konkan
-
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ప్రాంతాలవారీగా వివరాలు
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఎవ్వరూ ఊహించని విధంగా ఈసారి బీజేపీ, శివసేన (శిందే), ఎన్సీపీ (ఏపీ)ల మహాయుతి కూటమి 231 స్థానాల్లో విజయఢంకా మోగించింది. అదేవిధంగా మునుపెన్నడూలేని విధంగా బీజేపీ రాష్ట్రంలో 133 స్థానాల్లో జెండాపాతి రికార్డును సృష్టించగా, శివసేన (శిందే) 57 స్థానాలు, ఎన్సీపీ (ఎస్పీ) 41 స్థానాలను గెలుచుకున్నాయి. మరోవైపు కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ)ల మహావికాస్ ఆఘాడి కూటమి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మూడు పార్టీలు కలిపి కనీసం హాఫ్ సెంచరీని కూడా దాటలేకపోయాయి. కాంగ్రెస్ 15, శివసేన (యూబీటీ) 20, ఎన్సీపీ (ఎస్పీ) కేవలం 10 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యాయి. ఇక సమాజ్‌వాదీ పార్టీ రెండు స్థానాలు, ఎంఐఎం ఒక స్థానం సాధించగా, ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లు మరో తొమ్మిది స్థానాల్లో విజయం సాధించారు. ముఖ్యంగా ముంబై, కొంకణ్, పశ్చిమ మహారాష్ట్ర, ఉత్తర మహారాష్ట్ర, విదర్భ, మరఠ్వాడా ఇలా దాదాపు అన్ని రీజియన్లలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని మహాయుతి కూటమి సత్తాచాటింది . ముంబైలో... ముంబైలోని 36 స్థానాల్లో బీజేపీ, శివసేన (శిందే), 6, ఎన్సీపీ (ఏపీ)ల మహాయుతి కూటమి అత్యధికంగా 22 స్థానాలను కైవసం చేసుకుంది. మరోవైపు కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ)ల మహావికాస్ ఆఘాడి 12 స్థానాలకు పరిమితమైంది. పార్టీల వారీగా పరిశీలిస్తే బీజేపీ 15, శివసేన 6, ఎన్సీపీ (ఏపీ) ఒక స్థానాన్ని గెలుచుకోగా కాంగ్రెస్ 3, శివసేన (యూబీటీ) 9 స్థానాల్లో విజయం సాధించాయి. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల బరిలో తొలిసారిగా నిలిచి మాహీం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసిన మహారాష్ట్ర నవనిర్మాణసేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ఠాక్రే పరాజయం పాలయ్యారు. అయితే వర్లీ నియోజకవర్గంలో శివసేన (యూబీటీ) నుంచి బరిలో దిగి ఆదిత్య ఠాక్రే మాత్రం తన ప్రత్యర్థి మిలింద్ దేవ్‌రాపై విజయం సాధించి రెండోసారి శాసనసభలో అడుగుపెట్టనున్నారు.మరఠ్వాడాలో... మరఠ్వాడాలో ఎనిమిది జిల్లాలుండగా మొత్తం 46 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో బీజేపీ 19, శివసేన (శిందే) 12, ఎన్సీపీ (ఏపీ) ఎనిమిది, మరోవైపు కాంగ్రెస్ ఒకటి, శివసేన (యూబీటీ) మూడు, ఎన్సీపీ (ఎస్పీ) రెండు స్థానాలను దక్కించుకున్నాయి. విదర్భలో... విదర్భలోని 11 జిల్లాల్లో మొత్తం 62 అసెంబ్లీ స్థానాలు ఉండగా వీటిలో మహాయుతి కూటమి 47 స్థానాలను కైవసం చేసుకుంది. పార్టీలవారీగా పరిశీలిస్తే అత్యధికంగా బీజేపీ 37 స్థానాల్లో విజయం సాధించగా శివసేన (శిందే) నాలుగు, ఎన్సీపీ (ఏపీ) ఆరు స్థానాల్లో గెలిచాయి. కాగా ఎంవీయే కూటమి మొత్తం 13 స్థానాల్లో గెలుపు సాధించగా, కాంగ్రెస్ తొమ్మిది, శివసేన (యూబీటీ) నాలుగు స్థానాలు గెలుచుకున్నాయి. ఉత్తర మహారాష్ట్రలో... ఉత్తర మహారాష్ట్రలో అయిదు జిల్లాలో మొత్తం 47 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా ఇక్కడ అత్యధికంగా మహాయుతి కూటమి 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించింది. మరోవైపు మహావికాస్ ఆఘాడి కేవలం రెండు స్థానాలకు పరిమితమైంది. ఇక పార్టీల వారీగా పరిశీలిస్తే బీజేపీ 20, శివసేన (శిందే) 11, ఎన్సీపీ (ఏపీ) 11, కాంగ్రెస్ రెండు స్థానాలను గెలుచుకున్నాయి. చదవండి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు దిగ్గజాల ఓటమిపశ్చిమ మహారాష్ట్రలో... పశ్చిమ మహారాష్ట్రలోని అయిదు జిల్లాల్లో మొత్తం 58 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా మహాయుతి కూటమి 42 స్థానాలను గెలుచుకుంది. పార్టీలవారీగా పరిశీలిస్తే బీజేపీ 24, శివసేన (శిందే) ఏడు, ఎన్సీపీ (ఏపీ) 11 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఇక ఎంవీయే కూటమి 10 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ ఒకటి, శివసేన (యూబీటీ) రెండు, ఎన్సీపీ (ఎస్పీ) ఏడు స్థానాల్లో విజయం సాధించాయి. కొంకణ్‌లో.. కొంకణ్ రీజియన్ అయిదు జిల్లాల్లోని 39 నియోజకవర్గాల్లో మహాయుతి ఏకంగా 35 స్థానాలను కైవసం చేసుకోగా మహావికాస్ ఆఘాడి కేవలం రెండు స్థానాలకు పరిమితమైంది. పార్టీలవారీగా పరిశీలిస్తే బీజేపీ 16, శివసేన (శిందే), 16, ఎన్సీపీ (ఏపీ) మూడు, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ) ఒక్కోస్థానం గెలుచుకున్నాయి.లాడ్కీబహీణ్తో గణనీయంగా మహిళల ఓటింగ్..ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతోపాటు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలే మహాయుతి గెలుపునకు బాట వేశాయి. ప్రధానంగా ముఖ్యమంత్రి లాడ్కీ బహీణ్ యోజన వీటన్నిటికీ తలమానికంగా నిలిచింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, ఉపముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ల నేతృత్వంలోని బీజేపీ, శివసేన (శిందే), ఎన్సీపీ (ఏపీ)ల మహాయుతి ప్రభుత్వం ఎన్నికలకు నాలుగు నెలల ముందు ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా మహిళలకు ప్రతి నెల రూ. 1500 ఆర్థిక సహాయాన్ని అందించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు లబ్దిపొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి మహిళల ఓటింగ్ గణనీయంగా పెరిగిందని, వీరంతా మహయుతివైపు మొగ్గుచూపడం కూడా మహాయుతి విజయంలో ప్రధానపాత్ర పోషించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే విద్యార్థులు, నిరుద్యోగుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, రైతులకు రుణమాఫీ ఇలా అన్ని వర్గాల కోసం ఏదో ఒక పథకం అమలు చేయడం ద్వారా మహాయుతి ప్రభుత్వం అందరినీ ఆకట్టుకోగలిగిందని భావిస్తున్నారు. చెప్పవచ్చు. దీంతోనే ఈ సంక్షేమ పథకాలే మహాయుతి విజయానికి బాట వేశాయి. -
‘మహా’ ఎన్నికలు.. కొంకణే కీలకం
సాక్షి, నేషనల్ డెస్క్: కొంకణ్.. మహారాష్ట్రలో రాజధాని ముంబై నుంచి సింధుదుర్గ్ దాకా విస్తరించిన సువిశాల తీరప్రాంతం. నాలుగో వంతు అసెంబ్లీ స్థానాలతో ప్రతి ఎన్నికల్లోనూ ఫలితాలను శాసిస్తూ వస్తున్న ప్రాంతం కూడా. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి, విపక్ష ఎంవీఏ కూటముల భాగ్యరేఖలను కొంకణే నిర్దేశిస్తుందని భావిస్తున్నారు. అసెంబ్లీ స్థానాలపరంగా రాష్ట్రంలో కొంకణే అతి పెద్ద ప్రాంతం. మొత్తం 288 స్థానాల్లో 75 సీట్లు అక్కడే ఉన్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటైన కొంకణ్ అనంతరం శివసేనను ఆదరించింది. ఈ ఎన్నికల్లో శివసేనలోని రెండు వైరి వర్గాల ఆధిపత్య పోరుకు వేదికగా మారింది. కొంకణ్‌లోని 75 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 36 సీట్లు ఒక్క ముంబై మహానగర పరిధిలోనే ఉండటం విశేషం. శివసేన (షిండే) సారథి, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే స్వస్థలమైన థానే కొంకణ్ ప్రాంత పరిధిలోకే వస్తుంది. దాంతో ఇక్కడ ఉద్ధవ్ సారథ్యంలోని శివసేనపై ఆధిపత్యం చూపి సత్తా చాటడం ఆయనకు కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. ఒకప్పుడు ముంబై నుంచి వలస వెళ్లేవారు పంపే మొత్తాలపై ఆధారపడ్డ కొంకణ్‌లో కొన్నేళ్లుగా పరిస్థితి మారింది. చేపలు, మామిడి, కాజు తదితరాల ఎగుమతితో ఈ ప్రాంతం స్వయంసమృద్ధి సాధించింది. యువత వలసలకు స్వస్తి చెప్పి సొంత వ్యాపారాలతో స్థానికంగానే రాణిస్తున్నారు. వాయు, రైలు మార్గాలు ఇతోధికంగా పెరిగాయి. పర్యాటక ఆకర్షణలకు కూడా కొంకణ్ నెలవుగా మారింది. కమ్యూనిస్టులకు చెక్ పెట్టి... ముంబై, పరిసర ప్రాంతాల్లోని నూలు మిల్లులు, ఇతర కర్మాగారాల్లో కమ్యూనిస్టులు చాలాకాలం పాటు గణనీయమైన శక్తిగా వెలుగొందారు. 1980ల్లో శివసేన ఆవిర్భావంతో పరిస్థితులు మారాయి. తొలుత కాంగ్రెస్ మద్దతుతో వారి ఆధిపత్యానికి గండి కొట్టిన సేన, ఆ తర్వాత కాంగ్రెస్‌కు కూడా చెక్ పెట్టి కొంకణ్ అంతటా ప్రబల శక్తిగా ఎదిగింది. 1990ల నాటికి బీజేపీతో జట్టు కట్టి హిందూత్వవాదంతో మహారాష్ట్రవ్యాప్తంగా హవా చెలాయించింది. 1995కల్లా బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. 1999లో రాజకీయ దిగ్గజం శరద్ పవార్ కాంగ్రెస్‌ను వీడి ఏర్పాటు చేసిన ఎన్సీపీ కూడా కొంకణ్‌లో పోటీదారుగా మారింది. అలా ఈ ప్రాంతంలో మరోసారి రాజకీయ పునరేకీకరణ జరిగింది. అయితే 2014 నుంచీ పరిస్థితి మారుతూ వస్తోంది. మోదీ మేనియా సాయంతో ముంబై, పరిసర ప్రాంతాల్లో బీజేపీ బాగా పుంజుకుంటూ వచి్చంది. ప్రస్తుతం మొత్తం మహారాష్ట్ర తీర ప్రాంతంలోనూ కాషాయ పార్టీ హవా కని్పస్తోంది. ఆగర్భ శత్రువులైన శివసేన, కాంగ్రెస్ 2019 ఎన్నికల ఫలితాల అనంతరం అనూహ్య పరిస్థితుల్లో చేయి కలపడం, ఎన్సీపీతో కలిసి మహావికాస్ అగాఢీ (ఎంవీఏ) పేరిట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో కొంకణ్ రాజకీయ ముఖచిత్రం మరోసారి మారిపోయింది. శివసేన అసంతృప్త నేత షిండే బీజేపీ మద్దతుతో పార్టీని చీల్చడమే గాక ఎంవీఏ సంకీర్ణాన్ని కూలదోసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అలా శివసేన కాస్తా షిండే, ఉద్ధవ్ (యూబీటీ) వర్గాలుగా చీలింది. అనంతరం అజిత్ పవార్ కూడా ఎన్సీపీని చీల్చి ప్రభుత్వంలో చేరారు. నాటినుంచీ శరద్ పవార్ వర్గం ఎన్సీపీ (ఎస్పీ)గా కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో పైచేయి సాధించి తమదే నిజమైన పారీ్టగా నిరూపించుకోవడం ఈ నాలుగు వర్గాలకూ కీలకంగా మారింది. అలా వీరందరికీ కొంకణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. పట్టణ ప్రాబల్య ప్రాంతం → మహారాష్ట్రలో అత్యంత పట్టణీకరణ, పారిశ్రామికీకరణ జరిగిన ప్రాంతంగా కొంకణ్ తీరం గుర్తింపు పొందింది. → సింధుదుర్గ్ నుంచి ముంబై దాకా విస్తరించిన కొంకణ్ పరిధిలో పాల్ఘార్, థానే, రాయ్‌గఢ్, రత్నగిరి జిల్లాలున్నాయి. → ఇక్కడ 75 అసెంబ్లీ స్థానాలతో పాటు 12 మంది లోక్‌సభ స్థానాలున్నాయి. → గిరిజన ప్రాబల్య పాల్ఘర్లో 6, థానేలో 18, రాయ్‌గఢ్, సింధుదుర్గ్, రత్నగిరిల్లో కలిపి 15 అసెంబ్లీ స్థానాలున్నాయి. మిగతా 36 స్థానాలు ఒక్క ముంబై మహానగరంలోనే ఉన్నాయి. → ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమిని ఈ ప్రాంతమే ఆదుకుంది. శివసేన (షిండే), బీజేపీ, ఎన్సీపీ కూటమికి ఏడు స్థానాలు దక్కాయి.→ నానాటికీ విపరీతంగా పెరిగిపోతున్న జనాభా, గృహ వసతి, పేదరికం, మౌలిక సదుపాయాల లేమి వంటివి ఇక్కడ ప్రధాన సమస్యలు. → కొంకణ్‌పై కోల్పోయిన పట్టును ఈసారి ఎలాగైనా సాధించాలని కాంగ్రెస్ ప్రయతి్నస్తోంది.మిగతా ప్రాంతాల్లో... మహారాష్ట్రలో విదర్భ (62 అసెంబ్లీ సీట్లు), మరాఠ్వాడా (46), ఆనియన్ బెల్త్గా పేరొందిన ఉత్తర మహారాష్ట్ర (47), పశి్చమ మహారాష్ట్ర (58) ప్రాంతాల్లోనూ అధికార, విపక్ష కూటముల మధ్య గట్టి పోరు నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థులు కింగ్మేకర్లుగా మారినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఎందుకంటే ఈసారి రాష్ట్రవ్యాప్తంగా బరిలో ఉన్న స్వతంత్రుల సంఖ్య భారీగా పెరిగింది. వారిలో కనీసం 30 మంది దాకా నెగ్గడం ఖాయం. చివరికి ప్రభుత్వ ఏర్పాటులో వారే కీలకంగా మారతారు’’ అని మాజీ సీఎం ఛగన్ భుజ్‌బల్ అభిప్రాయపడ్డారు. – -
దావూద్ పూర్వీకుల ఆస్తులు వేలం
ముంబై: భారత్‌తో సహా ప్రపంచంలోని అనేకదేశాల్లో ఉగ్రదాడులకు పాల్పడిన అండర్ వరల్డ్ డాన్, అంతర్జాతీయ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంకు చెందిన ఆస్తులను వేలం వేయనున్నారు. స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్సేంజ్ మానిప్యులేటర్స్ యాక్ట్(ఎస్ఏఎఫ్ఎంఏ) కింద ఈ వేలం ప్రక్రియ జరగనుంది. మహరాష్ట్రలోని రత్నగిరి జిల్లా కొంకణ్‌లో దావూద్ పూర్వీకులకు చెందిన స్థిరాస్థులు ఉన్నాయి. వీటిని నవంబర్ 10న వేలం వేయనున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా నేపథ్యంలో వేలం ప్రక్రియను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా,ఆస్తుల వేల్యువేషన్ ప్రక్రియ గతేడాదే ముగిసిన విషయం తెలిసిందే. రత్నగిరి జిల్లా ఖేడ్ తాలుకాలోని ముంబ్కే గ్రామంలో దావూద్ పూర్వీకులు నివాసముండేవారు. ఈ గ్రామంతో పాటు అనేక ప్రాంతాల్లో దావూద్‌కు స్థిరాస్తులు ఉన్నాయి. (చదవండి: మాతోశ్రీని పేల్చేస్తాం) 1980లలో ఇక్కడ ఉన్న బంగ్లాలోనే దావూద్ కుటుంబ సభ్యులు నివాసముండేవారు. దీనిని దావూద్ ఎంతో విలాసవంతంగా తీర్చిదిద్ది తన తల్లి పేరు మీద రాయించాడు. 1993 ముంబయి పేలుళ్ల అనంతరం దావుద్ కుటుంబసభ్యులు దీనిని విడిచిపెట్టారు. అప్పటి నుంచి బంగ్లా ఖాళీగానే ఉంది. కానీ ఇప్పుడు ఇది శిథిలావస్థకు చేరింది. ఏ నిమిషంలోనైనా కూలిపోయే పరిస్థితికి నెలకొంది. తాజాగా ఆదివారం ముంబ్కే గ్రామంలో పర్యటించిన అధికారులు.. దావూద్ ఆస్తులపై సర్వే నిర్వహించారు. మొత్తం 7 ఆస్తులను వేలం వేయడానికి సన్నద్ధమవుతున్నారు. వీటి విలువ కోటి రూపాయలు ఉండనున్నట్లు తెలిసింది. కాగా, 1993 ముంబై వరస పేలుళ్లు తర్వాత దేశాన్ని వదిలిపెట్టి పాకిస్తాన్ పారిపోయాడు దావూద్. అలాగే దావూద్ సహచరుడు, గ్యాంగ్ స్టర్ ఇక్బల్ మిర్చికి చెందిన రెండు ఫ్లాట్లను కూడా అదే రోజున వేలం వేస్తారు. వచ్ఛే నెల 2 న బిడ్డర్ల పరిశీలన జరుగుతుంది. -
‘మహా’ భవిష్యత్ నిర్ణేత కొంకణ్!
ముంబై: త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కొంకణ్ ప్రాంతం కీలకంగా మారనుంది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో నాలుగో వంతు అంటే 75 సీట్లు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఏర్పాటు కానున్న ననార్ రిఫైనరీ, ఆరే వద్ద మెట్రో కార్‌షెడ్ సమస్య, పీఎంసీ బ్యాంకు స్కాంలు ఈ నెల 21న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారాంశాలుగా తెరపైకి వచ్చాయి. కొంకణ్‌లో ప్రధాన పోటీ బీజేపీ– శివసేన, కాంగ్రెస్– ఎన్సీపీల మధ్యే ఉంది. మరికొన్ని చిన్నాచితకా పార్టీలు సైతం ఉనికి కోసం ఈ ప్రాంతంలో పోరాడుతున్నాయి. కొంకణ్‌లోని మొత్తం 75 అసెంబ్లీ స్థానాల్లో ముంబైలో 29 సీట్లతోపాటు కాంగ్రెస్ మొత్తం 44 చోట్ల అభ్యర్థులను బరిలో నిలిపింది. ఎన్సీపీ 18 సీట్లలో పోటీకి దిగుతోంది. పొత్తులో భాగంగా శివసేన 44 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇందులో 19 నియోజకవర్గాలు ముంబైలోనివే. అధికార బీజేపీ మాత్రం ఇక్కడ 29 స్థానాల్లోనే పోటీ చేస్తోంది. ఇందులో 17 స్థానాలు ముంబై పరిధిలోనివే. కొంకణ్ పరిధిలోకి వచ్చే ముంబైలో కూడా 36 అసెంబ్లీ స్థానాలున్నాయి. కీలక అంశాలపై విభేదాలు రత్నగిరి జిల్లాలోని ననార్లో తలపెట్టిన రిఫైనరీ ప్రాజెక్టు గతంలో శివసేన, బీజేపీల మ«ధ్య వివాదానికి కారణమయింది. ఈ ప్రాజెక్టు కొంకణ్ ప్రాంతంలోని పర్యావరణాన్ని దెబ్బతీస్తుందని శివసేన ఆరోపించడం చర్చనీయాంశమైంది. ననార్ రిఫైనరీని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న శివసేనను బుజ్జగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. రిఫైనరీ ప్రాజెక్టు స్థాపనను అంగీకరించేదిలేదనీ, అది ముగిసిన అంశమని శివసేన అంటోంది. ఆరే కాలనీ వద్ద నిర్మించ తలపెట్టిన కార్ షెడ్ వల్ల స్థానికంగా 2,000 చెట్ల నరికివేత అంశంపై సుప్రీంకోర్టు దాకా వెళ్లడం వివాదాస్పదమైంది. వేలాది మంది ప్రజలను నష్టాల్లో ముంచిన పీఎంసీ బ్యాంక్ కుంభకోణం కూడా రెండు పార్టీలకు ఇబ్బందికరంగా మారింది. కొంకణ్ ప్రాంతంలోని పాల్ఘర్, థానే, రత్నగిరి, సింధు దుర్గ్ లలో శివసేన బలంగా ఉండగా, ముంబైలో బీజేపీ కీలకంగా ఉంది. ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌తోపాటు శరద్‌పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్‌పార్టీ (ఎన్సీపీ) పట్టు కోల్పోవడం బీజేపీ, శివసేనలకు వరంగా మారింది. -
మహారాజ ఫలం వచ్చేసింది
సాక్షి, ముంబై: మామిడి పండ్లలో అత్యంత ప్రీతిపాత్రమైన ‘హాపూస్’రకం పండ్లు రత్నగిరి మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. అయితే ధరలు మాత్రం సామాన్యులకు అందన్నంత ఎత్తులో ఉన్నాయి. ప్రస్తుతం రత్నగిరి మార్కెట్లో డజను పండ్లు రూ. 1,500 పలుకుతున్నాయి. దీంతో ఇతర ప్రాంతాల్లో ఈ మామిడి పండ్ల ధరలు మరింత అధికంగా ఉండే అవకాశాలున్నాయి. హాపూస్ రకం పండ్లు అత్యధికంగా కొంకణ్ ప్రాంతంలో అధికంగా ఉత్పత్తి అవుతాయి. దీంతో కొంకణ్‌లో ధరలను బట్టి ఇతర మార్కెట్లలో ఈ పండ్ల ధరలు ఎంత ఉండవచ్చో అంచనా వేస్తారు. ప్రస్తుతం కొంకణ్‌లో మార్కెట్లలోనే డజను హాపూస్ పండ్లు రూ. 1,500 పలుకుతున్నాయి. దేశంలోనే అత్యంత పెద్ద పండ్ల మార్కెట్‌గా ప్రసిద్ధి గాంచిన ఏపీఎంసీలోకి ఇటీవల నాలుగు పెట్టెల మామిడి పండ్లు వచ్చినప్పుడు వ్యాపారులు వాటికి పూజలు చేసి స్వాగతించారు. ప్రస్తుతం మామిడి పండ్ల విక్రయాలు కొంకణ్‌లో ప్రారంభమయ్యాయని, త్వరలోనే నగర మార్కెట్లకు చేరవచ్చని ఇక్కడి వ్యాపారులు చెప్పారు. ప్రారంభంలో సరుకు కొరత కారణంగా పండ్ల ధరలు ఆకాశాన్ని అంటినట్టు కన్పించినా ఆ తరువాత నిల్వలు పెరిగినకొద్దీ ధరలు దిగివస్తాయని పేర్కొంటున్నారు. ఏపీఎంసీ మార్కెట్లో వచ్చేవారం నుంచి పుష్కలంగా మామిడి పండ్ల దిగుమతి ప్రారంభం కాగలదని వ్యాపారులు అంటున్నారు. మే ఆఖరు వరకు వీటి సీజన్ ఉంటుందని వారన్నారు. -
13 వేల పాఠశాలల మూసివేత
పింప్రి, న్యూస్‌లైన్: ప్రభుత్వం పాఠశాలల్లో 20 మంది విద్యార్థుల కన్నా తక్కువ ఉంటే మూసివేయాలని డీఐఎస్ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కానీ ఇలాంటి పాఠశాలలన్నీ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. దీన్ని అమలు చే యాలా వద్దా అనేది ప్రభుత్వ నిర్ణయానికే వదిలేసింది. పాఠశాలలు నడవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో ప్రభుత్వం కూడా మూసివేత దిశగా రంగం సిద్ధం చేస్తుంది. ఆయా పాఠశాలలు మూతపడే అవకాశం ఉంది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి, మూతపడే పాఠశాలలు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సుమారు 13 వేల పైచిలుకు ఉన్నాయి. ఈ మేరకు ఆయా జిల్లా విద్యాధికారులు ఆయా పాఠశాలకు నోటీసులను అందజేశారు. గత సంవత్సరమే సూచన విద్యార్థులు తక్కువగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని గత సంవత్సరమే డీఐఎస్ఈ (డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్) ప్రభుత్వానికి సూచించింది. అప్పటి నుంచి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకొంది. ఇందులో భాగంగా ఆయా పాఠశాలల్లో వివిధ పథకాల ద్వారా విద్యార్థులను పెంచడం, మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసింది. గ్రామాల భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలలకు విద్యార్థులను చేరవేసేందుకు వాహనాల ఏర్పాటు తదితర సౌకర్యాలు కల్పించింది. అయినప్పటికీ విద్యార్థుల సంఖ్య పెరగలేదు. విద్యార్థులు పాఠశాలలకు రాని పరిస్థితులను అధ్యయనం చేసింది. చివరకు మూసివేత వైపే మొగ్గుచూపుతోంది. అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లోనే.. వెంటనే ఈ పాఠశాలలను మూసివేయ వద్దని రాష్ట్ర శిక్షణ మంత్రాలయం చెబుతున్నా, ప్రభుత్వం మాత్రం మూసివేసేందుకే మొగ్గు చూపుతోంది. గత సంవత్సరం ఉపాధ్యాయులు సేకరించిన వివరాల ప్రకారం 13,905 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో మరాఠీ, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, సింధి, తమిళం, తెలుగు పాఠశాలలు ఉన్నాయి. 3,700 పాఠశాలల్లో పది మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్నారు. 20 మంది కంటే తక్కువ ఉన్న పాఠశాలలను ప్రభుత్వం స్థానిక స్వరాజ్య సంస్థలకు అప్పగించింది. ఇట్లాంటివి 13 వేల పాఠశాలలు ఉన్నాయి. పుణే, కొంకణ్ జిల్లాలో ఈ పాఠశాలల సంఖ్య అత్యధికంగా ఉంది. ఇందులో తెలుగు మీడియం పాఠశాల పుణే దేహు రోడ్ కంటెన్మెంట్లో ఉంది. మూతబడే పాఠశాలలు అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
పట్టు నిలుపుకొన్న మహాకూటమి
సాక్షి, ముంబై: ముంబై , ఠాణే, కొంకణ్‌లలో మహాకూటమి మళ్లీ తన పట్టు నిలుపుకుంది. ఈ ప్రాంతాలు శివసేన, బీజేపీలకు పెట్టనికోటగా ఉండేవి. అయితే గత ఎన్నికల్లో పట్టు కోల్పోయినప్పటికీ తాజా ఎన్నికల్లో తమ పట్టు నిలుపుకుని రికార్డును సృష్టించాయి. దీంతో శివసేన, బీజేపీ కార్యకర్తల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ముంబైలో...: ముంబైలో కాంగ్రెస్, ఎన్సీపీల ప్రజాస్వామ్య కూటమిని శివసేన, బీజేపీలు మట్టి కరిపించాయి. 2009 లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు పూర్తి భిన్నంగా ఈసారి ఫలితాలు వెలుపడ్డాయి. గతంలో ముంబైలోని ఆరు స్థానాలలో కాంగ్రెస్ ఐదు, ఎన్సీపీ ఒకటి ఇలా మొత్తం ఆరు స్థానాలనూ దక్కించుకున్నాయి. అయితే ఈసారి మాత్రం ఖాతా తెరవలేకపోయాయి. ముంబైలో పోటీ చేసిన ప్రముఖనాయకులు కూడా పరాజయం పాలయ్యారు. ముంబైలోని ఆరు స్థానాలలో శివసేన, బీజేపీలు చెరో మూడు సీట్లను కైవసం చేసుకున్నాయి. విజయం సాధించిన శివసేన అభ్యర్థులలో దక్షిణ ముంబై నుంచి అరవింద్ సావంత్, దక్షిణ మధ్య ముంబై నుంచి రాహుల్ శెవాలే, వాయవ్య నుంచి గజానన్ కీర్తికర్లున్నారు. విజయం సాధించిన బీజేపీ అభ్యర్థులలో ముంబై నార్త్ సెంట్రల్ నుంచి పూనమ్ మహాజన్, ఈశాన్య ముంబై నుంచి కిరీట్ సోమయ్య, ఉత్తర ముంబై నుంచి గోపాల్ శెట్టిలున్నారు. అయితే ఈసారి కాంగ్రెస్‌కు చెందిన ప్రముఖ నాయకులైన ప్రియాదత్, ఏక్నాథ్ గైక్వాడ్, మిలింద్ దేవరా, సంజయ్ నిరుపం, గురుదాస్ కామత్‌లు పరాజయం పాలయ్యారు. ఠాణేలో...: ఠాణేలో కూడా మహాకూటమి తన విజయపరంపరను కొనసాగించింది. ఠాణేలోని మొత్తం నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల్లో శివసేన రెండు, బీజేపీ రెండు గెలుచుకోవడం ద్వారా మహాకూటమి రికార్డు సృష్టించింది. ఠాణే లోక్‌సభ నియోజకవర్గంలో శివసేన అభ్యర్థి రాజన్ విచారే విజయం సాధించారు. ఎన్సీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ అయిన సజీవ్ నాయిక్‌పై భారీ మెజారిటీతో గెలుపొందారు. మరోవైపు భివండీలో బీజేపీ అభ్యర్థి కపిల్ పాటిల్ విజయం సాధించగా పాల్ఘర్ బీజేపీ అభ్యర్థి చింతామణి వన్‌గా, కల్యాణ్‌లో శివసేన అభ్యర్థి శ్రీకాంత్ షిండేలు గెలుపొందారు. కొంకణ్‌లో...: కొంకణ్‌లోని రాయ్‌గఢ్, రత్నగిరి-సింధుదుర్గ నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్, ఎన్సీపీ కూటమికి పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. మరోవైపు శివసేన ఈసారి తన పట్టును నిలుపుకుంది. రత్నగిరి-సింధుదుర్గ స్థానంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైన నారాయణ్ రాణే కుమారుడు నీలేష్ రాణేపై శివసేనకు చెందిన వినాయక్ రావుత్ విజయం సాధించారు. మరోవైపు రాయ్‌గఢ్‌లో కూడా ఎన్సీపీ అభ్యర్థి సునీల్ తట్కరేపై శివసేన అభ్యర్థి అనంత్‌గీతే విజయం సాధిం చారు. ఇలా కొంకణ్‌లో కూడా తాను కోల్పోయిన స్థానాలను శివసేన తిరిగి కైవసం చేసుకుంది. -
నేడే రెండో దశ
సాక్షి, ముంబై: పశ్చిమ మహారాష్ట్ర, ఉత్తర మహారాష్ట్ర, మరాఠ్వాడా, కొంకణ్‌లోని 19 లోక్‌సభ నియోజకవర్గాల్లో గురువారం రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. ఇన్ని రోజులు రాజకీయ నేతల ప్రసంగాలను విన్న ఓటర్లు నేడు తమ ఓటుతో అభ్యర్థుల తలరాతలు రాసేందుకు సిద్ధమయ్యారు. 36,879 పొలింగ్ కేంద్రాల్లో సుమారు 3.25 కోట్ల మంది తమ ఓటు వేయనున్నారు. పోలింగ్ కేంద్రాలకు చేరుకునే ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికల సంఘం(ఈసీ) అన్ని ఏర్పాట్లు చేసింది. పొలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ముందే చేసిపెట్టింది. ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ సిబ్బందికి ఇబ్బంది కలగకుండా కనీస వసతులు కల్పించడంపై దృష్టి సారించింది. ఎండలో వచ్చి ఓటువేసే వారికి పొలింగ్ కేంద్రం వద్ద మంచినీరు అందుబాటులో ఉంచింది. వృద్ధులు, వికలాంగులకు తగిన ఏర్పాట్లు చేసింది. పొలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ ఎత్తున పోలీసు బందోబస్తు మొహరించారు. ఇదిలావుండగా లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు టెన్షన్ మొదలైంది. ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారో అన్న ఆందోళన వారిలో కనబడుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే, బీజేపీ సీనియర్ నేత గోపీనాథ్ ముండే, మాజీ సీఎం అశోక్ చవాన్, సుప్రీయా సూలే , విజయ్ సింహ్ మోహితే పాటిల్, పద్మసింహ్ పాటిల్, నీలేష్ రాణే తదితరులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముఖాముఖి పోటీ... రెండో దశలో ఎన్నికలు జరుగనున్న 19 లోక్‌సభ నియోజకవర్గాల్లో మూడు మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పోటీ డీఎఫ్ కూటమి, మహాకూటమిల మధ్య ప్రధాన పోటీ జరగనుంది. ఎన్నికల ప్రచారం చివరిరోజు వరకు కాంగ్రెస్ కూటమి ప్రచారం కోసం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రచారం చేశారు. మహాకూటమి కోసం బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, బీజేపీ నేత గోపీనాథ్ ముండే తదితరులు ప్రచారం చేసి ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. దేశంలోనే తొలిసారిగా బీజేపీ అత్యాధునిక సాంకేతిక పరిఙ/ా్ఞనాన్ని వినియోగించుకుంది. మోడీ కోసం త్రీడి సభలను ఏర్పాటు చేసింది. మోడీ వేరే ప్రాంతంలో మాట్లాడుతున్నప్పటికీ త్రీడీ టెక్నాలజీ కారణంగా మనముందే ఉన్నట్టు, మనవైపే చూస్తూ మాట్లాడుతున్నట్టు కనిపించింది. ఇలా తొలిసారిగా ఔరంగాబాద్‌లో ఏర్పాటు చేసిన త్రీడీ సభకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది. అందరి దృష్టి సింధుదుర్గావైపు... రెండో దశలో రత్నగిరి-సింధుదుర్గా లోక్‌సభ నియోజకవర్గంవైపు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. కాంగ్రెస్ నేత నారాయణ రాణే కుమారుడు నీలేష్ రాణే, శివసేన అభ్యర్థి వినాయక్ రావుత్ల మధ్య గట్టిపోటీ కన్పిస్తోంది. సింధుదుర్గాలో రాణే ప్రభావం ఉన్నా గత కొంతకాలంగా మారిన రాజకీయ సమీకరణాలు రాణే వర్గీయుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఎన్సీపీ నాయకుడు కేసకర్ రాణేకు ప్రచారం చేయడానికి నిరాకరించి అధిష్టానం ఆదేశాలను కూడా లెక్కచేయకుండా పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత కేసకర్ మద్దతుదారులు శివసేనకు మద్దతు ప్రకటించారు. దీంతో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. కాగా, అహ్మద్నగర్లోనూ ఈసారి తీవ్ర పోటీనే నెలకొంది. గత ఎన్నికల్లో సుమారు 47 వేల ఓట్ల మెజార్టీతో ఎన్సీపీ అభ్యర్థి శివాజీ భానుదాస్ కర్దిలేపై విజయం సాధించిన దిలీప్ కుమార్ ఈసారి విజయం కోసం చెమటోడుస్తున్నారు. అయితే ఈసారి గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన రాజీవ్ రాజలేను ఎన్సీపీ బరిలోకి దింపింది. దీంతో ఇక్కడ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. షిర్డీలో శివసేన అభ్యర్థిగా సదాశివ్ లోకాండే, కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్ ఎంపీ బావ్సాహెబ్ వాక్చౌరే మధ్య తీవ్ర పోటీ నెలకొంది.