IT sector growth
-
అగ్గది తెలంగాణ అంటే అట్లుంటది.. దేశ ప్రగతి కంటే మిన్నగా..
కరోనా సంక్షోభం తర్వాత సాధారణ స్థితికి రావడానికి అనేక రంగాలు ఆపసోపాలు పడుతుంటూ తెలంగాణలో ఐటీ రంగం శర వేగంగా దూసుకుపోతుంది. గత రికార్డులను బద్దలు కొడుతూ 2021-22 ఆర్థిక సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలను సాధించింది. ఏకంగా 26.14 శాతం వృద్ధిని కనబరిచింది. ఐటీలో తెలంగాణ సాధించిన వృద్ధిని వార్షిక నివేదిక ద్వారా మంత్రి కేటీఆర్ స్వయంగా వెల్లడించారు. జాతీయ సగటు కంటే ఎక్కువ హైటెక్ సిటీలోని టెక్ మహీంద్రా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఐటీ, అనుబంధ ఎగుమతుల్లో జాతీయ సగటు 17.2 శాతం ఉండగా తెలంగాణ 26.14శాతం వృద్ధి సాధించినట్లు తెలిపారు. జాతీయ సగటు కంటే ఏకంగా 9 శాతం అధిక వృద్ధి సాధించినట్టు మంత్రి వివరించారు. తెలంగాణ వచ్చాక 2021-22లో ఐటీ ఎగుమతుల విలువ రూ.1,83,569 కోట్లనీ మంత్రి కేటీఆర్ తెలిపారు. దేశ వ్యాప్తంగా ఐటీలో 4.5లక్షల ఉద్యోగాలు వస్తే ఒక్క హైదరాబాద్‌లో లక్షన్నర వచ్చాయన్నారను. ప్రస్తుతం తెలంగాణలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 7,78,121గా ఉందన్నారను. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత గడిచిన ఎనిమిదేళ్లలో 4.1లక్షల ఐటీ ఉద్యోగాలు వచ్చాయని వెల్లడించారు. త్వరలో ఐటీ సెక్టార్లతో తెలంగాణ మరెంతో ప్రగతి సాధించనుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ దిశగా ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. హైదరాబాద్‌లో స్టార్టప్ కల్చర్ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా 2022 జూన్ 20న టీ హబ్ సెకండ్ ఫేజ్‌ను ప్రారంభిస్తామన్నారు. అదే విధంగా టీ వర్క్స్ కొత్త ఫెసిలిటీ ఆగస్టు ప్రారంభించే అవకాశం ఉందని కేటీఆర్ వెల్లడించారు. చదవండి: స్టార్టప్‌లకు రాజధానిగా హైదరాబాద్: కేటీఆర్ -
2021-22 తెలంగాణ ఐటి వార్షిక నివేదిక విడుదల చేసిన మంత్రి కేటీఆర్
-
ఐటీ బాట పట్టిన హైదరాబాద్: కొత్తగా వందలాది కంపెనీలు.. వేలాదీ కొలువులు
సాక్షి, హైదరాబాద్: ముత్యాల నగరం (సిటీ ఆఫ్ పెరల్స్) ఐటీ బాట పట్టింది. మహానగరంలో గత ఏడేళ్లుగా ఐటీ, అనుంబంధ రంగ కార్యకలాపాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నగరం నలుచెరుగులా ఐటీ రంగాన్ని విస్తరించేందుకు కంకణం కట్టుకోవడంతో వందలాదిగా నూతన కంపెనీలు..వేలాది కొలువులు సిటీజన్లకు వరంగా మారాయి. తాజాగా కండ్లకోయలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న ఐటీ పార్క్‌తోపాటు.. ఇటీవలే జెన్‌పాక్ సంస్థ తమ గ్రిడ్ పాలసీలో భాగంగా ఉప్పల్‌లోని తమ క్యాంపస్‌ను 20 లక్షల చదరపు అడుగుల వాణిజ్య కార్యాలయాన్ని విస్తరించిన విషయం విదితమే. ఈ సంస్థ రాకతో కేవలం ఉప్పల్ ప్రాంతంలోనే ఏకంగా 15 వేలకుపైగా కొత్త ఉద్యోగాలు రానుండడం విశేషం. నగర ఐటీ సెక్టార్లో ప్రస్తుతం ఉన్న 6 లక్షల కొలువులకు అదనంగా రాబోయే రోజుల్లో మరో లక్ష ఉద్యోగాల కల్పన సాధ్యపడుతుందని ఆశాఖ వర్గాలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నాయి. వేగంగా విస్తరణ.. ► నార్త్ హైదరాబాద్ కింద పరిగణించే కండ్లకోయ పరిధిలో 35 ఇంజినీరింగ్, 50 ట్రెడిషనల్ డిగ్రీ కాలేజీలు 30 ఎంబీఏ కాలేజీలతో పాటు పలు ఫార్మసీ, మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి. ► ప్రతి ఏడాది 15 నుంచి 20 వేల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. ► వెస్ట్ హైదరాబాద్‌కు వెళ్లి ఐటీ ఉద్యోగాలు చేయడం కంటే.. నార్త్ హైదరాబాద్‌లోనే ఐటీ ఉద్యోగాలు చేసేలా నగరానికి నలువైపులా ఐటీ పార్కులు నిర్మించేందుకు నూతన ఐటీ పాలసీ దోహదం చేస్తుందని ఐటీ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ► నార్త్‌సిటీ పరిధిలో మంచి యూనివర్సిటీలు, సమీపంలోనే ఎంఎంటీఎస్, జాతీయ రహదారులు,అర్భన్పార్క్లు ఉండడం ఈప్రాంతంలో ఐటీ విస్తరణ వేగం పుంజుకుంది. అగ్రశ్రేణి కంపెనీలకు కేరాఫ్.. ► ప్రపంచంలోనే టాప్ 5 కంపెనీలతో పాటు అనేక కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాయి. యాపిల్, గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించిన విషయం విదితమే. ► అమెజాన్ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పింది. 31 లక్షల చదరపు అడుగుల్లో దీన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో సుమారు 1500 వరకు ఉన్న చిన్న, పెద్ద, కార్పొరేట్ కంపెనీల్లో సుమారు 6.28 లక్షల మంది ఉపాధి పొందుతున్న విషయం విదితమే. హై..హై..ఐటీ.. గ్రేటర్ పరిధిలో 2014 నుంచి ఐటీ భూమ్ క్రమంగా పెరుగుతోంది. విశ్వవ్యాప్తంగా పేరొందిన దిగ్గజ ఐటీ, బీపీఓ, హార్డ్‌వేర్, కేపీఓ సంస్థలు నగరానికి క్యూ కడుతున్నాయి. కరోనా కష్టకాలంలోనూ నగరంలో ఐటీ కంపెనీల కార్యకలాపాలు, నూతన కంపెనీల వెల్లువ తగ్గకపోవడం విశేషం. ప్రస్తుతం ఏటా రూ.1.45 లక్షల కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు 2026 నాటికి ఏటా రూ.3 లక్షల కోట్ల మార్కును దాటుతాయని ఐటీ వర్గాలు లెక్కలు వేస్తుండడం విశేషం. -
కళ్లు చెదిరేలా ఐటీ సెక్టార్లో అభివృద్ధి.. కేటీఆర్ స్పెషల్ వీడియో
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత ఐటీ రంగంలో తెలంగాణ గణనీయమైన అభివృద్ధి సాధించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఐటీ రంగంలో తెలంగాణ సాధించిన అభివృద్ధి, ప్రభుత్వం తీసుకున్న చర్యల వివరాలను వెల్లడిస్తూ రూపొందించిన ప్రత్యేక వీడియోను మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో షేర్ చేశారు. ఐటీ సెక్టార్‌కి సంబంధించి 2014లో ఎగమతుల విలువ రూ. 57 వేల కోట్ల రూపాయలు ఉండగా 2021కి వచ్చేసరికి 1.45 లక్షల కోట్లకు చేరుకుందని ఐటీ మంత్రి తెలిపారు. అంతేకాదు ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 3.23 లక్షల మంది ఉండగా ప్రస్తుతం 6.28 లక్షల మంది ఐటీ సెక్టార్లో ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారని, పరోక్షంగా 20 లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారని ఈ వీడియోలో తెలిపారు. ఇంకా ఈ రంగానికి సంబంధించిన అభివృద్ధిని కళ్లకు కట్టినట్టు ఈ వీడియోలో ఆవిష్కరించారు. So fulfilling to see how far #Telangana IT sector has come since the formation of the State in 2014. Telangana Promises...Telangana Delivers! Feel fortunate to be part of this exciting journey. #ITisTelangana#TriumphantTelangana pic.twitter.com/3yOwnoujQk — KTR (@KTRTRS) October 3, 2021 చదవండి : బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో మరో కీలక అడుగు -
నష్టాల ముగింపు- ఐటీ ఎదురీత
పలు దేశాలలో మళ్లీ కోవిడ్-19 కేసులు ఉధృతమవుతున్న నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లకూ సెగ తగిలింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకే కట్టుబడటంతో సెన్సెక్స్ 173 పాయింట్లు క్షీణించి 39,750 వద్ద ముగిసింది. నిఫ్టీ 59 పాయింట్ల నష్టంతో 11,671 వద్ద స్థిరపడింది. బ్రిటన్ బాటలో తాజాగా జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాలు లాక్‌డవున్ ఆంక్షలు విధించడంతో బుధవారం అమెరికా, యూరోపియన్ మార్కెట్లు పతనమయ్యాయి. దీంతో తొలుత దేశీయంగానూ అమ్మకాలు వెల్లువెత్తాయి. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్ 39,524వరకూ పతనమైంది. అయితే ఒక దశలో 40,010 వరకూ పుంజుకోవడం గమనార్హం! ఇదే విధంగా తొలుత నిఫ్టీ 11,607 దిగువకు చేరింది. తదుపరి 11,744 వరకూ ఎగసింది. అక్టోబర్ డెరివేటివ్ సిరీస్ గడువు ముగియడంతో ట్రేడర్లు పొజిషన్లను రోలోవర్ చేసుకున్నారని, దీంతో కొంతమేర మార్కెట్లలో ఆటుపోట్లు సహజమని విశ్లేషకులు పేర్కొన్నారు. అన్ని రంగాలూ ఎన్ఎస్ఈలో ఐటీ మాత్రమే అదికూడా 0.3 శాతం బలపడగా.. మిగిలిన అన్ని రంగాలూ 2-0.5 శాతం మధ్య డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎల్అండ్టీ, టైటన్, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, యాక్సిస్, ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, హెచ్‌యూఎల్, హీరో మోటో, ఎన్టీపీసీ 5-2 శాతం మధ్య బోర్లా పడ్డాయి. అయితే ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్, శ్రీ సిమెంట్, హెచ్‌సీఎల్ టెక్, కొటక్ బ్యాంక్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, ఐవోసీ, గెయిల్ 3-1 శాతం మధ్య పుంజుకున్నాయి. పిరమల్ డౌన్ డెరివేటివ్స్‌లో పిరమల్, ఐడియా, ఎల్అండ్టీ ఫైనాన్స్, భెల్, ఎల్ఐసీ హౌసింగ్, డీఎల్ఎఫ్, సెయిల్, పీవీఆర్, ఫెడరల్ బ్యాంక్, గ్లెన్‌మార్క్, లుపిన్ 5.5-2 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోవైపు పిడిలైట్, హెచ్‌పీసీఎల్, బెర్జర్ పెయింట్స్, అదానీ ఎంటర్, ఇండిగో, ముత్తూట్, చోళమండలం, రామ్‌కో సిమెంట్, జూబిలెంట్ ఫుడ్ 5-2 శాతం మధ్య జంప్‌చేశాయి. బీఎస్ఈలో స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం నీరసించింది. ట్రేడైన షేర్లలో 1,561 నష్టపోగా.. 1,029 లాభపడ్డాయి. ఎఫ్‌పీఐల అమ్మకాలు నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,131 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే దేశీ ఫండ్స్(డీఐఐలు) సైలంట్ అయ్యాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 3,515 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1,571 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 119.4 కోట్లు, డీఐఐలు రూ. 979 కోట్లు చొప్పున అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే -
పతన మార్కెట్లోనూ ఈ చిన్న షేర్లు భళా
ఉన్నట్టుండి పెరిగిన అమ్మకాలతో దేశీ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. సెన్సెక్స్ 725 పాయింట్ల వరకూ పడిపోగా.. నిఫ్టీ 225 పాయింట్లు కోల్పోయింది. ఈ నేపథ్యంలోనూ కొన్ని ఎంపిక చేసిన షేర్లు ట్రేడర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో నష్టాల మార్కెట్లోనూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వీటిలో అధిక శాతం సాఫ్ట్వేర్ సేవల కంపెనీలు కావడం గమనార్హం! జాబితాలో శాస్కన్ టెక్నాలజీస్, శాక్సాఫ్ట్ లిమిటెడ్, సిగ్నిటీ టెక్నాలజీస్, రామ్‌కో సిస్టమ్స్, కనోరియా కెమికల్స్ చోటు సాధించాయి. ట్రేడింగ్ వివరాలు చూద్దాం.. శాస్కన్ టెక్నాలజీస్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 9 శాతం దూసుకెళ్లి రూ. 644 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 684 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకావడం విశేషం! బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 3,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 17,900 షేర్లు చేతులు మారాయి. సిగ్నిటీ టెక్నాలజీస్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 8 శాతం జంప్‌చేసి రూ. 383 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 410 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకావడం విశేషం! బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 6,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 29,000 షేర్లు చేతులు మారాయి. శాక్సాఫ్ట్ లిమిటెడ్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 6 శాతం ర్యాలీ చేసి రూ. 405 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 447 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకావడం విశేషం! బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 10,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 69,000 షేర్లు చేతులు మారాయి. రామ్‌కో సిస్టమ్స్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 3 శాతం లాభపడి రూ. 390 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 397 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకావడం విశేషం! బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 15,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో లక్ష షేర్లు చేతులు మారాయి. కనోరియా కెమికల్స్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 12 శాతం లాభపడి రూ. 41 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 44 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 4,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 48,500 షేర్లు చేతులు మారాయి. -
హెచ్‌సీఎల్, ఇన్ఫీ పుష్- ఐటీ షేర్ల దూకుడు
ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించే వీలున్నట్లు ఐటీ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తాజాగా అభిప్రాయపడింది. ఆదాయం, నిర్వహణ మార్జిన్లు అంచనాల(గైడెన్స్)ను అందుకోనున్నట్లు పేర్కొంది. త్రైమాసిక ప్రాతిపదికన ఆదాయం 3.5 శాతం పెరగనున్నట్లు అంచనా వేసింది. ఇబిట్ మార్జిన్లు 20.5-21 శాతం స్థాయిలో నమోదుకావచ్చని తెలియజేసింది. దీంతో ఐటీ రంగంపై ఇన్వెస్టర్లలో ఆశలు పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇక మరోవైపు యూరోపియన్ సంస్థ గైడ్‌విజన్‌ను సొంతం చేసుకోనున్నట్లు ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ తాజాగా వెల్లడించింది. ఎంటర్ప్రైజ్ సర్వీస్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సేవలందించే ఈ యూరోపియన్ కంపెనీ కొనుగోలుకి తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. ఫలితంగా హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌తోపాటు.. సాఫ్ట్వేర్ సేవల ఇతర కంపెనీలకూ డిమాండ్ పెరిగినట్లు తెలియజేశారు. దీంతో ఎన్ఎస్ఈలో ఐటీ ఇండెక్స్ ఏకంగా 4.5 శాతం ఎగసింది. టీసీఎస్ రికార్డ్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేరు 9.6 శాతం దూసుకెళ్లింది. రూ. 789 వద్ద ట్రేడవుతోంది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. టీసీఎస్ 3 శాతం ఎగసింది. రూ. 2,447 వద్ద ట్రేడవుతోంది. తద్వారా సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. అంతేకాకుండా టీసీఎస్ మార్కెట్ విలువ రూ. 9 లక్షల కోట్లను అధిగమించింది. వెరసి ఆర్ఐఎల్ తదుపరి అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా రికార్డు సాధించింది. జోరుగా హుషారుగా ఐటీ సేవల ఇతర కంపెనీలలో ఎంఫసిస్ 8.4 శాతం జంప్‌చేసి రూ. 1251ను తాకింది. తొలుత రూ. 1,270 వద్ద 52 వారాల గరిష్టానికి చేరింది. ఈ బాటలో మైండ్‌ట్రీ 3.7 శాతం ఎగసి రూ. 1227 వద్ద ట్రేడవుతోంది. ఇది ఏడాది గరిష్టంకాగా.. ఇన్ఫోసిస్ 4 శాతం దూసుకెళ్లి రూ. 983కు చేరింది. తద్వారా 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఇదే విధంగా కోఫోర్జ్ 3.25 శాతం లాభపడి రూ. 2158 వద్ద కదులుతోంది. ఇది ఏడాది గరిష్టంకాగా.. టెక్ మహీంద్రా 3.5 శాతం పెరిగి రూ. 792 వద్ద ట్రేడవుతోంది. ఇక ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ 2.6 శాతం బలపడి రూ. 2564 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 2564 వద్ద 52 వారాల గరిష్టానికి చేరింది. ఐటీ దిగ్గజం విప్రో సైతం 2.75 శాతం పుంజుకుంది. రూ. 302 సమీపంలో ఏడాది గరిష్టం వద్ద ట్రేడవుతోంది. ఇతర కౌంటర్లలో తొలుత రూ. 1331 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకిన టాటా ఎలక్సీ 2 శాతం లాభంతో రూ. 1314 వద్ద ట్రేడవుతోంది. -
ఐటీ జాబ్స్ డౌన్!
సాక్షి, సిటీబ్యూరో : దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో కొలువుల వృద్ధి శాతం 3 శాతం పెరగ్గా...ఐటీ రంగంలో మాత్రం 12 శాతం కొలువులకు కోత పడినట్లు తాజా సర్వేలో తేలింది. 2017, ఏప్రిల్‌తో పోలిస్తే 2018 ఏప్రిల్ చివరి నాటికి పలురంగాల్లో కొలువులకు కోత పడగా.. మరికొన్ని రంగాల్లో వృద్ధి నమోదైనట్లు నౌక్రి డాట్‌కామ్ వెబ్సైట్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఐటీ..అనుబంధ రంగాల్లో ఇలా.. 2018, ఏప్రిల్ నెలాఖరునాటికి వివిధ రంగాల్లో కొలువుల వృద్ధిరేటును పరిశీలించి విడుదల చేసిన తాజా జాబ్సీక్ రిపోర్ట్‌లో ఐటీ మినహా ఇతర రంగాల్లో వృద్ధి మూడు శాతం నమోదైందని ఈ అధ్యయనం తేటతెల్లం చేసింది. ప్రధానంగా ఆటోమోబైల్, నిర్మాణ రంగం, ఇంజినీరింగ్ విభాగాల్లో కొలువుల జోరు కొనసాగుతోందని ఈ రిపోర్ట్ వెల్లడించడం విశేషం. మెట్రో నగరాల్లో జాబ్ ట్రెండ్స్ ఇలా.. ముంబయి, కోల్‌కతా నగరాల్లో ప్రతీఏటా ఐటీ కొలువుల్లో వృద్ధి నమోదవుతోందని..కానీ బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో నాలుగుశాతం తగ్గినట్లు ఈ నివేదిక వెల్లడించింది. కాగా కోల్‌కతాలో ఏటా ఐదుశాతం వృద్ధి, ముంబయిలో 4 శాతం, చెన్నైలో ఒకశాతం వృద్ధి నమోదవుతోందట. ఇక పుణే నగరంలోనూ కొలువుల్లో ఒక శాతం కోత పడుతున్నట్లు ఈ సర్వే రిపోర్టు వెల్లడించింది. పురోగమిస్తోన్న కొత్త రంగాలు.. ఐటీ రంగంలో కొలువుల వృద్ధిరేటు తగ్గుముఖం పట్టగా...మరోవైపు ఆటోమొబైల్, పారిశ్రామికరంగం, నిర్మాణ రంగాల్లో కొలువుల వృద్ధి గణనీయంగా నమోదవడం విశేషం. ఇక బీపీఓ, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, ఫార్మా, బయోటెక్ రంగాల్లోనూ స్వల్పవృద్ధి రేటు నమోదైనట్లు తాజా నివేదికలో వెల్లడైంది. మెట్రో నగరాల్లో ఐటీ కొలువుల్లో పెరుగుదల/తరుగుదల ఇలా ఉంది... నగరం పెరుగుదల/తరుగుదల కోల్‌కతా 5 శాతం వృద్ధి ముంబయి 4 శాతం వృద్ధి చెన్నై 1 శాతం వృద్ధి బెంగళూరు 4 శాతం తరుగుదల హైదరాబాద్ 4 శాతం తరుగుదల వివిధ రంగాల్లో వృద్ధి ఇలా ఉంది. రంగం కొలువుల్లో వృద్ధి ఇలా ఉంది (శాతంలో) ఆటోమొబైల్ 33 పారిశ్రామికరంగం 23 నిర్మాణరంగం 20 బీపీఓ 11 ఇన్సూరెన్స్ 06 బ్యాంకింగ్ 05 ఫార్మా, బయోటెక్ 04 మందగమనం తాత్కాలికమే నగరంలో ఐటీ రంగంలో కొలువుల వృద్ధిరేటు తాత్కాలికంగా తగ్గుముఖం పట్టినప్పటికీ..త్వరలో కొత్త కంపెనీలు, ప్రాజెక్టుల రాకతో పుంజుకుంటున్నట్లు అంచనా వేస్తున్నాం. ఐటీ, హార్డ్‌వేర్ పాలసీ, టీఎస్ఐపాస్ రాకతో గ్రేటర్ నగరానికి దేశ, విదేశీ దిగ్గజ కంపెనీల రాక మొదలైంది. – జీఎల్.స్వామి, ఐటీ రంగ నిపుణుడు -
ఐటీలో అంతే..
సాక్షి,బెంగళూర్: ఐటీ రంగంలో నియమాకాలు మరికొన్నేళ్లు మందకొడిగానే ఉంటాయన్న అంచనాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎగుమతులు 7-8 శాతం పెరగడం కష్టమేనని ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) వీ బాలకృష్ణన్ అన్నారు. వచ్చే ఏడాది ఐటీ రంగంలో వృద్ధి పట్ల ఆయన సానుకూలంగా స్పందించారు. అభివృద్ధి చెందిన మార్కెట్లలో పరిస్థితి ప్రోత్సాహకరంగా లేకపోవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రధమార్థంలో ఐటీ రంగం చెప్పుకోదగ్గ వృద్థి సాధించలేదని పేర్కొన్నారు. నియామకాలు మందగించాయని, ఆటోమేషన్ ప్రభావంతో మూడు ప్రధాన కంపెనీలు ఉద్యోగుల వృద్థిలో ప్రతికూల వృద్ధిని సాధించాయని చెప్పుకొచ్చారు. అయితే భారత ఐటీ పరిశ్రమకు ప్రధాన వనరుగా ఉన్న అమెరికాలో ఆర్థిక వ్యవస్థ కొంత మేర ఊపందుకోవడం ఊరట ఇచ్చే పరిణామమని చెప్పారు. యూరప్‌లోనూ పరిస్థితి మెరుగుపడటంతో వచ్చే ఏడాది నుంచి ఐటీ ఎగుమతులు ఆశాజనకంగా ఉంటాయని, అయితే డిజిటల్ రంగంలోనూ భారత్ సత్తా చాటాలని డిజిటల్ వైపుయ మళ్లే క్రమంలో భారత ఐటీ పరిశ్రమ పెద్దమొత్తంలో నిధులు కేటాయించి నూతన టెక్నాలజీలకు మళ్లే ప్రక్రియపై పెట్టుబడులు పెట్టాల్సిఉందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఐటీ వృద్ధి 7 నుంచి 8 శాతం ఉంటుందన్న నాస్కామ్ అంచనాలను ప్రస్తావిస్తూ ఆ స్థాయిలో ఐటీ వృద్ధి ఉంటుందని తాను అనుకొవడం లేదన్నారు. మూడవ, నాల్గో త్రైమాసికాల్లో ప్రోత్సాహకర వృద్ధి రేటును సాధించడం ఐటీ పరిశ్రమ ముందున్న సవాల్ అని అన్నారు. ఇక ఐటీ రంగంలో నియామకాల్లో నెలకొన్న మందకొడితనం మరికొన్నాళ్లు కొనసాగుతుందని బాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు. -
ఐటీలో వలసల జోరు...
⇒ రికార్డు స్థాయికి చేరిన అట్రిషన్ రేటు ⇒ బోనస్‌లు, ప్రమోషన్లు, ఐఫోన్లతో ఉద్యోగులకు తాయిలాలు ⇒ తగ్గుతున్న కొత్త ఉద్యోగాలు; ఈ ఏడాది 2 లక్షల మందికే అవకాశాలు ⇒ 12%కి పరిమితం కానున్న ఐటీ రంగ వృద్ధి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రమేష్ ఓ మల్టీ నేషనల్ కంపెనీ హెచ్ విభాగంలో హైదరాబాద్ యూనిట్‌కి అధిపతిగా పనిచేస్తున్నాడు. వార్షిక జీతం రూ.12 లక్షలు. సడెన్‌గా ఒకరోజు... రేపటి నుంచి విధులకు రానక్కరలేదంటూ మెయిల్ వచ్చింది. రమేష్ స్థానంలో అతని కింద పనిచేస్తున్న ఉద్యోగికి ప్రమోషన్ ఇచ్చి హెచ్ఆర్ హెడ్‌గా నియమించారు. ఇలా మార్పు చేయడం వల్ల కంపెనీకి ఏటా రూ.4 లక్షల మిగులు కనిపించింది. వ్యయాలు తగ్గించుకోవడానికి ప్రస్తుతం ఐటీ కంపెనీలు అనుసరిస్తున్న సూత్రమిది. ప్రొడక్ట్ నిపుణుల విషయంలో కాస్తంత ఆచితూచి కొద్దిమంది విషయంలోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుండగా... సపోర్టింగ్ విభాగాల్లో మాత్రం ఇదే తీరు అనుసరిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే టీసీఎస్ వంటి ప్రధాన కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించటం కూడా ఇటీవలి పరిణామమే. కంపెనీలు ఉద్యోగుల తొలగింపుపై దృష్టి సారించడంతో ఎంట్రీ లెవెల్లో నైపుణ్యం ఉన్న ఉద్యోగులకు డిమాండ్ ఏర్పడుతోంది. దీంతో కంపెనీల మధ్య ఉద్యోగుల వలసలు (అట్రిషన్ రేటు) ప్రస్తుతం రికార్డు స్థాయికి చేరింది. నాస్కామ్ అంచనాల ప్రకారం అట్రిషన్ రేటు సగటున 15 శాతం ఉంది. కానీ ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, విప్రో వంటి పెద్ద కంపెనీల్లో ఇంతకంటే అధికంగా ఉంది. దీంతో పలు కంపెనీలు ఉద్యోగులకు పదోన్నతులివ్వటం, బోనస్‌లు మంజూరు చేయటంతో పాటు ఐఫోన్ల వంటి బహుమతులు కూడా ఇస్తుండటం గమనార్హం. ఇటీవలే టసీఎస్ తన ఉద్యోగులకు భారీ బోనస్ ప్రకటించగా, ఇన్ఫోసిస్ 5,000 మంది ఉద్యోగులకు పదోన్నతులు, మంచి పనితీరు కనపర్చిన 3,000 మందికి ఐఫోన్లను బహుమతిగా అందించింది. ఉద్యోగల వలసలను అరికట్టడానికే కంపెనీలు ఈ విధమైన తాయిలాలను ప్రకటిస్తున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా కంపెనీల వ్యయ నియంత్రణకి తోడు, కొత్త టెక్నాలజీ ఫ్లాట్‌ఫామ్‌పై పనిచేయాలన్న తాపత్రయం కూడా ఈ వలసలకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఈ ఏడాది కూడా అట్రిషన్ రేటు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని, దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నాస్కామ్ ప్రెసిడెంట్ బి.వి.ఆర్ మోహన్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు యువత మానసిక ధోరణిలో చాలా మార్పు వచ్చిందని, ఎక్కువ కాలం ఒకే కంపెనీలో పని చేయడం లేదని, అలాగే సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవడానికి, కొత్త టెక్నాలజీ రంగాల్లోకి మారుతుండటం ఈ వలసలు పెరగడానికి కారణమన్నారు. ఈ మధ్య కాలంలో కొత్త టెక్నాలజిలో అందుబాటులోకి రావడం, అవకాశాలు పెరగడం అట్రిషన్ పెరగడానికి ప్రధాన కారణంగా పోగ్రెసివ్ సాఫ్ట్వేర్ వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డెరైక్టర్ రమేష్ లోగనాథన్ పేర్కొన్నారు. తగ్గనున్న ఉద్యోగాల కల్పన... అమెరికా వృద్ధి రేటు అనుకున్నంతగా పెరగకపోవటం, కంపెనీల్లో ఆటోమేషన్ పెరగటంతో ఈ ఏడాది ఐటీ ఉద్యోగార్థులకు తీవ్ర నిరాశ ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. 15 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థుల్లో రెండు లక్షల మందికి మించి ఉద్యోగాలు లభించకపోవచ్చని అంచనా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే ఏటా 2.5 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు బయటకు వస్తున్నారు. గతంలో ప్రతీ రూ.1,000 కోట్ల టర్నోవర్‌కు 500 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తే ఇప్పుడు ఆటోమేషన్ వల్ల ఆ స్థాయిలో ఉద్యోగాలు కల్పించలేకపోతున్నట్లు మోహన్ రెడ్డి చెప్పారు. గతేడాది ఐటీ రంగంలో కొత్తగా 2.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించగా అది ఈ ఏడాది రెండు లక్షలకు పరిమితం కావచ్చని అంచనా వేస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐటీ ఉద్యోగుల సంఖ్య 32 లక్షలుగా ఉంటే అది ఏ డాది 34 లక్షలకు చేరుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. డాలరుతో పోలిస్తే ఇతర దేశాల కరెన్సీ విలువలు బాగా తగ్గడంతో ఈ ఏడాది ఐటీ రంగ వృద్ధి సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందని, అదే రూపాయి విలువతో పోలిస్తే 12% దాటకపోవచ్చనేది నాస్కామ్ అంచనా. గతేడాది వ్యాపారంలో 11% వృద్ధి నమోదైతే ఉద్యోగాల కల్పన 7%కి పరిమితమయ్యింది.