పదమూడేళ్లకే వ్యభిచార కూపంలోకి!
- సీఐడీ దాడుల్లో వెలుగులోకి కఠోర వాస్తవాలు
- మెదక్ జిల్లా జాప్తిశివ్‌నూర్‌లోని వ్యభిచార గృహాలపై ఆపరేషన్
- 30 బాధితులను కాపాడిన అధికారులు.. అందులో 10 మంది మైనర్లే
- 35 మంది నిర్వాహకులు అరెస్టు
సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా రామాయంపేట పరిధిలోని జాప్తిశివ్‌నూర్‌లో వ్యభిచార గృహాలపై సీఐడీ విమెన్ ప్రొటెక్షన్ సెల్ అధికారులు బుధవారం అర్ధరాత్రి దాడులు చేశారు. పది మంది బాలికలు సహా 30 మంది బాధితులను రెస్క్యూ చేసి.. 35 మంది నిర్వాహకులను, ఇద్దరు విటులను అరెస్టు చేశారు. దీనికి సంబంధించి శుక్రవారం హైదరాబాద్‌లో సీఐడీ ఐజీ సౌమ్యా మిశ్రా వివరాలు వెల్లడించారు. జాప్తిశివ్‌నూర్‌లోని సరోజినీనగర్‌లో ఉన్న వ్యభిచార గృహాలపై బుధవారం అర్ధరాత్రి దాడులు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా రక్షించిన వారిలో 13 ఏళ్ల బాలిక సైతం ఉండటం ఆందో ళనకరమని చెప్పారు.
బెంగళూరుకు చెందిన జస్టిస్ అండ్ కేర్ స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన సమాచారం మేరకు 30 మంది సోషల్ వర్కర్లు, సైకాలజిస్టులతో పాటు సీఐడీ అధికా రులతో 30 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, దాడులు చేసినట్లు తెలిపారు. అరెస్టైన 35 మంది నిర్వాహకుల్లో 21 మంది మహి ళలు, 14 మంది పురుషులు ఉన్నారని.. వారి నుంచి రూ.4.85 లక్షలు స్వాధీనం చేసుకున్నా మని పేర్కొన్నారు. వ్యభిచార గృహాల్లో నగ దుతో పాటు అకౌంట్ పుస్తకాలు, రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఫిలిప్పీన్స్, సౌదీ అరేబియా కరెన్సీ సైతం లభించిందని తెలిపారు. బాధితులను రెస్క్యూ హోమ్‌లకు తరలించామన్నారు. గతంలో యాదగిరిగుట్ట లోని వ్యభిచార కేంద్రాలపై దాడులు చేసిన ప్పుడు చిక్కిన బాలికలే ఈ దాడుల్లోనూ పట్టుబడ్డారని.. అక్కడి నిర్వాహకులకు, ఇక్కడి వారికి సంబంధాలు ఉన్నట్లు తేలిందని సీఐడీ ఐజీ తెలిపారు. ఆ దాడుల్లో దొరికిన బాలికలను గార్డియన్లకు అప్పగించవద్దని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నిర్ణయం తీసుకున్నా.. కోర్టు అప్పగించిందని పేర్కొన్నారు.
సీఐడీ గుర్తించిన అంశాలివి
వరంగల్‌కు చెందిన ఓ బాలికకు ఉద్యోగం ఇప్పిస్తామంటూ తీసుకొచ్చి వ్యభిచారంలోకి దింపారు. ఆమెకు ఇవ్వాల్సిన డబ్బును సోద రుడి వరుసయ్యే వ్యక్తి వచ్చి తీసువెళ్తున్నాడు.
ఓ బాధితురాలు తీవ్రమైన శ్వాస సమ స్యతో పాటు కాళ్ల వాపుతో బాధపడుతోందని గుర్తించి, ఆస్పత్రికి తరలించారు.
ఇద్దరు బాధితులు గర్భవతులు కాగా.. ము గ్గురికి హెచ్ఐవీ ఉన్నట్లు గుర్తించారు. కర్ణాట కకు చెందిన మహిళ సహా ఇద్దరు యువతు లకు మతిస్థిమితం సరిగా లేదని గుర్తించారు.