరందడం లేదు. దేవరపల్లి సమీపంలో అదనంగా నిర్మిస్తున్న ఐదో లిఫ్ట్ పనులు పూర్తికాలేదు. దీనివల్ల మరో 13వేల ఎకరాల ఆయకట్టుకు నీరందడం లేదు. తాడిపూడి పథకం పనులు పూర్తయితే మరో 66వేల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా 2,06,600 ఎకరాలకు నీరందించాల్సిన పథకం ద్వారా లక్షన్నర ఎకరాలకు కూడా నీరందించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పదే పదే జిల్లాకు వస్తున్న సీఎం చంద్రబాబు ఒక్కసారైనా చింతలపూడి, తాడిపూడి పథకాల పనుల తీరును స్వయంగా పరిశీలిస్తే వేగవంతం అయ్యే అవకాశం ఉందని రైతు సంఘాల నేతలు అంటున్నారు. నత్తతో పోటీపడుతున్న ఈ పథకాలను పూర్తి చే యించడంలో శ్రద్ధ కనబరచని ప్రభుత్వం పట్టిసీమ పథకాన్ని హడావుడిగా తలకెత్తుకోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
నీటిపారుదల పథకం.. వేగవంతం చేయండి: నరేంద్ర మోదీ
నీటిపారుదల పథకంపై మంత్రులకు ప్రధాని ఆదేశం ఉపాధి హామీతో నీటిపారుదల పథకాన్ని అనుసంధానించాలి న్యూఢిల్లీ: గ్రామీణ నీటిపారుదల పథకం ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన అమలును వేగవంతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ తన సహచర మంత్రులను కోరారు. మంగళవారం వ్యవసాయం, నీటి వనరులు, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలతో ఆయన సమావేశమై పలు ఆదేశాలిచ్చారు. ప్రతి పొలానికి నీటిని అందించడమే ఈ పథకం లక్ష్యంగా ఉండాలన్నారు. దీన్ని ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయాలన్నారు. స్థూలస్థాయిలో నదుల అనుసంధానం ప్రాజెక్టులను గుర్తించి వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. ఉపగ్రహ చిత్రాలను, 3డీ చిత్రాలను ఉపయోగించి నీటిపారుదల అవకాశాలకు సంబంధించి మ్యాప్‌లను రూపొందించాలని, వాటితో వ్యవసాయదారులకు మార్గనిర్దేశనం చేయాలని సూచించారు. నీటి సంరక్షణ, ఆధునిక నీటిపారుదల పద్ధతుల వినియోగానికి సంబంధించి నేతృత్వం వహించడానికి ఆదర్శ రైతులను గుర్తించాలన్నారు. కొన్ని పట్టణాలను గుర్తించి, అక్కడ నీటిని రీసైక్లింగ్ చేయడం ద్వారా సమీపంలోని గ్రామాలకు సాగునీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే నీటి సంరక్షణ ప్రాముఖ్యంపై ప్రజల్ని చైతన్యపరచాలని సూచించారు. ఈ సమావేశానికి నీటి వనరుల శాఖ మంత్రి ఉమా భారతి, వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ తదితరులు హాజరయ్యారు. కాగా, ప్రభుత్వ ఉన్నతాధికారులు గడువు ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్‌నాటికి ఆస్తుల వివరాలు వెల్లడించేందుకు వీలుగా జనవరి చివరికల్లా ఏర్పాట్లు పూర్తి చేయాలని మోదీ అధికారులను ఆదేశించారు. -
పేదల భూములపై ‘పచ్చ’ కన్ను!
కాసుల కోసం దేనికైనా సిద్ధమయ్యే ‘పచ్చ’ నేతల కన్ను యడవల్లి పేదల భూములపై పడింది. ప్రభుత్వం తమదేనన్న ధీమాతో టీడీపీ నేతలు అక్రమ దందాకు తెర తీశారు. జీవనోపాధి కోసం 1973లో అప్పటి జిల్లా కలెక్టర్, 2006లో ఆనాటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఎస్సీ లబ్ధిదారులకు ఇచ్చిన భూములను నయూనో భయూనో దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పేదలకు అండగా ఉండాల్సిన అధికార గణం అక్రమార్కులకు సహకారం అందిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. చిలకలూరిపేట రూరల్: పేదరికంతో అల్లాడిపోతున్న యడవల్లి గ్రామ ఎస్సీలకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వమిచ్చిన సాగు భూములను అక్రమ మార్గాల్లో దక్కించుకునేందుకు జిల్లా టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. ఆ భూముల్లో విలువైన గ్రానైట్ నిక్షేపాలు ఉండటమే దీనికి కారణం. అధికార పార్టీ నేతల ఎత్తుగడలకు రెవెన్యూ అధికారులు యథాశక్తిన సహకరిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. ఇదీ సంగతి.. 1973లో నాటి జిల్లా కలెక్టర్ కత్తి చంద్రయ్య చిలకలూరిపేట మండలంలోని యడవల్లి గ్రామంలో నిరుపయోగంగా ఉన్న 360 ఎకరాల ప్రభుత్వ భూమిని 120 మంది ఎస్సీ కుటుంబాలకు పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి మూడెకరాల చొప్పున ఇవ్వగా లబ్ధిదారులు పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అనంతరం 2006లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో భూ పంపిణీ కార్యక్రమం చేపట్టినపుడు ఈ భూమికి మరో 45.50 ఎకరాలను కలిపి(మొత్తం 405.50 ఎకరాలు) అవే ఎస్సీ కుటుంబాలకు చెందిన 250 మంది లబ్ధిదారులకు విడివిడిగా పంపిణీ చేశారు. సాగు కోసం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం.. భూముల్లో వ్యవసాయం చేసేందుకు అవసరమైన సాగు నీరు సరిగా అందటం లేదని లబ్ధిదారులు వాపోతుండటంతో 2006లో నాటి ఎమ్మెల్యే, ప్రస్తుత వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ సమస్యను సీఎం వైఎస్ దృష్టి కి తీసుకువెళ్లారు. దీనికి స్పందిస్తూ రూ. 3.06 కోట్ల అం చనాతో సోమేపల్లి సాంబయ్య లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని మంజూరు చేశారు. 2008లో ఈ పథకం ప్రారంభం కావటంతో లబ్ధిదారుల సమస్య చాలావరకు తీరింది. అనధికార సర్వేల నిర్వహణ.. యడవల్లి ఎస్సీలకు ప్రభుత్వమిచ్చిన భూముల్లో గ్రానైట్ నిల్వలున్నట్టు తెలియటంతో టీడీపీ నేతలు మైనింగ్ శాఖ అధికారులతో అనధికారికంగా రహస్య సర్వేలు నిర్వహింపజేశారు. 250 ఎకరాల్లో గ్రానైట్ నిక్షేపాలు ఉన్నట్టు తేలటంతో వాటిని దక్కించుకునేందుకు రంగంలోకి దిగారు. యడవల్లిలోని 380, 381-15, 16, 17, 20-2ఎ సర్వే నంబర్లలో ఉన్న ప్రభుత్వ భూముల్లో గ్రానైట్ నిల్వలను తవ్వుకునే లీజు కోసం నిరభ్యంతర ధ్రువీకరణపత్రం(ఎన్వోసీ) జారీ చేయూలని కోరుతూ మండల తహశీల్దార్‌కు దరఖాస్తులు సమర్పించటం ప్రారంభించారు. టీడీపీ నేతల మార్గదర్శకత్వంలో పేట ప్రాంతంలోని ఒక కోల్డ్ స్టోరేజీ యజమాని, మరో పది మంది వివిధ పేర్లతో ఇప్పటికే 15 దరఖాస్తులను సమర్పించారు. ఎకరం రూ.35 లక్షల పైమాటే.. గ్రానైట్ నిక్షేపాలున్న భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నారుు. గతంలో ఎకరం ధర రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకు ఉండగా ప్రస్తుతం రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు పలుకుతోందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. విక్రయించే వ్యక్తి పేరిట ప్రభుత్వం మంజూరు చేసిన బీఫారం ఉంటే ఒక ధర, పట్టాదారు పాస్‌పుస్తకం ఉంటే మరో ధర లభిస్తోందని చెబుతున్నారు. సంబంధిత భూములపై ఇప్పటివరకు 12 అగ్రిమెంట్లు చేసుకోగా రెండు రిజిస్ట్రేషన్లు ఇప్పటికే పూర్తరుునట్టు విశ్వసనీయంగా తెలిసింది. మారుతున్న సర్వే నంబర్లు ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన భూమిని విక్రరుుంచటం, కొనుగోలు చేయటం నేరమని అందరికీ తెలిసిన విషయమే. దీంతో టీడీపీ నేతలు ప్రైవేట్ సర్వేయర్లు, గ్రామ రెవెన్యూ అధికారుల సహకారంతో సర్వే నంబర్లను మార్పించటానికి యత్నిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదైన సర్వే నంబర్ల డివిజన్లు, సబ్డివిజన్ల నంబర్లకు మరో నంబర్‌ను జోడిస్తే రిజిస్ట్రేషన్లకు ఆటంకం ఉండదనేది వారి ఎత్తుగడ. అంతేకాకుండా వేర్వేరు పేర్లతో లింకు డాక్యుమెంట్లు సృష్టిస్తున్నట్టు సమాచారం. ఎన్వోసీపై రహస్య విచారణ గ్రానైట్ నిక్షేపాలను తవ్వుకునేందుకు రెవెన్యూ అధికారుల నుంచి ఎన్వోసీ పొందటం తప్పనిసరి. గతంలో ఎన్వోసీ జారీ చేసే అధికారం జిల్లా కలెక్టర్‌కు ఉండేది. ప్రస్తుతం ఆ అధికారం మండల తహశీల్దార్లది కావటంతో అక్రమాలకు అవకాశం ఏర్పడుతోంది. కాగా, పలువురి నుంచి అందిన దరఖాస్తులను పరిశీలిస్తున్న రెవెన్యూ అధికారులు ఆయూ భూముల పరిస్థితిపై రహస్యంగా విచారణ జరుపుతున్నట్టు సమాచారం. అర్జీలు పెండింగ్‌లో ఉన్నారుు.. యడవల్లి గ్రామంలోని భూముల్లో గ్రానైట్ నిక్షేపాలను తవ్వుకునేందుకు అనుమతులు కోరుతూ దరఖాస్తులు వచ్చిన మాట వాస్తవమేనని తహశీల్దార్ జి.వి.ఎస్.ఫణీంద్రబాబు చెప్పారు. ఇప్పటివరకు 15 అర్జీలు వచ్చాయని, వీటి పరిశీలన పెండింగ్‌లో ఉందని వెల్లడించారు. భూములపై ఇప్పటివరకు తామెలాంటి విచారణ జరపలేదని పేర్కొన్నారు. -
దేశంలో ప్రతి సాగుభూమికీ నీరు
త్వరలో ప్రధానమంత్రి గ్రామ సించాయీ యోజన ప్రారంభం పాట్నా: వ్యవసాయానికి మరింత ఊతమిచ్చే దిశగా దేశవ్యాప్తంగా ‘ప్రధాన మంత్రి గ్రామ సించాయీ యోజన’ను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘‘దేశంలోని ప్రతి పంట భూమికీ సాగునీరు అందించాలన్న లక్ష్యంతోనే ఈ సించాయీ యోజన(సాగునీటి పథకం) ప్రవేశపెడుతున్నాం. సాగునీరు అందుబాటులో లేకపోతే వ్యవసాయ దిగుబడులు పెంచడం సాధ్యంకాదు. పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలన్న దానిపై ప్రణాళిక రచిస్తున్నాం’’ అని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధా మోహన్ సింగ్ శనివారమిక్కడ చెప్పారు. ‘‘భూసారాన్ని బట్టి కూడా దిగుబడులు ఆధారపడి ఉంటాయి. భూమి సారవంతమైనదైతే అత్యధిక దిగుబడులు సాధించడం సాధ్యమే. ఈ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులుకు ఈ పథకం కింద త్వరలోనే భూ సార కార్డులు జారీచేయనుంది. భూ సారాన్ని పరీక్షించేందుకు శాస్త్రవేత్తలు, వ్యవసాయ విద్యార్థుల సాయం తీసుకుంటాం’’ అని వివరించారు. భూసారాన్ని బట్టి ఆ భూమిలో ఎలాంటి పంటలు వేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలియజేయడం ద్వారా రైతుకు తోడ్పడవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. దేశంలోని 14 కోట్ల హెక్టార్ల వ్యవసాయ యోగ్యమైన భూమిలో 44 శాతానికే సాగునీరు అందుతోంది. మిగతా చోట్ల వర్షాలే ఆధారం.