London babulu
-
విజయవాడ టు లండన్ బాబులు
‘‘సినిమాల్లో నటించడం వల్ల ఇందులోని ఇబ్బందులు తెలిశాయి. ఇప్పుడు సినిమాపై మరింత గౌరవం పెరిగింది’’ అన్నారు రక్షిత్. చిన్నికృష్ణ దర్శకత్వంలో ఆయన హీరోగా ఏవీఎస్ స్టూడియో సమర్పణలో మారుతి టాకీస్ పతాకంపై రూపొందిన సినిమా ‘లండన్ బాబులు’. తమిళ చిత్రం ‘ఆండవన్ కట్టళై’కు రీమేక్ ఇది. ఈ నెల 17న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా రక్షిత్ మాట్లాడుతూ– ‘‘విజయవాడలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను. నాన్న వరప్రసాదరావుగారి ద్వారా మారుతిగారు తెలుసు. ఇంజనీరింగ్ చదివే రోజుల్లోనే సినిమాలపై ఆసక్తి ఉందా? అని నన్ను అడిగారాయన. ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మారుతిగారిని కలిశాను. ఈ సినిమాను తెరకెక్కించే ప్రక్రియలో భాగంగానే నన్ను హీరోగా ఎంపిక చేసుకున్నారు. ఓ దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకులు విదేశాలకు వెళ్లి ఎక్కవ డబ్బులు సంపాదించాలనుకుంటారు. అందుకోసం వాళ్లు ఏం చేశారన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందించారు. నేను గాంధీ అనే రోల్ చేశాను. రిపోర్టర్ సూర్యకాంతంగా స్వాతి నటించారు. స్వాతి వంటి సీనియర్ నటితో నటించడం చాలా హ్యాపీగా ఉంది. సినిమాలో మా ఇద్దరి మధ్య లవ్ సీన్స్ ఉన్నాయి. స్వాతి నటన సినిమాకు ప్లస్. ఈ సినిమాతో ఫస్ట్ సక్సెస్ అందుకుంటానన్న నమ్మకం ఉంది. భవిష్యత్‌లో నటుడిగానే కొనసాగాలనుకుంటున్నాను. ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేసే కథలను ఎంచుకోవాలనుకుంటున్నాను. డ్యాన్స్, డైలాగ్ డిక్షన్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. నా నెక్ట్స్ మూవీ మారుతిగారితోనే ఉంటుంది’’ అన్నారు. -
పాస్‌పోర్ట్ తిప్పలు!
‘‘జీవితాన్ని సినిమా పెద్దగా చూపిస్తే, టీవీ చిన్నగా చూపెడుతుంది. కానీ, జీవితాన్ని జీవితంగా చూపెట్టేది నాటకం మాత్రమే. ఈ టీజర్, సాంగ్ చూస్తుంటే నాకు నాటకాల్లో పనిచేసిన రోజులు గుర్తుకొచ్చాయి. నిర్మాతగా మారుతిగారు నాకు ఇన్స్పిరేషన్. కొత్త కాన్సెప్ట్ సినిమాలు ఆడితేనే కొత్త వారు ఇండస్ట్రీకి రావడానికి ఆసక్తి చూపిస్తారు’’ అని దర్శకుడు హరీష్ శంకర్ అన్నారు. రక్షిత్, స్వాతి జంటగా చిన్నికృష్ణ దర్శకత్వంలో ఏవీఎస్ స్టూడియో సమర్పణలో దర్శకుడు మారుతి నిర్మిస్తున్న చిత్రం ‘లండన్ బాబులు’. కె. సంగీతం అందించిన ఈ సినిమాలోని తొలి పాటను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హరీష్ శంకర్, స్పెషల్ టీజర్‌ను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. మారుతి మాట్లాడుతూ– ‘‘పాస్‌పోర్ట్ కోసం పడే తిప్పల్ని ఈ చిత్రంలో చెప్పాం. స్వాతిలో మంచి రైటర్, డైరక్టర్ కూడా ఉన్నారు. తనకి కథ నచ్చి, చేస్తాననగానే హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా రెగ్యులర్‌గా ఉండదు. నేను నిర్మించే సినిమాలకు పేరు వేసుకోవడానికి చాలా ఆలోచిస్తాను. కానీ, ఈ చిత్రం బాగా నచ్చడంతో పేరు వేసుకున్నా’’ అన్నారు. ‘‘లండన్ వెళ్లాలనుకున్న ఓ యువకుడి కథే ఈ చిత్రం’’ అన్నారు చిన్నికృష్ణ. రక్షిత్, స్వాతి, ఎ.వి.ఎస్. ప్రకాశ్, మల్లిక్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కె. నాయుడు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: కిరణ్ తలసిల, దాసరి వెంకట సతీష్. -
లండన్ బాబులు మూవీ స్టిల్స్
-
కలర్స్ బ్యూటి కొత్త సినిమా
బుల్లి తెర నుంచి వెండితెర మీదకు వచ్చి సత్తా చాటిన తెలుగమ్మాయి కలర్స్ స్వాతి. హీరోయిన్గా కెరీర్ స్టార్టింగ్‌లో మంచి విజయాలు సాధించిన ఈ ముద్దుగుమ్మ తరువాత వరుస ఫ్లాప్‌లతో డీలా పడిపోయింది. ముఖ్యంగా త్రిపుర సినిమా ప్లాప్ స్వాతి జోష్‌కు బ్రేక్ వేసింది. తెలుగు, తమిళ సినిమాలు కూడా నిరాశపరచటంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న స్వాతి ఇప్పుడు రీ ఎంట్రీకి రెడీ అవుతోంది. తమిళ సిమా రీమేక్‌తో టాలీవుడ్లో సత్తా చాటాలని భావిస్తోంది. విజయ్ సేతుపతి హీరోగా కోలీవుడ్‌లో మంచి విజయం సాధించిన అందవన్ కట్టలై సినిమాకు రీమేక్‌గా టాలీవుడ్లో తెరకెక్కుతున్న లండన్ బాబులు సినిమాలో స్వాతి హీరోయిన్గా నటిస్తోంది. బి చిన్ని కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మారుతి టాకీస్ బ్యానర్‌పై మారుతి నిర్మిస్తున్నాడు. రక్షిత్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమా ట్రైలర్ త్వరలో విడుదల చేస్తున్నట్టుగా తెలిపారు చిత్రయూనిట్.