labours strike
-
కార్మిక సమ్మెకు వైఎస్ జగన్ మద్దతు
కడప: దేశవ్యాప్తంగా కార్మికులు చేపడుతోన్న సమ్మెకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలిపారు. బుధవారం వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఘన నివాళి అర్పించిన ఆయన అనంతరం బెంగళూరు బయలుదేరారు. ఈ నేపథ్యంలో మార్గమధ్యలో ఓబులదేవర చెరువులో వైఎస్ జగన్...కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇంతలో అక్కడికి చేరుకున్న అంగన్ వాడీ కార్యకర్తలు తమ సమస్యలపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ప్రస్తావించాలని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు కూడా వైఎస్ జగన్ను కోరారు. ఈ మేరకు వారికి ఆయన హామీ ఇచ్చి బెంగళూరు పయనం అయ్యారు. -
మున్సిపల్ కార్యాలయం దిగ్బంధం
అనంతపురం: తొమ్మిది నెలలుగా వేతనాలు ఇవ్వటం లేదంటూ అనంతపురం పారిశుధ్య కార్మికులు బుధవారం కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. మధ్యాహ్నం వరకు లోపలికి ఉద్యోగులను వెళ్లనీయకుండా గేట్లు మూసివేశారు. దాదాపు 40 మంది కార్మికులు ఆందోళన చేపట్టారు. కార్యాలయం లోపల ఉన్న కార్పొరేషన్ మేయర్, కమిషనర్ వారికి వేతనాలు అందించే విషయమై చర్చలు కొనసాగిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.