బస్సు ఢీకొని యువకుడి మృతి
నగరంలోని ఏలూరు రోడ్డులో సీతారామపురం వంతెన వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. కేశినేని ట్రావెల్స్‌కు చెందిన బస్సు రోడ్డుపై వెళ్తున్న భవానీ సాయి అనే యువకుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో మృతుడి బంధువులు తమకు న్యాయం చేయాలని సంఘటనాస్థలంలో ఆందోళనకు దిగారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.