రాజన్న సన్నిధిలో రద్దీ
వేములవాడ : వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 25 వేల మంది భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ అధికారులు ఉదయం నుంచే గర్భగుడి దర్శనాలు, ఆర్జిత సేవలు నిలిపివేశారు. భక్తులు ధర్మగుండంలో స్నానాలాచరించి, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించకుని కుంకుమపూజలు నిర్వహించారు. భక్తుల ద్వారా రూ.19 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.