Madhava
-
పాకల బీచ్‌లో పెను విషాదం
సింగరాయకొండ: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల బీచ్‌లో గురువారం పెను విషాదం చోటుచేసుకుంది. సంక్రాంతి పండుగ అనంతరం తమ బంధువులు, స్నేహితులతో కలిసి రెండు బృందాలుగా సముద్ర స్నానానికి వచ్చినవారిలో ఆరుగురు గల్లంతయ్యారు. వారిలో ముగ్గురు మృతిచెందారు. ఇద్దరిని వారి స్నేహితులు, స్థానిక మత్స్యకారులు కాపాడారు. మరొకరి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పొన్నలూరు మండలం తిమ్మపాలెం గ్రామం శివన్నపాలేనికి చెందిన నోసిన మాధవ (24), అతని భార్య నవ్య (21), పిన్ని నోసిన సువర్ణరాణి, చెల్లెలు నోసిన జెస్సిక (13), మరదలు కందుకూరు మండలం కొళ్లగుంట గ్రామానికి చెందిన కొండాబత్తిన యామిని(14), మరో 10 మంది బంధువులతో కలిసి ఆటోలో పాకల బీచ్‌కు వచ్చారు. మగవారు మూత్ర విసర్జన కోసం పక్కకు వెళ్లగా... మహిళలు ముందుగా సముద్రంలోకి దిగారు. వారు దిగిన ప్రాంతంలో చిన్నపాటి గుంతలు ఉన్నాయి. వాటిని గమనించకుండా వీరు ముందుకు వెళుతుండగా ఒక్కసారిగా అలలు ఉధృతంగా వచ్చి ముంచేశాయి. మాధవ, నవ్య, జెస్సిక, యామిని, సువర్ణరాణి సముద్రంలో కొట్టుకుపోయారు. సముద్రపు అలలపై దూరంగా నవ్య, సువర్ణరాణి తేలియాడుతూ కనిపించడంతో స్థానిక మత్స్యకారుడు సైకం శ్రీను, మాధవ స్నేహితుడు విశాల్ పడవలో వెళ్లి వారిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. కొద్దిసేపటి తర్వాత మాధవ, జెస్సిక, యామిని మృతదేహాలు అలలపై కనిపించడంతో పోలీసులు బయటకు తీసుకొచ్చి కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, పండుగ కోసం స్నేహితుడు మాధవతో కలిసి ఇక్కడికి వచ్చానని, ఆనందంగా గడిపామని, తిరిగి వెళ్లే ముందు ఈ దుర్ఘటన జరిగిందని తెలంగాణలోని మెదక్ జిల్లా వాడి గ్రామానికి చెందిన విశాల్ అనే యువకుడు కన్నీటిపర్యంతమయ్యాడు. తన కళ్లముందే ఐదుగురు సముద్రంలో మునిగిపోయారని, మత్స్యకారుల సహకారంతో ఇద్దరిని కాపాడామని, స్నేహితుడు మాధవ మరణించడం జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తంచేశాడు.స్నేహితులతో కలిసి వచ్చిన యువకుడు గల్లంతుఅదే సమయంలో సింగరాయకొండ శ్రీరాంనగర్ ప్రాంతానికి చెందిన తమ్మిశెట్టి పవన్ (22) కూడా తన స్నేహితులతో కలిసి సముద్ర స్నానం చేసేందుకు పాకల బీచ్‌కు వచ్చాడు. అలల ఉధృతికి పవన్ సముద్రంలో కొట్టుకుపోయాడు. అతని కోసం మెరైన్ పోలీసులు గాలిస్తున్నారు. పాకాల బీచ్‌ను రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి, ఎస్పీ ఏఆర్ దామోదర్, ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న పరిశీలించి మెరైన్ పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పవన్ ఆచూకీ తెలిసే వరకు అదనపు బోట్లతో గాలింపు చర్యలు చేపట్టాలని మెరైన్ పోలీసులకు ఎస్పీ దామోదర్ సూచించారు. -
గ్రామీణ ప్రేమ కథ నేపథ్యంలో 'రాధా మాధవం'
టాలీవుడ్లో విలేజ్ లవ్ స్టోరీలు ఎన్నో అద్భుతాలు సృష్టించాయి. ఇండస్ట్రీలో ఎన్ని కొత్త జానర్లు వచ్చినా ప్రేమ కథా చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. తాజాగా మరో గ్రామీణ ప్రేమ కథా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మిస్తున్న అందమైన ప్రేమ కథా చిత్రం ‘రాధా మాధవం’. ఈ మూవీకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహిస్తున్నారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ నెలలో మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర యూనిట్.. మూవీ ఫస్ట్ లుక్‌ను నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా రిలీజ్ చేయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ పోస్టర్‌ను డీపీఎస్ ఇన్ఫో టెక్ మేనేజింగ్ డైరెక్టర్ డీ.ఎస్.ఎన్. రాజు రిలీజ్ చేశారు. చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ నెలలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
రాయని డైరీ.. టామ్ వడక్కన్ (బీజేపీ!)
ముప్పై ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉన్నాను. కాంగ్రెస్‌లో ఒక్కరికీ నేనెవరో తెలీదు. బీజేపీలోకి వచ్చి ఒక్కరోజైనా కాలేదు. ముప్పై ఏళ్లుగా నేను బీజేపీలో ఉన్నట్లే అంతా నన్ను పలకరిస్తున్నారు సంస్కారవంతమైన పార్టీ. ఎంత చక్కటి సంస్కారాన్ని అలవరిచారు మోదీజీ తన పార్టీకి!! నేనొచ్చాక, నా వెనుకే ఇంకో ఇద్దరు బీజేపీలోకి వచ్చారు. ఎవరో భార్యాభర్తలు. ‘‘ఎవరు వీళ్లు? ఎక్కడా చూడనట్లుందే?’’ అని శ్రీధరన్ పిళ్లైని అడిగాను. కేరళ బీజేపీ ప్రెసిడెంట్ ఆయన. ‘‘ఎవరైనా.. ‘ఎక్కడో చూసినట్లుందే’ అంటారు. మీరు మాత్రం ‘ఎక్కడా చూడన ట్లుందే’ అంటున్నారు. మీ ప్రశ్నలోనే సమా ధానం ఉంది.. వాళ్లెవరో’’ అన్నాడు పిళ్లై. ‘‘గాటిట్’’ అని పెద్దగా అరిచాను. ‘‘ఏమిటి గాటిట్’’ అన్నాడు పిళ్లై. ‘‘ఎక్కడా చూడనట్లుంటే.. వాళ్లు కాంగ్రెస్ వాళ్లై ఉంటారు. అంటే వీళ్లిద్దరూ కాంగ్రెస్ నుంచే కదా వచ్చారు బీజేపీలోకి’’ అన్నాను. ‘‘బ్రిలియంట్’’ అన్నాడు పిళ్లై! అది నా బ్రిలియన్స్ కాదు. కాంగ్రెస్ పార్టీ బ్రిలియన్స్. రాజీవ్ గాంధీ దగ్గర పని చేశాను. నేనెవరో ఎవరికీ తెలీదు. సోనియా గాంధీ దగ్గర పని చేశాను. నా పేరేమిటో ఎవరికీ తెలీదు. రాహుల్ దగ్గర పని చేశాను. నేనెవరో నేనే మర్చిపోయాను. రాహుల్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయినప్పుడు.. ఆ సభలో.. ‘ఎక్స్‌క్యూజ్‌మీ.. నా పేరేమిటో చెప్పగలరా?’ అని టెస్టింగ్ కోసం ఇద్దరుముగ్గుర్ని అడిగాను. తెలీదన్నారు! ‘పోనీ, టామ్ వడక్కన్ ఇక్కడెక్కడైనా మీకు కనిపించారా?’ అని అడిగాను. ‘మీపేరేమిటో కనుక్కుని మీకు చెప్పమంటే చెప్పగలం కానీ, టామ్ వడక్కన్ కనిపించాడా అని అడిగితే ఎలా చెప్పగలం? ఆ పేరే వినలేదు’’ అన్నారు!స్టన్ అయ్యాను! ఆ ఇద్దరుముగ్గురికికాస్త దూరంగా వెళ్లి, ఇంకో ఇద్దరుముగ్గుర్ని కదిలించాను. ‘‘చూడండీ.. అక్కడున్న ఆ ఇద్దరుముగ్గురు టామ్ వడక్కన్ పేరే వినలేదంటున్నారు. ఆశ్చర్యంగా లేదూ..’’ అన్నాను.‘‘ఆశ్చర్యం ఏముందీ.. వాళ్లకే కాదు, మాకూ తెలీదు.. టామ్ వడక్కన్ ఎవరో’’ అన్నారు. హర్ట్ అవ్వాలో అవకూడదో తెలీలేదు. ‘‘హర్ట్ అవనవసరం లేదు’’ అనే మాట వినిపించింది! తలతిప్పి చూశాను. ‘‘మీరు వడక్కన్ కదా!’’ అన్నాడు ఆ వ్యక్తి. నివ్వెరపోయాను. నిశ్చేష్టుడినయ్యాను. నాకు నేనే కొత్తగా అనిపించాను.‘‘మీరు టామ్ వడక్కన్ కదా!’’ అన్నాడు ఆ వ్యక్తి మళ్లీ. ఆరాధనగా అతడి వైపు చూశాను. ‘‘మీరెవరు?’’ అని అడిగాను. ‘‘నేనెవరో మీకు తెలియనవసరం లేదు. మీరెవరో ఈ ప్రపంచానికి తెలియాలి. మీది త్రిశ్సూర్ అని తెలియాలి. కార్పొరేట్ ఉద్యోగం మానేసి కాంగ్రెస్‌లో చేరారని తెలియాలి. ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తానని ముప్పై ఏళ్లుగా అడుగుతున్నా కాంగ్రెస్ మీకు టికెట్ ఇవ్వలేదని తెలియాలి. పుల్వామా ఎటాక్ల మీద కాంగ్రెస్ పార్టీ యాంటీ–ఆర్మీ కామెంట్స్ మమ్మల్ని బాధించాయని తెలియాలి. అందుకే మీరు బీజేపీలో చేరారని తెలియాలి’’ అన్నాడా వ్యక్తి ఆవేశంగా! కన్నీళ్లొచ్చేశాయి నాకు. ‘‘మీరెవరో చెప్పారు కాదు’’ అన్నాను చేతులు జోడిస్తూ. ‘‘రవిశంకర్ ప్రసాద్ అంటారు నన్ను. మోదీ దగ్గర మినిస్టర్‌ని’’ అన్నాడు. ‘‘కేరళలో మిమ్మల్ని పిళ్లై మీట్ అవుతాడు’’ అని చెప్పాడు. చెప్పినట్లే పిళ్లై నన్ను కలిశాడు.‘‘ఏంటి పిళ్లై.. ఆ చప్పుళ్లు?’’ అని అడిగాను. ‘‘ఆ భార్యాభర్తలు వచ్చారు కదా. వాళ్లను ఆహ్వానిస్తూ డప్పులు కొడుతున్నారు’’ అన్నాడు! నిజంగానే పార్టీకి ఎంత మంచి సంస్కారం నేర్పించారు మోదీజీ!!. మాధవ్ శింగరాజు -
కట్టుకున్నవాడే కాలయముడు
విశాఖపట్నం గత నెల 22న హార్బర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన యువతిది హత్యేనని పోలీసులు నిర్థారించారు. భ ర్తే హత్య చేసినట్టు గుర్తించి బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ టి.కల్యాణి కథనం ప్రకారం లక్ష్మీదేవిపేటకు చెందిన మాధవ ధనలక్ష్మి, విజయనగరం జిల్లాకు చెందిన లొగలాపు మోహనరావు అలియాస్ మోహన్‌ను మూడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. అనంతరం వీరు విశాఖలోని హనుమంతవాక, వెంకోజిపాలెం, కొబ్బరితోట ప్రాంతాల్లో కొన్నాళ్లు కాపురమున్నారు. స్వతహాగా ధనలక్ష్మి డాన్సర్ కావడంతో మోహన్ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో దంపతులు కొద్ది రోజులు విడిగా ఉన్నారు. గత నెల 17వ తేదీ రాత్రి తిరిగి మోహన్ ఆమె వద్దకు రాగా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. కోపోద్రిక్తుడైన మోహన్ భార్య ధనలక్ష్మి మెడకు చున్నీ బిగించడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం లక్ష్మీదేవిపేట రైలుపట్టాల దిగువన మురికిగుంటలో మతదేహాన్ని పడేసి ఏమీ తెలియనట్టు వెళ్లిపోయాడు. ధనలక్ష్మి కనిపించకపోవడంతో ఆమె తల్లి, అన్నయ్య 21వ తేదీ రాత్రి టూటౌన్ పోలీస్ స్టేషన్లో అదృశ్యం కేసు పెట్టారు. ఇంతలో 22వ తేదీ సాయంత్రం హార్బర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బయటపడిన యువతి మృతదేహాన్ని ధనలక్ష్మిగా గుర్తించారు. హార్బర్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి టూటౌన్ పోలీసులకు బదిలీ చేశారు. వారు సమగ్ర విచారణ చేపట్టి ధనలక్ష్మి భర్తను అదుపులోకి తీసుకుని విచారించడంతో తానే హతమార్చినట్లు అంగీకరించాడు. పోలీసులు నిందితుడిని బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.