చంపేసి.. గోతిలో పాతిపెట్టారు
రంగారెడ్డి: గుర్తుతెలియని దుండగులు ఓ వివాహితను చంపేసి మృతదేహాన్ని గోతిలో పాతిపెట్టారు. కుక్కలు మృతదేహాన్ని పీక్కుతినడంతో ఈ విషయం వెలుగులోకొచ్చింది. దుండగులు దాదాపు 20 రోజుల క్రితం వేరే ప్రాంతంలో మహిళను చంపి ఇక్కడకు తీసుకొచ్చి పాతిపెట్టి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కీసర పంచాయతీ పరిధిలోని కీసరగుట్ట ప్రాంతంలో సోమవారం పశువులను మేపుతున్న కొందరు ఓ మహిళ అస్థిపంజరాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మహిళకు దాదాపు 30 ఏళ్ల వయసు ఉండొచ్చని. మహిళ కాలుకు మెట్టెలు ఉండటంతో ఆమె వివాహిత అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.