K. VENKATRAMAIAH
-
కాపీయింగ్‌కు చెక్
ముల్లును ముల్లుతోనే తీయాలన్న సూత్రాన్ని అమలు చేస్తోంది ఇంటర్ బోర్డు. సాంకేతిక పరిజ్ఞానంతో మాస్ కాపీయింగ్‌కు పాల్పడాలనుకున్న వారికి అదే సాంకేతిక పరిజ్ఞానంతో అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం అన్ని ఇంటర్మీడియెట్ పరీక్షా కేంద్రాల్లో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్) సెల్ ట్రాకింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తేనుంది. రీక్ష ప్రారంభమైన క్షణాల్లోనే ప్రశ్నపత్రాలు బయట ప్రత్యక్షమవటం.. సెల్ఫోన్ల ద్వారా ప్రశ్నలు బయటకు చేరవేస్తూ మాస్ కాపీయింగ్‌కు పాల్పడటం.. ర్యాంకుల కోసం పాకులాడే కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా చేసే చర్యలివి. దీని ఫలితంగా కష్టపడి చదివిన విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు సెల్‌ట్రాకింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చి మాస్‌కాపీయింగ్‌కు అడ్డుకట్ట వేయాలని ఇంటర్మీడియెట్ బోర్డు భావిస్తోంది. ఈ నెల 12 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. వీటిని పకడ్బందీగా నిర్వహించేందుకు బోర్డు సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే ఆయా పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్లు, ఇతర అధికారులకు ఉన్నతాధికారులు సమాచారం అందించారు. పనితీరు ఇలా... ప్రతి ఇంటర్ పరీక్ష కేంద్రంలో జీపీఎస్ సిస్టం ఏర్పాటుచేసి హైదరాబాద్‌లో ఉన్న ఇంటర్ బోర్డుకు అనుసంధానం చేస్తారు. దీని ద్వారా ఆ సెంటర్‌కు వంద మీటర్ల దూరంలో ఉన్నవారు సెల్ఫోన్ల ద్వారా ఎవరెవరితో మాట్లాడుతున్నారనే సమాచారం ఇంటర్ బోర్డుకు అందుతుంది. దీనిద్వారా ఏ సెంటర్లో ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. ఈ విధానం వల్ల ప్రతిభ గల విద్యార్థులకు న్యాయం జరుగుతుందని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. మాస్‌కాపీయింగ్ అరికట్టేందుకే.. - కె.వెంకట్రామయ్య, ఆర్ఐవో జిల్లాలో 159 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నాం. వంద శాతం మేర అన్ని సెంటర్లలో జీపీఎస్ నిఘా ఉంటుంది. ఈ విధానం డీజీపీ పర్యవేక్షణలో ఉంటుంది. జీపీఎస్ పరికరాలు ఎక్కడ అమర్చారనేది కూడా తెలుసుకోవటం కష్టం. ఈ విధానం ద్వారా పూర్తిగా పారదర్శకంగా ఎటువంటి కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పరీక్షలు నిర్వహిస్తాం. ఎవరైనా కాపీయింగ్‌కు ప్రయత్నించినట్లు తెలిస్తే వారిపై క్రిమినల్ కేసులు పెడతాం. సంబంధిత సెంటర్ల సూపర్వైజర్లను బాధ్యుల్ని చేసి సస్పెండ్ చేస్తారు. అందుకే సూపర్వైజర్లుగా ప్రభుత్వ శాఖలకు చెందినవారిని మాత్రమే నియమిస్తున్నాం. -
సమర్థంగా ఇంటర్ ప్రాక్టికల్స్
జిల్లాలో 175 పరీక్షా కేంద్రాల ఏర్పాటు నాలుగు విభాగాలుగా నిర్వహణ ఆర్ఐఓ కె.వెంకట్రామయ్య వెల్లడి విజయవాడ, న్యూస్‌లైన్ : ఈ నెల 12 నుంచి జరగనున్న ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.వెంకట్రామయ్య అన్నారు. పరీక్షలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్ నిర్వహణపై పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో మహాత్మాగాంధీ రోడ్డులోని మాంటిస్సోరి మహిళా కళాశాలలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆర్ఐఓ వెంకట్రామయ్య మాట్లాడుతూ ఇంటర్ ప్రాక్టికల్స్‌కు జిల్లా వ్యాప్తంగా 175 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి సిబ్బంది ఎంపిక ప్రక్రియ పూర్తయిందన్నారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు జిల్లాలో 48 వేల 913 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. వీరిలో ఎంపీసీ విద్యార్థులు 34 వేల 584 మంది కాగా, బైపీసీ విద్యార్థులు 11 వేల 695 మంది, ఒకేషనల్ అభ్యర్థులు 2,634 మంది ఉన్నట్లు వివరించారు. మొదటి స్పెల్‌లో ఈ నెల 12 నుంచి 16 వరకు, రెండో స్పెల్‌లో 17 నుంచి 22 వరకు, మూడో స్పెల్‌లో 23 నుంచి 28 వరకు, నాలుగో స్పెల్‌లో 29 నుంచి మార్చి 4 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షల సందర్భంగా ప్రతి కళాశాలా విధిగా లేబరేటరీలలో పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశామని, వారు నిరంతరం పర్యవేక్షిస్తారని చెప్పారు. థియరీ పరీక్షలకూ ఏర్పాట్లు పూర్తి... ప్రాక్టికల్ పరీక్షల అనంతరం మార్చి 12 నుంచి థియరీ పరీక్షలు జరుగుతాయని ఆర్ఐఓ చెప్పారు. వాటికి కూడా అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్లు తెలిపారు. ఇప్పటికే థియరీ పరీక్షలకు సంబంధించి పరీక్షా కేంద్రాలు ఎంపిక చేశామని, త్వరలో వాటికి సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులు సాల్మన్‌రాజు, ప్రసాదరావులతో పాటు పలు కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, చీఫ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.