janardhan
-
యూ బెగ్గర్ అంటూ.. తాత అవమానించాడు
హైదరాబాద్: నగరంలో సంచలనం సృష్టించిన ప్రముఖ పారిశ్రామికవేత్త చంద్రశేఖర్ జనార్దనరావు(Industrialist Janardhan Rao) హత్యకేసులో నిందితుడు, ఆయన మనవడు కిలారు కీర్తితేజ(Keerthi Teja) నాలుగు రోజుల (Police custody) సోమవారం ముగిసింది. కీర్తితేజ తన తాతను హత్య చేసిన విధానం, ఎందుకు చేశాడో పంజాగుట్ట పోలీసులకు వివరించారు. ప్రతిరోజూ తన తాత జనార్దన్‌రావు అవమానించేవాడని.. అది భరించలేకనే ఈ ఘోరానికి పాల్పడినట్లు కీర్తితేజ వెల్లడించాడు. ఏరోజూ తనను సొంత మనిషిగా చూడలేదని, అందరి కంటే హీనంగా చూస్తూ దారుణంగా వ్యవహరించేవాడని, అందుకే తాతను హత్య చేశానని పోలీసుల విచారణలో చెప్పాడు. సీఐ శోభన్ తెలిపిన వివరాల ప్రకారం తన తాత తనను కుటుంబంలో ఒక సభ్యుడుగా తనను ఎప్పుడూ చూసేవాడు కాదన్నాడు.ప్రతీరోజూ తనను బెగ్గర్ అంటూ సంబోధించడమే కాకుండా ఆఫీసుకు వెళ్తే అక్కడ కూడా అవమానించేవారని కీర్తి తేజ చెప్పాడు. దీంతో స్టాఫ్ కూడా తనను చిన్నచూపు చూసేవారంటూ తెలిపాడు. ఆస్తి పంపకాలు పదవుల కేటాయింపుల్లోనూ తనను తక్కువ చేశాడని, చివరకు డైరెక్టర్ పదవి కూడా జనార్దన్‌రావు రెండవ కుమార్తె కొడుకుకు ఇచ్ఛాడని, అప్పటినుంచి తనకు, తాతకు మధ్య గొడవలు పెరిగాయని చెప్పాడు. అందుకే తాతను చంపేయాలని నిర్ణయించుకుని ప్లాన్ చేసుకున్నానని, అందులో భాగంగా ఇన్‌స్టామార్ట్ నుంచి కత్తి కొనుగోలు చేశానని చెప్పాడు.హత్య జరిగిన రోజు తనకు తాతకు మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగిందని, తనకు వాటా కావాలని అడిగితే ఇయ్యను పొమ్మనడంతో కోపంతో కత్తితో కసితీరా పొడిచి చంపేసి తర్వాత అక్కడినుంచి పారిపోయానని కీర్తి తేజ తెలిపాడు. హత్య చేసిన తర్వాత బిఎస్మక్తా ఎల్లమ్మగూడ పక్కనే ఖాళీ స్థలంలో కత్తి, రక్తంతో కూడిన బట్టలను తగులబెట్టానని వివరించాడు. అయితే మంటల్లో కత్తి కాలిపోకుండా అలాగే ఉండడంతో పోలీసులు ఆ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అయితే మొదటిరోజు విచారణలో కీర్తితేజ పోలీసులకు సహకరించలేదు.ఎందుకు హత్య చేశావంటూ పోలీసులు ఎంత ప్రశ్నించినా నోరు మెదపలేదు. ఘటనాస్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్‌కు ప్రయత్నిస్తే కీర్తి తేజ సహకరించలేదు. ఏ ప్రశ్న అడిగినా నేల చూపులు చూసేవాడని పోలీసులు చెప్పారు. రెండవరోజు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అప్పటినుంచి విచారణ వేగవంతమైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని విచారణ అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించినట్లు పోలీసులు చెప్పారు. -
చనిపోతున్నా బిడ్డా..!
ఇచ్చోడ: ‘‘చనిపోతున్నా బిడ్డా..’’అంటూ ఓ తండ్రి కూతురికి వీడియో కాల్ చేశాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియజేసి.. వారు అతని ఆచూకీ కోసం ఆరా తీస్తూ వెళ్లేసరికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం జున్ని గ్రామంలో శనివారం ఈ విషాదకర ఘటన జరిగింది. అప్పులు పెరిగిపోవడంతోపాటు, ఫైనాన్స్ కిస్తీలు కట్టలేక ఆ రైతు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.గ్రామస్తులు, ఎస్సై తిరుపతి కథనం ప్రకారం.. జున్ని గ్రామానికి చెందిన అడిగే జనార్దన్‌కు భార్య గంగబాయి, ముగ్గురు కూతుళ్లు లక్ష్మి, ప్రియ, గంగమణి, కుమారుడు విఠల్ ఉన్నారు. కూతుళ్ల పెళ్లిళ్లు అయ్యాయి. జనార్దన్ తనకున్న మూడెకరాల్లో పత్తి, సోయా సాగు చేశాడు. కొన్ని నెలల క్రితం ఫైనాన్స్ ద్వారా ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. అయితే ట్రాక్టర్ సరిగా నడవకపోవడంతో కిస్తీలు కట్టలేకపోయాడు. దీంతో కిస్తీలు కట్టాలని ఫైనాన్స్ వారు ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో జనార్దన్ మద్యానికి బానిసయ్యాడు. శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పొలానికి వెళ్తున్నానని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో పుణేలో ఉంటున్న కూతురికి వీడియో కాల్ చేశాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. వెంటనే ఆమె గ్రామంలోని తన కుటుంబ సభ్యులకు ఈ సమాచారం అందించింది. వీడియో కాల్లో కనిపించిన ప్రదేశంలో సిమెంటు బెంచీలు ఉన్నాయని చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు ఇచ్చోడ పార్కులో గాలించారు. అక్కడ కనిపించకపోవడంతో పొలం చుట్టుపక్కల ప్రదేశంలో గాలిస్తుండగా.. ఓ స్టోన్ క్రషర్ సమీపంలో చెట్టుకు జనార్దన్ (50) మృతదేహం వేలాడుతూ కనిపించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తిరుపతి తెలిపారు. -
చంద్రబాబుకే బురిడీ!
సాక్షి టాస్క్‌ఫోర్స్: పలమనేరు ఎన్నికల ప్రచారానికి వచ్చిన చంద్రబాబు మాట్లాడుతూ పాపం కర్ణాటక నుంచి ఇక్కడికొచ్చి మెటల్ స్టోన్ క్రషింగ్ చేసుకుంటున్న జనార్దన నాయుడిని బెదిరించి దాన్ని కొట్టేశారని ఆరోపించారు. ఇదే విషయాన్ని ఆయన జిల్లాలో పలుచోట్ల ఎన్నికల ప్రచారాల్లో మాట్లాడారు. జనార్దన నాయుడుకు ఇంత అన్యాయం జరిగిందా అనుకున్నారుగానీ ఇప్పుడు చూస్తే అసలు ఆ క్వారీకి లీజుదారుడు జనార్దన్ నాయుడే కాదు. చిత్తూరు జిల్లా వి.కోట మండలానికి చెందిన శరత్కుమార్దిగా ఇక్కడి మైనింగ్ రికార్డుల్లో ఉంది. ఇన్నాళ్లు చంద్రబాబునే బురిడీ కొట్చించిన జనార్దన్ నాయుడు భలే వాడుగా ఉండాడే అంటూ ఇక్కడి జనం చర్చించుకుంటున్నారు. కూటమి అధికారంలోకి రాగానే మాదిగబండ క్వారీనీ నాయుడు స్వాధీనం చేసుకుని తమ ప్రభుత్వం అధికారంలో ఉందని అధికారులను సైతం బెదిరించుకుంటూ జల్లి(కంకర)పనులు యథేచ్ఛగా చేస్తున్నాడు. నాయుడు కర్ణాటకలో బీజేపీ నాయకుడు, ఇక్కడేమో టీడీపీ లీడర్‌గా చలమాణి అవుతున్నాడు.ఆపరేటర్ మృతితో విషయం వెలుగులోకి...మూడు రోజుల క్రితం మాదిగబండ క్వారీలో ఓ జేసీబీ ఆపరేటర్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. దీనిపై స్పందించిన ఇక్కడి వైఎస్సార్సీపీ నేతలు మృతుని కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలకు దిగారు. ఈ నేపథ్యంలో క్వారీకి సంబందించిన అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2021లో ఇక్కడి క్వారీకి లీజుదారుగా ఉన్న జి.మోహన్‌బాబు తన క్వారీని శరత్‌కుమార్‌కు బదిలీ చేశారు. ఇందుకు సంబంధించిన స్థానిక మైనింగ్ శాఖలో ప్రొసీడింగ్స్ నెం:1059/టీక్యూఎల్/ఆర్ఎంబీఎస్/21 గా ఉంది. దీంతో శరత్‌కుమార్ లీజుదారుగా మారాడు. క్వారీకి సంబంధించి హెచ్‌టీ సర్వీస్ నెం:2503 పేరిట తీసుకున్నాడు. అయితే ఇదే క్వారీ ఇన్ ఎలిజిబుల్ జాబితాలో ఉందంటూ 2022 ఆగస్టు 1న మైనింగ్ డీడీ కేఎల్వీ ప్రసాద్‌రావు లీజుదారుడైన శరత్‌కుమార్‌కు ప్రొసీడింగ్స్ నెం:3522/క్యూ1గా నోటీసు జారీ చేశారు. దీంతో ఈ క్వారీ పనులు ఆగిపోయాయి. అనవసరంగా కరెంట్ చార్జీలు భారమెందుకు అనుకుని, 2024 జూన్ 6న స్థానిక ట్రాన్స్‌కో అధికారులకు అప్పటిదాకా ఉన్న బకాయిలను చెల్లించి సర్వీసును డీసీ చేయమని ట్రాన్స్‌కో ఎస్ఈ(ఆపరేషన్)కు అర్జీ ఇచ్చాడు. దీన్ని బట్టి చూస్తే ఈ క్వారీ జనార్దన్నాయుడుది కాదు శరత్కుమార్దని తేలిపోయింది.పంచాయతీకి సెస్‌లు కూడా లేవటకొలమాసనపల్లి పంచాయతీ సర్పంచ్ గోవిందుస్వామి సోమవారం స్థానిక మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ అక్రమంగా మైనింగ్ చేస్తున్న జనార్దన్నాయుడుపై చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. పైగా పంచాయతీ పన్నులను వసూలు చేయించాలని విన్నవించారు.ఒకే నెంబరుతో రెండు ఆధార్ కార్డులుజనార్దన్నాయుడు 9041 1852 3636 అనే నంబరుతో దొడ్డ కంబలి, బంగారుపేట తాలుకా, కర్ణాటక పేరిట ఆధార్ కార్డు ఉంది. ఇదే నంబరుపై కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం కెనమాకులపల్లిలోనూ ఆధార్ కార్డు కలిగి ఉన్నట్టు ఇక్కడి వైఎస్సార్సీపీ నేతలు బయటపెట్టారు. దీనిపై కలెక్టర్ విచారణ చేపట్టాలని విన్నవించారు.నోరుమెదపని అధికారులుఅనర్హత జాబితాలోకి వచ్చిన మాదిగబండ క్వారీని స్థానిక మైనింగ్ అధికారులు ఎందుకు ఆపలేదో అర్థం కాలేదు. తనకు కరెంట్ వద్దని విన్నవించిన లీజ్దారుని కాదని ఇన్ని నెలలుగా ట్రాన్స్‌కో అధికారులు ఎలా సరఫరా ఇస్తున్నారో చెప్పడం లేదు. దీనిపై వారిని వివరణ కోరినా దాటవేసే ప్రయత్నం చేయడం గమనార్హం.కూటమి అధికారంలోకి రాగానే..రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జనార్ధన్‌నాయుడు తన మనుషులతో వచ్చి మాదిగబండ క్వారీని స్వాధీనం చేసుకున్నాడు. అప్పటికే అక్కడున్న జల్లిని సైతం కర్ణాటకకు తరలించుకున్నాడు. దీనిపై లీజుదారుడైన శరత్‌కుమార్ జూన్ 16న స్థానిక సీఐకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కానీ అధికారబలంతో నాయుడు రెచ్చిపోయి క్వారీవద్దకు ఎవరినీ రానీయకుండా స్టోన్‌క్రషింగ్ చేస్తున్నాడు. -
సరిలేరు తనకెవ్వరు..!!
వేసవిలో మండుటెండల్లో ఖానా పూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చే వారికి పట్టణానికి చెందిన జనార్దన్ అంబలి పోసి ఆకలి తీరుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. పట్టణంలోని సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్ద డాక్యుమెంట్ రైటర్‌గా (లేఖరిగా) పనిచేస్తున్న పల్లికొండ జనార్దన్ తాను సంపాదించిన దాంట్లోంచి కొంత సామాజిక కార్యక్రమాలకు వెచ్చిస్తున్నాడు.ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా రాజకీయాలకతీతంగా తొమ్మిదేళ్లుగా సామాజిక సేవచేస్తూ అందరి మన్ననలు పొందుతూ పలువురికి మార్గదర్శిగా నిలుస్తున్నాడు. ఏటా వేసవి ప్రారంభం కాగానే మూడు నెలల పాటు ప్రజలకు అంబలిని అందిస్తున్నారు.రద్దీ పెరిగినా వెనక్కి తగ్గకుండా..పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌కు గతంలో అంతగా జనం వచ్చేవారు కాదు. ప్రస్తుతం ప్రభుత్వం ఉచితంగా ఆర్టీసీ సేవలు పెంచడంతో రద్దీ పెరిగింది. అయినప్పటికీ ప్రతీరోజు వెయ్యిమందికి పైగా జనానికి ఉచితంగా అంబ లి అందిస్తున్నాడు. దీనికి తోడు రూ.50 వెచ్చించి ఆర్టీసీ బస్టాండ్‌లో కూల్ వాటర్ ఫ్రీజర్ ఏర్పాటు చేసి ప్రజల దాహం తీరుస్తున్నాడు. 7 పదుల వయస్సులోనూ అధైర్యపడకుండా తన సేవలు కొనసాగిస్తున్నాడు.అంబలితో ఆరోగ్యం..అంబలి తాగడం ద్వారా వేడిమి నుంచి చల్లద నం పొందడంతో పాటు ఎన్నో పోషక విలువలు అందుతాయి. దీంతో చిన్నా, పెద్ద తేడా లేకుండా అంబలి సేవిస్తున్నారు.భవిష్యత్‌లోనూ అందిస్తా..నాటి కాలంలో ప్రతీ వేసవిలో అంబలి తాగడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు వడదెబ్బల నుంచి ఉపశమనం పొందేవారు. తొమ్మిదేళ్ల క్రితం కార్యక్రమం చేపట్టా. భవిష్యత్తులోనూ అందిస్తా.– పల్లికొండ జనార్దన్, అంబలి దాతకొన్నేళ్లుగా తాగుతున్నాం..ఆర్టీసీ బస్టాండ్‌లో జనార్దన్ ఉచితంగా అందించే అంబలిని కొన్నేళ్లుగా తాగుతున్నాం. వేసవి వచ్చిందంటే బస్టాండ్‌లో జనార్దన్ అంబలి ఉంటుందని గుర్తుకు వస్తుంది. ఎన్ని పనులున్నా వదిలివెళ్లి అంబలి తాగుతున్నాం.– కరిపె రాజశేఖర్, ఖానాపూర్ఇవి చదవండి: ఆరేళ్లుగా పిజ్జా లాగించేస్తున్నాడు.. కానీ అతను..! -
ఏఈ పేపర్ ‘చూపించడానికి’ రూ.2 లక్షలు!
సాక్షి, హైదరాబాద్/గండేడ్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో ఇద్దరు నిందితులను శుక్రవారం సిట్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న లవడ్యావత్ డాక్యానాయక్‌కు రూ.2 లక్షలు చెల్లించి అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) ప్రశ్నపత్రాన్ని ‘చూసి రాసిన’అభ్యర్థి జనార్దన్‌తోపాటు ఈ డబ్బు ఇచ్చిన అతడి తండ్రి మైబయ్య పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు అయినవారి సంఖ్య 19కి చేరింది. కమిషన్ కార్యదర్శి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన పిలిదిండి ప్రవీణ్ కుమార్, నెట్వర్క్ అడ్మిన్‌గా పనిచేసిన రాజశేఖర్‌రెడ్డి కుమ్మక్కై పలు పరీక్షల ప్రశ్నపత్రాలు(మాస్టర్ క్వశ్చన్ పేపర్స్) తస్కరించినట్లు సిట్ అధికారులు ఇప్పటికే నిర్ధారించారు. వీటిలో ఏఈ పేపర్‌ను ప్రవీణ్‌కుమార్ మహబూబ్‌నగర్ జిల్లా పగిడ్యాల పంచాంగల్ తండాకు చెందిన భార్యభర్తలు రేణుక, డాక్యాలకు విక్రయించాడు. కాగా, వికారాబాద్ జిల్లాలోని ఉపాధి హామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గండేడ్ మండలం జంగంరెడ్డిపల్లికి మైబయ్యతో అదే శాఖలో పనిచేసిన డాక్యాకు ఇదివరకే పరిచÄయం ఉంది. మైబయ్య కుమారుడు జనార్దన్ కూడా ఏఈ పరీక్షకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మార్చి 3న పరీక్ష పేపర్‌ను రూ.6 లక్షలకు విక్రయిస్తానని డాక్యా చెప్పగా, తన వద్ద అంత మొత్తం లేదని చెప్పి మైబయ్య తొలుత రూ.2 లక్షలు ఇచ్చాడు. పరీక్ష పేపర్ చూడు.. ప్రశ్నలు గుర్తుపెట్టుకో... డాక్యా మార్చి 4న జనార్దన్‌ను తన ఇంటికి పిలిచి పరీక్షపత్రంలోని ప్రశ్నలు చూపించాడు. తాను కోరి నట్లు రూ.6 లక్షలు చెల్లిస్తే జిరాక్సు ప్రతి ఇచ్చేవాడినని, రూ.2 లక్షలే ఇవ్వడంతో పేపర్ చూసుకుని ప్రశ్నలు గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఇస్తున్నానని జనార్దన్‌కు డాక్యా చెప్పాడని తెలిసింది. అయితే డాక్యాసహా ఇతర నిందితులు అరెస్టు, విచారణలో మైబయ్య, జనార్దన్ గురించి చెప్పలేదు. సిట్ పోలీసులు మార్చి మొదటివారంలో డాక్యా ఇంటి వద్ద ఉన్న సెల్‌ఫోన్ సిగ్నల్స్‌తోపాటు ఇతర కాల్స్ వివరాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే డాక్యా, మైబయ్యకు మధ్య ఉన్న లింకు బయటపడింది. మైబయ్య కుమారుడు జనార్దన్ పరీక్ష రాసినట్లు తేలింది. దీంతో వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా ఏఈ పరీక్షపత్రం ‘చూసి రాసిన’వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కోర్టు అనుమతితో వీరిని కస్టడీలోకి తీసుకోవాలని, ఇతర లింకులపై విచారించాలని సిట్ నిర్ణయించింది. -
‘ఓటుకు కోట్లు 2.0’ ప్రకంపనలు
సాక్షి, అమరావతి: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు చేసిన ఓటుకు కోట్లు 2.0 కుంభకోణం ప్రకంపనలు రేపుతోంది. తననూ టీడీపీ నేతలు ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని సోమవారం గుంటూరు (పశ్చిమ) ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ కూడా వెల్లడించడం సంచలనం సృష్టించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేయాలని.. టీడీపీ అగ్రనేతతో మాట్లాడిస్తామంటూ స్థానిక నేతలు తనను సంప్రదించారని మద్దాళి గిరిధర్ చెప్పారు. స్థానిక నేతలకు తాను స్పందించకపోవడంతో మాజీ ఎమ్మెల్సీ, చంద్రబాబు సన్నిహితుడు టీడీ జనార్దన్ ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించారని.. కానీ, తాను ఫోన్ లిఫ్ట్ చేయలేదన్నారు. కుట్రలు, కుతంత్రాలు, విలువల్లేని రాజకీయాలు చేసే చంద్రబాబు వైఖరి నచ్చక.. సీఎం వైఎస్ జగన్ సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన చూసి టీడీపీ వీడానని ఆయన స్పష్టంచేశారు. టీడీపీ అగ్రనేతల నుంచి తనకు వచ్చిన ఫోన్‌కాల్ లిస్ట్‌ను ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ బహిర్గతం చేయడంతో టీడీపీ ప్రలోభాల పర్వం మరోసారి బట్టబయలైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేస్తే రూ.పది కోట్లు ఇస్తామంటూ తనను ప్రలోభపెట్టేందుకు ఉండి ఎమ్మెల్యే రామరాజు ప్రయత్నించారని ఎమ్మెల్యే రాపాక ఇప్పటికే వెల్లడించడం.. ఓటును అమ్ముకుంటే వ్యక్తిత్వాన్ని కోల్పోయినట్లేనని భావించి ఆ ప్రతిపాదనను తిరస్కరించానని స్పష్టంచేసిన విషయం విదితమే. టీడీపీ ప్రలోభాలకు లొంగే ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు టీడీపీ అభ్యర్థికి క్రాస్ ఓటు చేశారన్నది స్పష్టమవుతోంది. గెలిచే బలం లేకున్నప్పటికీ.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని బరిలోకి దించడాన్ని బట్టి చూస్తుంటే.. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలోనే ఓటుకు రూ.కోట్లు ఎరవేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి చంద్రబాబు వ్యూహం రచించారని ఆదిలోనే వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ పార్టీ నేతలు చెప్పారు. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు 23 ఓట్లు రావడాన్ని బట్టి చూస్తే.. ఆ పార్టీకి ఉన్న 19 మంది ఎమ్మెల్యేల కంటే అదనంగా నలుగురు ఓట్లేసినట్లు స్పష్టమవుతోంది. ఆ నలుగురికి ఒక్కొక్కరికి రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లు ఇచ్చి కొనుగోలు చేసినట్లు సజ్జల ఇప్పటికే స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రలోభాల పర్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రలోభాలు, కుట్రలు, కుతంత్రాలు బాబు నైజం.. ప్రజలకు మంచి చేసి.. వారి ఆశీస్సులతో అధికారంలోకి రావాలని చంద్రబాబు ఎప్పుడూ ఆలోచించరని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 1995లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి దొడ్డిదారిన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రలోభాల పర్వాన్నే ఆయన ఎంచుకున్నారని గుర్తుచేస్తున్నారు. కుట్రలు, కుతంత్రాల ద్వారానే అధికారంలోకి రావడంపైనే చంద్రబాబు ఆలోచన చేస్తారని వారు స్పష్టంచేస్తున్నారు. తెలంగాణలో 2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు ఎరవేసి ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ.. ఆడియో వీడియో టేపులతో ఆ రాష్ట్ర ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చంద్రబాబు దొరికిపోవడాన్ని వారు గుర్తుచేస్తున్నారు. -
టాలీవుడ్లో మరో విషాదం, ప్రముఖ నటుడు వల్లభనేని జనార్ధన్ మృతి
టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. లెజెండరి నటులు కైకాల సత్యనారాయణ, నటుడు చలపతి రావు మృతి మరువకముందే మరో నటుడు కన్నుమూశారు. ప్రముఖ నటుడు, దర్శక-నిర్మాత వల్లభనేని జనార్ధన్(63) అనారోగ్యంతో మృతి చెందారు. ఈ రోజు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో టాలీవుడ్లో మరోసారి విషాదం నెలకొంది. ఆయన మృతికి టాలీవుడ్ సినీ ప్రముఖులు, నటీనటులు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన మెగాస్టార్ చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమాతో విలన్‌గా ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవితో అనేక చిత్రాల్లో నటించిన జనార్ధన్, బాలకృష్ణతో ‘లక్ష్మీనరసింహా’, నాగార్జునతో ‘వారసుడు’, వెంకటేశ్ తో ‘సూర్య ఐపీఎస్’ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. సినిమాల్లోనే కాకుండా ‘అన్వేషిత’ వంటి సీరియల్స్‌లో నటించి మెప్పించారు జనార్ధన్. ప్రముఖ దర్శక నిర్మాత విజయబాపినీడు మూడవ కూతురు లళినీ చౌదరిని జనార్ధన్ వివాహమాడారు. ఆయనకు ఇద్దరు కూతుర్లు, ఓ కొడుకు ఉన్నారు. మొదటి అమ్మాయి శ్వేత చిన్నతనంలోనే చనిపోయింది. రెండో కూతురు అభినయ ఫ్యాషన్ డిజైనర్‌గా కొనసాగుతున్నారు. అబ్బాయి అవినాశ్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఇక మామ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ చిత్రంతోనే వల్లభనేని జనార్ధన్ సినీరంగ ప్రవేశం చేశారు. చదవండి: విషాదంలో రకుల్.. మిస్ యూ అంటూ ఎమోషనల్ పోస్ట్ మరో కొత్త వివాదంలో రష్మిక, ఈసారి దక్షిణాదిపై సంచలన వ్యాఖ్యలు -
నా కుటుంబంపై కుట్ర జరుగుతోంది: బాలినేని
సాక్షి, ప్రకాశం జిల్లా: తనకు సంబంధం లేని విషయాలపై కొందరు గొడవ చేస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దీని వెనుక టీడీ జనార్ధన్ కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిన్న చెన్నైలో పట్టుబడ్డ డబ్బుపై మరోసారి దుష్ప్రచారం చేశారన్నారు. తన కుటుంబంపై కుట్ర జరుగుతోందన్నారు. ఇకనైనా వారు పద్దతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తప్పు చేసినట్లు నిరూపిస్తే పదవి నుంచి తప్పకుంటానని బాలినేని సవాల్ విసిరారు. చదవండి: చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్ ఓపెన్ సవాల్ -
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం
సాక్షి, హైదరాబాద్: పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే పార్టీ కాంగ్రెస్.. అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్, పేదలకు ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను ప్రవేశపె ట్టి ప్రజల మన్ననలు పొందిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వంటి నేతలు కాంగ్రెస్‌కు సేవలందించారని కొనియాడారు. మాజీ మంత్రి బోడ జనార్దన్, సిర్పూర్ బీఎస్పీ నాయకుడు రావి శ్రీనివాస్, మెట్పల్లి జెడ్పీటీసీ కె.రాధ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కళ్లెం శంకర్‌రెడ్డి తదితరులు ఆదివారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఏప్రిల్, మే లో ఎన్నికలు ఉంటాయని, జూన్‌లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. మాజీ మంత్రి బోడ జనార్దన్ మాట్లాడుతూ కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వ్యక్తి రేవంత్‌రెడ్డి ఒక్కరేనని అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్.. ఒక్క అవకాశం ఇవ్వండని చెప్పి వందల కోట్లు సంపాదించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు మల్లు రవి, వేంనరేందర్ రెడ్డి, మెట్పల్లి నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాది నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. -
Divyavani: టీడీపీ నేతలపై దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: టీడీపీ నుంచి బయటకొచ్చాక పనికిమాలిన చెత్త వెధవలు నాపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఆ పార్టీ నేతలపై దివ్యవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. అహర్నిశలు పార్టీ కోసం కష్టపడినా గుర్తింపు లేకనే బయటకు వచ్చేశానన్నారు. ఈ మేరకు దివ్యవాణి మీడియాతో మాట్లాడుతూ.. 'పార్టీకోసం నిజాయితీగా పనిచేసిన నాకు అన్యాయం చేశారు. టీడీ జనార్దన్ కోవర్టులతో తప్పులు చేస్తున్నారు. టీడీపీ నేతలు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. తెలంగాణలో టీడీపీకి ఏ పరిస్థితి వచ్చిందో ఏపీలో అదే పరిస్థితి వస్తుంది. నేను నిజాయితీగా ఉన్నాను కాబట్టే అందరి ఆధారాలు బయటపెడుతున్నాని' దివ్యవాణి అన్నారు. చదవండి: (CM Jagan: 24 ఏళ్ల కల నెరవేర్చిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు) -
‘ఆ అభ్యర్థుల ఎన్నికను రద్దు చేయాలి’
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థుల చేతిలో ఓటమిపాలైన పలువురు కాంగ్రెస్ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. తమపై గెలుపొందినవారి ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఎన్నికల పిటిషన్లు(ఈపీ) దాఖలు చేశారు. ఈపీలు దాఖలు చేసినవారిలో నాగం జనార్దన్‌రెడ్డి, డీకే అరుణ, ఎ.రేవంత్‌రెడ్డి, లక్ష్మణ్‌కుమార్, దాసోజు శ్రవణ్‌కుమార్, చంద్రశేఖర్, ఫిరోజ్‌ఖాన్, కాసాని జ్ఞానేశ్వర్ తదితరులు ఉన్నారు. తమపై గెలుపొందిన వారంతా అక్రమ పద్ధతుల్లో విజయం సాధించారని తమ తమ పిటిషన్లలో పేర్కొన్నారు. కొడంగల్‌లో తనపై గెలుపొందిన పట్నం నరేందర్‌రెడ్డి ఎన్నిక ల్లో అక్రమాలకు పాల్పడ్డాడని రేవంత్‌రెడ్డి తెలిపారు. అందువల్ల అతని ఎన్ని కను రద్దు చేసి తాను ఎన్నికైనట్లు ప్రకటించాలని కోరారు. దర్మపురి నుంచి గెలుపొందిన కొప్పుల ఈశ్వర్ ఎన్నికను రద్దు చేయాలంటూ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తన పిటిషన్లో కోరారు. నాగర్‌కర్నూలు నియోజకవర్గంలో మర్రి జనార్దన్‌రెడ్డి ఎన్నికను నాగం జనార్దన్‌రెడ్డి సవాలు చేశారు. గద్వాల నుంచి కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నికను డీకే అరుణ సవాలు చేశారు. ఖైరతాబాద్‌లో దానం నాగేందర్ ఎన్నికను రద్దు చేయాలని దాసోజు శ్రవణ్ కోరారు. మహబూబ్‌నగర్‌లో వి.శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికను సవాలు చేస్తూ టీడీపీ అభ్యర్థి చంద్రశేఖర్, నాంపల్లిలో ఎంఐఎం అభ్యర్థి ఎన్నికను సవాలు చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్‌ఖాన్, సికింద్రాబాద్‌లో టి.పద్మారావుగౌడ్ ఎన్నికను సవాలు చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ హైకోర్టును ఆశ్రయించారు. -
బ్రోకర్లు, రౌడీషీటర్లు, గూండాలకు టికెట్లిచ్చారు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌పార్టీలో బ్రోకర్లు, గూండాలు, రౌడీషీటర్లకు టికెట్లు కేటాయించారని మాజీమంత్రులు బోడ జనార్దన్, విజయరామారావు సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ కోసం ఐదేళ్లుగా కష్టపడిన తమను కాదని పారాచూట్లకు టికెట్లు అమ్ముకున్నారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ టికెట్లు రాని ఆశావహులతో కలసి తెలంగాణ రెబెల్స్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో జనార్దన్, విజయరామారావు, ధర్మపురి టికెట్ ఆశించిన మద్దాల రవీందర్ మాట్లాడారు. టికెట్ల కోసం పార్టీలోకి వచ్చినవారికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం కల్పించవద్దని రాహుల్ ఎన్నో సభల్లో, సమావేశాల్లో సూచించినా ఉత్తమ్, ఆర్.సి.కుంతియా టికెట్ల కోసం బేరమాడి, ఎంత ఖర్చు పెడతారో చెప్పాలంటూ అభ్యర్థిత్వాలను అమ్ముకున్నారన్నారు. తమ వద్ద ఆధారాలున్నాయని త్వరలోనే వాటిని బయటపెడతామన్నారు. పార్టీ సభ్యత్వంలేని 19 మందికి టికెట్లు అమ్ముకున్నారన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కావాలనే అభ్యర్థుల జాబితాను లీక్ చేసి, తర్వాత మీడియాలో వచ్చింది నమ్మవద్దంటూ చెప్పారని, తీరా అదే జాబితా అధికారికంగా వెలువడటం వెనుక ఎన్నికోట్లు చేతులు మారాయో చెప్పాలని డిమాండ్ చేశారు. 40 మందితో రెబెల్స్ ఫ్రంట్ జాబితా... తెలంగాణ ఇచ్చినందుకు సోనియా రుణం తీర్చుకోవాల్సిన తాము రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరామని, ముందస్తు ఎన్నికల నాటికి తామే అభ్యర్థులుగా ఉన్నామని జనార్దన్ అన్నారు. తీరా ఎన్నికలు దగ్గరపడేసరికి పారాచూట్లకు టికెట్లను అమ్ముకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పారాచూట్లకు టికెట్లుండవని రాహుల్ చెప్తుంటే ఉత్తమ్, కుంతియా, భట్టి విక్రమార్క మహాకూటమి పేరుతో మాయకూటమి పెట్టి టికెట్లు అమ్ముకున్నారన్నారు. కాంగ్రెస్ గెలవాల్సిన చోట ఓడిపోయే వ్యక్తులను నిలుచోబెట్టి పార్టికి నష్టం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడినా టికెట్లు రాని 40 మంది అభ్యర్థులతో తాము తెలంగాణ రెబల్స్ ఫ్రంట్‌గా ఏర్పడుతున్నామని వెల్లడించారు. రెండు రోజుల్లో రెబల్స్ జాబితా విడుదలు చేస్తామని తెలిపారు. నాలుగుసార్లు ఓడిపోయిన వ్యక్తికి టికెటిస్తారా? కరీంనగర్ జిల్లా ధర్మపురి నుంచి నాలుగు సార్లు ఓడిపోయిన వ్యక్తి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు మళ్లీ టికెట్ ఇవ్వడం రాహుల్ గాంధీ పెట్టిన నిబంధనలకు విరుద్ధమని రవీందర్ అన్నారు. స్క్రీనింగ్, కోర్ కమిటీ సమావేశాల్లో తన లాంటి స్థానిక నేతలు, యువకుల పేర్లు తుదిదశలో పరిశీలనకు వచ్చినా, వాటిని పక్కన పెట్టి ఉత్తమ్, కుంతియా, మరికొందరు సీనియర్లు టికెట్లను అమ్ముకున్నారని ఆరోపించారు. రెబెల్స్ఫ్రంట్ తరపున ధర్మపురి నుంచి పోటీ చేస్తున్నట్టు రవీందర్ చెప్పారు. -
ప్రభుత్వ ఉద్యోగం రాలేదని..
శ్రీకాకుళం: ప్రభుత్వ ఉద్యోగం రాలేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా పొందురు సమీపంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. లావేరు మండలం మురపాక గ్రామానికి చెందిన జనార్ధన్ గత కొంత కాలంగా ప్రభుత్వోద్యోగ అన్వేషణలో ఉన్నాడు. ఈ క్రమంలో ఉద్యోగం రాకపోవడంతో.. తీవ్ర మనస్తాపానికి గురై రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. -
పథకం ప్రకారమే జయశ్రీ హత్య
భర్తను కఠినంగా శిక్షించాలి పిల్లలకు న్యాయం చేయాలి మృతురాలి తల్లి, సోదరి డిమాండ్ అనంతపురం సెంట్రల్ : తన వివాహేతర సంబంధానికి తరచూ అడ్డు తగులుతున్నందునే ఉపాధ్యాయురాలు జయశ్రీని భర్త జనార్ధన్ పథకం ప్రకారం హత్య చేశాడని ఆమె తల్లి లక్ష్మిదేవి, అక్క, మాజీ కార్పొరేటర్ పావురాల కిష్ట భార్య పూర్ణమ్మ ఆరోపించారు. నగరంలోని నీరుగంటివీధిలో గల తమ నివాసంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జనార్ధన్ పలువురితో వివాహేతర సంబంధాలు పెట్టుకుని జయశ్రీకి నరకం చూపించాడని ఆవేదన వ్యక్తం చేశారు. సర్దిచెప్పాలని చూసిన తమను కూడా ఇష్టానుసారం దూషించేవాడని కన్నీటి పర్యంతమయ్యారు. ఎప్పటికైనా మారుతాడులే అని భావించామని, కానీ ఇంతటి దారుణానికి ఒడిగడుతాడని ఊహించలేకపోయామని అన్నారు. జయశ్రీకి భర్త అంటే ఎంతో ప్రాణమన్నారు. భర్త వేధింపులకు ఫిర్యాదు చేద్దామంటే వద్దనేదని గుర్తు చేసుకున్నారు. ముందే పోలీసులను ఆశ్రయించి ఉన్నా ఆమె ప్రాణాలతో దక్కేదని వాపోయారు. అన్యాయంగా జయశ్రీని పొట్టన పెట్టుకున్న జనార్ధన్‌కు కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేశారు. తల్లిని కోల్పోయిన ప్రగతిశ్రీ, వివేక్ శబరీష్‌లకు న్యాయం చేయాలని ఎస్పీ రాజశేఖర్‌బాబుకు విజ్ఞప్తి చేశారు. ఆస్తిపాస్తులు, ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ పిల్లలకు వర్తింపజేయాలని కోరారు. ఉపాధ్యాయ సంఘాలు కూడా ముందుకు వచ్చి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలోనే ఎస్పీని కలుస్తామన్నారు. -
మొగుడే యముడు
– ఉపాధ్యాయిని జయశ్రీని హతమార్చింది భర్తే? – పోలీసుల ప్రాథమిక విచారణలో అంగీకరించినట్లు సమాచారం – అనుమానంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఒప్పుకోలు –––––––––––––––––––––––––––––––––––––– అనంతపురం సెంట్రల్ : దంపతులిద్దరూ ప్రభుత్వోద్యోగులే. గౌరవప్రదమైన ఉపాధ్యాయ వత్తిలో కొనసాగుతున్నారు. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన అతను భార్యపై అనుమానం పెంచుకున్నాడు. చివరకు అంతమొందించాడు. తప్పించుకునేందుకు ప్రమాదవశాత్తు కాలుజారి పడి మతి చెందినట్లు నమ్మించాలని ప్రయత్నించాడు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో తానే హత్య చేశానంటూ అంగీకరించినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. అనంతపురం పాతూరులోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పని చేస్తున్న జయశ్రీ(35), యూటీఎఫ్ నగర కార్యదర్శిగా ఉంటున్న జనార్దన్ గంగానర్లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కాగా, వారి కుటుంబం అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తోంది. అయితే కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న అతను బుధవారం రాత్రి తీవ్ర స్థాయిలో గొడవపడినట్లు తెలుస్తోంది. విచక్షణ కోల్పోయిన అతను భార్య తలను గోడకేసి కొట్టడంతో పాటు ఊపిరి ఆడకుండా చేయడంతో ఆమె మతి చెందినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఆ తరువాత కంగారుపడిన నిందితుడు భయంతో ఆమెను పలు ప్రైవేటు హాస్పిటళ్లకు పిల్చుకెళ్లినట్లు తెలిసింది. అయితే అప్పటికే ఆమె మరణించినట్లు తెలిసి బాత్రూంలో జారి కింద పడినట్లు నమ్మించేందుకు ప్రయత్నించాడు. పోలీసుల విచారణలో అసలైన సంగతి ఒప్పుకున్నట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో అతన్ని అధికారంగా అరెస్టు చూపే అవకాశం ఉంది. -
డీసీసీబీ టర్నోవర్ రూ.600 కోట్లు
రూ.1000 కోట్లకు పెంచుతాం ఆ దిశగా అడుగులు డీసీసీబీ నోడల్ ఆఫీసర్ జనార్దన్ పాపన్నపేట: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వార్షిక టర్నోవర్ రూ.600 కోట్లకు చేరుకుందని దాన్ని రూ.వెయ్యి కోట్లకు పెంచాలన్న చైర్మన్ ఆదేశం మేరకు కార్యాచరణ రూపొందించినట్టు డీసీసీబీ నోడల్ ఆఫీసర్ జనార్దన్, డైరక్టర్ పి.మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం పాపన్నపేటలోని పీఏసీఎస్‌లో జరిగిన వినియోగదారుల సమావేశంలో వారు మాట్లాడారు. అన్నదాతలకు అండగా నిలిచేందుకు డీసీసీబీల ద్వారా ట్రాక్టర్లు, దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలు అందజేస్తున్నామన్నారు. రైతులకు టూవీలర్స్‌కు కూడా రుణాలు ఇస్తున్నామని చెప్పారు. త్వరలో గ్రామీణ బ్యాంకుల్లో 30 ఏటీఎం కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కస్టమర్ ఏటిఎంలను ఐదింటిని నెలకొల్పుతామన్నారు. డిపాజిటర్లకు మరిన్ని మెరుగైన సేవలు అందజేస్తామన్నారు. ఇతర బ్యాంకుల కన్నా 1.5 శాతం వడ్డీని ఎక్కువగా చెలిస్తామన్నారు. కార్యక్రమంలో మేనేజర్ శ్రీనివాస్, గోపాల్‌రెడ్డి, ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు. -
నేడు పోలీసు మెడల్ స్వీకరించనున్న ఏసీపీ జనార్దన్
వరంగల్ : వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని కాజీపేట ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్న బి.జనార్దన్ సోమవారం ఇండియన్ పోలీస్ మెడల్ స్వీకరించనున్నారు. హైదరాబాద్‌లో జరగనున్న స్వా తంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయనకు సీఎం కేసీఆర్ మెడల్ అందజేస్తారు. కాగా, జనార్దన్ 1994 లో సేవా పతకం, 2013లో ఉత్తమ సేవా పతకంతో పాటు 65కుపైగా ప్రశంసాపత్రాలు అందుకున్నారు. జనార్దన్‌ను సీపీ సుధీర్‌బాబు, పోలీసు అధికారులు అభినందించారు. -
'నేను ఎవరినీ వేధించలేదు'
-
ఎవరీ జనార్దన్?
-
తమ్ముడూ సెలైంట్!
క్యాడర్ లేని టీటీడీపీ గ్రామ స్థాయి నుంచి బలోపేతం కష్టమే.. ఇప్పుడే ప్రజా ఉద్యమాలొద్దు మూడేళ్ల తర్వాతే ప్రజల్లోకెళ్లండి జిల్లా నాయకులకు చంద్రబాబు సూచన అప్పుడైనా ప్రజలు నమ్ముతారా? ఆలోచనలోపడ్డ పార్టీ శ్రేణులు సాక్షి, మంచిర్యాల : జిల్లాలో ఉనికి కోల్పోయిన టీడీపీ మూడేళ్ల తర్వాతే ప్రజల ముందుకు రావాలని నిర్ణయించింది. ముందుగా ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని భావించినా.. క్యాడర్ లేక.. ప్రజల స హకారం లేక కార్యక్రమాలన్నీ విఫలమై పార్టీ పరువుపోతుందని అధిష్టానం భావించింది. ఇప్పుడే ప్రజల్లోకి వెళ్లొద్దని టీడీపీ భావిస్తోంది. ముందుగా గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు క్యాడర్‌ను బలోపేతం చేసుకుని.. ఆ తర్వాతే ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని ఆ పార్టీ అధినేత చం ద్రబాబు నాయుడు ఇటీవల జిల్లా నాయకులకు సూచించి నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇటీవల ‘సైకిల్’ ఎక్కిన బో డ జనార్దన్ ముందుగా క్యాడర్‌ను బలోపేతం చేసుకునే పని లో పడ్డారు. కానీ.. క్షేత్రస్థాయిలో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు లేకపోవడంతో వారిని ఎలా ప్రసన్నం చేసుకోవా లో తెలియక ‘దేశం’ నేతలు మార్గాలు అన్వేషిస్తున్నారు. సా ర్వత్రిక ఎన్నికల తర్వాత అడ్రస్ లేకుండాపోయిన టీడీపీ నుంచి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ ఇప్పటికే ఇత ర పార్టీలకు వలస వెళ్లిపోయారు. దీంతో పార్టీ క్యాడర్ పూర్తి గా బలహీనపడింది. మిగిలిన పార్టీ శ్రేణులూ ప్రజల్లో వెళ్లేం దుకు సాహసించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ముందుగా ఆ పార్టీ శ్రేణులకు మనోధైర్యాన్నివ్వాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. మరో నాలుగేళ్ల వరకు ఎన్నికలు లే నందునా.. మూడేళ్లలో పార్టీని గ్రామీణ స్థాయి నుంచి బలోపేతం చేసి ఎన్నికల ముందు మళ్లీ ప్రజల్లో వెళ్లాలని నిర్ణయించింది. నమ్మకం కలిగించేదెలా..? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడుగడుగునా అడ్డుకున్న.. రా ష్ట్ర ఏర్పాటు తర్వాతా తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నీ రు, విద్యుత్ వాటాను అడ్డుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రజల్లో విశ్వాసం ఎలా కలిగించాలి..? పార్టీని ఎ లా బలోపేతం చేయాలో తెలియక జిల్లా నాయకత్వం ఆలోచనలో పడింది. బాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని గమనించి.. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని ఘోరంగా ఓడించిన ప్రజలు.. ఇకపై కూడా బాబును నమ్మొద్దని నిర్ణయించుకున్నారు. ఇదే క్రమంలో గత నెలలో టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదులో ‘ప్రమాద బీమా’, ‘ఆరోగ్య బీమా’ ఆఫర్లు ప్రకటించినా ఎవరూ విశ్వసించలేదు. దీంతో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘోరంగా విఫలమైంది. అధిష్టానం ఊహిస్తున్నట్లుగా క్యాడ ర్ కొద్దోగొప్పో బలోపేతమైనా ఆ సమయంలో పార్టీ చేపట్టే ఆందోళనలో ప్రజలు భాగస్వాములవుతారో లేరోనని ఇప్పట్నుంచే ఆ పార్టీ నాయకులకు ఆందోళన పట్టుకుంది. -
‘రొమాన్స్ విత్ ఫైనాన్స్’ సినిమా స్టిల్స్
-
పంట నష్ట పరిహారం చెల్లింపులో అవకతవకలు
దోమ: పంట నష్ట పరిహారం మంజూరులో అధికారులు అవినీతికి పాల్పడ్డారని, అర్హులకు అన్యాయం జరిగింద ని ఆగ్రహిస్తూ మండల పరిధిలోని మైలారం గ్రామానికి చెందిన రైతులు శనివారం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. 2013 నవంబరులో భారీ వర్షాల కారణంగా మండలంలో వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. అప్పట్లో వీఆర్ఓలు, వ్యవసాయాధికారులు గ్రామాల్లో పర్యటించి పంట నష్టపోయిన రైతుల వివరాలను ప్రభుత్వానికి పంపించారు. అధికారులు అందించిన వివరాల మేరకు ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం సంబంధిత రైతులకు పంట నష్టపరిహారం డబ్బులు విడుదల చేసింది. మైలారం గ్రామంలో 57మందిని అర్హులుగా ఎంపిక చేసి నష్టపరిహారం మంజూరు చేశారు. అయితే నిజంగా పంట నష్టపోయిన రైతులకు కాకుండా అనర్హులకు పరిహారం మంజూరు చేశారంటూ గ్రామానికి చెందిన వందలాది మంది రైతులు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పక్కనే ఉన్న వ్యవసాయ కార్యాలయాన్ని మూసి వేయించారు. వ్యవసాయ విస్తరణ అధికారి వెంకటయ్యను చుట్టు ముట్టి అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం భూమి కూడా లేనివారికి, వ్యవసాయం అంటే ఏమిటో కూడా తెలియని వారికి పరిహారం మంజూరైందని ఆరోపించారు. పైరవీలు చేసి ఎంతో కొంత ముట్టజెప్పిన వారికే అధికారులు పరిహారం మంజూరు చేయిం చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే సర్వే నెంబరుపై నలుగురైదుగురికి పరిహారం ఎలా వస్తుందంటూ ప్రశ్నించారు. అవినీతికి పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు అర్హులైన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనికి తహసీల్దార్ జనార్దన్ స్పందిస్తూ రైతుల ఆందోళన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని వారికి నచ్చజెప్పారు. అయితే రెండు, మూడు రోజుల్లో తమకు న్యాయం చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో ఎంపీటీసీ సుశీలతో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
తాండూరు యాదిలో ‘ఆనందోబ్రహ్మ’
తాండూరు, న్యూస్‌లైన్: ప్రముఖ హాస్యనటుడు, ఆనందోబ్రహ్మగా ప్రేక్షకుల ఆదరణ పొందిన ధర్మవరపు సుబ్రహ్మణ్యానికి తాండూరుతో అనుబంధం ఉంది. శనివారం రాత్రి ఆయన తుది శ్వాస విడవడంపై తాండూరులో ఆయనతో అనుబంధం ఉన్న వారిని విషాదానికి గురిచేసింది. ఆయనతో కలిసి పనిచేసిన వారు అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. సుబ్రహ్మణ్యం మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని తాండూరుకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత జనార్దన్ విచారం వ్యక్తం చేశారు. అప్పట్లో ధర్మవరపుతో జనార్దన్ కలిసిమెలిసి ఉండేవారు. ఈ సందర్భంగా ఆయన పలు జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అవి ఆయన మాటల్లోనే.. ‘1982లో పంచాయతీ సమితిలో విలేజ్ లెవల్ వర్క్ డెవలప్మెంట్ ఆఫీసర్(వీఎల్‌డబ్ల్యూఓ)గా ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఏడాదిపాటు తాండూరులో పనిచేశారు. ఆయన ఎప్పుడూ కళల గురించే మాట్లాడుతుండేవారు. స్థానిక ప్రభుత్వ క్వార్టర్స్‌లోనే ఆయన ఉండేవారు. శని, ఆదివారాల్లో హైదరాబాద్‌కు వెళ్లేవారు. ఇక్కడ ఉద్యోగం చేస్తూనే ఆల్ఇండియా రేడియోలో మాటా మంతి తదితర కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఎప్పుడూ ఆప్యాయంగా అందరినీ పలకరిస్తూ, నవ్వుతూ, నవ్విస్తూ ఉండేవారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం మంచి కళాకారుడని, ఆయన ఇక్కడ పని చేస్తే తనలో ప్రతిభకు గుర్తింపు రాదని అప్పటి పంచాయతీ సమితి అధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్‌కు నేను చెప్పాను. దీంతో సుబ్రహ్మణ్యంను చంద్రశేఖర్ ఇక్కడి నుంచి రిలీవ్ చేశారు. ఈ నేపథ్యంలోనే సుబ్రహ్మణ్యం హైదరాబాద్‌కు వెళ్లారు. రేడియోలో కార్యక్రమాలు చేస్తుండగానే ఆయనకు బుల్లితెర అవకాశం వచ్చింది. ఆనందోబ్రహ్మలో నటించినఆయనకు మంచి పేరు వచ్చింది. అప్పటి నుంచి ఆయన అనేక సీరియల్స్‌లో అవకాశాలు రావడంతోపాటు సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. మంచి హాస్యనటుడిగా ఆయన ప్రేక్షకాదరణ పొందారు. ఒక ఏడాదిపాటు తాండూరులో ఆయన పని చేసినప్పుడు ఎదుటి వ్యక్తులను ఎంతో ప్రేమతో పలకరించేవార’ని జనార్దన్ వివరించారు.