kapatralla
-
కప్పట్రాళ్ల సర్పంచ్‌గా దివాకర్‌నాయుడు తొలగింపు
కర్నూలు(అర్బన్): జిల్లాలోని దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామ సర్పంచ్‌గా ఉన్న ఎం దివాకర్నాయుడును పదవి నుంచి తొలగించినట్లు జిల్లా పంచాయతీ అధికారి కే ఆనంద్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో గ్రామానికి చెందిన పీ వెంకటప్పనాయుడు హత్య కేసులో నిందితుడిగా ఉన్న దివాకర్నాయుడుకు 2015 జనవరి 12న న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించిన నేపథ్యంలో పీఆర్ యాక్ట్ 1994 ప్రకారం ఆయనను పదవి నుంచి తొలగించినట్లు చెప్పారు. ఇక నుంచి ఉప సర్పంచే తిరిగి ఎన్నికలు నిర్వహించేంతవరకు సర్పంచుగా బాధ్యతలు నిర్వహిస్తారన్నారు. -
ఫ్యాక్షన్ గ్రామంలో కలెక్టర్, ఎస్పీ నిద్ర
దేవరకొండ: కర్నూలు జిల్లా అధికారులు ఫ్యాక్షన్ గ్రామంలో సోమవారం నిద్రించనున్నారు. దేవరకొండ మండలంలోని కప్పట్రాళ్ల గ్రామంలో కలెక్టర్ విజయ్ మోహన్, ఎస్పీ విజయకృష్ణ సోమవారం నిద్ర చేయనున్నారు. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల ప్రజలతో మమేకమై, వారి సమస్యలు, అందుతున్న సంక్షేమ పధకాల ఫలితాల గురించి తెలుసుకునేందుకు గ్రామంలో నిద్రచేయాలని అధికారులు నిర్ణయించారు. సోమవారం సాయంత్రం గ్రామానికి చేరుకున్న అధికారులు వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. గ్రామంలోని రెవెన్యూ కార్యాలయం భవనంలో వారు నిద్ర చేయనున్నారు. అధికారుల నిర్ణయంపై గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.