రేపు పార్లమెంట్లో 'పసుపు బిల్లు'
న్యూఢిల్లీ: ఈ నెల లోక్సభలో టర్మెరిక్ బోర్డ్-2017 ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు ఎంపీ కవిత తెలిపారు. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు ఆమె వివరించారు. పసుపు బోర్డు ఏర్పాటుకు మద్ధతు తెలపాలని కేంద్రానికి మహారాష్ట్ర సీఎం ఫడణవిస్, కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ లేఖలు రాశారని ఆమె తెలిపారు.
పసుపు బోర్డు ఏర్పాటుతోనే పసుపు రైతుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆమె వివరించారు. ఈ విషయమై ఇప్పటి వరకు రెండు సార్లు ప్రధానమంత్రి మోదీని కలిసి, మాట్లాడానని ఆమె తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, రైతులతో ఢిల్లీకి కూడా వెళ్లామన్నారు. బిల్లు లోక్సభ ఆమోదం పొందితే పసుపు బోర్డు ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని ఎంపీ కవిత చెప్పారు.